Skip to main content

మూసిన గది రహస్యం Part 2 – అద్దంలో కనిపించిన ప్రతీకారం

మూసిన గది రహస్యం – Part 2: అద్దంలో ప్రతీకారం”

కథ ప్రారంభం
నిన్న రాత్రి జరిగిన ఘటన తర్వాత… గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో భయం స్థిరపడిపోయింది…

గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడింది.

పోలీసులు, ఇంకా అపార్ట్మెంట్ జనం అంతా అన్విత ఇంటిని చుట్టుముట్టారు.

నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి అందరూ ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు…

“హార్ట్ అటాక్ అయ్యిందట…”
“లేదు… ఏదో భయంతో చనిపోయిందట…”
“ఆ గదిలో ఏదో ఉంది…”

అయితే…
ఎవరికి అసలు నిజం తెలియదు.

అద్వైత్ మాత్రం నిశ్శబ్దంగా తన బాల్కనీలో నిలబడి అంతా చూస్తున్నాడు…

ఆ రాత్రి జరిగిన ప్రతి క్షణం అతని మెదడులో తిరుగుతోంది…

ఆమె భయం…
అద్దం పగలడం…
అంతా చాలా అసహజంగా ఉంది.
“ఇది సాధారణం కాదు…” 

అని అతను తనలోనే అనుకున్నాడు.

ఆ రోజు సాయంత్రం…
పోలీసులు మళ్లీ అన్విత ఫ్లాట్‌లోకి వెళ్లారు.

ఇన్స్పెక్టర్ రాఘవ్…
అతని చూపు గదిలో ప్రతి మూలను పరిశీలిస్తోంది.

“ఏ గాయం లేదు… కానీ చనిపోయింది…” అని అతను అనుమానంగా అన్నాడు.

అప్పుడే…
ఒక కానిస్టేబుల్ గట్టిగా పిలిచాడు.

అన్విత డైరీ

“సర్… ఇక్కడ ఒక డైరీ ఉంది!”
అద్వైత్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది.
డైరీ…?

ఇన్స్పెక్టర్ ఆ డైరీ తీసుకుని తెరిచాడు…

  • ఇది చదివిన తర్వాత… రాఘవ్ ముఖం మారిపోయింది…”
  • “ఈ డైరీ… సాధారణం కాదు…

  • అన్విత గతం
    అందులో నా పేరు అన్విత…

    నా చిన్నప్పుడే నా జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది.
    అమ్మ, నాన్న ఇద్దరూ ఒక ప్రమాదంలో నన్ను వదిలి వెళ్లిపోయారు…

    ఆ రోజు నుంచి నా ప్రపంచం ఖాళీ అయిపోయింది.

    అప్పుడు…
    నన్ను తన ఒడిలోకి తీసుకుంది నా నాన్నమ్మ.

    కాలం గడిచింది…
    నేను చదువులో ముందుకు వెళ్లాను.

    అందుకు పై చదువుల కోసం నేను టౌన్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

    మొదటిసారి…
    నా ఊరిని, నా నాన్నమ్మని వదిలి వెళ్లే రోజు…

    నా గుండె నిండా భయం…
    కళ్లలో నీళ్లు…
    కానీ… ఆశ కూడా ఉంది.

    “జాగ్రత్తగా ఉండు… ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి…” అని
    నా నాన్నమ్మ కన్నీళ్లతో నన్ను పంపించింది.

    టౌన్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు…
    అది నాకు కొత్త ప్రపంచం లాంటిది.

    ఎత్తైన బిల్డింగ్స్…
    బిజీ రోడ్లు…
    తెలియని మనుషులు…

    నేను పూర్తిగా ఒంటరిగా అనిపించుకుంది.

    డిగ్రీ కాలేజీ మొదటి రోజు…

    క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టినప్పుడు ఎవరూ నాకు పరిచయం లేరు…
    ఎవరితో మాట్లాడాలో తెలియదు…

    అప్పుడు…
    ఒక వాయిస్ వినిపించింది—

    “హాయ్… నువ్వు కొత్త స్టూడెంట్ కదా?”

    నేను వెనక్కి తిరిగి చూసాను…

    అతను…
    అద్వైత్.

    అతని ముఖంలో ఒక సింపుల్ స్మైల్… కళ్లలో నమ్మకం…
    మాటల్లో ఓ స్నేహం కనిపించింది.

    “నేను అద్వైత్…” అని తనను పరిచయం చేసుకున్నాడు.
    అద్వైత్

    ఆ చిన్న పరిచయం…
    నా జీవితంలో ఒక పెద్ద మార్పు అయ్యింది.

    ఆ రోజు నుంచి…
    క్లాస్‌లో నాకు పక్కన కూర్చునేది అతనే…
    నాకు అర్థం కాని సబ్జెక్ట్స్ అతనే చెప్పేవాడు…
    నేను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాట్లాడించేది కూడా అతనే…
    నెలలు గడిచేకొద్దీ… మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము.

    నేను నవ్వడం మళ్లీ నేర్చుకున్నాను…
    జీవితాన్ని మళ్లీ ప్రేమించడం మొదలుపెట్టాను…

    కానీ…
    ఆ స్నేహం నాలో
    మెల్లగా ఇంకేదో భావంగా మారుతోంది అని నాకు అర్థం కాలేదు…

    అది స్నేహమా…?
    లేదా… ప్రేమా…?

    అప్పటికి నాకు తెలియదు…
    కానీ నా గుండె మాత్రం
    అతని కోసం కొట్టుకోవడం మొదలుపెట్టింది…

    తర్వాత మా చదువులు పూర్తయ్యాయి…

    కానీ నా మనసు మాత్రం ఒక్కటే ఆలోచిస్తోంది—
    “అద్వైత్ లేకుండా నేను ఎలా ఉంటాను…?”

    అదృష్టం అనుకోవాలో … లేక విధి ఆట అనుకోవాలో …
    మా ఇద్దరికీ ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది.

    ఆ రోజు నాకు ప్రపంచమే దొరికినట్టుగా అనిపించింది…
    రోజూ అతన్ని చూడొచ్చు… మాట్లాడొచ్చు…
    అతనితో టైం గడపొచ్చు…

    ఆఫీస్‌లో మొదటి రోజు…
    మళ్లీ అదే ఫీలింగ్... కానీ ఈసారి నేను ఒంటరిగా లేను…
    అద్వైత్ నా పక్కన ఉన్నాడు.

    కాఫీ బ్రేక్‌లు… లంచ్ టైమ్ చాట్స్… వర్క్‌లో హెల్ప్…
    ప్రతి చిన్న విషయం కూడా నాకు ప్రత్యేకంగా అనిపించేది.
    అతను నవ్వితే… నా రోజు బాగుంటుంది…
    అతను మాట్లాడితే… నా ప్రపంచం ఆగిపోయినట్టే అనిపిస్తుంది…

    అలా రోజులు గడుస్తున్నకొద్దీ…
    నా మనసులో ఉన్న భావాలు మరింత బలంగా మారాయి.

    అవును…
    నేను అద్వైత్‌ను ప్రేమిస్తున్నాను.

    ఈ నిజాన్ని నేను ఒప్పుకున్న రోజు…
    నా గుండె ఒకేసారి భయంతో, ఆనందంతో కొట్టుకుంది.

    “ఈ రోజు చెబుతా…”
    “లేదంటే రేపు చెబుతా…”

    అలా నేను చాలా రోజుల పాటు ధైర్యం కూడబెట్టుకుంటూ ఉన్నాను.

    ఒక రోజు…

    అతనితో కాఫీకి వెళ్లినప్పుడు
    చెప్పేయాలని నిర్ణయించుకున్నాను…

    నా గుండె బలంగా కొట్టుకుంటోంది…
    మాటలు నోటి దగ్గరకి వచ్చి ఆగిపోయాయి…

    అప్పుడే…
    నా ఫోన్ మోగింది.

    ఆ కాల్…
    నా జీవితాన్ని మళ్లీ పూర్తిగా మార్చేసింది.

    “అన్విత…
    నీ నాన్నమ్మ…”

    అంతే…
    నా చేతిలో ఫోన్ జారి పడిపోయింది.

    నా ప్రపంచం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది…
    నేను మళ్లీ ఒంటరిగా మారిపోయాను.

    వెంటనే ఊరికి వెళ్లాల్సి వచ్చింది…

    ఆ ప్రయాణం అంతా… నా కళ్లలో కన్నీళ్లు…
    మనసులో బాధ…

    “చెప్పాల్సిన మాట… చెప్పలేకపోయాను…” అనే పశ్చాత్తాపం.

    ఊరికి వెళ్లిన తర్వాత… అక్కడ ప్రతి మూల…
    నా నాన్నమ్మ జ్ఞాపకాలతో నిండిపోయింది.

    కొన్ని రోజులు…
    నేను బయట ప్రపంచం గురించి మర్చిపోయాను…

    కానీ ఒక ఆలోచన మాత్రం నన్ను వెంటాడుతోంది—
    “అద్వైత్‌కు ఇంకా చెప్పలేదు…”

    కొంతకాలం తర్వాత…
    నేను తిరిగి టౌన్‌కి వచ్చాను.

    నా గుండెల్లో ఒక చిన్న ఆశ—
    “ఇప్పటికైనా చెబుతాను…”

    కానీ…
    అది ఆలస్యమైపోయింది.

    ఆఫీస్‌కి వెళ్లిన మొదటి రోజే…
    నాకు ఒక వార్త తెలిసింది.

    “అద్వైత్ పెళ్లి ఫిక్స్ అయ్యింది…”

    ఆ మాట విన్న క్షణం…
    నా చెవుల్లో ఏమీ వినిపించలేదు…
    నా కళ్ల ముందు అంతా బ్లర్ అయిపోయింది…

    “లేదు… ఇది నిజం కాదు…”
    అని నేను నన్నే నమ్మించుకోవడానికి ప్రయత్నించాను.

    కానీ…
    కొన్ని రోజుల్లోనే, ఆ వార్త నిజమైపోయింది.
    అతని పెళ్లి అయిపోయింది.

    ఆ రోజు…
    నా గుండె ముక్కలైపోయింది.

    నేను చెప్పలేకపోయిన ఒక్క మాట…
    నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.

    అతను లేని ఆఫీస్‌ నేను భరించలేకపోయాను…
    అతని నవ్వు… అతని ఆనందం…

    అన్నీ నాకు నొప్పిగా మారాయి.

    అక్కడ ఉంటే…
    ప్రతి జ్ఞాపకం నన్ను వెంటాడుతోంది…

    అందుకే…
    నేను ఆ టౌన్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

    పారిపోవాలని కాదు… మర్చిపోవాలని…

    నేను తిరిగి మా ఊరికి వెళ్ళిపోయాను…

    ఆ ఊరు…
    ఒకప్పుడు నాకు ఆప్యాయంగా అనిపించిన అదే ఊరు…
    ఇప్పుడు మాత్రం పూర్తిగా ఖాళీగా అనిపించింది.

    ఇంటి లోపల నిశ్శబ్దం…
    గోడలపై పాత జ్ఞాపకాలు…
    ప్రతి మూలలో నా నాన్నమ్మ గుర్తులు…

    రోజులు గడుస్తున్నాయి…
    కానీ నా జీవితం మాత్రం ఎక్కడో ఆగిపోయినట్టే ఉంది.

    ఉదయం లేస్తాను…
    ఏ పని లేకుండా అలాగే కూర్చుంటాను…
    రాత్రి పడుకుంటాను…
    కానీ నిద్ర మాత్రం రాదు…

    అలా కొన్నిరోజులు…  నెలలు అయ్యాయి.

    ఇంట్లో ఉన్న డబ్బు…  నెమ్మదిగా కరిగిపోయింది.

    ఒక రోజు…
    అల్మారాలో చివరి నోటు కూడా తీసుకున్నప్పుడు…
    నాకు ఒక్కసారిగా అనిపించింది...

    “ఇలా కొనసాగితే… నేను పూర్తిగా ఒంటరిగా పడిపోతాను…”

    బతకాలి అంటే…  ముందుకు వెళ్లాలి.

    గతాన్ని మర్చిపోవాలి…
    అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను—

    మళ్లీ పని చేయాలి.
    మళ్లీ నా జీవితాన్ని నేనే నిలబెట్టుకోవాలి.

    ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి…
    చాలా రోజుల తర్వాత నాకు కాస్త బలంగా అనిపించింది.

    కొన్ని రోజుల్లోనే…

    నా బ్యాగ్ సర్దుకున్నాను…
    ఇంటి తలుపు మూసే ముందు ఒక్కసారి లోపల చూసాను…

    అక్కడ నా గతం ఉంది…  కానీ నేను మాత్రం వెళ్లిపోతున్నాను…

    మళ్లీ టౌన్‌కి వచ్చాను.

    ఆ నగరం… మళ్లీ నన్ను స్వాగతించినట్టే ఉంది…
    కానీ ఈసారి నేను మారిపోయాను.

    పని కోసం వెతకడం ప్రారంభించాను…

    రోజంతా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ…
    ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ…

    కొన్ని చోట్ల—
    “మేము కాల్ చేస్తాం…” అని పంపేశారు.

    కొన్ని చోట్ల—
    “ఎక్స్‌పీరియన్స్ లేదు…” అని రిజెక్ట్ చేశారు.

    ప్రతి రిజెక్షన్…
    నా గుండె మీద ఒక గాయం లాంటిదే.

    కానీ…     ఈసారి నేను ఆగలేదు.

    ఎందుకంటే…   ఇప్పుడు వెనక్కి వెళ్లే దారి లేదు.

    చివరికి…

    ఒక రోజు…
    ఒక చిన్న కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను.

    సింపుల్ ప్రశ్నలు…  సింపుల్ సమాధానాలు…

    కానీ నా కళ్లలో ఉన్న ఆ తపన… నా మాటల్లో ఉన్న ఆ నిజం…

    వాళ్లను నమ్మించింది.
    “మీరు రేపటి నుంచి జాయిన్ అవ్వండి…” అని చెప్పారు.

    ఆ మాట విన్న క్షణం…

    నా కళ్లలో ఆనందం…
    మనసులో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది.

    చాలా రోజుల తర్వాత…    నేను మళ్లీ నిలబడ్డాను.

    కొత్త జాబ్…  కొత్త జీవితం…

    కానీ…
    నా గుండె లోపల ఎక్కడో ఒక చోట…
    పాత జ్ఞాపకాలు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాయి.

    నాకు తెలియకుండా…
    అవి మళ్లీ బయటికి రావడానికి, సరైన సమయాన్ని ఎదురు చూస్తున్నాయి…

    అక్కడే ఒక ఇల్లు కూడా చూసుకున్నాను…
    గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్…

    ఆ అపార్ట్‌మెంట్ మొదట చూసినప్పుడు…
    అది చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా అనిపించింది.

    పచ్చని చెట్లు చుట్టూ…
    బిల్డింగ్ బయట సింపుల్ డిజైన్…
    లోపలికి వెళ్తే… కొంచెం పాతదనపు వాసన…

    అది కొత్తగా నిర్మించిన భవనం కాదు…
    కానీ… ఏదో తెలియని ఆకర్షణ ఉంది.

    “ఇక్కడే ఉండొచ్చు…” అనిపించింది.

    ఫ్లాట్ చిన్నదే…
    ఒక హాల్… ఒక బెడ్‌రూమ్… చిన్న కిచెన్…

    కానీ నాకు అది సరిపోతుంది.
    ఎందుకంటే… నాకు పెద్ద స్థలం అవసరం లేదు…
    ఒక శాంతి కావాలి.

    ఇంటి తాళం తీసుకుని మొదటిసారి లోపల అడుగు పెట్టినప్పుడు…

    ఒక చల్లని గాలి నా ముఖాన్ని తాకింది…
    కిటికీ దగ్గర కర్టెన్ నెమ్మదిగా కదిలింది…

    ఒక్క క్షణం…
    ఎవరో నన్ను గమనిస్తున్నట్టుగా అనిపించింది.

    నేను ఒక్కసారి చుట్టూ చూసాను…
    ఎవరూ లేరు.

    “అలసట వల్లే ఇలా అనిపిస్తుంది…” అని
    నన్నే నమ్మించుకున్నాను.

    రోజులు గడుస్తున్నాయి…
    ఆఫీస్ → ఇల్లు
    ఇల్లు → ఆఫీస్
    అలా నా జీవితం మళ్లీ రొటీన్‌లో పడిపోయింది.

    అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లు కూడా సైలెంట్ గానే ఉండేవారు…

    ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు.

    కారిడార్‌లో నడుస్తుంటే… కొన్ని ఫ్లాట్స్ ఎప్పుడూ మూసే ఉంటాయి…

    రాత్రి అయ్యేసరికి…
    ఆ అపార్ట్‌మెంట్ ఇంకా నిశ్శబ్దంగా మారిపోతుంది.

    ఒక రోజు…
    రాత్రి 11 దాటిపోయింది…

    నేను కిచెన్‌లో నీళ్లు తీసుకుంటూ ఉండగా…
    ఎక్కడో నుంచి ఒక సున్నితమైన శబ్దం వినిపించింది…

    టక్… టక్…
    నేను ఆగిపోయాను.
    అన్విత

    మళ్లీ…
    టక్… టక్…

    అది గోడ వైపు నుంచి వస్తోంది…
    లేదా… ఎదురుగా ఉన్న ఫ్లాట్ నుంచి…?

    నా గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది.
    నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్లి చూసాను…

    కారిడార్ ఖాళీగా ఉంది. లైట్లు మాత్రం మసకబారుతున్నాయి…

    ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపు…
    సగం తెరిచి ఉంది.

    “ఇక్కడ ఎవరో ఉన్నారా…?” అని అనిపించింది.

    కానీ…  ఎవరూ బయటకు రాలేదు.

    నేను మళ్లీ నా ఫ్లాట్‌లోకి వచ్చేసాను…
    తలుపు బిగించి వేసుకున్నాను.

    ఆ రాత్రి…
    నాకు నిద్ర రాలేదు.
    అది చిన్న శబ్దమే కావచ్చు… లేదా నా ఊహలే కావచ్చు…

    కానీ…
    ఆ గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో ఏదో సరైనది లేదని
    నాకు మొదటిసారి అనిపించింది…

    అప్పుడు నాకు తెలియదు…

    అదే చోట…
    నా గతం మళ్లీ నా ముందుకు వస్తుందని…

    అది కూడా…
    నేను ఎప్పటికీ మర్చిపోవాలని అనుకున్న రూపంలో…

    అక్కడే నాకు నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టయింది...

    తనకు ఎందుకు అలా అనిపించింది...?

    తర్వాత ఏమి జరిగింది...?

    అన్విత చనిపోవడానికి కారణం ఏమిటి...?


    👉 ఈ రహస్యాలన్నీ Part-3 లో చూడండి…

    Follow చేయండి.

    Part-3 త్వరలోనే వస్తుంది.

    Comments

    Popular posts from this blog

    “రహస్య గది – Part 2 పెద్దింటి రహస్యం – Part 2 “Telugu Horror Story”

    పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడుస్తూ… పెద్దలు అసహాయంగా చూస్తూ… కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి. ఒకసారి భారీ కరువు వచ్చింది… పొలాల్లో పంట...

    నువ్వు సేఫ్‌గా ఉన్నావా? హారిక కథ Part-2 "నీడ వెనుక నిజం”

    “హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్ల. 8:59 PM… ఇప్పుడు గుండె శబ్దమే ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. “ఈసారి వస్తే… నేను రిప్లై ఇస్తాను…” అని ఆమె తనలో తాను నిర్ణయించుకుంది. ఆమె...

    90s లోని ఆడిన ఆటలు part-3

    90s లో పిల్లలు బయట ఆడిన ఆటలు చాలా simple అయినా super fun ఉండేవి 😄  ఇప్పుడు mobile games ఎక్కువ అయినా, ఆ కాలం games లో ఉన్న excitement వేరు! ఇక్కడ కొన్ని best indoor & outdoor games వివరంగా తెలుసుకుందాం 👇 21.  దొంగ – పోలీస్ ఆట (Thief & Police Game Rules in Telugu)           దొంగ–పోలీస్ (Chor Police) అనేది చాలా ఫన్‌గా ఉండే పిల్లల ఆట. ఈ ఆటలో పరుగులు, తెలివి, ప్లానింగ్—all కలిసి ఉంటాయి 😄 ఎంతమంది ఆడాలి? కనీసం 4–5 మంది ఎక్కువమంది ఉంటే ఇంకా ఫన్ 👍 ఆట యొక్క ఉద్దేశ్యం పోలీస్ → దొంగలను పట్టుకోవాలి దొంగలు → పోలీస్‌కి చిక్కకుండా తప్పించుకోవాలి ఆట మొదలుపెట్టే విధానం అందరూ కలిసి ఒక చోట నిలబడాలి “ఒంటి కాలి, రెంటి కాలి…” లాంటి పద్ధతితో ఎవరు పోలీస్ అవుతారో నిర్ణయించాలి మిగతా వాళ్ళంతా దొంగలు ఆట ఎలా ఆడాలి? 🔹 Step-by-step : 1. స్టార్ట్ “పోలీస్ కళ్ళు మూసుకుని 1 నుంచి 20 వరకు లెక్కపెడతాడు” ఆ సమయంలో దొంగలు దాక్కుంటారు 🏃‍♂️ 2. వెతకడం కౌంట్ పూర్తయ్యాక పోలీస్ వెతకడం మొదలుపెడతాడు 3. పట్టుకోవడం పోలీస్ దొంగను తాకితే →...

    “రహస్య గది – Part 1 (తెలుగు Horror Story)”

    “పెద్దింటి రహస్యం – భయంకర కథ”   ఒక గ్రామంలో పెద్ద ఇల్లు. ఆ ఇల్లు చాలా పెద్ద సంసారం ఉన్న ఇల్లు.       గ్రామంలో అందరూ ఆ ఇంట్లో వాళ్ళను పెద్దింటి వాళ్ళు అనేవారు. ఆ పెద్దింట్లో ఒక అబ్బాయికి పెళ్లి నిశ్చయం అయ్యింది.      ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా పెళ్లి ఏర్పాట్లు జరిగుతున్నాయి.       ఇంటి ముందు మామిడి ఆకుల తోరణాలు, గాలి తాకిడికి ఊగుతూ… రంగురంగుల లైట్లు రాత్రి ఆకాశాన్ని కూడా వెలిగిస్తున్నాయి.       గ్రామం మొత్తం ఆహ్వానం పొందింది. ఎవరైనా వచ్చి తినొచ్చు… చూడొచ్చు… ఆశీర్వదించొచ్చు. పెళ్లి రోజు ఉదయం… నాదస్వరాలు మోగుతుండగా, డప్పులు, తాళాలు గ్రామం అంతా వినిపిస్తున్నాయి.  పెళ్లి కొడుకు రాజశేఖర్…        తెల్ల పంచె కట్టుకొని, తిలకం పెట్టుకొని, అద్భుతంగా కనిపిస్తున్నాడు.   పెళ్లికూతురు నాదియా…        పసుపు పచ్చ, ఎర్రటి అంచు పట్టు చీర ఇంకా బంగారు ఆభరణాలు         ఆమె ముఖంలో చిన్న నవ్వు పెద్ద సంతోషం. పెళ్లి సందడులు చాలా సరదాగా నడుస్తూ ఉండేది.  ఇలా ఉండగా, ...

    90s లోని ఆడిన ఆటలు part-2

    90s లో పిల్లలు బయట ఆడిన ఆటలు చాలా simple అయినా super fun ఉండేవి 😄  ఇప్పుడు mobile games ఎక్కువ అయినా, ఆ కాలం games లో ఉన్న excitement వేరు! ఇక్కడ కొన్ని best indoor & outdoor games వివరంగా తెలుసుకుందాం 👇 11. Tiger & Goat (పులి–మేక ఆట)        పులి–మేక ఆట (Tiger & Goat game) ఒక పురాతన భారతీయ స్ట్రాటజీ గేమ్. దీన్ని కొన్ని ప్రాంతాల్లో “Bagh-Chal” అని కూడా అంటారు. ఇది 2 మంది ఆడే ఆట — ఒకరు పులి (Tiger), మరొకరు మేకలు (Goats) పాత్రలు తీసుకుంటారు. ఆట లక్ష్యం (Goal) 🐯 పులి (Tiger) → ఎక్కువ మేకలను పట్టుకోవాలి (తినాలి) 🐐 మేకలు (Goats) → పులిని కదలకుండా బ్లాక్ చేయాలి ఆటకు కావలసినవి ఒక ప్రత్యేకమైన బోర్డు (Board) (లైన్లు, పాయింట్లు ఉంటాయి) 4 పులులు (Tigers) 20 మేకలు (Goats) ఆట ప్రారంభం ఎలా? బోర్డు మీద ముందే ఉన్న 4 మూలలలో లేదా నిర్ణయించిన స్థానాల్లో పులులు పెట్టాలి మేకలు మొదట బోర్డులో ఉండవు మేకల ఆటగాడు ఒక్కోసారి ఒక్క మేకను బోర్డులో ఖాళీ స్థలంలో పెట్టాలి. 🐐 మేకల ఆటగాడు (Goat Player ) ఒక్కో...