Skip to main content

Episode 2 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story

చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 2 1980ల్లో… ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటనను ఇప్పటికీ అక్కడి పెద్దవాళ్లు పూర్తిగా మర్చిపోలేదు… పౌర్ణమి రాత్రి చెరువు దగ్గరకు వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి ఆ దారి వైపు చూడకుండా వచ్చేవారు…? అసలు… “లక్ష్మి” అనే ఆ అమ్మాయి నిజంగా ఎవరు…? ఆ రాత్రి… రాఘవ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అతని అరచేతుల్లో ఇంకా చెరువు నీటి చల్లదనం మిగిలి ఉన్నట్టే అనిపిస్తోంది. అతని చేతిలో ఉన్న ఆ వెండి గాజు మాత్రం చంద్రకాంతి తగిలినప్పుడల్లా వింతగా మెరుస్తోంది. అది సాధారణ గాజులా కనిపించినా… దానిలో ఏదో చెప్పలేని భయం దాగి ఉన్నట్టుగా ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. బయట అప్పుడప్పుడు వీచే గాలి పాత కిటికీ తలుపులను మెల్లగా కదిలిస్తోంది. దూరంగా ఎక్కడో కుక్కలు మొరుగుతున్న శబ్దం మాత్రమే ఆ నిశ్శబ్ద రాత్రిని చీల్చుతోంది. కానీ రాఘవకు మాత్రం కళ్లకు నిద్ర రాలేదు. అతను మంచం మీద పడుకున్నప్పుడల్లా చెరువు దగ్గర కనిపించిన ఆ అమ్మాయి ముఖమే గుర్తొస్తోంది. ఆమె కళ్ళలో కనిపించిన ఆ విచిత్రమైన బాధ… ఆమె మాటల్లో దాగి ఉన్న ఆ ఒంటరితనం… ఏదో అతని మనసును గట్టిగా పట్టేసినట్టుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఇంకా అత...

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత…
ఒక రోజు…

నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.… 

కారిడార్‌లోకి అడుగు పెట్టగానే…

ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు..
అన్విత ఇంకా అద్వైత్

మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు…

అతన్ని చూసిన క్షణం—
నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి…
నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.

ఎన్ని రోజుల తర్వాత…
ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను…

అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు.

ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి.

అతని కళ్లలో ఆశ్చర్యం…
నా కళ్లలో ఆనందం… గందరగోళం…
నేను ఏమి మాట్లాడాలో తెలియక…
నవ్వు కూడా సరిగా రాలేదు.

చివరికి…
ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను—

“అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?”
అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.

“నేను బాగున్నాను…
నువ్వెలా ఉన్నావు… అన్విత?”

ఆ మాట విన్న క్షణం…
నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.

“నేను కూడా బాగున్నాను…
ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…”

అని చెప్పేటప్పుడు…
నా గొంతులో చిన్న కంపనం వినిపించింది.

అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాము…

గతం… జ్ఞాపకాలు… అన్నీ మళ్లీ నెమ్మదిగా మధ్యలోకి వచ్చాయి.

కారిడార్‌లోని ఆ నిశ్శబ్దం…  మా మధ్య మాటలతో నిండిపోయింది.

చివరికి…
నేను కొంచం ధైర్యంగా నవ్వుతూ అన్నాను—

“ఇదే మా ఇల్లు…  ఎప్పుడైనా టైం దొరికితే రా అద్వైత్…”

అద్వైత్:
"అలా అంటే… మనం చాలా దగ్గర్లోనే ఉన్నాము...
దానికి ఎదురుగ ఉన్న ప్లాట్ మాది…” 
అని చిన్న నవ్వుతో అన్నాడు. 

ఆ మాట విన్న వెంటనే…  నా హృదయం లోపల ఏదో మెల్లగా కదిలింది.

అతన్ని మరిచిపోవాలనుకున్నాను...
కానీ నేను ఎంత ప్రయత్నించినా…
అతన్ని నా మనసులో నుంచి పూర్తిగా తీసివేయలేకపోతున్నాను…

అలా ప్రతి ఉదయం…
తలుపు తెరిస్తే ఒకసారి కారిడార్ వైపు చూడడం నా అలవాటు అయిపోయింది—

“అతను కనిపిస్తాడేమో…” అనే చిన్న ఆశతో.

కొన్నిసార్లు…
అతను ఫోన్‌లో మాట్లాడుకుంటూ బయటకు వస్తాడు…

కొన్నిసార్లు…
నేను బయటకు వచ్చేసరికి అతను ఇప్పటికే అక్కడ నిలబడి ఉంటాడు.

అలా దొరికిన ప్రతీసారి…
మా మధ్య చిన్న చిన్న మాటలు మొదలయ్యేవి.

“ఆఫీస్ ఎలా ఉంది…?”
“ఇక్కడ అలవాటు అయిపోయిందా…?”
“ఎంత టైం నుంచి ఇక్కడ ఉంటున్నావు…?”

అలా సాధారణంగా మొదలైన మాటలు…
నెమ్మదిగా మళ్లీ పాత జ్ఞాపకాల దారి పట్టేవి.

కాఫీ గురించి…
కాలేజీ రోజులు గురించి…
చిన్న చిన్న నవ్వుల గురించి…

మేము మాట్లాడుతున్నప్పుడల్లా…    సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు.

ఒక రోజు…
సాయంత్రం సమయం... నేను ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉండగా—

తలుపు దగ్గర ఒక మెల్లని నాక్ వినిపించింది.
తలుపు తెరిచి చూసాను…

అద్వైత్.
“ఫ్రీగా ఉన్నావా…?
ఒక్కసారి మా ఇంటికి రా…”
అని అన్నాడు.

ఆ మాట విన్న క్షణం…
నా గుండెలో తెలియని ఆనందం ఉప్పొంగింది.

“సరే…” అని చిన్న నవ్వుతో అతని వెంట వెళ్లాను.

అతని ఇంటి లోపల అడుగు పెట్టినప్పుడు—
అది చాలా సాదాసీదాగా ఉంది … 

కానీ హాయిగా అనిపించింది.

అప్పుడే…
“అన్విత… ఇదే నా భార్య… మాధవి…” అని
అతను పరిచయం చేశాడు.

ఆమె నా వైపు చూసి మృదువుగా నవ్వింది.

“హాయ్…” అని నేను కూడా నవ్వాను…

కానీ… నా మనసులో మాత్రం ఏదో కుదురుగా లేదు.

ఆ రోజు నుంచి…
నేను మాధవితో కూడా మాట్లాడడం మొదలుపెట్టాను.

ఆమె చాలా మంచిదైన అమ్మాయి…
సింపుల్… 
సైలెంట్… 
అమాయకంగా నవ్వేది.
అన్విత, అద్వైత్ ఇంకా మాధవి

అప్పుడప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని…
మేము ముగ్గురం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం…

కానీ…
నెమ్మదిగా…
ఏదో మార్పు నాకు కనిపించడం ప్రారంభమైంది.

అద్వైత్…
మునుపటి కంటే తన భార్యపై ఎక్కువ శ్రద్ధ చూపించడం…

ఆమె చిన్న చిన్న విషయాలకూ పట్టించుకోవడం…

ఆమె నవ్వితే… అతను సంతోషపడడం…
అన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయి.

కొన్ని రోజులకు…
మాధవి ప్రెగ్నెంట్ అయ్యింది.
ఆ వార్త విన్న రోజు…
ఇంటి అంతా ఆనందంతో నిండిపోయింది.

కానీ…
నా లోపల మాత్రం ఏదో విరిగిపోయింది.

రోజురోజుకీ వాళ్ల సంతోషం చూసి...
నా లోపల కోపం పెరుగుతూ వచ్చింది...
చివరికి నేను నన్నే కోల్పోయాను…

అద్వైత్…
ఇప్పుడు పూర్తిగా ఆమెకే చెందినట్టుగా అనిపించాడు.
నాతో మాట్లాడటం తగ్గిపోయింది…

కొన్ని సార్లు నేను ఉన్నానో లేదో కూడా పట్టించుకోలేదు.

ఆ మార్పు…
నాకు నెమ్మదిగా బాధగా… కోపంగా మారింది.

ఒక రోజు…
మళ్లీ వాళ్లింటికి వెళ్లాను.......

అంటూ....

అక్కడ నుండి నాలుగు కాగితాలు అతికించబడి ఉన్నాయి.
అవి సాధారణంగా కనిపించలేదు…

పోలీసులు హత్య విచారణ కోసం 
అద్వైత్ కూడా అక్కడికి పిలిపించారు.

ఈ డైరీలో ఏదో రహస్యంగా…
ఏదో చెప్పాలనుకున్నట్టుగా ఉన్నాయి.

“ఇవి ఏమిటి…?” అని ఇన్స్పెక్టర్ రాఘవ్...

“ఈ కాగితాల లోపల ఏదో ఉంది…” అని
అతను అనుమానంగా అన్నాడు.

అతను జాగ్రత్తగా వాటిని ఒక్కొక్కటిగా తీసాడు…
చిరగకుండా… నెమ్మదిగా…

అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు.

ఆ కాగితాలను తెరిచి చదవడం ప్రారంభించాడు…

అందులో రాసిన అక్షరాలు చూసిన క్షణం—

ఇన్స్పెక్టర్ రాఘవ్ ముఖంలో ఆశ్చర్యం…
భయం కలిసిపోయాయి.

ఆ కాగితాల్లో రాసి ఉంది—

 “అద్వైత్…

మునుపటి కంటే ఇప్పుడు తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు…
నాతో అస్సలు మాట్లాడటం లేదు…
నన్ను పట్టించుకోవడం లేదు…” 

ఆ రోజు నుంచి…
నాకు నిద్ర సరిగ్గా రావడం మానేసింది.

రాత్రి లైట్లు ఆఫ్ చేసిన తర్వాత కూడా…
నా కళ్ల ముందు మాత్రం ఒకే దృశ్యం తిరుగుతూనే ఉంది—

అద్వైత్…
మాధవితో నవ్వుతూ మాట్లాడటం…

వాళ్ల నవ్వులు నా చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి.

నేను కళ్లను బిగిగా మూసుకున్నా…
ఆ దృశ్యం మాత్రం పోవడం లేదు.
అన్విత

“ఎందుకు ఇలా అవుతోంది నాకు…?”
“నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను…?”

అని నా మనసునే నేను అడిగాను.

కానీ…
జవాబు మాత్రం రాలేదు.

రోజులు గడిచే కొద్దీ…
నా కోపం… బాధ…
అన్నీ ఒకే చోట చేరిపోయాయి.

చివరికి…
ఒక రోజు…
నేను నిర్ణయం తీసుకున్నాను.

ఎలాగైనా ఆమె జీవితం నాశనం చేయాలని అనుకున్నాను…”

అని చదువుతున్నప్పుడు…
ఇన్స్పెక్టర్ రాఘవ్ ఒక్కసారిగా ఆగిపోయాడు.
ఆ గదిలో ఉన్న నిశ్శబ్దం మరింత గాఢంగా మారింది.

అతను నెమ్మదిగా తన చూపును అద్వైత్ వైపు తిప్పాడు…

అద్వైత్ కళ్లలో గందరగోళం… భయం…
ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితి.

ఒక రోజు…
ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి…
నేనే ఆమెను మా ఫ్లాట్‌కు పిలిచాను…
స్నేహంగా నటిస్తూ…”

ఆ మాటలు వినగానే…
అద్వైత్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.
అతని చేతులు స్వల్పంగా కంపించాయి.

అతను తల ఊపుతూ—
“లేదు… ఇది నిజం కాదు…” 
అని మెల్లగా అనుకున్నాడు.

కానీ…
ఇన్స్పెక్టర్ మళ్లీ చదవడం కొనసాగించాడు—

“ఆమెకి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చాను…
“ఆ మత్తు మందు ఎక్కువగా పనిచేసింది…”

ఆ మాటలు గదిలో ప్రతిధ్వనించినట్టుగా అనిపించాయి.

“అది… ఎక్కువ అయిపోయింది…
ఆమె ఒక్కసారిగా కూలిపోయింది…”

అద్వైత్ కళ్లలో భయం మరింత పెరిగింది.

అతని ఊపిరి బిగుసుకుపోయింది…
గుండె కొట్టుకునే శబ్దం అతనికే వినిపిస్తున్నట్టుంది.

అన్విత...
“మొదట నేను భయపడ్డాను…
ఏం చేయాలో అర్థం కాలేదు…”

ఒక్క క్షణం…
ఇన్స్పెక్టర్ కూడా చదవడం ఆపి ఆలోచించాడు.

“కానీ…
ఇది నాకు ఒక అవకాశం అనిపించింది…”

ఆ లైన్ వినగానే—
అద్వైత్ పూర్తిగా నిశ్చేష్టుడయ్యాడు.

అతని కాళ్లు బలహీనంగా మారాయి…
అతను నిలబడలేనట్టుగా అనిపించింది.

గదిలో ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు అతనిపైనే ఉంది.

అన్విత...
“ఆమెను బాత్రూమ్‌లో పడేసి…
స్లిప్ అయ్యి పడిపోయినట్టుగా సెట్ చేశాను…”

“అందరూ…
ఇది ప్రమాదం అనుకుని వదిలేశారు…”

ఇన్స్పెక్టర్ నెమ్మదిగా డైరీ మూసాడు.

గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది…
ఎవరూ ఊపిరి కూడా బిగపట్టుకుని ఉన్నట్టుగా అనిపించింది.

ఇన్స్పెక్టర్ రాఘవ్ నెమ్మదిగా తల పైకి ఎత్తి అన్నాడు—

“అంటే…
ఇది ఒక murder case…”

ఆ మాట గదిలో భారంగా మోగింది.
అద్వైత్ చేతులు వణికిపోతున్నాయి…
అతని కాళ్లు బలహీనంగా మారిపోయాయి…

“అన్విత…
ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు…”

అని అతను గట్టిగా ఊపిరి పీలుస్తూ అన్నాడు.

ఆ తర్వాత…
అతను ఇక తనను ఆపుకోలేకపోయాడు.

మెల్లగా కూర్చుని…
తన ముఖాన్ని చేతులతో మూసుకుని ఏడవడం ప్రారంభించాడు.
అద్వైత్

ఆ ఏడుపు…   కేవలం బాధ కాదు…

పశ్చాత్తాపం…
గిల్ట్…
తనకు తెలియని ఒక నష్టం…
అన్నీ కలిసిపోయిన ఒక విరుగు.

“మాధవి…
నన్ను క్షమించు…”

అని అతను గట్టిగా sob అవుతూ అన్నాడు.

“ఇది అంతా… నా నిర్లక్ష్యం వల్లే జరిగింది…”
“నేను ముందే ఏదో తప్పు జరుగుతోందని గుర్తించాలి…”

అతని మాటలు విరిగి విరిగి వస్తున్నాయి…
అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.

మాధవి ఆత్మ అతని పక్కనే నిలబడి ఉంది.
ఆమె ముఖంలో మాత్రం ఆశ్చర్యకరంగా ఒక ప్రశాంతత కనిపిస్తోంది…

ఏ బాధా…
ఏ కోపం…
ఏ భయం…

ఏమీలేవు.
ఆమె నెమ్మదిగా అద్వైత్ వైపు చూసింది…

ఒక చిన్న, మృదువైన నవ్వు ఆమె పెదవులపై మెరిసింది.

“అద్వైత్… ఇది నీ తప్పు కాదు…”
నువ్వు బాధపడకు అని అన్నది...

“ఇంతటితో నేను వచ్చిన పని…  పూర్తయ్యింది…”
ఇక నేను వెళుతున్నాను... అంటూ 

ఆ క్షణంలో—
ఆమె రూపం నెమ్మదిగా మసకబారడం ప్రారంభమైంది.

మొదట ఆమె కాళ్లు…
తర్వాత ఆమె చేతులు…

నెమ్మదిగా…
ఆమె మొత్తం శరీరం ఒక పలుచని పొగలా మారిపోయింది.
ఆమె పూర్తిగా మాయమైపోయింది.

ఇన్స్పెక్టర్ కూడా ఒక్క క్షణం మాట రావడం లేదు.

అద్వైత్ మాత్రం…

అక్కడే కూర్చుని…
ఖాళీగా చూస్తూ ఉన్నాడు.
అతని కళ్లలో కన్నీళ్లు ఇంకా జారుతూనే ఉన్నాయి…

కానీ…
ఇప్పుడు అతనికి అర్థమైంది—
తన ప్రతీకారం పూర్తి చేసుకునేందుకు వచ్చిన ఒక ఆత్మ…

అప్పుడే అద్దంలో ఇంకొక ప్రతిబింబం...
అన్విత ఆత్మ…
నన్ను క్షమించు అద్వైత్ అంటూ పశ్చాత్తాపం …

“ప్రతీకారం…
ఎప్పుడూ మనసును శాంతి ఇవ్వదు…
కానీ కొన్ని ఆత్మలకు…
అది ఒక్కటే విముక్తి…”

Comments

Popular posts from this blog

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

“ఆమె చనిపోయింది… కానీ మెసేజ్ ఇంకా వస్తోంది! 📱👻” part-1

మూసిన గది రహస్యం అద్దంలో కనిపించింది… కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు… ఎవరూ లేరు… అదే ఆమె చేసిన పెద్ద తప్పు… ఆ రాత్రి… ఆమె బ్రతికే బయటపడలేదు 😱      వర్షం గట్టిగా కురుస్తోంది… అది సాధారణ వర్షం కాదు…   ఆకాశమే పగిలిపోయినట్టుగా కుండపోతగా కురుస్తోంది. గాలి ఒక్కోసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా హోరెత్తుతోంది. చెట్లు వంగి మళ్లీ నిలబడుతున్నాయి. ఆకాశంలో మెరుపులు ఒక్కసారిగా మెరుస్తూ… చీకటిని క్షణం పాటు చీల్చేస్తున్నాయి.  ఆ వెంటనే వినిపిస్తున్న గర్జన గుండెల్లోకి దూసుకెళ్లేంత భయంకరంగా ఉంది. గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్ మొత్తం ఆ రాత్రి ఒక భూతబంగ్లా లా కనిపిస్తోంది. సాధారణంగా వెలుగులతో మెరిసే ఆ భవనం… ఇప్పుడు పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. కరెంట్ ఒక్కసారిగా పోయింది. ఎక్కడో ఎలక్ట్రిక్ వైర్లు చప్పుళ్లు చేస్తూ…  “టక్…టక్…” అంటూ వినిపిస్తున్నాయి. లిఫ్ట్ పనిచేయడం ఆగిపోయింది. కారిడార్లలో ఎమర్జెన్సీ లైట్లు కూడా వెలగడం లేదు. అప్పుడప్పుడు మెరుపు వెలుగు పడినప్పుడు మాత్రమే…  ఆ భవనం గోడలు, కిటికీలు, బాల్కనీలు ఒక్క క్షణం కనిపించి…   వెంటనే మళ్లీ చీకటిలో కలిసిప...