"వరద వారి పంటను తీసుకెళ్లింది... అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి... కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది. ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు. అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం. సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు. మావయ్యా... మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా... నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...
అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.… కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.
ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను—
అద్వైత్ నువ్వా…? బాగున్నావా…? అతను కాసేపు నన్ను చూసి… స్మైల్ చేశాడు. నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత? ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి… అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాము… గతం… జ్ఞాపకాలు… అన్నీ మళ్లీ నెమ్మదిగా మధ్యలోకి వచ్చాయి. కారిడార్‌లోని ఆ నిశ్శబ్దం… మా మధ్య మాటలతో నిండిపోయింది.
చివరికి…
నేను కొంచం ధైర్యంగా నవ్వుతూ అన్నాను— ఇదే మా ఇల్లు… ఎప్పుడైనా టైం దొరికితే రా అద్వైత్…
అద్వైత్:
అలా అంటే… మనం చాలా దగ్గర్లోనే ఉన్నాము... దానికి ఎదురుగ ఉన్న ప్లాట్ మాది… అని చిన్న నవ్వుతో అన్నాడు. ఆ మాట విన్న వెంటనే… నా హృదయం లోపల ఏదో మెల్లగా కదిలింది. అతన్ని మరిచిపోవాలనుకున్నాను... కానీ నేను ఎంత ప్రయత్నించినా… అతన్ని నా మనసులో నుంచి పూర్తిగా తీసివేయలేకపోతున్నాను…
అలా ప్రతి ఉదయం… తలుపు తెరిస్తే ఒకసారి కారిడార్ వైపు చూడడం నా అలవాటు అయిపోయింది— అతను కనిపిస్తాడేమో…” అనే చిన్న ఆశతో. కొన్నిసార్లు… అతను ఫోన్‌లో మాట్లాడుకుంటూ బయటకు వస్తాడు… కొన్నిసార్లు… నేను బయటకు వచ్చేసరికి అతను ఇప్పటికే అక్కడ నిలబడి ఉంటాడు. అలా దొరికిన ప్రతీసారి… మా మధ్య చిన్న చిన్న మాటలు మొదలయ్యేవి. ఆఫీస్ ఎలా ఉంది…? ఇక్కడ అలవాటు అయిపోయిందా…? ఎంత టైం నుంచి ఇక్కడ ఉంటున్నావు…? అలా సాధారణంగా మొదలైన మాటలు… నెమ్మదిగా మళ్లీ పాత జ్ఞాపకాల దారి పట్టేవి. కాఫీ గురించి… కాలేజీ రోజులు గురించి… చిన్న చిన్న నవ్వుల గురించి… మేము మాట్లాడుతున్నప్పుడల్లా… సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు.
ఒక రోజు…
సాయంత్రం సమయం... నేను ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉండగా— తలుపు దగ్గర ఒక మెల్లని నాక్ వినిపించింది. తలుపు తెరిచి చూసాను…
అద్వైత్.
ఫ్రీగా ఉన్నావా…? ఒక్కసారి మా ఇంటికి రా… అని అన్నాడు. ఆ మాట విన్న క్షణం… నా గుండెలో తెలియని ఆనందం ఉప్పొంగింది. సరే… అని చిన్న నవ్వుతో అతని వెంట వెళ్లాను. అతని ఇంటి లోపల అడుగు పెట్టినప్పుడు— అది చాలా సాదాసీదాగా ఉంది … కానీ హాయిగా అనిపించింది.
అప్పుడే… అన్విత… ఇదే నా భార్య… మాధవి… అని అతను పరిచయం చేశాడు. ఆమె నా వైపు చూసి మృదువుగా నవ్వింది. హాయ్… అని నేను కూడా నవ్వాను… కానీ… నా మనసులో మాత్రం ఏదో కుదురుగా లేదు. ఆ రోజు నుంచి… నేను మాధవితో కూడా మాట్లాడడం మొదలుపెట్టాను. ఆమె చాలా మంచిదైన అమ్మాయి. సింపుల్… సైలెంట్… అమాయకంగా నవ్వేది. అప్పుడప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లేదాన్ని… మేము ముగ్గురం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం… కానీ… నెమ్మదిగా… ఏదో మార్పు నాకు కనిపించడం ప్రారంభమైంది.
అద్వైత్…
మునుపటి కంటే తన భార్యపై ఎక్కువ శ్రద్ధ చూపించడం… ఆమె చిన్న చిన్న విషయాలకూ పట్టించుకోవడం… ఆమె నవ్వితే… అతను సంతోషపడడం, అన్నీ నా కళ్ల ముందే జరుగుతున్నాయి. కొన్ని రోజులకు… మాధవి ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ వార్త విన్న రోజు… ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. కానీ... నా లోపల మాత్రం ఏదో విరిగిపోయింది. రోజురోజుకీ వాళ్ల సంతోషం చూసి.. నా లోపల కోపం పెరుగుతూ వచ్చింది... చివరికి నేను నన్నే కోల్పోయాను…
అద్వైత్… ఇప్పుడు పూర్తిగా ఆమెకే చెందినట్టుగా అనిపించాడు. నాతో మాట్లాడటం తగ్గిపోయింది. కొన్ని సార్లు నేను ఉన్నానో లేదో కూడా పట్టించుకోలేదు. ఆ మార్పు… నాకు నెమ్మదిగా బాధగా… కోపంగా మారింది.
ఒక రోజు… మళ్లీ వాళ్లింటికి వెళ్లాను.......
అంటూ.... అక్కడ నుండి నాలుగు కాగితాలు అతికించబడి ఉన్నాయి. అవి సాధారణంగా కనిపించలేదు… పోలీసులు హత్య విచారణ కోసం అద్వైత్ కూడా అక్కడికి పిలిపించారు. ఈ డైరీలో ఏదో రహస్యంగా… ఏదో చెప్పాలనుకున్నట్టుగా ఉన్నాయి. ఇవి ఏమిటి…?” అని ఇన్స్పెక్టర్ రాఘవ్... ఈ కాగితాల లోపల ఏదో ఉంది… అని అతను అనుమానంగా అన్నాడు. అతను జాగ్రత్తగా వాటిని ఒక్కొక్కటిగా తీసాడు… చిరగకుండా… నెమ్మదిగా…
అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఆ కాగితాలను తెరిచి చదవడం ప్రారంభించాడు… అందులో రాసిన అక్షరాలు చూసిన క్షణం— ఇన్స్పెక్టర్ రాఘవ్ ముఖంలో ఆశ్చర్యం…
భయం కలిసిపోయాయి. ఆ కాగితాల్లో రాసి ఉంది—
అద్వైత్…
మునుపటి కంటే ఇప్పుడు తన భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు… నాతో అస్సలు మాట్లాడటం లేదు… నన్ను పట్టించుకోవడం లేదు… ఆ రోజు నుంచి… నాకు నిద్ర సరిగ్గా రావడం మానేసింది. రాత్రి లైట్లు ఆఫ్ చేసిన తర్వాత కూడా… నా కళ్ల ముందు మాత్రం ఒకే దృశ్యం తిరుగుతూనే ఉంది—
అద్వైత్… మాధవితో నవ్వుతూ మాట్లాడటం… వాళ్ల నవ్వులు నా చెవుల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. నేను కళ్లను బిగిగా మూసుకున్నా… ఆ దృశ్యం మాత్రం పోవడం లేదు. ఎందుకు ఇలా అవుతోంది నాకు…? నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను…? అని నా మనసునే నేను అడిగాను. కానీ… జవాబు మాత్రం రాలేదు రోజులు గడిచే కొద్దీ, నా కోపం… బాధ… అన్నీ ఒకే చోట చేరిపోయాయి.
చివరికి… ఒక రోజు… నేను నిర్ణయం తీసుకున్నాను. ఎలాగైనా ఆమె జీవితం నాశనం చేయాలని అనుకున్నాను… అని చదువుతున్నప్పుడు… ఇన్స్పెక్టర్ రాఘవ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆ గదిలో ఉన్న నిశ్శబ్దం మరింత గాఢంగా మారింది. అతను నెమ్మదిగా తన చూపును అద్వైత్ వైపు తిప్పాడు… అద్వైత్ కళ్లలో గందరగోళం… భయం… ఏమి జరుగుతుందో అర్థం కాని స్థితి.
ఒక రోజు… ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి… నేనే ఆమెను మా ఫ్లాట్‌కు పిలిచాను…
స్నేహంగా నటిస్తూ…
ఆ మాటలు వినగానే… అద్వైత్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతని చేతులు స్వల్పంగా కంపించాయి. అతను తల ఊపుతూ— లేదు… ఇది నిజం కాదు… అని మెల్లగా అనుకున్నాడు.
కానీ… ఇన్స్పెక్టర్ మళ్లీ చదవడం కొనసాగించాడు— ఆమెకి మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చాను… ఆ మత్తుమందు ఎక్కువగా పనిచేసింది… ఆ మాటలు గదిలో ప్రతిధ్వనించినట్టుగా అనిపించాయి. అది… ఎక్కువ అయిపోయింది… ఆమె ఒక్కసారిగా కూలిపోయింది…”
అద్వైత్ కళ్లలో భయం మరింత పెరిగింది. అతని ఊపిరి బిగుసుకుపోయింది… గుండె కొట్టుకునే శబ్దం అతనికే వినిపిస్తున్నట్టుంది.
మొదట నేను భయపడ్డాను… ఏం చేయాలో అర్థం కాలేదు…
ఒక్క క్షణం… ఇన్స్పెక్టర్ కూడా చదవడం ఆపి ఆలోచించాడు.
కానీ… ఇది నాకు ఒక అవకాశం అనిపించింది…
ఆ లైన్ వినగానే— అద్వైత్ పూర్తిగా నిశ్చేష్టుడయ్యాడు.
అతని కాళ్లు బలహీనంగా మారాయి… అతను నిలబడలేనట్టుగా అనిపించింది. గదిలో ఉన్న ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు అతనిపైనే ఉంది.
ఆమెను బాత్రూమ్‌లో పడేసి… స్లిప్ అయ్యి పడిపోయినట్టుగా సెట్ చేశాను…
అందరూ… ఇది ప్రమాదం అనుకుని వదిలేశారు… ఇన్స్పెక్టర్ నెమ్మదిగా డైరీ మూసాడు. గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఏర్పడింది… ఎవరూ ఊపిరి కూడా బిగపట్టుకుని ఉన్నట్టుగా అనిపించింది. ఇన్స్పెక్టర్ రాఘవ్ నెమ్మదిగా తల పైకి ఎత్తి అన్నాడు—
అంటే… ఇది ఒక murder case…
ఆ మాట గదిలో భారంగా మోగింది. అద్వైత్ చేతులు వణికిపోతున్నాయి… అతని కాళ్లు బలహీనంగా మారిపోయాయి… అన్విత… ఇలా చేస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు… అని అతను గట్టిగా ఊపిరి పీలుస్తూ అన్నాడు.
ఆ తర్వాత… అతను ఇక తనను ఆపుకోలేకపోయాడు. మెల్లగా కూర్చుని… తన ముఖాన్ని చేతులతో మూసుకుని ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు… కేవలం బాధ కాదు…
పశ్చాత్తాపం… గిల్ట్… తనకు తెలియని ఒక నష్టం… అన్నీ కలిసిపోయిన ఒక విరుగు. మాధవి…
నన్ను క్షమించు… అని అతను గట్టిగా sob అవుతూ అన్నాడు. ఇది అంతా… నా నిర్లక్ష్యం వల్లే జరిగింది… నేను ముందే ఏదో తప్పు జరుగుతోందని గుర్తించాలి…”
అతని మాటలు విరిగి విరిగి వస్తున్నాయి… అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. మాధవి ఆత్మ అతని పక్కనే నిలబడి ఉంది. ఆమె ముఖంలో మాత్రం ఆశ్చర్యకరంగా ఒక ప్రశాంతత కనిపిస్తోంది…
ఏ బాధా… ఏ కోపం… ఏ భయం… ఏమీలేవు. ఆమె నెమ్మదిగా అద్వైత్ వైపు చూసింది… ఒక చిన్న, మృదువైన నవ్వు ఆమె పెదవులపై మెరిసింది. అద్వైత్… ఇది నీ తప్పు కాదు… నువ్వు బాధపడకు అని అన్నది... ఇంతటితో నేను వచ్చిన పని… పూర్తయ్యింది… ఇక నేను వెళుతున్నాను... అంటూ
ఆ క్షణంలో— ఆమె రూపం నెమ్మదిగా మసకబారడం ప్రారంభమైంది. మొదట ఆమె కాళ్లు… తర్వాత ఆమె చేతులు… నెమ్మదిగా… ఆమె మొత్తం శరీరం ఒక పలుచని పొగలా మారిపోయింది. ఆమె పూర్తిగా మాయమైపోయింది. ఇన్స్పెక్టర్ కూడా ఒక్క క్షణం మాట రావడం లేదు.
అద్వైత్ మాత్రం… అక్కడే కూర్చుని… ఖాళీగా చూస్తూ ఉన్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు ఇంకా జారుతూనే ఉన్నాయి… కానీ… ఇప్పుడు అతనికి అర్థమైంది— తన ప్రతీకారం పూర్తి చేసుకునేందుకు వచ్చిన ఒక ఆత్మ…
అప్పుడే అద్దంలో ఇంకొక ప్రతిబింబం... అన్విత ఆత్మ… నన్ను క్షమించు అద్వైత్.
పశ్చాత్తాపం … ప్రతీకారం… ఎప్పుడూ మనసును శాంతి ఇవ్వదు…
కానీ కొన్ని ఆత్మలకు… అది ఒక్కటే విముక్తి…

Comments
Post a Comment