మూసిన గది రహస్యం
అద్దంలో కనిపించింది…
కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు… ఎవరూ లేరు…
అదే ఆమె చేసిన పెద్ద తప్పు…
ఆ రాత్రి… ఆమె బ్రతికే బయటపడలేదు 😱
వర్షం గట్టిగా కురుస్తోంది… అది సాధారణ వర్షం కాదు…
ఆకాశమే పగిలిపోయినట్టుగా కుండపోతగా కురుస్తోంది.
గాలి ఒక్కోసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా హోరెత్తుతోంది. చెట్లు వంగి మళ్లీ నిలబడుతున్నాయి.
ఆకాశంలో మెరుపులు ఒక్కసారిగా మెరుస్తూ… చీకటిని క్షణం పాటు చీల్చేస్తున్నాయి.
ఆ వెంటనే వినిపిస్తున్న గర్జన గుండెల్లోకి దూసుకెళ్లేంత భయంకరంగా ఉంది.
గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్ మొత్తం ఆ రాత్రి ఒక భూతబంగ్లా లా కనిపిస్తోంది.
సాధారణంగా వెలుగులతో మెరిసే ఆ భవనం… ఇప్పుడు పూర్తిగా చీకట్లో మునిగిపోయింది.
కరెంట్ ఒక్కసారిగా పోయింది. ఎక్కడో ఎలక్ట్రిక్ వైర్లు చప్పుళ్లు చేస్తూ…
“టక్…టక్…” అంటూ వినిపిస్తున్నాయి.
లిఫ్ట్ పనిచేయడం ఆగిపోయింది. కారిడార్లలో ఎమర్జెన్సీ లైట్లు కూడా వెలగడం లేదు.
అప్పుడప్పుడు మెరుపు వెలుగు పడినప్పుడు మాత్రమే…
ఆ భవనం గోడలు, కిటికీలు, బాల్కనీలు ఒక్క క్షణం కనిపించి…
వెంటనే మళ్లీ చీకటిలో కలిసిపోతున్నాయి.
దూరంగా ఎక్కడో ఒక కుక్క గట్టిగా అరుస్తోంది…
ఆ శబ్దం కూడా ఆ వర్షం మధ్యలో మరింత భయంకరంగా వినిపిస్తోంది.
ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఫ్లాట్‌లోనూ ఒక విచిత్రమైన నిశ్శబ్దం.
ప్రజలు ఉన్నారు… కానీ ఎవ్వరూ బయటికి రావడం లేదు. ఆ రాత్రి గాలి కూడా ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది…
కానీ మాటల్లోకి రాక మౌనంగా అరుస్తోంది.
ఆ చీకటిలో…
ఒక ఫ్లాట్ బాల్కనీలో మాత్రం ఒక నీడ నిలబడి ఉంది.
అది అన్విత...
అన్విత తన బాల్కనీలో నిలబడి ఉంది…
చల్లని గాలి వాన చినుకులతో కలిసి ఆమె ముఖాన్ని తాకుతోంది.
చేతులతో రెయిలింగ్ పట్టుకుని ఎదురుగా ఉన్న ఫ్లాట్ వైపు చూస్తోంది.
అది అద్వైత్ ఫ్లాట్…
సాధారణంగా అక్కడ లైట్ ఆన్‌లో ఉండేది… TV శబ్దం, నవ్వులు, ఏదో జీవం ఉండేది.
కానీ ఈరోజు… అక్కడ కూడా గాఢమైన చీకటి మాత్రమే ఉంది.
ఒక్కోసారి మెరుపు మెరుస్తే…
అతని బాల్కనీ, కిటికీలు క్షణం పాటు కనిపిస్తున్నాయి.
ఆ క్షణాల్లో… ఎవరో లోపల కదులుతున్నట్టు అనిపించి… మళ్లీ ఏమీ కనిపించకుండా పోతుంది.
అన్విత కళ్లను చిట్లించి మళ్లీ జాగ్రత్తగా చూసింది.
“అది నిజంగానే ఎవరోనా…? లేక నా భ్రమేనా…?” అని ఆమె మనసులో అనుకుంది.
అదే సమయానికి…
ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయ్యింది.
ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో చాలా గట్టిగా వినిపించినట్టు అనిపించింది.
అన్విత గుండె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె నెమ్మదిగా ఫోన్ స్క్రీన్ వైపు చూసింది…
స్క్రీన్ మీద మెరుస్తున్న పేరు చూసి కాస్త ఆశ్చర్యపోయింది…
“అద్వైత్”
“ఇంత టైమ్‌లో…?”
వర్షం శబ్దం మధ్యలో… ఆమె మెసేజ్ ఓపెన్ చేసింది.
“నువ్వు ఏమైనా శబ్దం విన్నావా?”
ఆ ఒక్క లైన్ చూసిన వెంటనే… అన్విత గుండె మళ్లీ గట్టిగా కొట్టుకుంది.
ఆమె వెంటనే తలెత్తి అతని ఫ్లాట్ వైపు చూసింది.
అక్కడ ఇంకా చీకటే ఉంది… ఎలాంటి కదలిక కనిపించలేదు.
“శబ్దమా…? ఏ శబ్దం…?” అని మనసులోనే అనుకుంది.
ఆమె మనసులో అనుమానం మొదలైంది.
ఇప్పటికే వర్షం, మెరుపులు, చీకటి… ఇవన్నీ కలిసి ఒక విచిత్రమైన భయం కలిగిస్తున్నాయి.
ఆమె వెంటనే టైప్ చేసింది…
“ఏ శబ్దం?”
మెసేజ్ పంపిన తర్వాత… ఆమె చూపు మళ్లీ ఆ ఫ్లాట్‌పైనే నిలిచిపోయింది…
ఇప్పుడు మాత్రం… ఆమెకు స్పష్టంగా అనిపించింది…
ఆ చీకటిలో ఎవరో కదులుతున్నారు…
అప్పుడే ఆమెకు అద్వైత్ నుండి మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది.
“మా ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది.”
ఆమె గుండె దడ దడగా కొట్టుకుంది. ఎదురుగా ఉన్న అతని బాల్కనీ వైపు చూసింది.
చూసిన వెంటనే లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి.
అప్పుడే ఒక పెద్ద శబ్దం కూడా వినిపించింది. అన్విత చాలా భయపడిపోయింది.
“నా బెడ్‌రూమ్ తలుపు మూసుకుపోయింది.” అని మెసేజ్ వచ్చింది.
అన్విత గుండె వేగంగా కొట్టుకుంటోంది… చేతులు స్వల్పంగా కంపిస్తున్నాయి.
“ఇక్కడ నిలబడి ఉండడం కంటే… వెళ్లి చూసేద్దాం…” అని ఆమె తనలోనే అనుకుంది.
ఒక్కసారిగా తిరిగి లోపలికి వెళ్లి… తలుపు తెరిచి బయటకు అడుగు వేసింది.
కారిడార్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఎమర్జెన్సీ లైట్ కూడా పనిచేయడం లేదు.
దూరంగా ఎక్కడో వర్షం నీళ్లు పైప్ నుంచి జారిపడుతున్న శబ్దం…
“టప్… టప్… టప్…” అంటూ ప్రతిధ్వనిస్తోంది.
ఆ శబ్దం మధ్యలో… ఆమె అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తోంది.
ప్రతి అడుగు వేసినప్పుడు… ఆ శబ్దం కారిడార్ అంతా మారుమోగుతున్నట్టు అనిపిస్తోంది.
అన్విత నెమ్మదిగా ముందుకు నడిచింది…
చేతితో గోడను తడుముకుంటూ… దారి చూసుకుంటోంది. అప్పుడప్పుడు మెరుపు మెరుస్తే…
కారిడార్ ఒక్క క్షణం వెలుగుతో నిండిపోతుంది… ఆ వెంటనే మళ్లీ గాఢ చీకటి.
ఆ క్షణాల్లో…
గోడల మీద వేలాడుతున్న నీడలు విచిత్రంగా కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి.
ఆమె గుండె లోపల భయం పెరుగుతోంది… కానీ అద్వైత్ గురించి ఆలోచన ఆమెను ముందుకు నడిపిస్తోంది.
చివరికి…
ఆమె అతని ఫ్లాట్ తలుపు దగ్గరికి చేరుకుంది.
కొన్ని క్షణాలు… ఆమె అక్కడే నిలబడి ఉంది.
లోపల ఏదైనా శబ్దం వినిపిస్తుందేమో అని చెవులు గట్టిగా పెట్టి విన్నది…
నిశ్శబ్దం…
అది సాధారణ నిశ్శబ్దం కాదు… ఏదో దాగి ఉన్నట్టుగా అనిపించే భయంకరమైన నిశ్శబ్దం.
ఆమె గొంతు ఎండిపోయింది…
కొంచెం ధైర్యం చేసి… తలుపు దగ్గరికి ఇంకా దగ్గరగా వెళ్లి…
స్వల్పంగా కంపిస్తున్న స్వరంతో పిలిచింది…
“అద్వైత్…!”
ఆ శబ్దం కారిడార్ అంతా మారుమోగింది…
కానీ… లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
లోపలినుంచి తలుపు లాక్ కాలేదని తెలుసుకుంది, నెమ్మదిగా తలుపు తెరిచింది.
ఇంటి లోపల పూర్తిగా చీకటి. ఆమె ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని మెల్లగా లోపలికి వెళ్ళింది.
నేల మీద మట్టితో ఉన్న భయంకరమైన అడుగుల ముద్రలు బెడ్‌రూమ్ వైపుకు వెళ్లినట్టు కనిపించాయి.
ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటుంది. భయపడుతూ మెల్లగా లోపలికి నడిచింది.
బెడ్‌రూమ్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది. చప్పుడు చేస్తూనే నెమ్మదిగా తలుపు తోసింది.
అద్వైత్ నేలపై కూర్చుని గోడ వైపు చూస్తున్నాడు. అన్విత చాలా భయపడిపోయింది.
మెల్లగా “అద్వైత్!” అని పిలిచింది...!
అతను నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. "అన్విత"
“నాకు నువ్వు మెసేజ్ చేశావా?” అని అడిగింది,
అతను ఆశ్చర్యంగా చూసాడు.
“ నేనా..! నేను ఏ మెసేజ్ చేయలేదే…” అని అన్నాడు.
అద్వైత్ నంబర్ నుంచే అన్విత ఫోనుకు మళ్ళీ కొత్త మెసేజ్ వచ్చింది.
“నేను ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాను.” అన్విత చేతిలోని ఫోన్ కింద పడిపోయింది.
ఆమె చేతిలోని ఫోన్ నేలపై పడిపోయిన శబ్దం ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది…
గుండె బలంగా కొట్టుకుంటోంది… శ్వాస కూడా సరిగ్గా పడటం లేదు…
ఏమి జరుగుతోంది అన్నది ఆమెకు అర్థం కావడం లేదు.
కొన్ని క్షణాలు అక్కడే నిలబడి… నెమ్మదిగా… చాలా నెమ్మదిగా… తన ఇంటి వైపు తిరిగింది.
ఆమె అడుగులు భారంగా అనిపిస్తున్నాయి…
ఎవరైనా వెనుక నుంచి చూస్తున్నట్టుగా ఒక భయం ఆమెను వెంటాడుతోంది.
బయట మెరుపు ఒక్కసారిగా మెరిపించింది…
ఆ క్షణంలో…
ఆమె బెడ్‌రూమ్ లోపల ఒక కాంతి మెరుపు లా కనిపించింది.
అన్విత గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది.
“అది… ఏమిటి…?”
ఆమె కళ్ళు పెద్దవిగా మారాయి…
నెమ్మదిగా బెడ్‌రూమ్ వైపు అడుగు వేసింది.
తలుపు దగ్గరికి చేరుకుని… లోపలికి చూసింది.
అక్కడ…
అద్దం ముందున్న ప్రతిబింబంలో…
తెల్ల చీర కట్టుకుని ఉన్న ఒక ఆవిడ నిలబడి ఉంది.
ఆమె ముఖం స్పష్టంగా కనిపించదు…
జుట్టు ముందుకు పడిపోయి ముఖాన్ని దాచేసింది…
అద్దంలో కనిపిస్తున్న ఆ రూపం మాత్రం కదలడం లేదు…
నిశ్శబ్దంగా… అక్కడే నిలబడి ఉంది.
అద్దంలో కనిపిస్తున్న ఆ రూపాన్ని చూసిన క్షణంలో…
అన్విత శరీరం మొత్తం గడ్డకట్టినట్టైంది. ఆమె కళ్ళు ఆ ప్రతిబింబంపైనే నిలిచిపోయాయి…
“అది… నిజంగానే… ఉందా…?”
ఆమె నెమ్మదిగా తల తిప్పి… వెనక్కి చూసింది…
గది ఖాళీగా ఉంది. ఎవరూ లేరు. తర్వాత అద్వైత్ ఇంట్లో ఉన్న అద్దం వైపు చూసింది…
ఇక్కడ… అదే ఆవిడ నిలబడి ఉంది.
ఈసారి… అద్దంలో ఆమె తల పైకి లేచింది. జుట్టు కాస్త పక్కకు జరగడంతో…
ఆమె ముఖం కొద్దిగా కనిపించింది… అప్పుడు ఆమె ఎవరన్నది తనకి తెలిసింది.
అది చూసిన వెంటనే అన్విత గుండె బలంగా కొట్టుకుంటోంది…
"నువ్వా..."!
విచిత్రంగా నవ్వుతూ… అలాగే ఏడుస్తూ ఉంది.
"ప్లీజ్ నన్ను వదిలేయ్...."
ఆమె మాటలు తనకే వినిపించలేదు.
అన్విత మెల్లగా ఒక అడుగు వెనక్కి వేసింది…
అప్పుడే…
అద్దంలో ఉన్న ఆ రూపం… నెమ్మదిగా… చేతిని పైకి లేపింది…
అన్విత కూడా భయంతో వెనక్కి జరగబోతుంది…
కానీ… ఆమె కదలలేకపోయింది.
ఏదో కనిపించని శక్తి ఆమెను అక్కడే ఆపేసింది.
అద్దంలో ఉన్న ఆవిడ… నెమ్మదిగా ముందుకు కదిలింది…
కానీ… ఆమె కాళ్లు నేలపై కదలడం లేదు…
అద్దం లోపలే దగ్గర పడుతోంది…
ఇంకా దగ్గరగా…
ఇంకా దగ్గరగా…
ఒక్కసారిగా…
అద్దం గట్టిగా పగిలిపోయింది…!!
గాజు ముక్కలు చుట్టూ ఎగిరిపోయాయి…
అన్విత ఒక్కసారి గట్టిగా అరచింది…
“ఆఆఆఆఆఆ…!!!”
ఆ అరుపు…
మెల్లగా…
మెల్లగా…
నిశ్శబ్దంలో కలిసిపోయింది…
ఆ క్షణంలో… గది మొత్తం చీకటితో నిండిపోయింది.
మరుసటి రోజు ఉదయం…
వర్షం ఆగిపోయింది… సూర్యకాంతి మెల్లగా గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్ మీద పడుతోంది.
ప్రజలు బయటకు వచ్చారు…
నిన్న రాత్రి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.
అప్పుడే…
ఒక ఫ్లాట్ ముందు జనాలు గుమికూడారు…
అది…
అన్విత ఫ్లాట్.
పోలీసులు వచ్చారు. తలుపు తెరిచారు… లోపలికి వెళ్లిన వెంటనే…
అక్కడ ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఆగిపోయారు…
బెడ్‌రూమ్ లోపల… అద్దం పూర్తిగా పగిలిపోయి ఉంది…నేలంతా గాజు ముక్కలు…
మధ్యలో…
అన్విత…
నిశ్చలంగా పడుంది.
ఆమె కళ్ళు పూర్తిగా తెరిచి ఉన్నాయి…
ముఖంలో…
అత్యంత భయంకరమైన భయం గడ్డకట్టినట్టుగా ఉంది…
ఆమె శరీరంపై ఎక్కడా గాయాలు లేవు…
కానీ…
ఆమె… ఇక బ్రతికి లేదు.
పోలీసులు కేసు నమోదు చేశారు…
“అనుమానాస్పద మరణం…”
అంతే.
ఎవరికి ఏమీ అర్థం కాలేదు…
అయితే…
ఆ రాత్రి నిజంగా ఏమి జరిగింది…?
అద్దంలో కనిపించిన ఆ ఆవిడ ఎవరు…?
అన్వితకు వచ్చిన మెసేజ్ ఎవరు పంపించారు…?
👉 ఈ రహస్యాలన్నీ Part-2 లో చూడండి…
Follow చేయండి.
Part-2 త్వరలోనే వస్తుంది.
Part-2 Click Here




Comments
Post a Comment