Skip to main content

25 మామిడి చెట్ల గణిత పజిల్ | రైతుకు ఎంత డబ్బు వచ్చింది? | Telugu Maths Puzzle

  మునుపటి సమాధానం 🖼️ చిత్రం 1 ఈ చిత్రంలో "మ" అనే అక్షరం నుండి ప్రారంభమయ్యే వస్తువులు ఎన్ని ఉన్నాయి ? " మ" అక్షరంతో ప్రారంభమయ్యే వస్తువులను జాగ్రత్తగా లెక్కించాలి. సమాధానం = 10 1.    మామిడి చెట్టు 2.   మామిడి కాయలు 3.    మొసలి 4.    మేఘాలు 5.   మేక 6.    మోటార్ సైకిల్ 7.    ముక్కు 8.    ముక్కుపుడక 9.    మల్లె పూవు 10.   మందారం పూవు   🖼️ చిత్రం 2  ఈ చిత్రంలో మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ?    చిన్న త్రిభుజాలను మాత్రమే కాకుండా పెద్ద త్రిభుజాలను కూడా లెక్కించాలి. సమాధానం = 18 చిన్న త్రిభుజాలు 5 పెద్ద త్రిభుజాలు 5 జాయింట్ త్రిభుజాలు 8   ఈ రోజు గణిత ప్రశ్న ఒక రైతు 25 మామిడి మొక్కలను నాటాడు. ఆ మొక్కలు పెరుగుతూ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. ఒక సీజన్‌లో ప్రతి చెట్టుకు 500 మామిడి కాయలు వచ్చాయి.      రైతు 20 కాయలను తన ఇంటికి తీసుకున్నాడు.      తన బంధువుల 5 ఇళ్లకు ఒక్కో ఇంటికి చొప్పున 10 కాయల ఇచ...

Episode 2 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story

చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 2

1980లో… ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో జరిగిన సంఘటనను ఇప్పటికీ అక్కడి పెద్దవాళ్లు పూర్తిగా మర్చిపోలేదు. పౌర్ణమి రాత్రి చెరువు దగ్గరకు వెళ్లిన వాళ్లంతా ఎందుకు తిరిగి ఆ దారి వైపు చూడకుండా వచ్చేవారు…?

అసలు…
“లక్ష్మి” అనే ఆ అమ్మాయి నిజంగా ఎవరు…?


ఆ రాత్రంతా రాఘవకు అస్సలు నిద్రపట్టలేదు. ఆ రోజు జరిగింది తలచుకుంటే రాఘవ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అతని ఒళ్ళు మొత్తం చల్లపడిపోయినట్టు అనిపిస్తోంది. చేతులు మొత్తం చమటతో నిండిపోయింది. ఆ వెండి గాజు అప్పుడప్పుడూ 
చంద్రకాంతి తగిలినప్పుడల్లా వింతగా మెరుస్తోంది.

అది ఒక మామూలు గాజులాగానే కనిపించినా, దానిలో ఏదో చెప్పలేని భయం దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. కానీ రాఘవ కళ్ళకు మాత్రం నిద్ర పట్టలేదు. అతను మంచం మీద పడుకున్నప్పుడల్లా
చెరువు దగ్గర కనిపించిన ఆ అమ్మాయి ముఖమే కనిపిస్తోంది. ఆమె కళ్ళలో కనిపించిన ఆ విచిత్రమైన బాధ, ఆమె మాటల్లో కనిపించిన ఆ ఒంటరితనం ఏదో అతని మనసును గట్టిగా పట్టేసినట్టుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఇంకా అతని చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి.

“ఎన్నేళ్ల తర్వాత…
ఇక్కడికి మళ్లీ ఎవరో వచ్చారు…”

ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి అతని వెన్నులో చలి పరిగెత్తుతోంది. ఆ మాటల్లో ఉన్నది భయమా…? లేక ఎదురు చూపులా…? రాఘవకు అర్థం కాలేదు. అతను మెల్లగా ఆ గాజును అక్కడున్న టేబుల్‌పై పెట్టి
దీపం వెలుతురులో జాగ్రత్తగా పరిశీలించాడు. దీపం మసక వెలుతురులో ఆ వెండి గాజు మీద చిన్న చిన్న గీతలు స్పష్టంగా కనిపించాయి. అది చాలా పాతదిగా ఉన్నా ఎవరో ఎంతో జాగ్రత్తగా దాచుకున్న వస్తువులా అనిపించింది.

అప్పుడే ఆ గాజు లోపలి వైపు చిన్న అక్షరాలు చెక్కి ఉన్నట్టు కనిపించాయి. మొదట అవి స్పష్టంగా కనిపించలేదు. రాఘవ కళ్ళను ఇంకొంచం దగ్గరగా తీసుకెళ్లి చూసాడు. ఆ గాజు మీద సంవత్సరాలుగా పేరుకుపోయిన మట్టివల్ల ఆ అక్షరాలు కొంచం కూడా కనిపించడం లేదు.  అతను మెల్లగా వేళ్లతో తుడిచాడు. పొడిచిన మట్టిని చేతితో తుడిచాడు. అప్పుడు దాని మీదున్న అక్షరాలు నెమ్మదిగా స్పష్టంగా కనిపించింది.

దీపం వెలుతురు ఆ అక్షరాలపై పడిన తక్షణమే రాఘవ గుండె బలంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఎందుకంటే దానిమీద ఉన్న అక్షరాలు.

“లక్ష్మి”

ఆ పేరు రాఘవ మనసులో మళ్లీ మళ్లీ మారుమోగుతూనే ఉంది. ఎక్కడో… ఎప్పుడో… తన చిన్నప్పటి జ్ఞాపకాలలో  ఆ పేరు విన్నట్టుగా అనిపించింది. తనకు స్పష్టంగా ఏమీ గుర్తుకు రావట్లేదు. కానీ కొన్ని చెదిరిపోయిన దృశ్యాలు మాత్రం ఒక్కొక్కటిగా మనసులో మెదిలాయి. సాయంత్రం అయ్యాక పెద్దవాళ్లు ఇంటి ముందున్న మేడమీద కూర్చొని మెల్లిగా మాట్లాడుకోవడం…

తాను దగ్గరకు వెళ్లగానే ఒక్కసారిగా మౌనం అవ్వడం… “పిల్లాడి ముందు ఆ విషయం మాట్లాడొద్దు…” అని ఎవరో నిదానంగా చెప్పిన స్వరం, ఆ రోజుల్లో ఊరిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉండేది. పగలంతా సాధారణంగానే కనిపించినా, రాత్రి పడితే మాత్రం ప్రతి ఇంటి తలుపు త్వరగా మూసుకుపోయేది. చిన్న పిల్లలను బయట ఆడనివ్వకుండా వాళ్ళ అమ్మలు లోపలికి పిలుచుకునేవారు. “చీకటి పడకముందే ఇంటికి రా” అన్న మాటలు అప్పట్లో ప్రతి ఇంట్లో వినిపించేది.

కానీ ఎందుకు అలా చెప్పేవారో అప్పటివరకు రాఘవ ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రం ఆ పాత జ్ఞాపకాలు అన్నీ కలసి అతని గుండెల్లో ఒక తెలియని భారంలా పేరుకుపోతున్నాయి.

మరుసటి ఉదయం…
ఆకాశం ఇంకా పూర్తిగా వెలగలేదు. పొలాల మీద తెల్లని పొగ మంచు పరుచుకుంది. దూరంగా కోళ్లు అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. రాఘవ మాత్రం ఆ రాత్రంతా అసలు నిద్రే పోలేదు. అతని కళ్ళ కింద అంతా నల్లటి వలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖంలో అలసట ఉన్నా…
మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది.

“లక్ష్మి ఎవరు…?”

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేది ఊరిలో ఒకరే అని రాఘవకు తెలుసు. ఆ ఊరిలో ఎవరికన్నా ఎక్కువ కాలం జీవించిన మనిషి అంటే ఒక్కరే అతనే చన్నయ్య. ఈ ఊరిలో జరిగిన ప్రతి సంఘటనకు సాక్షిగా నిలిచిన వృద్ధుడు. ఆ ఊరు ఇంకా సరిగ్గా మేలుకోకముందే రాఘవ చన్నయ్య ఇంటి దగ్గరకు చేరుకున్నాడు.

పాత మట్టి ఇల్లు, గోడల మీద కాలం వేసిన పగుళ్లు…
ముందు చిన్న తాటి మేడ, అక్కడే చన్నయ్య ఒంటరిగా కూర్చున్నాడు. అతని తెల్లని గడ్డం గాలికి చిన్నగా కదులుతోంది. వణుకుతున్న చేతులతో ఒక పాత కర్రను గట్టిగా పట్టుకున్నాడు. వయసు అతని శరీరాన్ని బాగా బలహీనపరిచింది. కానీ అతని కళ్ళలో మాత్రం ఇంకా ఏదో మిగిలి ఉంది. అది వృద్ధాప్యం కాదు, అలసట కూడా కాదు, అది ఎన్నో సంవత్సరాలుగా దాచిపెట్టిన ఒక భయం.

రాఘవ దగ్గరకు వచ్చిన శబ్దం విన్న వెంటనే చన్నయ్య నెమ్మదిగా తలెత్తి చూశాడు. ఒక్క క్షణం పాటు అతని కళ్ళలో స్పష్టంగా భయం కనిపించింది. చెరువు దగ్గర నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎవరినో చాలా కాలం తర్వాత చూసినట్టుగా లేదా… ఎప్పటికీ తిరిగి రాకూడదనుకున్న జ్ఞాపకం మళ్లీ తన ముందుకొచ్చినట్టుగా. రాఘవ గాజును తెచ్చి ఆ వృద్ధుడి ముందు పెట్టాడు.

ఆ గాజు చూసిన క్షణంలోనే, చన్నయ్య ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. అతని చేతులు వణకడం ప్రారంభమైంది. 

“ఈ… ఈ గాజు నీకు ఎక్కడ దొరికింది రాఘవా…?”
అని అడిగాడు భయపడుతూ. రాఘవ నెమ్మదిగా జరిగిన విషయం మొత్తం చెప్పాడు. చెరువు దగ్గర చూసిన అమ్మాయి గురించి కూడా వివరించాడు. చన్నయ్య కొద్దిసేపు అలాగే నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అతను మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. “ఇది… లక్ష్మిదే…” రాఘవ గుండె వేగంగా కొట్టుకుంది. “లక్ష్మి ఎవరు…?” అని రాఘవ అడిగాడు. చన్నయ్య కళ్ళలో మెల్లగా నీళ్లు వస్తున్నాయి. “నలభై ఏళ్ల క్రితం…  ఈ ఊరిలోనే ఉండేది. చాలా మంచిది ఎవరితోనూ గట్టిగా మాట్లాడేది కాదు కానీ…”

అంటూ అతని గొంతు ఆగిపోయింది. “ఒక పౌర్ణమి రాత్రి ఆమె కనిపించకుండా పోయింది.” రాఘవ శ్వాస బిగుసుకుపోయింది. “అప్పుడు ఎవరూ వెతకలేదా?” అని అడిగాడు. చన్నయ్య తలను వంచుకున్నాడు. “వెతికాం, కానీ చెరువు దగ్గర ఆమె పాదాల గుర్తులు మాత్రమే కనిపించాయి. అవి నీళ్ల వరకు వెళ్లాయి కానీ తిరిగి రాలేదు” గది మొత్తం ఒక్కసారిగా బరువుగా మారిపోయింది. రాఘవ చేతిలోని గాజు చల్లబడుతోంది. "అంటే ఆమె చెరువులో మునిగిపోయిందా?” చన్నయ్య ఒక్కసారిగా రాఘవ వైపు చూశాడు. ఆ కళ్ళలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. “అది ఎవరికీ తెలియదు” అతను స్వరం తగ్గించి అన్నాడు. “కానీ ఆ రోజు నుంచి ప్రతి పౌర్ణమి రాత్రి ఆమెను చెరువు దగ్గర చూసిన వాళ్లు ఉన్నారు” రాఘవ మౌనంగా విన్నాడు.

అప్పుడే చన్నయ్య ఒక్కసారిగా దగ్గరకు వాలి మెల్లగా చెప్పాడు. “కానీ అసలు భయం అది కాదు రాఘవా అయితే ఇంకేమి?” చన్నయ్య గొంతు వణికింది. “ఆమె కనిపించకుండా పోయిన తర్వాత ఆమెతో చివరిసారి మాట్లాడిన ముగ్గురు వ్యక్తులకు విచిత్రమైన సంఘటనలు జరిగాయని ఊరిలో ప్రచారం మొదలైంది” 

ఆ మాట వినగానే రాఘవ చేతిలో ఉన్న వెండి గాజు ఒక్కసారిగా నేలపై పడిపోయింది. టన్! ఆ శబ్దం గదిలో మార్మోగింది. అదే క్షణంలో ఇంటి బయట దూరంగా ఎక్కడో ఎవరో మెల్లగా నవ్వినట్టుగా ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. రాఘవ, చన్నయ్య ఇద్దరూ ఒకేసారి తలుపు వైపు చూశారు. అప్పుడే  బయట మధ్యాహ్నం అయినా ఆకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది.
గాలి బలంగా వీచసాగింది.

ఇంకా ఇంటి ముందు మట్టిలో నీళ్లతో తడిసిన పాదాల గుర్తులు నెమ్మదిగా కనిపించడం ప్రారంభమయ్యాయి. అవి నేరుగా ఇంటి తలుపు వరకూ వచ్చి ఆగిపోయాయి. అప్పుడు ఇద్దరూ ఒకరి మొకం ఒకరు చూసుకున్నారు. ఆ పాదాలు ఎవరివి అనేట్టుగా...

1. ఆ పాదాల గుర్తులు నిజంగా ఎవరివి…?
2. లక్ష్మి మరణం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి…?
3. ఆ చెరువు అడుగున ఏళ్లుగా దాచిపెట్టిన భయంకరమైన నిజాన్ని రాఘవ బయటపెట్టగలడా…?
చూడండి తర్వాతి భాగంలో...

ఈ కథ యొక్క తర్వాతి భాగం త్వరలో వస్తుంది… పూర్తి కథను మిస్ కాకుండా follow అవ్వండి.

Part - 3 👉 Click Here

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...