ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది. కొత్త కోడలు కూడా బలి అవుతుంది. ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది.
అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది
ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను.
నా పేరు — “అమృత”
ఒకసారి భారీ కరువు వచ్చింది. పొలాల్లో పంటలు, బావుల్లో నీరు కూడా ఎండిపోయాయి. ఆ కుటుంబం పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. ఒక రోజు రాత్రి గాలి బలంగా వీచుతోంది, మెరుపులు మెరుస్తున్నాయి, వర్షం పడబోతున్నట్టుగా ఆకాశం గర్జిస్తోంది. అప్పుడే ఆ ఇంటి ముందు ఒక వింత మనిషి కనిపించాడు. నల్లని దుస్తులు, కళ్లలో వింత కాంతి, చేతిలో ఒక పాత త్రిశూలం లాంటి దండం, అతను ఒక మంత్రికుడు.
అతను కాస్త దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పాడు. దానికి ఒక ధర ఉంటుంది. ఇంటి పెద్దలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏ ధరైనా సరే… మేము సిద్ధం అన్నారు.
అది వాళ్లు చేసిన పెద్ద తప్పు.
దానికి మంత్రికుడు వాళ్ళ ఇంట్లో మూలాన ఉన్న ఒక గదిలో నేలపై ఒక వింత యంత్రం గీసాడు. ఎర్రటి పొడి చల్లి మంత్రాలు జపించాడు. ఆ గది ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. గాలి బలంగా వీచింది, అతని స్వరం మెల్లగా మారిపోయింది. ప్రతి తరంలో మొదటి బలి కోడలే. ఆ తరువాత గ్రామస్థులను బలి ఇస్తే సంపద పెరుగుతుంది ఎందరిని బలి ఇస్తే అంత సంపద. ఇలా తరాతరాలుగా మరణం కావాలి అని అన్నాడు.
మొదటి బలి ఆమె రక్తంతో ఈ ఒప్పందం కొనసాగుతుంది. మీరు ఈ నియమాన్ని అలాగే పాటిస్తే... మీ కుటుంబం ఎప్పటికీ ధనవంతులుగానే ఉంటుంది.
ఇంటి పెద్దలు ఒక్క క్షణం ఆలోచించారు. అది తప్పు అని వాళ్లకు తెలిసినా... ఆకలి, ఆశ, లోభం వాళ్ల మనసును గెలిచాయి చివరికి వాళ్లు అంగీకరించారు అప్పుడు మంత్రికుడు ఒక పాత్ర తీసి, అందులో తన రక్తంతో ఒప్పందం రాశాడు.
ఇలా జరిగిన తర్వాత రెండు మూడు రోజుల వెంటనే ఒక పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఆ ఇంటికి రావాల్సిన కోడలు నేనే. ఆ మొదటి బలి కూడా నాదే అయ్యింది. ఎంతో సంబరంగా, సంతోషంగా ఈ ఇంట్లోకి మొదటిసారి కోడలిగా అడుగు పెట్టాను. ఈ ఇంట్లోకి వచ్చిన మొదట కొన్ని రోజుల్లోనే నాకు ఏదో తేడా అనిపించింది. ఇంటి వాళ్ల ప్రవర్తన, రాత్రిళ్లు వినిపించే మంత్రాల శబ్దాలు అన్నీ నన్ను అనుమానంలో పడేశాయి.
ఒక రాత్రి… అందరూ నిద్రపోయిన తర్వాత మెల్లగా ఆ రహస్య గదికి వెళ్ళాను అక్కడ కనిపించింది. వేదికపై రక్తపు మరకలు, తంత్రిక చిహ్నాలు అప్పుడు నాకు ఇక్కడ ఏదో భయంకరమైనది జరుగుతోంది అని అర్థమైంది.
ఆ రోజు నుంచి ఎలాగైనా నిజాన్ని తెలుసుకోవాలని పాత వస్తువులు వెతికాను. పూర్వీకుల గురించి తెలుసుకున్నాను. చివరికి ఆ ఒప్పందం గురించి నిజం తెలుసుకున్నాను. వచ్చే అమావాస్యకు నన్ను బలి ఇస్తారని.
నేనూ దీనిని ఆపాలనుకున్నాను కానీ దీని నుండి తప్పించుకోవడం అసాధ్యం అని తెలుసుకున్నాను. ఎందుకంటే... ఈ ఇంటి వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరూ బయటకు వెళ్లనివ్వరు. అప్పుడు నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. కానీ నేను చనిపోయినా… నా తర్వాత వచ్చే కోడళ్ళు బ్రతకాలి అంటూ ఒక పాత డైరీ తీసుకుని అందులో ప్రతి విషయం రాయడం మొదలుపెట్టాను …
ఈ ఇంటి చరిత్ర, మంత్రికుడి ఒప్పందం గురించి, బలి ఎలా చేస్తారు, ఎప్పుడు బలి ఇస్తారు అన్నీ వివరంగా రాశాను…
మంత్రికుడు పూజలో ముందుగా ఇంటి కోడలి రక్తాన్ని ఇంకా మంత్రికుడి రక్తాన్ని కలిపి పూజలో పెట్టి తర్వాత కోడలిని బలి ఇస్తారు. ఇలా చేస్తే ఇంటి సంపద పెరుగుతుందని చెప్పాడు. కానీ అసలు కారణం వేరే ఉంది. ఇలా చేయడం వల్ల ఆ మంత్రికుడి ఆయుశు పెరుగుతుంది. తన ఆయుషు పెంచుకోవాలని, తర తరాలనుండి సరిగ్గా సమయానికి మంత్రికుడు ఇక్కడికి వచ్చి తన చేతుల మీదుగానే బలి జరుగుతుంది.
దీనికి పరిష్కారంగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే... బలి రోజు ఈ ఇంటి కోడలి రక్తానికి బదులుగా ఆ మంత్రికుడి రక్తాన్ని ఇంకా అతన్నే బలిగా ఇస్తే ఈ శాపం ఇక్కడితో ముగుస్తుంది.
ఇంకా ఆ పుస్తకం చివరి పేజీలో...
ఈ పుస్తకం ఎవరికి దొరికితే వారు దయచేసి ఈ శాపాన్ని ఆపండి అని రాసి ఉంది. నాదియా చేతులు వణికాయి. కానీ ఎలాగైనా దీనిని ఇంతటితో ఆపాలని, దైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకొంది.
అంతలో... బయట అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో వస్తున్నారు అన్నట్టు నాదియా వెంటనే పుస్తకాన్ని అక్కడే పెట్టి బయటికి వచ్చింది. ఏమీ లేదన్నట్టు తన గదిలోకి వెళ్లిపోయింది. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. పక్కనే పడుకున్న రాజశేఖర్ ముఖాన్ని చూస్తూ ఉంది. ఇవన్నీ తెలిసి కూడా, నన్ను ఇతను పెళ్లి చేసుకున్నాడా అని ఆమె మనసులోనే కుమిలిపోయింది.
మరుసటి రోజు ఇంటి పెద్దలు అందరూ ఒకచోట చేరి నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. నాదియా దూరం నుంచి వింటుంది. ఈసారి పూజ ఆలస్యం చేయకూడదు. అమావాస్య రాత్రే సరైన సమయం. లేకపోతే ప్రమాదం అని.
అమావాస్యకు ఇంకో 2 రోజులు మాత్రమే. నాదియా భయంతో వణికిపోయింది. కానీ ఈసారి పారిపోవాలని కాదు నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంది.
అదే రాత్రి… నాదియా మెల్లగా రాజశేఖర్‌ను లేపింది. నీతో కొన్ని విషయాలు చెప్పాలి అంటూ రహస్య గది, పుస్తకం… బలి, మొత్తం అన్నీ చెప్పేసింది. అది విన్న రాజశేఖర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా అలాగే ఉండిపోయాడు.
తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు. నాదియా... నువ్వు ఇవి తెలుసుకోవద్దు అన్నాడు. ఆమె షాక్ అయింది. అంటే… ఇవన్నీ నిజమేనా…? అని అడిగింది. రాజశేఖర్ కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. నిజమే అన్నాడు. నాకు ఈ విషయం చిన్నప్పుడే తెలిసింది. కానీ ఈ ఇంటి నుండి ఎవ్వరూ బయటపడలేరు. అయితే… నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ నాదియా గట్టిగా ఏడ్చేసింది, అతను తల వంచాడు. నేను నిన్ను కాపాడాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఆలస్యమైపోయింది అని చెప్పాడు భాద పడుతూ...
ఇక అమావాస్య రాత్రి రానే వచ్చింది. బలి కోసం అంతా సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచే పెద్దింట్లో వాతావరణం మొత్తం మారిపోయింది. ఇల్లంతా ఒక వింత నిశ్శబ్దం. ఎవరూ గట్టిగా మాట్లాడడం లేదు, ఎవరూ నవ్వడం లేదు, ఇంటి పెద్దలు ఒకరినొకరు గమనిస్తూ, ఏదో పెద్ద పని కోసం సిద్ధమవుతున్నారు అన్నట్లుగా ఉన్నారు.
ఉదయం… ఆ ఇంటి ఆవరణ మొత్తం శుభ్రం చేశారు, పాత పూజ గదిని తెరిచారు, మూసి ఉన్న ఆ గదిని తెరిచినప్పుడు—లోపలనుంచి ఒక పాత వాసన గాలి లాగా బయటకు వచ్చింది. గోడలపై పాత రక్తపు మరకలు ఇంకా కనిపిస్తున్నాయి. ఆ గదిని గోమయం, కుంకుమ, నూనె దీపాలతో శుభ్రం చేశారు. మధ్యలో ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద— ఎర్రని వస్త్రం పరచారు. దాని మీద వింత చిహ్నాలు గీచారు అవి సాధారణ పూజ చిహ్నాలు కాదు. మంత్రికుడి యంత్రాలు…
మధ్యాహ్నం… ఇంటి పెద్దమ్మలు నాదియాను దగ్గరకు పిలిచారు. ఇది ఒక ప్రత్యేక పూజ, కోడలిగా నువ్వు పాల్గొనాలి అని మృదువుగా చెప్పారు. నాదియాకు అనుమానం వచ్చింది కానీ బయటపడకుండా నటించింది.
ఆ రోజు సరిగ్గా అమృత ఆ పుస్తకంలో రాసినట్లే ప్రతి ఒకటి జరిగింది ముందుగా ఉపవాసం, ఎర్రటి చీర, చేతికి నల్ల దారం, ముఖానికి పసుపు ఎక్కువగా కుంకుమ, కాళ్లకు గజ్జెలు.
సాయంత్రం మంత్రికుడు వచ్చాడు. బలి కోసం ఒక్కొక్కటిగా సిద్ధం చేస్తున్నాడు. ఇంట్లో దీపాలు ఒక్కొక్కటిగా వెలిగించాడు కానీ సాధారణ దీపాలు కాదు ఎర్రటి కాంతి ఇచ్చే నూనెలో వెలిగించే దీపాలు. ఇంటి చుట్టూ నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీశారు. తలుపులపై రక్తంతో చుక్కలు పెట్టారు. ఆ ఇల్లు మొత్తం ఒక యజ్ఞవేదికలా మారిపోయింది…
రాత్రి 10 గంటలకు పూజ మొదలైంది. ఇంటి పెద్దలు నల్ల దుస్తులు ధరించారు, వాళ్ల ముఖాల్లో భయం, ఆత్రం కలిసిపోయి ఉంది. ఒక పాత గ్రంథం తీసుకుని మంత్రాలు చదవడం ప్రారంభించారు. ఆ మంత్రాలు వినడానికి భయంకరంగా ఉన్నాయి. అవి దేవుడి కోసం కాదు. ఏదో అజ్ఞాత శక్తిని పిలవడానికి అన్నట్టు. రాత్రి 11:30 అయ్యింది నాదియాకు ఒక పానీయం ఇచ్చారు. ఇది తాగితే నీకు శక్తి వస్తుంది అన్నారు. కానీ— అది నిద్ర మందు ఆమె బలహీనంగా మారడానికి. నాదియా అది తాగినట్టు నటించింది కానీ ఎవరూ గమనించకుండా పారేసింది తర్వాత రాత్రి సరిగ్గా 12 గంటలకు ఆ గది లోపలికి రా అని చెప్పారు.
నాదియా 11:55 గంటలకు లోపలికి వచ్చింది. గది తలుపులు మూసేశారు. బయట ఎవరూ లేకుండా చేశారు. మధ్యలో ఆ వేదిక, చుట్టూ దీపాలు, మధ్యలో నాదియాను నిలబెట్టారు. ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది. గాలి బలంగా వీచడం మొదలైంది, దీపాలు అల్లాడుతున్నాయి. మంత్రాలు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి…
సమయం వచ్చింది… అని ఒక పెద్ద మనిషి అన్నాడు. 12:00 గంటలు అయ్యింది అమావాస్య క్షణం వచ్చింది. ఆ క్షణంలో— గది ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఎర్రటి కాంతి మాత్రమే మిగిలింది. ఆమెను వేదికపై మెల్లగా తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆమెను బలి చేయబోతున్న క్షణంలో తనకేమి తెలియనట్టుగా వేదిక మధ్యలోకి వచ్చింది. అప్పుడే నాదియా అకస్మాత్తుగా లేచింది. మంత్రికుడు అర్థం చేసుకునేలోపు, అతని చేతిలో ఉన్న కత్తిని లాక్కొని— ఒక్క దెబ్బతో అతని తలను నరికేసింది. అక్కడితో ఈ శాపం ముగిసినట్లు అనిపించింది.
తరువాత ఇంట్లో ఉన్న లైట్లు మొత్తం వాటంతట అవే వెలిగాయి. ఇంటికి కొత్త కళ వచ్చింది. అందరూ షాక్ అయ్యారు. ఇంటి సంపద ఎక్కడ వెళిపోతుందో అన్న భయంతో ఆ ఇంటి పెద్దలు కోపంతో ముందుకు వచ్చారు అప్పుడే రాజశేఖర్ ముందుకు వచ్చి, చాలు! అని అరిచాడు. అతను ఆ వేదికను కింద పడేశాడు దీపాలు ఆరిపోయాయి ఇక చాలు మొత్తం ఆపేయండి. ఇలా చేస్తూ పోతే ఆస్తి మాత్రమే ఉంటుంది, మనుషులు, సంతోషాలు కాదు అని నెమ్మదిగా అందరికీ అర్థం అయ్యేలా చెప్పారు. అప్పటికే గ్రామస్థులంతా వాళ్ళ ఇంటిని చుట్టుముట్టారు అక్కడ జరిగిందంతా చూశారు. పోలీసులను పిలిపించి గ్రామంలో జరిగిన మరణాలకంతా వీళ్ళే కారణం అంటూ ఆ ఇంటి పెద్దలను జైలుకు పంపించారు. మిగిలింది నాదియా ఇంకా రాజశేఖర్ మాత్రమే. ఆ ఇంటి మీదున్న శాపం చివరకు తొలిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో నిజమైన నవ్వులు వినిపించాయి.
ఇంకా ఇలాంటి stories కోసం మా blogg ను follow అవ్వండి

Comments
Post a Comment