Skip to main content

25 మామిడి చెట్ల గణిత పజిల్ | రైతుకు ఎంత డబ్బు వచ్చింది? | Telugu Maths Puzzle

  మునుపటి సమాధానం 🖼️ చిత్రం 1 ఈ చిత్రంలో "మ" అనే అక్షరం నుండి ప్రారంభమయ్యే వస్తువులు ఎన్ని ఉన్నాయి ? " మ" అక్షరంతో ప్రారంభమయ్యే వస్తువులను జాగ్రత్తగా లెక్కించాలి. సమాధానం = 10 1.    మామిడి చెట్టు 2.   మామిడి కాయలు 3.    మొసలి 4.    మేఘాలు 5.   మేక 6.    మోటార్ సైకిల్ 7.    ముక్కు 8.    ముక్కుపుడక 9.    మల్లె పూవు 10.   మందారం పూవు   🖼️ చిత్రం 2  ఈ చిత్రంలో మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ?    చిన్న త్రిభుజాలను మాత్రమే కాకుండా పెద్ద త్రిభుజాలను కూడా లెక్కించాలి. సమాధానం = 18 చిన్న త్రిభుజాలు 5 పెద్ద త్రిభుజాలు 5 జాయింట్ త్రిభుజాలు 8   ఈ రోజు గణిత ప్రశ్న ఒక రైతు 25 మామిడి మొక్కలను నాటాడు. ఆ మొక్కలు పెరుగుతూ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. ఒక సీజన్‌లో ప్రతి చెట్టుకు 500 మామిడి కాయలు వచ్చాయి.      రైతు 20 కాయలను తన ఇంటికి తీసుకున్నాడు.      తన బంధువుల 5 ఇళ్లకు ఒక్కో ఇంటికి చొప్పున 10 కాయల ఇచ...

పురాతన కోట రహస్యం – తాళంచెవి ఏ గదిలో ఉంది? | Telugu Puzzle Story

అనగనగా ఒక రాజ్యంలో అర్జున్ అనే తెలివైన యువకుడు ఉండేవాడు. 

అతనికి కొత్త ప్రదేశాలను అన్వేషించడం అంటే చాలా ఇష్టం. 

ఒక రోజు అతను అడవిలో తిరుగుతుండగా దారి తప్పిపోయి, చెట్ల మధ్య దాగి ఉన్న ఒక పురాతన కోటలోకి వెళ్లిపోయాడు.
గది

వెళ్లిన వెంటనే అతడికి ఒక తలుపుపై ఇలా ఉంది. 

"ఈ కోటలోని నాలుగు గదులలో సరైన గదిని గుర్తించాలంటే, ఇచ్చిన ప్రశ్నకు వచ్చిన సమాధానం నుండి 1 తీసివేయాలి." 

అర్జున్ కు ఏమీ అర్థం కాలేదు అలాగే లోపలికి వెళ్ళాడు.

కోట అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు ఎక్కడి నుంచో వింత శబ్దాలు వినిపించాయి. 

గాలి వీచినప్పుడల్లా పాత తలుపులు కిర్రుమంటూ కదిలాయి. 

గోడలపై పడిన నీడలు కూడా ఏదో కదులుతున్నట్లుగా కనిపించాయి.

కానీ ఆ కోట చాలా పురాతనంగా కనిపించింది.
గోడలపై పచ్చిక మొక్కలు పెరిగి ఉన్నాయి. 

కొన్ని చోట్ల రాళ్లు విరిగిపోయి ఉన్నాయి. లోపల నుంచి చల్లని గాలి వీచి అతనికి వింత అనుభూతిని కలిగించింది.

కోటలోకి అడుగుపెట్టిన వెంటనే అతనికి ఏ దారి ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. 

చుట్టూ పొడవైన గోడలు, పాడైపోయిన గదులు, చీకటిగా ఉన్న మార్గాలు కనిపించాయి.

బయటకు వెళ్లే దారి కోసం వెతికినా ఎక్కడా కనిపించలేదు.

ఏమి చేయాలో తెలియక అర్జున్ ఒక గది నుంచి మరో గదికి పిచ్చివాడిలా తిరుగుతూ ఉండిపోయాడు.

కొంతసేపటి తర్వాత అతనికి ఒక్కసారిగా ఒక విషయం గుర్తుకొచ్చింది.

“నేను ఒకసారి పత్రికలో ఇలాంటి కోట గురించి చదివాను. 

దీని గురించి ఎన్నో రహస్య కథలు కూడా విన్నాను,” అని తనలో తాను అనుకున్నాడు.

ఆ కథల ప్రకారం, ఈ కోటలోకి ప్రవేశించిన చాలామంది తిరిగి బయటకు రాలేదట. 

కొందరు విచిత్రమైన శబ్దాలు విన్నారని, మరికొందరు గోడలు కదులుతున్నట్లు చూశామని చెప్పారట. 

ఈ కోటలో మాయలు జరుగుతాయని, దారులు తమంతట తామే మారిపోతాయని కూడా కథలు ఉండేవి.

“అయితే నేను విన్న ఆ కోట ఇదేనా?” అని అర్జున్ ఆలోచించడం మొదలుపెట్టాడు.

అతను జాగ్రత్తగా గోడలను పరిశీలిస్తూ ముందుకు నడిచాడు. 

ఒక చోట గోడపై వింత గుర్తులు చెక్కబడి కనిపించాయి.

వాటి క్రింద దుమ్ముతో కప్పబడి ఉన్న ఒక పాత శాసనం కనిపించింది. దానిపై ఇలా వ్రాయబడి ఉంది:

“తెలివితో వెతికేవారికే బయటకు వెళ్లే దారి కనిపిస్తుంది.”

అది చదివిన అర్జున్‌కు ధైర్యం వచ్చింది. 

ఇక భయపడకుండా ప్రతి గదిని జాగ్రత్తగా పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. 

ఆసక్తితో అర్జున్ లోపలికి ముందుకు వెళ్లాడు. 

ఆ పురాతన కోట బయటకు ఎంత పాడైపోయినట్లు కనిపించినా, లోపల మాత్రం ఎన్నో రహస్యాలను దాచుకున్నట్లు అనిపించింది.

కోటలో చాలా గదులు ఉన్నాయి. అర్జున్ ప్రతీ గదిలో వెళ్లి చూస్తున్నాడు.

మొదటి గదిలో పాత చిత్రాలు కనిపించాయి. రెండో గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి. 

మూడో గదిలో దుమ్ము పట్టిన పుస్తకాలతో నిండిన అల్మారాలు ఉన్నాయి. 

కొన్ని చిత్రాల కళ్లే తనను చూస్తున్నట్లు అర్జున్‌కు అనిపించింది.

అర్జున్ ఒక పుస్తకాన్ని తీసి తెరవగానే దుమ్ము గాలిలోకి ఎగిరింది. 

కానీ ఆ పుస్తకంలోని అక్షరాలు కాలగర్భంలో కలిసిపోయి ఉండటంతో ఏమీ చదవలేకపోయాడు.

అలా ఒక్కో గదిని పరిశీలిస్తూ ముందుకు సాగుతుండగా, కోట లోపలి భాగంలో ఒక పెద్ద మందిరంలాంటి ప్రదేశానికి చేరుకున్నాడు. 

అక్కడ మధ్యలో ఒక భారీ ఇనుప తలుపు కనిపించింది. 


ఆ తలుపు సాధారణ తలుపు కాదు. దాని ఎత్తు దాదాపు రెండు మనుషులంత ఉండేది. 

తలుపు మొత్తం తుప్పు పట్టి ఉన్నా, ఇంకా చాలా బలంగా కనిపించింది.

తలుపు మధ్యలో ఒక పెద్ద తాళం వేలాడుతూ ఉంది. 

"బయటకు వెళ్లే దారి ఇదే అయి ఉంటుంది." అని అనుకున్నాడు. 

అప్పుడే ఆ పెద్ద ఇనుప తలుపు దగ్గర తాళంచెవి కోసం చుట్టూ వెతకడం ప్రారంభించాడు. 

కొంత దూరంలో ఉన్న ఒక పాత అల్మారాపై ఇలా ఉంది. తాళంచెవి మార్గం. 

ఆ అల్మారాలో దుమ్ముతో కప్పబడి ఉన్న ఒక పుస్తకం కనిపించింది. 

జాగ్రత్తగా ఆ పుస్తకాన్ని తీసి తెరిచాడు. మొదటి కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి. 

కానీ మధ్యలో ఒక పేజీలో పెద్ద అక్షరాలతో ఒక ప్రశ్న రాసి ఉంది:

"తాళం చెవి కోసం వెతుకుతున్న ప్రయాణికుడా!

నీ ముందు నాలుగు గదులు ఉన్నాయి.

వెంటనే తన ముందు నాలుగు గదులు ప్రత్యక్షమయ్యాయి. 

వాటిలో ఒక గదిలో మాత్రమే తాళం చెవి దాగి ఉంది.

మిగిలిన మూడు గదులు నిన్ను తప్పుదారి పట్టిస్తాయి.

సరైన గదిని గుర్తించడానికి ఈ సూచనను జాగ్రత్తగా చదువు:

ప్రయాణికుడా! 
ముందుగా తాళం చెవి ఉన్న గది సంఖ్యను కనుగొను."

(3 × 4) + (10 ÷ 2) - 14 = ?

ఆ వచ్చిన సమాధానానికి మొదట చెప్పినట్టుగా చేస్తే తాళం చెవి ఉన్న గది సంఖ్య దొరుకుతుంది."

గది 1, గది 2, గది 3, గది 4 లలో సరైన గదిలోకి ప్రవేశించు. అని చెప్పింది. 

అర్జున్ ఆ ప్రశ్నను చదివి కొద్దిసేపు ఆలోచించాడు.

"ముందు లెక్కను చేద్దాం," అని తనలో తాను అనుకున్నాడు.

కానీ గోడలపై ఉన్న మసక వెలుతురు, బయట నుంచి వినిపిస్తున్న వింత శబ్దాలు అతని ఏకాగ్రతను చెడగొట్టాయి.

నాలుగు తలుపులు అతని ముందే నిలబడి ఉన్నాయి.

🔹 గది 1
🔹 గది 2
🔹 గది 3
🔹 గది 4

గది
అర్జున్ ఏ గదిలోకి అడుగుపెట్టాడు?

తాళం చెవి దొరికిందా?

ఇనుప తలుపు వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి?

🤔 మీరు ఈ పజిల్‌ను ఛేదించగలరా?

సరైన గది సంఖ్య ఏమిటి?

మీ సమాధానాన్ని కామెంట్‌లో చెప్పండి!

⏳ సరైన సమాధానం మరియు కథ కొనసాగింపు రేపు ఉదయం 7:00 గంటలకు...

Click here 👉 🔑 అర్జున్ రహస్య కోట పజిల్ | సరైన తాళంచెవి సంఖ్యను కనుగొనగలరా?


Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...