Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3

మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది.
సుమతి ఇంటి ముందు నిలబడి, శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది.

ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు కూడా చేతులు, కాళ్ళు కడుక్కుంటూ, ఈరోజు ఎండ ఎక్కువగా ఉంది…” అన్నాడు.

రాములమ్మ వెంటనే, వానలు బాగానే పడ్డాయి కానీ ఎండ కూడా అలాగే ఉంది ఈసారి…” అంది. భోజనానికి సుమతి తప్ప ఇంక అందరూ కూర్చున్నారు. సుమతి ఒక గిన్నెలో వేడి అన్నం ఇంకా పప్పు తెచ్చి అందరికీ వడ్డించింది.  శారదకు ఒక చిన్న గిన్నెలో అన్నం పప్పు కలిపి ఇచ్చింది. అందరూ మాట్లాడుతూ తింటిన్నారు.  సుమతి నించోని ఎవరికి ఏమి వడ్డించాలి అని గమనిస్తూ ఉంది.  శారద మాత్రం తినడం కంటే మాట్లాడటంలోనే బిజీగా ఉంది. నాన్నా… నేను ఈరోజు పెద్ద కుండతో కూడా నీళ్లు తెస్తా!” అంది. అది విని అందరూ నవ్వారు. ముందు నీ చిన్న కుండను సరిగ్గా మోయడం నేర్చుకోమ్మా…” అన్నాడు రాఘవుడు సరదాగా.


సుమతి మావయ్య సిద్దయ్యకు ఇంకొంచం పెరుగుకు అన్నం పెట్టడానికి ముందుకు వచ్చేసరికి. చాలమ్మా… కడుపు నిండిపోయింది…” అంటూ సిద్దయ్య చేతులు కడుక్కున్నాడు. పక్కనే కూర్చున్న రాములమ్మ: రోజంతా పొలంలో పని చేసి వచ్చి ఇదేంటండీ… ఇంత తక్కువగా తింటే ఎలా?” అంటూ మందలించినట్టు అంది. సిద్దయ్య మెల్లగా నవ్వి, పాత వయసయ్యింది రాములమ్మ… ముందు లాగా కడుపు కూడా వినడం లేదు…” అన్నాడు. ఆ మాట విన్న శారద వెంటనే తాతయ్య దగ్గరకు వచ్చి, అయితే నా అన్నం తింటావా తాతయ్య?” అంటూ తన చిన్న గిన్నెను ముందుకు చాపింది. అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. సిద్దయ్య శారద తల నిమిరి, నీ అన్నం తింటే నాకు మళ్లీ బలం వచ్చేస్తుందేమో!” అన్నాడు. శారదకి అది నిజంగానే అనిపించింది. అయితే తిను…” అంటూ గిన్నె అతని చేతిలో పెట్టింది. ఆ చిన్న మాటకి ఆ ఇంటి వాతావరణం ఇంకా హాయిగా మారిపోయింది.

రాఘవుడు మాత్రం ఇంకా నెమ్మదిగా తింటూ, రేపు పొలం పక్కనున్న కాలువ కట్ట కొంచెం బలపరచాలి.  ఈసారి నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి…” అన్నాడు. సిద్దయ్య వెంటనే, అవునురా… నిన్న రాత్రి కూడా నీళ్లు గట్టిగా వచ్చాయి. జాగ్రత్తగా చూడాలి. 
ఒకవేళ కట్ట తెగితే పంట అంతా నీళ్లలో పోతుంది…” అన్నాడు. ఆ మాటలు వింటూ సుమతి కాసేపు ఆగింది. ఆ కాలువ వాళ్ల కుటుంబానికి ఎంత ముఖ్యమో ఆమెకు బాగా తెలుసు. ఆ నీళ్లపైనే పంట ఆ పంటపైనే ఇంటి జీవితం. రాములమ్మ పెరుగు కలుపుకుంటూ, ఈసారి పంట బాగుంటే శారదకి కొత్త పట్టు లంగా కుట్టించాలి…” అంది. అది విన్న వెంటనే శారద కళ్లు మెరిశాయి. ఎర్ర రంగు కావాలి నాకు!” అంటూ ఆనందంగా అరిచింది. ప్రతి సారి నీకు ఎర్రదే కావాలి…” అంటూ రాఘవుడు నవ్వాడు. ఎందుకంటే… ఎర్ర రంగు వేసుకుంటే నేను సినిమా వాళ్లలా ఉంటానట!” అని శారద అమాయకంగా చెప్పేసరికి మళ్లీ అందరూ నవ్వేశారు.

అలా ఒక్కొక్కరిదీ భోజనం అయ్యాక… ఇంట్లో పెద్దవాళ్లు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్లారు. ఆ కాలంలో మధ్యాహ్నం వేళల్లో ఊరంతా చాలా ప్రశాంతంగా ఉండేది. చెట్ల కింద ముసలివాళ్లు కూర్చుని ఊరి విషయాలు మాట్లాడుకునేవారు. రాఘవుడు తిన్న తర్వాత చేయి కడుక్కుని అలాగే కూర్చొన్నాడు...  నాది కూడా అయిపోయింది" అంటూ తన ఖాళీ గిన్నెను చూపించింది శారద. సుమతి శారద చేతులు ఇంకా తన మూతి కడుగుతుంటే ఇక చాలమ్మా" అని తాతయ్య దగ్గరకు పరిగెత్తింది. కొంచం సేపటికి... సాయంత్రం వర్షం పడేలా ఉంది... నేను వెళ్లి కట్ట బలపరుస్తాను" అని మళ్ళీ పొలానికి  బయలుదేరాడు రాఘవుడు.

తర్వాత... సుమతి రాఘవుడు తిన్న పళ్లెంలోనే కొంచం అన్నం పప్పు వేసుకుని తినింది. ఆమె తిన్న తర్వాత పాత్రలు అన్నింటిని శుభ్రపరిచింది. శారదా ఎక్కడున్నావమ్మా కొంచం సేపు పడుకొందువు రామ్మా తల్లి" అని శారదను ప్రేమగా పిలిచింది. శారద వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతూ ఉండగా... తనకు అమ్మ పిలుపు వినపడింది. ఆ పిలుపు విన్న వెంటనే  వస్తున్నా అమ్మా" అంటూ వచ్చింది. సుమతి శారదకు ఒక పాట పడుతూ నిద్రపుచ్చింది. శారద పడుకొన్న తర్వాత మెల్లగా బయటకు వచ్చి ఇంటి ముందర చిన్న పీట వేసుకుని ముందు పెద్ద గిన్నెలో బియ్యం పోసుకుని రాళ్లు ఏరడం మొదలుపెట్టింది. ఆడవాళ్లు మధ్యాహ్నం ఇంటి పనులంతా అయినా తర్వాత... ఇంటి ముందు కూర్చుని బియ్యం ఏరడం, పప్పులు శుభ్రం చేయడం చేసేవారు.

శారద కొంచం సేపటికి నిద్ర లేచేసింది. అమ్మా..." అంటూ వచ్చింది. సుమతి "అప్పుడే లేచేసావా... ఇంకొంచం సేపు పడుకోకుండా" అంది. శారద అమ్మ దగ్గరికి వచ్చి సుమతి పక్కనే కూర్చుని, అమ్మా… నేనూ చేస్తా…” అంది. నీ చేత్తో చేస్తే అన్నంలో రాళ్లకంటే మట్టే ఎక్కువ పడుతుంది!” అంటూ సుమతి మెల్లగా నవ్వింది. అయినా శారద చిన్న చేతులతో బియ్యం కలుపుతున్నట్టు నటించింది. ఇంతలో ఊరి దారిలోంచి ఒక శబ్దం వినిపించింది. చీరలు… కొత్త చీరలు…” అంటూ ఒక వ్యాపారి ఊర్లోకి వచ్చాడు. ఆ రోజుల్లో ఇలా ఊరూరా తిరుగుతూ వస్తువులు అమ్మేవాళ్లు... తరచూ వచ్చేవారు. వెంటనే వీధిలో ఉన్న ఆడవాళ్లు ఒక్కొక్కరిగా బయటికి వచ్చారు. సుమతి కూడా బియ్యం అంతా లోపల పెట్టి చీరలు చూడటానికి వెళ్ళింది.

రంగురంగుల చీరలు చూసి మాట్లాడుకుంటున్నారు. సుమతి కూడా కాసేపు వెళ్లి చూసింది. ఒక ఆకుపచ్చ చీరను చేతిలో పట్టుకుని చూస్తుండగా… రాములమ్మ దగ్గరికి వచ్చి, పండుగ దగ్గరపడుతోంది కదా… ఒకటి తీసుకోమ్మా…” అంది. సుమతి మాత్రం, ఇంకోసారి తీసుకుంటా అమ్మా… ముందుగా అప్పులు కొంచెం తగ్గాలి…” అంది మెల్లగా. ఆ మాట విన్న రాములమ్మ కాసేపు మౌనంగా నిలబడి ఉంది.  ఆ రోజులలో చాలా కుటుంబాల పరిస్థితి అలానే ఉండేది.

కష్టపడి పని చేసినా… డబ్బు మాత్రం చేతిలో నిలబడేది కాదు. సుమతి ఇంకా వాళ్ళ అత్తయ్య ఇద్దరూ కొంచం బాధతోనే తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.

కానీ…
ఆ సాయంత్రం కాలువ దగ్గర జరిగిన ఒక చిన్న సంఘటన…
ఆ ఇంటి ప్రశాంతతను నెమ్మదిగా మార్చబోతుందని అప్పుడెవరూ ఊహించలేదు…

Part - 4 👉 Click Here

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...