Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Episode - 4 ఉమ్మడి కుటుంబం1980లో పల్లెటూరిలోని ఆనందం


“1980లో… ఆ చిన్న గ్రామంలో ఉదయం కోడి కూయకముందే మొదలయ్యేది. మట్టి వాసన, ముగ్గుల అందం, కుటుంబ ప్రేమల మధ్య పెరిగిన చిన్నారి శారద… ఒక రోజు చెప్పిన చిన్న మాట… కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి జీవితాన్నే మార్చబోతోందని అప్పుడెవరికీ తెలియదు…”

అలా సాయంత్రం మెల్లగా గ్రామం మీదకి దిగుతూ ఉండగా… పొలం దారులన్నీ మళ్లీ జనాలతో కిక్కిరిసిపోయాయి. రోజంతా ఎండలో పని చేసిన రైతులు భుజాల మీద గొడ్డళ్లు వేసుకుని నడుస్తున్నారు. కొంతమంది ఎద్దుల బండ్లపై గడ్డి మోసుకొస్తున్నారు. ఆ బండ్లు కదిలినప్పుడల్లా గంటలు “గల గల” అంటూ మధురంగా వినిపిస్తున్నాయి. ఆవులు, ఎద్దులు తమ ఇళ్ల దారులు తామే గుర్తుపట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాయి. వాటి వెనకాల చిన్న పిల్లలు నవ్వుతూ పరుగులు పెడుతున్నారు. అయ్యో… మా గంగమ్మ ఆ వైపు పోతుంది! అంటూ ఒక చిన్నోడు అరవగా, మరో పిల్లాడు నవ్వుకుంటూ దాని తాడును పట్టుకున్నాడు. దూరంగా చెట్ల మీద కూర్చున్న పక్షులు కూడా గూటికి చేరుకుంటున్నాయి. 

ఆకాశం మొత్తం నారింజ, ఎరుపు రంగులతో అందంగా మెరిసిపోతోంది. శారద మాత్రం ఇంటి ముందు మట్టి అరుగు మీద నిలబడి… దూరంగా వచ్చే ప్రతి మనిషిని ఆసక్తిగా చూస్తోంది. ఒక్కసారిగా పొలం దారిలో తన నాన్న కనిపించగానే… అమ్మా! మా నాన్న వచ్చేశాడు!” అంటూ ఆనందంతో గట్టిగా అరిచింది. అంతే చిన్న చిన్న అడుగులతో పరుగెత్తుకుంటూ వెళ్లి రాఘవుడి కాళ్లను పట్టుకుంది. రోజంతా పని చేసి అలసిపోయిన రాఘవుడి ముఖం మీద చెమట కనిపిస్తోంది. కానీ… కూతురు నవ్వు చూసిన క్షణంలోనే అతని అలసట సగం తగ్గిపోయింది.

ఏమమ్మా మా బుజ్జి… ఈరోజు ఏం చేసింది?” అని ప్రేమగా అడిగాడు. శారద గర్వంగా ఛాతీ పొంగిస్తూ…  బియ్యం కూడా ఏరాను! ఇంకా రాములమ్మకి నీళ్లు కూడా ఇచ్చా!” అంది. అది విన్న రాఘవుడు ఆశ్చర్యంగా నటిస్తూ… అయ్యో! మరి ఇంకో రెండు రోజుల్లో మా ఇంటి పనులన్నీ అయిపోయినట్టే!” అన్నాడు. ఆ మాట విన్న వెంటనే… ఇంట్లో ఉన్న వాళ్లంతా నవ్వేశారు. రాములమ్మ నవ్వుతూ, ఇంకో కొద్ది రోజుల్లో ఈ పాపే మమ్మల్ని చూసుకుంటుంది చూడు…” అంది. శారదకి ఆ మాట అర్థం కాకపోయినా… అందరూ నవ్వుతున్నారని తాను కూడా నవ్వింది. ఇంతలో సుమతి ఇంటి ముందు చిన్న మట్టి దీపం వెలిగించింది. ఆ దీపం వెలుగు మెల్లగా చీకటిని తొలగిస్తోంది.

కొన్ని ఇళ్లలో మాత్రమే కిరోసిన్ దీపాల వెలుగు కనిపించేది. పొయ్యి మీద కూర మరిగే వాసన ఇంటి మొత్తం వ్యాపించింది. చెక్కలు కాలుతున్న శబ్దం, పక్కింటి వాళ్ల మాటలు… దూరంగా వినిపిస్తున్న గుడి గంట… అన్నీ కలిసిపోయి ఆ గ్రామ సాయంత్రాన్ని ఇంకా అందంగా మార్చేశాయి. గుడి గంట శబ్దం వినగానే రాములమ్మ చేతులు జోడించి దేవుడిని చూసింది. అందరూ సుఖంగా ఉండాలి తండ్రీ…” అంటూ నెమ్మదిగా మురిసింది.

ఆ కాలంలో... డబ్బు ఎక్కువగా లేకపోయినా, మనుషుల మధ్య ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. ఒకరి ఇంట్లో కష్టం వస్తే, పక్కింటి వాళ్లు కూడా వచ్చి తోడుగా నిలబడేవారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే… ఊరంతా ఆ ఇంటి గురించి మాట్లాడుకునేది. ఒకరి ఆనందం అంటే అందరి ఆనందం… ఒకరి బాధ అంటే అందరి బాధ.

ఆ చిన్న గ్రామంలో సంపద కంటే సంబంధాలకే ఎక్కువ విలువ ఉండేది. ఆ రాత్రి కూడా… ఆ చిన్న మట్టి ఇంట్లో అందరూ నేలపై చుట్టూ వలయంగా కూర్చుని భోజనం చేశారు. వేడి అన్నంలో సుమతి నెయ్యి వేసి శారద చేతిలో పెట్టింది. చాలా వేడిగా ఉంది అమ్మా…” అంటూ శారద ఊదుకుంటూ తినడం చూసి, రాఘవుడు నవ్వుకున్నాడు.  భోజనం అయ్యాక ఇంటి ముందు మంచాలు వేసుకుని అందరూ కూర్చునేవారు. పెద్దవాళ్లు పాత కథలు చెప్పేవారు. పిల్లలు ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టేవారు. ఆ రాత్రి కూడా అలాగే అందరూ కూర్చున్నారు. 

చల్లని గాలి మెల్లగా వీచుతోంది. కొద్ది సేపటికే… శారద అమ్మ ఒడిలోనే నిద్రపోయింది. సుమతి మెల్లగా ఆమె జుట్టు నిమురుతూ ఉండగా… రాఘవుడు ఆ చిన్న కుటుంబాన్ని చూస్తూ ఆనందపడ్డాడు. గ్రామాల్లో ఉదయం అనేది కోడి కూయక ముందే మొదలైపోయేది. ఆ రాత్రి నక్షత్రాల కింద నిద్రపోయిన వాళ్లందరూ… తెల్లవారుజామున చల్లని గాలికి మెల్లగా కళ్లు తెరిచారు.

దూరంగా ఎక్కడో కోడి “కొక్కొరోకో…” అంటూ గట్టిగా కూసింది. అదే గ్రామానికి మేలుకొలుపు. కొన్ని ఇళ్లలో అప్పటికే పొయ్యిల్లో మంటలు వెలిగిపోయాయి. చెక్కలు కాలుతున్న వాసన… ఇంటి ముందు కొత్తగా ఊడ్చి మట్టిమీద నీళ్లు చల్లిన పరిమళం… ఉదయపు మంచుతో తడిసిన గాలి… అన్నీ కలిసి ఆ పల్లెను ఇంకా ప్రశాంతంగా మార్చేశాయి. సుమతి కూడా తెల్లవారక ముందే లేచింది. మొదట ఇంటి ముందు ఊడ్చి తర్వాత బిందెలో నీళ్లు తీసుకుని మట్టిమీద చల్లింది. అలా నీళ్లు చల్లగానే, ఆ మట్టి నుంచి వచ్చే సువాసన చుట్టూ వ్యాపించింది. కొద్దిసేపటికే ఆమె తెల్లని పిండితో ముగ్గు పెట్టడం మొదలుపెట్టింది. చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కానీ… ఆ చిన్న నూనె దీపం వెలుగులో సుమతి వేసిన ముగ్గు మాత్రం చాలా అందంగా కనిపిస్తోంది.

ఇంతలో రాములమ్మ బయటికి వచ్చి, అయ్యో సుమతి… ఈరోజు ముగ్గు చాలా బాగుంది! అంది. సుమతి నవ్వుతూ, శారద నిన్న రాత్రి పెద్ద ముగ్గు వేయమ్మా అని చెప్పింది కదా… అంది. అంతలో ఇంట్లో నుంచి చిన్నగా ఆవలింపు వినిపించింది. శారద ఇంకా నిద్ర మత్తులోనే బయటికి వచ్చింది. కళ్లను రుద్దుకుంటూ… అమ్మా… ఇంత త్వరగా ఎందుకు లేచావ్?” అని అడిగింది. రాములమ్మ నవ్వుతూ, అయ్యో పాపం… ఇక్కడ సూర్యుడు లేవకముందే పనులు మొదలవుతాయి అమ్మా…” అంది. శారద మాత్రం ముగ్గు దగ్గరకు వెళ్లి ఆశ్చర్యంగా చూస్తోంది. అమ్మా… నేనూ వేయనా?” అంటూ చిన్న వేళ్లతో ముగ్గు పిండి పట్టుకుంది. సుమతి నవ్వుకుంటూ, ముందు నువ్వు గీత సరిగ్గా వేయడం నేర్చుకోమ్మా…” అంది. అంతే… శారద చాలా జాగ్రత్తగా ఒక చిన్న గీత వేసింది. కానీ అది వంకరగా పోయింది. అది చూసి రాములమ్మ పెద్దగా నవ్వేసింది. ఇదేం ముగ్గురా! పాము నడిచిన దారిలా ఉంది!” అంది. ఆ మాట విన్న వెంటనే శారద మొహం చిట్లించింది. నేను బాగా వేసా!” అంటూ చిన్నగా కోపపడింది. అది చూసి సుమతి వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని, మొదట ఇలానే నేర్చుకుంటారు అమ్మా… అంటూ తల నిమిరింది.

పొలం వైపు వెళ్లే రైతుల అడుగుల శబ్దం నెమ్మదిగా ఊరంతా మేల్కొలపడం మొదలైంది.తెల్లవారుజామున ఆ చల్లని గాలిలో మట్టి వాసన, ఇంకా రాత్రి పడిన మంచు తడి పరిమళం కలిసిపోయి ఊరంతా వ్యాపించింది. ఎద్దుల మెడలకు కట్టిన చిన్న చిన్న గంటల గణ… గణ… అంటూ మోగుతుండగా, రైతులు భుజాన నాగళ్లు వేసుకుని పొలం దారి పట్టారు. కొంతమంది చేతిలో లాంతర్లు పట్టుకుని నడుస్తుంటే, మరికొందరు ఎద్దులను నెమ్మదిగా తోసుకుంటూ హోయ్… హోయ్…” అంటూ ముందుకు తీసుకెళ్తున్నారు.

దూరంగా బావి దగ్గర అప్పటికే ఆడవాళ్ల సందడి మొదలైంది. తలపై ఖాళీ కుండలు పెట్టుకుని వచ్చిన వాళ్లు నీళ్లు తోడుకుంటూ ఒకరితో ఒకరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి వాన బాగా పడిందట… ఈసారి పంట బాగుంటుందేమో…” అంటూ వారి మాటలు ఆ ప్రశాంతమైన ఉదయాన్ని మరింత అందంగా మార్చేశాయి. ఒక వైపు పాలవాడు తన పాత సైకిల్‌కు రెండు వైపులా పెద్ద అల్యూమినియం డబ్బాలు కట్టుకుని పాలు… పాలు… అంటూ వీధి వీధి తిరుగుతున్నాడు. ఇంకొక మూలలో… చిన్న టీ దుకాణం దగ్గర మట్టిపొయ్యిపై నీళ్లు మరిగే శబ్దం వినిపిస్తోంది. చాయ్ వాసన గాలిలో కలవడంతో పొలం వెళ్లే వాళ్లు అక్కడ రెండు నిమిషాలు ఆగి వేడి టీ తాగుతున్నారు.

పిల్లలు స్కూల్‌కి వెళ్లేందుకు స్లేట్‌లు పట్టుకుని రెడీ అవుతున్నారు. ఆ చిన్న గ్రామం మొత్తం మెల్లగా మేల్కొంటోంది. అయితే ఆ ఉదయం శారదకి మాత్రం కొత్త ఆసక్తి మొదలైంది. సుమతి ముగ్గు వేస్తుంటే చూసిన తర్వాత… నేను కూడా పెద్ద వాళ్లలా అన్ని పనులు నేర్చుకుంటా!” అని మనసులో అనుకుంది.


“శారద చెప్పిన ఆ చిన్న మాటను అప్పట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు…
కానీ త్వరలో ఆమె చేసే పని… ఆ ఇంట్లో అందరినీ ఆశ్చర్యపరచబోతోంది…!”

Part - 5 👉 Click Here

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...