Skip to main content

Posts

Showing posts from May, 2026

🔑 అర్జున్ రహస్య కోట పజిల్ | సరైన తాళంచెవి సంఖ్యను కనుగొనగలరా?

అర్జున్ పుస్తకంలో ఉన్న పజిల్‌ను జాగ్రత్తగా లెక్కించాడు. (3 × 4) + (10 ÷ 2) - 14 = ?  12 + 5 - 14 = 3 కానీ కోటలోకి వచ్చినప్పుడు చదివిన సూచన అతనికి గుర్తొచ్చింది: "వచ్చిన సమాధానం నుండి 1 తీసివేయాలి." అంటే 3 - 1 = 2 అర్జున్ ధైర్యంగా గది 2 తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. గది అంతా చీకటిగా ఉంది. గోడలపై పాత చిత్రాలు వేలాడుతున్నాయి.  మధ్యలో ఒక చిన్న రాతి బల్ల కనిపించింది. ఆ బల్లపై ఒక తాళంచెవి కాదు...  తాళంచెవుల గుత్తి! కనిపించింది. "అయితే వీటిలో ఒకటి పెద్ద ఇనుప తలుపుకు సరిపోతుందేమో!" అని సంతోషంగా అనుకున్నాడు. అర్జున్ వెంటనే ఆ గుత్తిని తీసుకుని భారీ ఇనుప తలుపు దగ్గరకు వెళ్లాడు. అతను ఒక తాళంచెవిని తీసి తాళంలో పెట్టబోతుండగా... అకస్మాత్తుగా కోట అంతా కంపించింది! గోడల మధ్య నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. "సరిగ్గా ఆలోచించు ప్రయాణికుడా! నీకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది!" అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అప్పుడే తాళం మీద బంగారు అక్షరాలు వెలిగాయి. "సరైన తాళంచెవి సంఖ్యను కనుగొనకపోతే ఈ తలుపు ఎప్పటికీ తెరుచుకోదు." అప్పుడే అతని ముందు రెండు చిత్రాలు ప్రత్యక్షమయ...

Episode-3 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి 1980లో జరిగిన భయంకరమైన రహస్యం

చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 3 1980ల్లో… ఆ ఊరిలో పౌర్ణమి రాత్రి పేరు వినగానే కూడా కొంతమంది పెద్దవాళ్లు మౌనంగా మారిపోవడానికి కారణం ఉంది.  చెరువు దగ్గర కనిపించే ఆ అమ్మాయి నిజంగా ఆత్మేనా…? లేక… ఎన్నేళ్లుగా దాచిపెట్టిన ఒక నేరం తిరిగి బయటకు రావాలనుకుంటుందా…? ఇంటి ముందు కనిపించిన ఆ తడిసిన పాదాల గుర్తులను చూసి రాఘవ గుండె బలంగా కొట్టుకుంటోంది. మట్టిలో స్పష్టంగా కనిపిస్తున్న ఆ అడుగుల గుర్తులు ఆ ముద్రలు ఒక్కోటి ఎంతో భారంగా నేలపై పడినట్టుగా కనిపించాయి. చెరువు మట్టి ఇంకా తడిగా ఉండటంతో ఆ కాళ్ల ఆకారాలు స్పష్టంగా బయటపడ్డాయి. పాదాల చుట్టూ చిన్న చిన్న నీటి బిందువులు మెరుస్తున్నాయి. అవి కేవలం అడుగుల గుర్తుల్లా కాకుండా, ఇప్పుడే ఎవరో అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంటి వెనుక ఆగినట్టుగా అనిపించాయి. చన్నయ్య చేతిలో ఉన్న పాత కర్ర మెల్లగా వణికింది. అతని నుదుటిపై చెమట చుక్కలు మెరుస్తున్నాయి. గదిలో వేలాడుతున్న చిన్న నూనె దీపం గాలికి ఊగుతూ గోడలపై భయంకరమైన నీడలను చూపించింది. రాఘవ గొంతు ఎండిపోయింది. అతను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక అక్కడే నిలబడి ఆ అడుగుల వైపు చూస్తూ ఉన్నాడు.  చప్ప్… చప్ప్......

Episode 2 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story

చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 2 1980లో… ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో జరిగిన సంఘటనను ఇప్పటికీ అక్కడి పెద్దవాళ్లు పూర్తిగా మర్చిపోలేదు.  పౌర్ణమి రాత్రి చెరువు దగ్గరకు వెళ్లిన వాళ్లంతా  ఎందుకు తిరిగి ఆ దారి వైపు చూడకుండా వచ్చేవారు…? అసలు… “లక్ష్మి” అనే ఆ అమ్మాయి నిజంగా ఎవరు…? ఆ రాత్రంతా రాఘవకు అస్సలు నిద్రపట్టలేదు. ఆ రోజు జరిగింది తలచుకుంటే రాఘవ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అతని ఒళ్ళు మొత్తం చల్లపడిపోయినట్టు అనిపిస్తోంది. చేతులు మొత్తం చమటతో నిండిపోయింది. ఆ వెండి గాజు అప్పుడప్పుడూ  చంద్రకాంతి తగిలినప్పుడల్లా వింతగా మెరుస్తోంది. అది ఒక మామూలు గాజులాగానే కనిపించినా, దానిలో ఏదో చెప్పలేని భయం దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. కానీ రాఘవ కళ్ళకు మాత్రం నిద్ర పట్టలేదు. అతను మంచం మీద పడుకున్నప్పుడల్లా చెరువు దగ్గర కనిపించిన ఆ అమ్మాయి ముఖమే కనిపిస్తోంది. ఆమె కళ్ళలో కనిపించిన ఆ విచిత్రమైన బాధ, ఆమె మాటల్లో కనిపించిన ఆ ఒంటరితనం ఏదో అతని మనసును గట్టిగా పట్టేసినట్టుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఇంకా అతని చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. “ఎన్నేళ్ల తర్వాత… ...

Episode 6 ఉమ్మడి కుటుంబం| 1980 పల్లె కథ – కాలువ దగ్గర ఎవరు?

“ఆ రాత్రి… ఊరి జనాలు వర్షానికి కాదు… కాలువ శబ్దానికి భయపడ్డారు. ఎందుకంటే… ఆ నీళ్లతో పాటు ఎవరో ఒకరి కేకలు కూడా వినిపిస్తున్నాయి…” కథ ప్రారంభం👇 కాలువ దగ్గర నిలబడి ఉన్న శారద… ఆకాశంలో మెరుస్తున్న మెరుపులను ఆశ్చర్యంగా చూస్తోంది. మిగతా పిల్లలు మాత్రం వర్షం మొదలయ్యిందని కేకలు వేస్తూ పరుగులు పెడుతున్నారు. “శారదా! త్వరగా రా!” అంటూ ఒక పిల్లాడు అరవగా… శారద మాత్రం కాలువలో వేగంగా పారుతున్న నీళ్లను చూస్తూ నిలబడిపోయింది. ఎందుకో ఆ రోజు కాలువ శబ్దం కూడా భయంకరంగా వినిపిస్తోంది. అప్పుడే మరోసారి గట్టిగా ఉరుము వినిపించింది. “ధడామ్…!” ఆ శబ్దానికి చిన్న పిల్లలు భయపడి ఒక్కసారిగా చెట్టు కిందకు చేరుకున్నారు. అంతలో సుమతి అక్కడికి చేరుకుంది. తడిసిన జుట్టును చెయ్యితో సరిచేసుకుంటూ, “శారదా!” అంటూ గట్టిగా పిలిచింది. అమ్మ గొంతు వినగానే శారద వెనక్కి తిరిగింది. “అమ్మా! నీళ్లు ఎంత వేగంగా వస్తున్నాయో చూడు!” అంటూ అమాయకంగా అంది. సుమతి దగ్గరకు వెళ్లి ఆమె చేతిని బిగిగా పట్టుకుంది. “ఇక్కడ నిలబడకూడదు రామ్మా… వర్షం పెరుగుతోంది” అంది కంగారుగా. అప్పటికే వర్షం చినుకులు పెద్దవిగా మారాయి. కొన్ని క్షణాల్లోనే… ఆకాశం మొత్తం చీ...

Episode 1 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story

చెరువు దగ్గర కనిపించిన అసాధారణ అమ్మాయి “ప్రతి పౌర్ణమికి రాత్రిపూట చెరువు దగ్గర ఒక అమ్మాయి కనిపించేదట.  ఆమె నీళ్ల మీద నడుస్తుందని ఊరివాళ్లు ఎప్పుడూ చెప్పుకునేవారు. కానీ… ఆమెను దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం మళ్లీ ఎప్పుడూ సాధారణంగా ఉండలేదట… పిచ్చివారిలా మారుతారట.  ఆమె నిజంగా మనిషేనా…  లేక రాత్రిళ్లు చెరువు దగ్గర కనిపించే ఒక దయ్యమా …?” అది 1985 కాలం… కొండల మధ్యలో  పచ్చని చెట్లతో నిండిపోయి ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు వేములపల్లి. ఉదయం సూర్యుడి వెలుగు కొండల వెనక నుంచి నెమ్మదిగా బయటికి కనిపిస్తుంటే అప్పుడు ఆ ఊరు మెల్లగా మేల్కొనేది. ఇళ్ల ముందు మహిళలు కల్లాపు నీళ్ళు చల్లి ముగ్గులు వేస్తూ ఉండేవారు. దూరంగా కోళ్లు కూస్తూ, ఎద్దుల బండ్ల గంటల శబ్దం పొలాల దారి మొత్తం వినిపించేది. నీరు  తాగడానికి ఆ ఊరి ప్రజలందరికీ ఒకటే ఆధారం, గ్రామం చివర ఉన్న ఒక  పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు ఎప్పుడూ చల్లగా, స్వచ్ఛంగా ఉండేవి.  ఉదయం తెల్లారిందంటే చాలు ప్రతి ఇంటి ఆడవాళ్లు తమ తమ ఇళ్ళల్లో ఉన్న మట్టి  కుండలు, పిత్తల బిందెలు తీసుకుని చెరువు దారి పట్టేవారు. కొంతమంది మాట్లాడుకుంటూ వ...

Episode 5 ఉమ్మడి కుటుంబం ఆ వర్షం రాకముందు జరిగిన సంఘటన

1980లో… ఒక చిన్న గ్రామంలో అందరూ సాధారణ రోజుగా భావించిన ఆ సాయంత్రం… ఒక చిన్నారి అమాయకపు ఆటతో మొదలై, ఒక భారీ వర్షంతో ఊరంతా గుర్తుంచుకునే సంఘటనగా మారింది… ఆ రోజు శారద చేసిన చిన్న పని… తర్వాత వాళ్ల జీవితాన్ని ఎలా మార్చిందో చూడండి … ఆ రోజు ఉదయం నుంచి శారద మనసులో ఒక్కటే తిరుగుతోంది… “నేను కూడా పెద్ద వాళ్లలా ఉండాలి!” సుమతి బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి బిందెలు వరుసగా పెట్టింది. రాములమ్మ ఇంటి వెనుక ఆవులకు గడ్డి వేస్తోంది. రాఘవుడు పొలం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అందరూ తమ తమ పనుల్లో ఉండగా… శారద మాత్రం ఒక్కో పని ఎలా చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. కొద్దిసేపటికే సుమతి బట్టలు ఉతికేందుకు వెనుక వైపు వెళ్లింది. అదే సమయం చూసిన శారద… నెమ్మదిగా ఒక చిన్న బిందె దగ్గరకు వెళ్లింది. రెండు చేతులతో పట్టుకుని లేపడానికి ప్రయత్నించింది. కానీ బిందె కాస్త బరువుగా ఉండడంతో… “అబ్బా…” అంటూ చిన్నగా మూలిగింది. అయినా వదలలేదు. చిన్న చిన్న అడుగులతో ముందుకు నడవడం మొదలుపెట్టింది. బిందెలోని నీళ్లు చప్పుళ్లు చేస్తూ బయటికి చిందుతున్నాయి. అంతలో బయట నుంచి వస్తున్న రాములమ్మ అది చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. “అయ...

Episode - 4 ఉమ్మడి కుటుంబం1980లో పల్లెటూరిలోని ఆనందం

“1980లో… ఆ చిన్న గ్రామంలో ఉదయం కోడి కూయకముందే మొదలయ్యేది. మట్టి వాసన, ముగ్గుల అందం, కుటుంబ ప్రేమల మధ్య పెరిగిన చిన్నారి శారద… ఒక రోజు చెప్పిన చిన్న మాట… కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి జీవితాన్నే మార్చబోతోందని అప్పుడెవరికీ తెలియదు…” అలా సాయంత్రం మెల్లగా గ్రామం మీదకి దిగుతూ ఉండగా… పొలం దారులన్నీ మళ్లీ జనాలతో కిక్కిరిసిపోయాయి. రోజంతా ఎండలో పని చేసిన రైతులు భుజాల మీద గొడ్డళ్లు వేసుకుని నడుస్తున్నారు. కొంతమంది ఎద్దుల బండ్లపై గడ్డి మోసుకొస్తున్నారు. ఆ బండ్లు కదిలినప్పుడల్లా గంటలు “గల గల” అంటూ మధురంగా వినిపిస్తున్నాయి. ఆవులు, ఎద్దులు తమ ఇళ్ల దారులు తామే గుర్తుపట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాయి. వాటి వెనకాల చిన్న పిల్లలు నవ్వుతూ పరుగులు పెడుతున్నారు. “అయ్యో… మా గంగమ్మ ఆ వైపు పోతుంది!” అంటూ ఒక చిన్నోడు అరవగా, మరో పిల్లాడు నవ్వుకుంటూ దాని తాడును పట్టుకున్నాడు. దూరంగా చెట్ల మీద కూర్చున్న పక్షులు కూడా గూటికి చేరుకుంటున్నాయి. ఆకాశం మొత్తం నారింజ, ఎరుపు రంగులతో అందంగా మెరిసిపోతోంది. శారద మాత్రం ఇంటి ముందు మట్టి అరుగు మీద నిలబడి… దూరంగా వచ్చే ప్రతి మనిషిని ఆసక్తిగా చూస్తోంది. ఒక్కసారిగా పొలం దారిలో త...

అర్ధరాత్రి 12:07కి వచ్చిన Video Call

అర్ధరాత్రి 12 గంటలకు మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి నుంచి వీడియో కాల్ వస్తే…? అది prank అనుకున్న అర్జున్… call lift చేసిన తర్వాత మాత్రం… తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం చూసాడు…” అర్జున్ అనే యువకుడు Bengaluru లో ఒంటరిగా ఒక చిన్న అద్దె గదిలో ఉండేవాడు. పగలంతా బయట పనులు చూసుకుని… రాత్రిళ్లు మాత్రం laptop ముందు కూర్చొని freelance projects చేసేవాడు. ఆ గది కూడా చాలా చిన్నది. ఒక పక్క పాత wooden table… దానిమీద half-broken laptop… పక్కనే చల్లారిపోయిన tea glass… ceiling fan “కీచ్… కీచ్…” అంటూ నెమ్మదిగా తిరుగుతుండేది. ఆ రాత్రి బయట వర్షం కూడా మొదలైంది. జల్లులు కిటికీ గాజుపై పడుతూ విచిత్రమైన శబ్దం చేస్తున్నాయి. అర్జున్ మాత్రం headphones పెట్టుకుని పని చేస్తూనే ఉన్నాడు. Time చూసాడు. 12:07 AM. అప్పుడే… ఫోన్ ఒక్కసారిగా vibrate అయింది. టేబుల్ మీద ఉన్న మొబైల్ నెమ్మదిగా కదులుతూ వెలిగింది. ఆ వెలుతురు చీకటి గదిలో మరింత భయంగా కనిపించింది. అర్జున్ మొదట పట్టించుకోలేదు. “ఈ టైమ్‌లో ఎవరు call చేస్తున్నారు…” అంటూ screen వైపు చూసాడు. కానీ… Screen మీద కనిపించిన పేరు చూసిన క్షణంలోనే అతని గుండె ఒక్కసారి...