Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది


"వరద వారి పంటను తీసుకెళ్లింది...  అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...  కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది. ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..."


సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు. అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం. 

సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు. మావయ్యా... మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా.

ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది.
"సరే అమ్మా... 
నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు."

ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపోయిన మొక్కలు... అవి చూసి ఆమె మనసు బాధపడింది. కానీ అదే సమయంలో రాఘవుడు చేసిన కష్టం ఎంత గొప్పదో ఆమెకు మరింత అర్థమైంది. సిద్ధయ్య ఆమెకు చిన్న చిన్న పనులు చూపించడం ప్రారంభించాడు. ముందుగా వరదతో కొట్టుకొచ్చిన ఎండిన కొమ్మలు, చెత్తను ఏరమని చెప్పాడు. ఇద్దరూ కలిసి పొలం అంతా తిరుగుతూ పనికిరాని మొక్కలను తొలగించారు. తర్వాత నీటి కాలువల్లో పేరుకున్న మట్టిని పక్కకు తీసి నీరు సరిగా వెళ్లేలా చేశారు. ఎండలో పని చేయడం సుమతికి కొత్త అనుభవం. కొద్దిసేపటికే చేతులు నొప్పించాయి. అయినా సిద్ధయ్య చూపించిన ప్రతి పనిని శ్రద్ధగా నేర్చుకుంది.

"ఇలాగే కొద్దికొద్దిగా నేర్చుకుంటే మంచి రైతురాలవుతావమ్మా," అని సిద్ధయ్య చెప్పగా సుమతి చిరునవ్వు నవ్వింది. అక్కడున్న ఇతర మహిళా కూలీలతో పరిచయం చేసుకుంది.  అలా వాళ్ళతో మాట్లాడుకుంటూ, ఆ రోజు పొలం పని ముగించారు.  మొదటి రోజు సుమతికి చాలా అలసటగా అనిపించింది. కాళ్లు కూడా బరువెక్కాయి. నేలలో నడవడం కష్టంగా అనిపించింది.  కానీ ఇంటికి వచ్చాక ఆమె ముఖంలో మాత్రం సంతృప్తి కనిపించింది.

"ఈ రోజు నిజంగా ఏదో చేశాననే భావన వచ్చింది," అని ఆమె మనసులో అనుకుంది.

అటు రాఘవుడు కూడా సమీప పట్టణంలో  "ఏదైనా పని దొరికితే కొంతైనా ఆదాయం వస్తుంది," అని అనుకుని బయటకు బయలుదేరాడు. ఉదయం నుంచే గ్రామం చుట్టుపక్కల ఉన్న పొలాల దగ్గరకు వెళ్లాడు. "అన్నా... ఏమైనా కూలిపని ఉందా?" అని ఒక రైతును అడిగాడు. "ఇప్పుడైతే పని లేదు రాఘవా. అవసరం అయితే చెబుతాను" అని ఆ రైతు చెప్పాడు. అక్కడి నుంచి మరో చోటికి వెళ్లాడు. ఒక నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి అడిగాడు. "మాకు ఇప్పటికే కూలీలు ఉన్నారు బాబూ," అని అక్కడి మేస్త్రీ చెప్పాడు. రాఘవుడు నిరాశగా అక్కడి నుంచి బయలుదేరాడు. సూర్యుడు నెమ్మదిగా నడినెత్తికి చేరుకున్నాడు. ఎండ తీవ్రంగా పెరిగింది. చెమటలు కారుతున్నా రాఘవుడు మాత్రం వెనక్కి తిరగలేదు. మధ్యాహ్నం అయ్యింది. ఇంటికి వెళ్లి భోజనం చేయాలని అనిపించింది. కానీ ఇంట్లో పరిస్థితి గుర్తొచ్చింది. "ఇప్పుడు ఇంటికి వెళ్లి తింటే సమయం వృథా అవుతుంది. ముందు పని దొరకాలి" అని అనుకుని ఒక చెట్టు నీడలో కాసేపు నీళ్లు తాగి మళ్లీ బయలుదేరాడు. మూడో చోటుగా పక్క గ్రామానికి వెళ్లాడు. అక్కడ కూడా పని కోసం అడిగాడు. మళ్ళీ "ఈరోజు పని లేదు బాబూ," అనే సమాధానమే వచ్చింది. ఆ మాట విన్న తర్వాత రాఘవుడి గుండె భారంగా మారింది. ఉదయం నుంచి తిరుగుతున్నాడు. కాళ్లు నొప్పి పెడుతున్నాయి. ఇంట్లో అందరూ తన కోసం ఎదురు చూస్తుంటారు. కానీ పని దొరకక ముందే ఇంటికి వెళ్లకూడదని రాఘవుడు అనుకున్నాడు. ఆకలితో కడుపు మండుతోంది. అయినా ధైర్యం కోల్పోలేదు.

"ఒక వైపు సుమతి వారికి పని దొరికిందేమో దానికే ఇంటికి రాలేదేమో" అని మనసులో అనుకుంది. 

రాఘవుడు సాయంత్రం కావొస్తున్న సమయంలో గ్రామం చివర ఉన్న ఒక పెద్ద కొబ్బరి తోట దగ్గరకు వెళ్లాడు. అక్కడ కొంతమంది కూలీలు పని చేస్తున్నారు. రాఘవుడు దగ్గరకు వెళ్లి యజమానిని అడిగాడు.
"అయ్యా... నాకు ఏమైనా పని దొరుకుతుందా?"

యజమాని అతన్ని ఒకసారి చూసి,

"రేపటి నుంచి తోట శుభ్రం చేసే పని ఉంది. కష్టపడి చేస్తే నెలరోజుల వరకు పని ఉంటుంది. వస్తావా?" అని అడిగాడు.

ఆ మాట వినగానే రాఘవుడి ముఖంలో వెలుగు వచ్చింది. "తప్పకుండా వస్తానయ్యా!" అని ఆనందంగా చెప్పాడు. రోజంతా ఎదురైన నిరాశ ఒక్క క్షణంలో మాయమైపోయింది. సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో రాములమ్మ, సిద్ధయ్య, సుమతి అతని కోసం ఎదురుచూస్తున్నారు. రాఘవుడు ఇంట్లోకి అడుగుపెట్టగానే సుమతి ఆత్రంగా అడిగింది.

"ఏమైందండి? పని దొరికిందా?" 

రాఘవుడు చిరునవ్వు నవ్వాడు.

"దొరికింది సుమతి! రేపటి నుంచి కొబ్బరి తోటలో పని చేయమన్నారు.  నెలరోజుల వరకు పని ఉంటుందట."

ఆ మాట విన్న వెంటనే సుమతి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. "నిజంగానా అండి?" అని అడిగింది.

"అవును," అని రాఘవుడు చెప్పాడు. రాములమ్మ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.

"దేవుడు మనల్ని పూర్తిగా వదిలేయలేదురా," అని అంది.

సిద్ధయ్య కూడా సంతోషంగా తల ఊపాడు. "కష్టపడే మనిషిని దేవుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు," అని చెప్పాడు. ఆ రోజు ఇంట్లో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, చాలాకాలం తర్వాత అందరి ముఖాల్లో చిన్న ఆశ కనిపించింది. ఆ ఆశకు కారణం రాఘవుడు తెచ్చిన ఆ ఒక్క శుభవార్తే. రేపటి నుంచే రాఘవుడు కొబ్బరి తోటలో పనికి వెళ్లడం ప్రారంభించాడు. రోజంతా కష్టపడి పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. 

అతనికి పని కొత్తదే అయినా... కుటుంబం కోసం అన్న ఆలోచనే అతనికి బలం ఇచ్చింది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. ఇంట్లో పరిస్థితి కొంచెం మెరుగుపడుతోంది. అప్పులు మాత్రం ఇంకా ఉన్నాయి. కానీ ముందు ఉన్న నిరాశ ఇప్పుడు లేదు. ఒకరోజు సాయంత్రం రాఘవుడు పని ముగించుకుని ఇంటికి వస్తుండగా, ఎదురుగా ఒక వ్యక్తి కనిపించాడు.

అతను మధు.
మధు రాఘవుడి చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదివారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కొన్ని సంవత్సరాల క్రితం రాఘవుడి తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బు లేక ఇబ్బంది పడిన సమయంలో కూడా మధు తనకు చేతనైన సహాయం చేశాడు. అందుకే రాఘవుడికి మధు మీద ప్రత్యేకమైన నమ్మకం ఉండేది. "రాఘవా! చాలా రోజులైంది. ఎలా ఉన్నావు?" అని మధు అడిగాడు. రాఘవుడు జరిగిన విషయాలన్నీ చెప్పాడు. మధు శ్రద్ధగా విన్నాడు. గత కొద్ది నెలలుగా మధు కొండచెరువు పక్కన ఉన్న భూముల వద్దకు తరచూ వెళ్లేవాడు. అక్కడ కొంతమంది రైతులు తక్కువ పెట్టుబడితో కూరగాయల సాగు చేసి మంచి ఆదాయం సంపాదించడం అతను స్వయంగా చూశాడు. అందుకే రాఘవుడికి కూడా అదే మార్గం చూపించాలని అనుకున్నాడు.

"మన దగ్గర ఉన్న కొండచెరువు పక్కన ఖాళీ భూమి గుర్తుందా?" అని మధు అడిగాడు. "అవును," అన్నాడు రాఘవుడు. "అక్కడ కొందరు కూరగాయల సాగు చేసి మంచి లాభం పొందుతున్నారు. నేను స్వయంగా చూశాను. తక్కువ ఖర్చుతో త్వరగా ఆదాయం వస్తుంది. నువ్వు కూడా ప్రయత్నించవచ్చు," అని మధు చెప్పాడు.

ఆ మాటలు విన్న రాఘవుడి మనసులో కొత్త ఆశ చిగురించింది. ఇంటికి వచ్చి ఆ విషయం అందరికీ చెప్పాడు. సిద్ధయ్య కూడా ఆసక్తిగా విన్నాడు. "ఇది ప్రయత్నించడానికి మంచి అవకాశం కావచ్చు," అన్నాడు. సుమతి కళ్లలో మళ్లీ వెలుగు కనిపించింది. "మనం అందరం కలిసి చేస్తే తప్పకుండా సాధించగలం," అంది.

ఆ రాత్రి అందరూ కొత్త కలలతో నిద్రపోయారు... కానీ విధి మాత్రం వారి కోసం మరో పెద్ద పరీక్షను సిద్ధం చేసి ఉంచిందని వారికి తెలియదు..."

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...