అర్జున్ పుస్తకంలో ఉన్న పజిల్‌ను జాగ్రత్తగా లెక్కించాడు. (3 × 4) + (10 ÷ 2) - 14 = ? 12 + 5 - 14 = 3 కానీ కోటలోకి వచ్చినప్పుడు చదివిన సూచన అతనికి గుర్తొచ్చింది: "వచ్చిన సమాధానం నుండి 1 తీసివేయాలి." అంటే 3 - 1 = 2 అర్జున్ ధైర్యంగా గది 2 తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. గది అంతా చీకటిగా ఉంది. గోడలపై పాత చిత్రాలు వేలాడుతున్నాయి. మధ్యలో ఒక చిన్న రాతి బల్ల కనిపించింది. ఆ బల్లపై ఒక తాళంచెవి కాదు... తాళంచెవుల గుత్తి! కనిపించింది. "అయితే వీటిలో ఒకటి పెద్ద ఇనుప తలుపుకు సరిపోతుందేమో!" అని సంతోషంగా అనుకున్నాడు. అర్జున్ వెంటనే ఆ గుత్తిని తీసుకుని భారీ ఇనుప తలుపు దగ్గరకు వెళ్లాడు. అతను ఒక తాళంచెవిని తీసి తాళంలో పెట్టబోతుండగా... అకస్మాత్తుగా కోట అంతా కంపించింది! గోడల మధ్య నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. "సరిగ్గా ఆలోచించు ప్రయాణికుడా! నీకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది!" అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అప్పుడే తాళం మీద బంగారు అక్షరాలు వెలిగాయి. "సరైన తాళంచెవి సంఖ్యను కనుగొనకపోతే ఈ తలుపు ఎప్పటికీ తెరుచుకోదు." అప్పుడే అతని ముందు రెండు చిత్రాలు ప్రత్యక్షమయ...
అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.… కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి… స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...