"వరద వారి పంటను తీసుకెళ్లింది... అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి... కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది. ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు. అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం. సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు. మావయ్యా... మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా... నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...
1980లో…
ఒక చిన్న గ్రామంలో అందరూ సాధారణ రోజుగా భావించిన ఆ సాయంత్రం…
ఒక చిన్నారి అమాయకపు ఆటతో మొదలై,
ఒక భారీ వర్షంతో ఊరంతా గుర్తుంచుకునే సంఘటనగా మారింది…
ఆ రోజు శారద చేసిన చిన్న పని…
తర్వాత వాళ్ల జీవితాన్ని ఎలా మార్చిందో చూడండి…
ఆ రోజు ఉదయం నుంచి శారద మనసులో ఒక్కటే తిరుగుతోంది…
నేను కూడా పెద్ద వాళ్లలా ఉండాలి! సుమతి బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి బిందెలు వరుసగా పెట్టింది. రాములమ్మ ఇంటి వెనుక ఆవులకు గడ్డి వేస్తోంది. రాఘవుడు పొలం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అందరూ తమ తమ పనుల్లో ఉండగా… శారద మాత్రం ఒక్కో పని ఎలా చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. కొద్దిసేపటికే సుమతి బట్టలు ఉతికేందుకు వెనుక వైపు వెళ్లింది. అదే సమయం చూసిన శారద నెమ్మదిగా ఒక చిన్న బిందె దగ్గరకు వెళ్లింది. రెండు చేతులతో పట్టుకుని లేపడానికి ప్రయత్నించింది. కానీ బిందె కాస్త బరువుగా ఉండడంతో… అబ్బా…” అంటూ చిన్నగా మూలిగింది. అయినా వదలలేదు. చిన్న చిన్న అడుగులతో ముందుకు నడవడం మొదలుపెట్టింది. బిందెలోని నీళ్లు చప్పుళ్లు చేస్తూ బయటికి చిందుతున్నాయి. అంతలో బయట నుంచి వస్తున్న రాములమ్మ అది చూసి ఒక్కసారిగా ఆగిపోయింది.
అయ్యో అయ్యో! ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. శారద మాత్రం భయపడకుండా, నేనే నీళ్లు పెడతా! అంది గర్వంగా. ఆ మాట విన్న రాములమ్మ నవ్వు ఆపుకోలేకపోయింది. ఇంకో రెండు రోజుల్లో ఈ పాపే ఊరంతా పనులు చేసేస్తుందేమో! అంది. అంతలో సుమతి కూడా బయటికి వచ్చింది.
శారద చేతిలో బిందె చూసి ఆశ్చర్యపోయింది.
ఇది ఎవరు చేయమన్నారు? అని అడిగింది. శారద అమాయకంగా, నేనే చేసుకుంటున్నా… నేను పెద్దదాన్నయ్యా కదా… అంది. ఆ మాట విన్న సుమతి ముఖం ఒక్కసారిగా మృదువైంది. ఆమె దగ్గరకు వెళ్లి బిందె తీసుకుని, పెద్దదవ్వాలి అంటే ముందు జాగ్రత్తగా ఉండాలి అమ్మా… అంటూ ప్రేమగా చెప్పింది. శారద మాత్రం చిన్నగా మొహం పెట్టుకుంది.
నేను కూడా నీలా పని చేయాలి… అంది. సుమతి నవ్వుతూ ఆమె చెంప నిమిరింది.
“చేస్తావమ్మా… కానీ తొందరపడకూడదు.
ఆ మాటలు వింటూ రాములమ్మ మెల్లగా నవ్వుకుంది. ఈ పాపకి చిన్నప్పట్నుంచే బాధ్యత ఎక్కువ! అంది. అంతలో దూరంగా స్కూల్ గంట మోగింది. వీధిలో పిల్లలు స్లేట్‌లు పట్టుకుని పరుగులు పెడుతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం… ఎండ చాలా ఎక్కువగా ఉంది. పొలం నుంచి వచ్చిన రాఘవుడు ఇంటి ముందు చెట్టు కింద కూర్చుని ఊపిరి పీలుస్తున్నాడు. సుమతి అతనికి చల్లని మజ్జిగ ఇచ్చింది.
అప్పుడే శారద పరుగెత్తుకుంటూ వచ్చి, నాన్నా! నేను కూడా పని చేశా! అంటూ ఆనందంగా అంది. ఏం పని చేశావమ్మా? అని రాఘవుడు అడిగాడు. శారద చాలా గర్వంగా, నీళ్లు మోశా! అంది. అది విన్న రాఘవుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అయ్యో! నిజంగా?” అని అడిగాడు. శారద వెంటనే తల ఊపింది. రాములమ్మ పక్కనే నవ్వుతూ, అవును రా… చిన్న బిందెతో ఇంట్లోనే సగం నీళ్లు చల్లేసింది!” అంది.
అంతే… అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. శారద మాత్రం అందరూ నవ్వుతున్నారనే అర్థం కాక, నేను నిజంగానే తెచ్చా!” అంటూ చిన్నగా కోపపడింది. అది చూసి రాఘవుడు ఆమెను ఒడిలోకి తీసుకుని, మా శారద నిజంగానే చాలా ధైర్యం ఉన్న అమ్మాయి… అన్నాడు. ఆ మాట విన్న వెంటనే… శారద ముఖం మళ్లీ వెలిగిపోయింది. అప్పుడే పక్కింటి పిల్లలు కొంతమంది శారద దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల చేతుల్లో చిన్న చిన్న కర్రలు, మట్టి బొమ్మలు ఉన్నాయి.
శారదా… రా! కాలువ దగ్గర అందరం ఆటలు ఆడుకుంటున్నాం! అని ఒక అమ్మాయి ఆనందంగా పిలిచింది. ఈరోజు కొత్త ఆట కూడా పెట్టాం… నువ్వు రాకపోతే సరదా ఉండదు! అని ఇంకో పిల్లాడు చెప్పాడు.
ఆ మాటలు విన్నా కూడా…శారద మాత్రం వాళ్ల వైపు చూడకుండా ఇంటి ముందున్న పనుల దగ్గరే నిలబడి ఉంది. అమ్మ సుమతి తుడిచిన పాత్రలను శారద తీసుకుని లోపల పెట్టింది. కొంచెం నీళ్లు తీసుకుని మొక్కలకు పోసింది. మళ్లీ వంటింటి దగ్గరకు వెళ్లి చిన్న చిన్న పనులు చేసేందుకు సిద్ధమైంది. అది చూసిన రాఘవుడు మెల్లగా నవ్వుకున్నాడు. ఆ నవ్వులో ప్రేమ ఉంది… గర్వం ఉంది.
అయ్యో… మా పాప రైతు ఇంటి అమ్మాయిలా తయారవుతోంది! అంటూ సరదాగా అన్నాడు. సుమతి కూడా చిరునవ్వు నవ్వింది. చూడండి… చిన్నప్పటి నుంచే నాకు తోడుగా తిరుగుతోంది అంది. రాఘవుడు శారద దగ్గరకు వచ్చి మృదువుగా అన్నాడు. వెళ్ళమ్మా… వాళ్లతో ఆడుకో. పని ఎప్పుడైనా ఉంటుంది.” కానీ శారద తలను అడ్డంగా ఊపింది. నేను ఆడుకోవడానికి వెళ్ళను నాన్నా… ఇక్కడే అమ్మతో కలిసి పని చేస్తా” అంది చిన్నగా. ఆ మాట విన్న వెంటనే…రాఘవుడు కాసేపు ఆమె ముఖం వైపు చూసాడు. చిన్న చేతులతో పనులు పట్టుకోవాలని చూస్తున్న ఆ పాపను చూసి అతని మనసు కరిగిపోయింది. అతడు మెల్లగా మోకాళ్లపై కూర్చుని శారద కళ్లలోకి చూస్తూ అన్నాడు—
అలా కాదు తల్లి… ఇప్పుడు నీది పని చేసే వయసు కాదు… ఆడుకునే వయసు. శారద ఆశ్చర్యంగా చూసింది. పొలాల్లో మేమున్నాం… ఇంట్లో అమ్మ ఉంది. నీకు ఇప్పుడే ఈ బాధ్యతలన్నీ అవసరం లేదు. నువ్వు నవ్వుతూ… పరుగులు పెడుతూ… సంతోషంగా ఆడుకుంటూ ఉండాలి.” శారద అమాయకంగా అడిగింది— అయితే నేను పెద్దయ్యాక పని చేయొచ్చా? రాఘవుడు నవ్వుతూ ఆమె తల నిమిరాడు. అప్పుడు నువ్వు అమ్మలా పెద్దదానివి అవుతావు. ఇంటి పనులు కూడా చేస్తావు… అందరినీ చూసుకుంటావు.” అప్పుడు శారద కళ్లలో చిన్న వెలుగు మెరిసింది. అయితే నేను పెద్దయ్యాక అన్నీ పనులు నేనే చేస్తా!” అంది గర్వంగా. ఆ మాట విని సుమతి, రాఘవుడు ఇద్దరూ నవ్వుకున్నారు. అలాగే చేద్దువు తల్లి… కానీ ఇప్పుడు వెళ్లి ఆడుకో అంటూ రాఘవుడు ఆమె చేతిని పట్టుకుని ఆ పిల్లల దగ్గరకు తీసుకెళ్లాడు.
శారద మొదట కొంచెం మొహమాటపడినా… తర్వాత పిల్లలతో కలిసి పరుగెత్తింది. ఆమె నవ్వు ఆ చిన్న వీధి అంతా మార్మోగిపోయింది. దూరంగా నిలబడి చూస్తున్న రాఘవుడు మాత్రం మెల్లగా అన్నాడు— పిల్లల నవ్వులు ఇల్లంతా వినిపిస్తే… అదే అసలైన సంపద…”
సాయంత్రం అయ్యేసరికి… ఆకాశంలో మబ్బులు నెమ్మదిగా కమ్ముకోవడం మొదలైంది. మధ్యాహ్నం వరకు మండిపోయిన ఎండ ఒక్కసారిగా తగ్గిపోయి… చల్లని గాలి ఊరంతా వీచింది. పొలాల దగ్గర ఉన్న చెట్లు గాలికి ఊగుతూ “షూ… షూ…” అని శబ్దం చేస్తున్నాయి. దూరంగా ఎక్కడో ఉరుము గట్టిగా వినిపించింది. అది విన్న వెంటనే ఇంటి ముందున్న ఆవులు కూడా కదిలి గోడచాటు చేరాయి. కొంతమంది ఆడవాళ్లు కుండలు తీసుకొని త్వరగా ఇంటి దారి పట్టారు. రాములమ్మ మాత్రం గుమ్మం దగ్గర నిలబడి ఆకాశం వైపు చూసింది. మబ్బులు మరింత నల్లగా మారుతున్నాయి. ఈరోజు పెద్ద వాన పడేలా ఉంది…” అని ఆమె నెమ్మదిగా అంది.
అప్పుడే… ఇంట్లో ఏదో పని చేస్తున్న సుమతి ఒక్కసారిగా బయటకు పరిగెత్తింది. ఆమె ముఖంలో కంగారు స్పష్టంగా కనిపిస్తోంది. చీర కొంగు సరిచేసుకుంటూ తొందరగా బయటకు వెళ్తుండగా… రాములమ్మ ఆశ్చర్యంగా, ఏంటమ్మా అలా పరుగెడుతున్నావు?” అని అడిగింది. సుమతి ఒక్క క్షణం కూడా ఆగకుండా, వర్షం పడేలా ఉంది అమ్మ… శారదను తీసుకొస్తా!” అంటూ పరుగెత్తింది. ఆమె మాటల్లో ఆత్రం కనిపించింది.
ఎందుకంటే… చిన్న శారద మధ్యాహ్నం నుంచి పక్కింటి పిల్లలతో కలిసి కాలువ దగ్గర ఆడుకుంటోంది. వాన మొదలైతే అక్కడి దారి మొత్తం బురదగా మారిపోతుంది. సుమతి వేగంగా నడుస్తూ, ఈ పిల్ల కూడా ఎక్కడికి వెళ్తుందో చెప్పదు…” అని తనలో తానే అనుకుంది.
ఇంతలో, మొదటి చినుకు నేలపై పడింది. మట్టి వాసన ఒక్కసారిగా గాలిలో వ్యాపించింది. ఆ వాసనతో పాటు సుమతి గుండెల్లో కంగారు ఇంకా పెరిగింది.
అదే సమయంలో…
కాలువ దగ్గర ఆడుకుంటున్న శారద మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆశ్చర్యంగా గమనిస్తోంది…
అయితే… ఆ రాత్రి పడబోయే ఆ వాన… వాళ్ళ జీవితంలో ఒక కొత్త సంఘటనకు కారణం అవుతుందని అప్పుడెవరికీ తెలియదు…!
తర్వాతి భాగంలో…
ఆ రాత్రి వచ్చిన భారీ వర్షం వల్ల జరిగిన నష్టం ఏమిటి…?
తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే తర్వాతి Episode చూడండి…
Part - 6 👉 Click Here

Comments
Post a Comment