Skip to main content

Episode 2 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story

చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 2 1980ల్లో… ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటనను ఇప్పటికీ అక్కడి పెద్దవాళ్లు పూర్తిగా మర్చిపోలేదు… పౌర్ణమి రాత్రి చెరువు దగ్గరకు వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి ఆ దారి వైపు చూడకుండా వచ్చేవారు…? అసలు… “లక్ష్మి” అనే ఆ అమ్మాయి నిజంగా ఎవరు…? ఆ రాత్రి… రాఘవ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అతని అరచేతుల్లో ఇంకా చెరువు నీటి చల్లదనం మిగిలి ఉన్నట్టే అనిపిస్తోంది. అతని చేతిలో ఉన్న ఆ వెండి గాజు మాత్రం చంద్రకాంతి తగిలినప్పుడల్లా వింతగా మెరుస్తోంది. అది సాధారణ గాజులా కనిపించినా… దానిలో ఏదో చెప్పలేని భయం దాగి ఉన్నట్టుగా ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. బయట అప్పుడప్పుడు వీచే గాలి పాత కిటికీ తలుపులను మెల్లగా కదిలిస్తోంది. దూరంగా ఎక్కడో కుక్కలు మొరుగుతున్న శబ్దం మాత్రమే ఆ నిశ్శబ్ద రాత్రిని చీల్చుతోంది. కానీ రాఘవకు మాత్రం కళ్లకు నిద్ర రాలేదు. అతను మంచం మీద పడుకున్నప్పుడల్లా చెరువు దగ్గర కనిపించిన ఆ అమ్మాయి ముఖమే గుర్తొస్తోంది. ఆమె కళ్ళలో కనిపించిన ఆ విచిత్రమైన బాధ… ఆమె మాటల్లో దాగి ఉన్న ఆ ఒంటరితనం… ఏదో అతని మనసును గట్టిగా పట్టేసినట్టుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఇంకా అత...

School Friends Story in Telugu – Ego to Friendship & Secret Trip Plan part -1

"Royal Heritage School Story – Part 1”

🏫 స్కూల్ పరిచయం
Royal Heritage School

మేత్రినగర్ లో  రాయల్ హెరిటేజ్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉండేది.

ఆ రాయల్ హెరిటేజ్ స్కూల్ టౌన్‌లోనే మంచి ప్రసిద్ధి చెందిన స్కూల్.
అది చాలా అందంగా, పెద్ద బిల్డింగ్స్, గ్రౌండ్, లాబ్స్ అన్నీ ఉండేవి.

అక్కడ చదివే పిల్లలు చాలా ధనవంతుల కుటుంబాల నుండి వచ్చిన వాళ్లు.

“మేమే గొప్ప” అన్నట్టుగా మాట్లాడేవారు.

వేరే పిల్లలను చిన్నచూపు చూసేవారు

పేద పిల్లలను ఎగతాళి చేసేవారు 😒

తమ డబ్బు, స్టేటస్ గురించి గొప్పగా చెప్పుకునేవారు
అహంకారం కొంచం ఎక్కువ.

కానీ అందరూ అలాంటివాళ్లు కాదు… 
అక్కడ మంచి వాళ్ళు కూడా ఉండేవారు.


👥 ఫ్రెండ్స్ గ్రూప్
రాయల్ హెరిటేజ్ స్కూల్ లో 8వ తరగతి A సెక్షన్ లో ...

అఖిల్, వినయ్, సాయి, కిరణ్, రోహిత్ అని ఒక friends group ఉండేది.

ఆ group లో కిరణ్ చాలా మంచివాడు, తెలివైనవాడు, బుద్దిమంతుడు, class కు first కూడా.

ఈ అఖిల్, వినయ్, సాయి ఇంకా రోహిత్ చదవడం రాయడం, బుద్ది తెలివి అన్నింట్లోను కిరణ్ కంటే తక్కువే.

డబ్బులున్నాయన్న అహంకారం మాత్రం ఉండేది.
కానీ కిరణ్ పేదవాడైనా చదువు, బుద్ది ఎక్కువ ఉండడంతో కిరణ్ ను ఫ్రెండ్స్ గా చూసేవారు.

ఒకరోజు… 
రాయల్ హెరిటేజ్ స్కూల్ లో ఒక పెద్ద ఈవెంట్‌ జరుగింది.

ఆ రోజంతా పిల్లలు సంతోషంతో చాలా enjoy చేశారు.

మరుసటి రోజు…
స్కూల్‌లో వాతావరణం కాస్త భిన్నంగా అనిపించింది.

నిన్నటి ఈవెంట్‌ హంగామా తగ్గిపోయినా, పిల్లల మధ్య ఇంకా ఆ ఉత్సాహం కనిపిస్తూనే ఉంది.

కానీ 8వ తరగతి A సెక్షన్‌లో మాత్రం ఒక చిన్న మార్పు మొదలైంది…

అఖిల్, వినయ్, సాయి, రోహిత్ — ఈ నలుగురు కిరణ్‌తో కొంచం వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.


😒 అహంకారం
“అయ్యా కిరణ్… నిన్న event లో మా family ఎంత donate చేసిందో తెలుసా?” అని అఖిల్ అన్నాడు.

వినయ్ వెంటనే, “అవును రా… మా dad లేకపోతే ఈ event అంత grand గా జరగేది కాదు” అని జోడించాడు.
సాయి...

“మీ ఇంట్లో ఎందుకు ఎవరూ రాలేదు? డబ్బులు లేవనా” అని ఎగతాళి చేశాడు.

ఆ మాటలు కిరణ్ గుండెల్లో గుచ్చుకున్నాయి… కానీ బయటకు ఏమీ చెప్పలేదు.

నిశ్శబ్దంగా తన bench దగ్గర కూర్చున్నాడు.

రోహిత్ మాత్రం కొంచం సైలెంట్‌గా ఉన్నాడు… 
అతనికి ఆ మాటలు అంతగా నచ్చలేదు.


📚 Quiz Competition
ఆ రోజే…
class teacher ఒక announcement ఇచ్చింది:
“Students… 
వచ్చే వారం inter-school quiz competition ఉంది. 
మన school నుండి 4 members select చేస్తాం.”

అందరి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి.

Teacher పేర్లు చెప్పడం మొదలుపెట్టింది:

“First — కిరణ్…
Second — రోహిత్…
Third — అఖిల్…
Fourth — వినయ్…”

సాయి పేరు లేకపోవడంతో అతను కాస్త అసహనం గా ఫీల్ అయ్యాడు.

Practice మొదలైంది…
Quiz కి prepare అవుతుండగా…

కిరణ్ అందరికీ topics explain చేస్తూ, doubts clear చేస్తూ help చేయడం మొదలుపెట్టాడు.

అఖిల్, వినయ్ మొదట పెద్దగా పట్టించుకోలేదు…

ఒక రోజు practice test పెట్టారు…

అక్కడ నిజం బయటపడింది
కిరణ్ — పూర్తి మార్కులు 
రోహిత్ — మంచి score
అఖిల్, వినయ్ — చాలా తక్కువ

Teacher కాస్త serious అయ్యింది:
“మీరు ఇలా ఉంటే competition లో school పేరు పోతుంది…” అని అన్నారు.

అఖిల్ ఇంకా వినయ్ కు practice చేసేటప్పుడు కిరణ్ help చేశాడు.

అఖిల్ నెమ్మదిగా కిరణ్ దగ్గరకు వచ్చి,
“సారీ రా… ఆ రోజు మేము నిన్ను తక్కువగా చూసాం… కానీ నువ్వు మాకు help చేస్తున్నావ్…” అన్నాడు.

వినయ్ కూడా,
“మాకు నిజంగా help చేస్తావా?” అని అడిగాడు.

కిరణ్ చిన్నగా నవ్వి,
“ఫ్రెండ్స్ కదా… help చేయడం నా duty 😊” అన్నాడు.

రోహిత్ సంతోషంగా చూసాడు…
అందరూ కలసి కట్టుగా చదువుకోవడం ప్రారంభించారు...

Quiz practice అయిపోయిన తర్వాత కూడా వాళ్లు వెంటనే ఇంటికి వెళ్లేవాళ్లు కాదు…

ఒకరోజు కిరణ్ :
“చదువు చాలు రా... కొంచం refresh అవుదాం” అని చెప్పాడు. అంతే…
అందరూ ground కి వెళ్లి cricket ఆడడం మొదలుపెట్టారు.

అఖిల్ batting చేస్తుంటే,

వినయ్ fielding చేస్తూ comedy చేస్తూ అందరినీ నవ్వించాడు 😂

రోహిత్ మాత్రం umpire లా acting చేసి,
“Out రా… clearly out!” అని drama చేశాడు 😆

కిరణ్ కూడా నవ్వుతూ,
“ఇది quiz practice కంటే difficult రా!” అన్నాడు.


🍱 Lunch Time బాండింగ్
Lunch Time బాండింగ్

మరొక రోజు lunch time లో…

కిరణ్ తన simple lunch box తెరిచాడు.

అఖిల్, వినయ్, సాయి వాళ్ళ దగ్గర fancy food ఉంది.

అఖిల్:
“రా కిరణ్… మనం అందరం share చేసుకుందాం” అన్నాడు.

వినయ్ కూడా,
“నీ lunch కూడా taste చూద్దాం రా” అన్నాడు.

అందరూ కలసి తింటూ…
జోక్స్ చెబుతూ… ఒక family లా feel అయ్యారు.

ఆ రోజు సాయి lunch తేలేదు..

ఒక మూలలో ఒక్కడే కూర్చుని ఉన్నాడు. 
అప్పుడు కిరణ్..
సాయి నువ్వు కూడా రా ఇద్దరం ఒకే బాక్స్ లో తిందాం అన్నాడు.

నేను నీతో చాలా తప్పుగా మాట్లాడాను… కానీ నువ్వు అవేమీ పట్టించుకోలేదు… సారీ రా”

కిరణ్:
 "పరవాలేదు రారా" అంటూ ఇద్దరూ ఒకే బాక్స్ లో భోజనం చేశారు.

సాయి ఆ రోజు నుంచి attitude పూర్తిగా తగ్గించాడు…
అలా వాళ్లంతా కలిసికట్టుగా చదువుకొని...


 🏆 విజయం
విజయం

Competition రోజు…

     రాయల్ హెరిటేజ్ స్కూల్ నుండి వెళ్లిన కిరణ్, రోహిత్, అఖిల్, వినయ్ — నలుగురి ముఖాల్లో ఉత్సాహం కనిపిస్తున్నా… 

లోపల మాత్రం కొంచెం టెన్షన్ కూడా ఉంది.

      వేదిక పెద్దగా అలంకరించబడింది. వేరే వేరే స్కూల్స్ నుండి వచ్చిన విద్యార్థులు అందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు.

Quiz మొదలైంది…

మొదటి రౌండ్ — General కనౌలెడ్జి

కిరణ్ confident గా buzzer నొక్కి సరైన answer చెప్పాడు.

“Correct!” అని announce చేయగానే… వాళ్ల స్కూల్ టీమ్ కి మొదటి points వచ్చాయి.

రెండో రౌండ్ — Science
ఈసారి రోహిత్ ముందుకు వచ్చి answer చెప్పాడు.
Audience నుంచి చిన్నగా claps వినిపించాయి.

అఖిల్, వినయ్ ఒకరికొకరు చూసుకుని కొంచం nervous గా feel అయ్యారు…

కానీ కిరణ్ వైపు చూసి confidence తెచ్చుకున్నారు.

మూడో రౌండ్ — Rapid Fire

Host:
“Ready?”

వాళ్లు ఒకేసారి:
“Yes!”

ప్రశ్నలు వరుసగా వస్తున్నాయి…

అఖిల్ — ఒకటి correct
వినయ్ — ఇంకొకటి correct

Time almost అయిపోతున్నప్పుడు…
Last question వచ్చింది…

అందరూ ఒక్కసారిగా silent అయ్యారు…

ఆ question కాస్త tough గా ఉంది…

అఖిల్, వినయ్ hesitate అయ్యారు…
రోహిత్ కూడా unsure గా చూసాడు…

కానీ కిరణ్ ముందుకు వచ్చి buzzer నొక్కాడు.

ఒక్క క్షణం… అందరి గుండెలు బలంగా కొట్టుకున్నాయి…

“Answer is… ______”

అతను చెప్పగానే…

“Correct answer!” అని announce అయ్యింది.

ఆ క్షణంలో audience అంతా clap చేశారు 👏👏👏

Final scores announce చేశారు…

“First Place goes to… Royal Heritage School!”

అందరూ ఒకేసారి లేచి ఆనందంతో కేకలు వేశారు 

అఖిల్, వినయ్ వెంటనే కిరణ్ ని hug చేశారు.

“Thanks రా… నువ్వు లేకపోతే ఇది possible కాదు” అని అఖిల్ అన్నాడు.

వినయ్ కళ్ళల్లో ఆనందం:
“నువ్వే మా hero రా…” అన్నాడు.

రోహిత్ నవ్వుతూ:
“Teamwork రా… మనందరం కలిసి గెలిచాం” అన్నాడు.

Stage మీదకు వెళ్లి trophy తీసుకుంటూ…

కిరణ్ కళ్ళల్లో ఆనందం మెరిసింది…
అతని గుండెల్లో ఒక్కటే అనిపించింది—

“ఇదే నిజమైన friendship…”

ఆ రోజు వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న దూరాలు అన్నీ పూర్తిగా మాయమయ్యాయి…
వాళ్లు ఇప్పుడు నిజమైన friends అయ్యారు

ఆ రోజు తర్వాత వాళ్లు ప్రతి రోజు కలిసే ఉండేవారు… 
అదే friendship వాళ్లను కొత్త adventure వైపు తీసుకెళ్లింది.

ఒక రోజు school తర్వాత ground లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా… 

వాళ్లకు అనుకోకుండా crazy idea వచ్చింది.😏


😏 Trip Plan
అఖిల్ ఒక్కసారిగా అన్నాడు:
మనం ఇలా చదువు, school మాత్రమే కాదు… 
ఒక trip కి వెళ్దామా?”

వినయ్ వెంటనే:
“Trip ఆ? ఎక్కడికి రా?”

సాయి excitement తో:
“Hill station కి వెళ్దాం రా… cool గా ఉంటుంది".

రోహిత్ కాస్త doubt గా:
“అయ్యా… ఇంట్లో allow చేస్తారా?” అన్నాడు.

అందరూ ఒక్కసారిగా silent అయ్యారు

కిరణ్ ఆలోచిస్తూ:
“Allow చేయరు… especially ఇలా మనం alone వెళ్తే” అన్నాడు.

అఖిల్
“అయితే… secretly plan చేద్దాం 😏”

హూం......

అందరూ phone తీసుకుని search చేయడం మొదలుపెట్టారు.
  • “Best hill stations near us”
  • “Low budget trips”
  • “Safe places for students”
కొన్ని places వచ్చాయి:

Ooty (ఉటీ)
వినయ్: “ఇది చాలా famous ra… climate super అంటారు”

సాయి: “Photos చూస్తేనే వెళ్లాలనిపిస్తుంది”

కిరణ్: “కానీ ఖర్చు ఎక్కువ అయ్యే chance ఉంది…”

Coorg (కూర్గ్)

రోహిత్: “ఇది peaceful place ra… crowd తక్కువ ఉంటుంది”

అఖిల్: “Nature full enjoy చేయొచ్చు”

Chikmagalur (చిక్‌మగళూరు)

కిరణ్ కళ్ళు మెరిశాయి
“ఇది perfect ra… budget లో కూడా manage అవుతుంది”

అందరూ:
“Done! ఇదే final”

అఖిల్:
“Money ఎలా arrange చేద్దాం?”

కిరణ్ smart గా plan చెప్పాడు:
  • Pocket money save చేయడం
  • unnecessary ఖర్చులు తగ్గించడం
  • చిన్నగా parents కి “school expenses” అని చెప్పి కొంత money తీసుకోవడం
వినయ్: “Transport?”

రోహిత్: “Bus లో వెళ్దాం… cheap & easy”

Plan Final
Sunday early morning బయలుదేరడం
Same day night తిరిగి రావడం
ఎవరికీ తెలియకుండా plan 😬

సాయి tension తో: “ఇది risky ra…”

అఖిల్ నవ్వుతూ:
“No risk no fun”

కిరణ్ మాత్రం కాస్త serious గా:
“Guys… fun ok… కానీ safe ఉండాలి… 
careful ga plan చేద్దాం” అని అన్నాడు.

🤫 Secret Pact 
అందరూ చేతులు కలిపి ఒక మాట చెప్పారు...

“ఈ trip గురించి ఎవరికీ చెప్పం”

వాళ్ల ముఖాల్లో excitement ఉంది...
కానీ లోపల ఒక తెలియని భయం కూడా ఉంది...

ఎందుకంటే...
ఆ trip వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది...

  • ఒక day trip ఎన్ని రోజులకు ముగుస్తుంది
  • ఒక అపద్దం వల్ల జరిగే నష్టాలు 

చూడండి part-2లో 
Follow చేయండి.

Part 2 త్వరలో వస్తుంది...

Part click here 👇


Comments

Popular posts from this blog

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

“ఆమె చనిపోయింది… కానీ మెసేజ్ ఇంకా వస్తోంది! 📱👻” part-1

మూసిన గది రహస్యం అద్దంలో కనిపించింది… కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు… ఎవరూ లేరు… అదే ఆమె చేసిన పెద్ద తప్పు… ఆ రాత్రి… ఆమె బ్రతికే బయటపడలేదు 😱      వర్షం గట్టిగా కురుస్తోంది… అది సాధారణ వర్షం కాదు…   ఆకాశమే పగిలిపోయినట్టుగా కుండపోతగా కురుస్తోంది. గాలి ఒక్కోసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా హోరెత్తుతోంది. చెట్లు వంగి మళ్లీ నిలబడుతున్నాయి. ఆకాశంలో మెరుపులు ఒక్కసారిగా మెరుస్తూ… చీకటిని క్షణం పాటు చీల్చేస్తున్నాయి.  ఆ వెంటనే వినిపిస్తున్న గర్జన గుండెల్లోకి దూసుకెళ్లేంత భయంకరంగా ఉంది. గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్ మొత్తం ఆ రాత్రి ఒక భూతబంగ్లా లా కనిపిస్తోంది. సాధారణంగా వెలుగులతో మెరిసే ఆ భవనం… ఇప్పుడు పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. కరెంట్ ఒక్కసారిగా పోయింది. ఎక్కడో ఎలక్ట్రిక్ వైర్లు చప్పుళ్లు చేస్తూ…  “టక్…టక్…” అంటూ వినిపిస్తున్నాయి. లిఫ్ట్ పనిచేయడం ఆగిపోయింది. కారిడార్లలో ఎమర్జెన్సీ లైట్లు కూడా వెలగడం లేదు. అప్పుడప్పుడు మెరుపు వెలుగు పడినప్పుడు మాత్రమే…  ఆ భవనం గోడలు, కిటికీలు, బాల్కనీలు ఒక్క క్షణం కనిపించి…   వెంటనే మళ్లీ చీకటిలో కలిసిప...