Skip to main content

Royal Heritage School Story – Part 2” 🤫 Secret Plan – ఇంట్లో ఎలా చెప్పాలి?

👇 ఇవి మీరు “గత భాగంలో జరిగిన కథ…”👇

స్కూల్ పరిచయం:
మేత్రినగర్ లో ఉన్న Royal Heritage School మంచి పేరున్న, క్రమశిక్షణతో నడిచే స్కూల్.

👬 ఫ్రెండ్స్ గ్రూప్:
అఖిల్, వినయ్, సాయి, రోహిత్, కిరణ్ ఐదుగురు చాలా close friends గా ఎప్పుడూ కలిసే ఉండేవారు.

😄 పిల్లల ప్రవర్తన:
వాళ్లు చదువులో బాగుండటంతో పాటు, ఆటల్లో, సరదాలో కూడా active గా ఉండేవారు.

Quiz Competition:
స్కూల్ తరఫున పాల్గొన్న Quiz Competition లో వాళ్లు first prize గెలుచుకున్నారు.

🍱 Lunch Time Bonding:
Lunch time లో వాళ్లు కలిసి తింటూ, నవ్వుకుంటూ తమ friendship ని మరింత బలంగా చేసుకున్నారు.

🤫 Secret Plan:
వాళ్లు ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పకుండా ఒక secret trip Chikmagalur (చిక్‌మగళూరు)కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.

“ఒక చిన్న అబద్ధంతో మొదలైన ఈ ప్రయాణం… వాళ్ల జీవితాన్ని ఎలా మార్చబోతోంది…”

తర్వాత

Royal Heritage School Story – Part 2”
🤫 Secret Plan – ఇంట్లో ఎలా చెప్పాలి?

ఆ రోజు సాయంత్రం…
స్కూల్ బెల్ మోగింది. పిల్లలంతా ఇంటికి వెళ్లాలని ఆతురంగా ఉన్నారు.”

కానీ అఖిల్, వినయ్, సాయి, రోహిత్, కిరణ్ ఈ ఐదుగురు మాత్రం...

తొందర తొందరగా బ్యాగ్ సద్దుకొని School ground లో ఉన్న ఒక circle దగ్గర వచ్చి కూర్చున్నారు.

అఖిల్, వినయ్, సాయి, రోహిత్, కిరణ్

సూర్యుడు అస్తమించిపోతూ…
ఆకాశం orange రంగులో మెరిసిపోతోంది.

ముందు రోజు చేసిన secret trip plan గురించి serious గా discussion చేయడం మొదలుపెట్టారు…

మొదటి సమస్య

రోహిత్ నెమ్మదిగా అన్నాడు:

“మనం చేసిన ఈ Chikmagalur (చిక్‌మగళూరు) trip 

 plan ok…రా కానీ ఇంట్లో ఏమని చెబుదాం?”

అందరూ ఒక్కసారిగా silent అయ్యారు…

సాయి:
“అసలు ఇది risky ra… parents కి తెలిసిపోతే…”

అఖిల్ వెంటనే:
“అయ్యా… tension పడకు! ఒక solid plan వేయాలి అంతే 😏”

అందరూ కిరణ్ వైపు చూశారు…

కిరణ్ ప్లాన్
కిరణ్ calm గా మాట్లాడడం మొదలుపెట్టాడు:
“మనమందరం ఒక్కో reason చెప్తే doubt వస్తుంది…

అందరూ same story చెప్పాలి!”

వినయ్:
“అంటే?”

కిరణ్:
“Special class… లేదా school project work అని చెప్పొచ్చు.”

రోహిత్:
“అది believable ga ఉంటుంది ra…”

సాయి:
“కానీ full day బయటే ఉంటాం… doubt రాదా?”

కిరణ్:
“అందుకే timing perfect ga match చేయాలి.”

అఖిల్ excited గా:
“Ok! final ga decide చేద్దాం… ఎవరు ఏం చెప్తారు?”

అందరూ ఒక్కొక్కరుగా ideas చెప్పడం మొదలుపెట్టారు

అఖిల్:
“నేను ఇలా చెప్తా…

‘Dad… Sunday school లో special coaching ఉంది.
Inter-school competition next round కోసం prepare అవ్వాలి’”

వినయ్ నవ్వుతూ:
“నీ dad doubt అడిగితే?”

అఖిల్:
“Simple ra… ‘Teacher call చేసింది’ అంటా 😎”

వినయ్:
“నేను tuition అని చెప్తా…

‘Extra classes ఉన్నాయి… full day practice’ అని.”

రోహిత్:
“నీ mom phone చేస్తే?”

వినయ్ కాస్త tension గా:
“Phone silent లో పెడతా 😅”

అందరూ నవ్వేశారు 😂

సాయి:
కాస్త serious గా:
“నేను project work అంటా…

‘Friends house లో group study’ అని చెప్తా.”

అఖిల్ teasing గా:
“ఏ friend house?” అన్నాడు.

సాయి:
“అయ్యో… అదే problem 😬”

కిరణ్:
“నా ఇంటి పేరు చెప్పు… simple!”

సాయి:
“Thank you ra…” 😊

రోహిత్:
“నేను నిజం దగ్గరగా చెప్తా…

‘School work ఉంది… బయటకు వెళ్తాం’ అని.”

అఖిల్:
“అది risky ra…”

రోహిత్:
“కానీ నా parents strict… ఎక్కువ lie చెప్పలేను.”

కిరణ్ అంగీకరిస్తూ:
“సరే… careful ga manage చేయ్.”

👦 ఇప్పుడు కిరణ్ ప్లాన్

అందరూ కిరణ్ వైపు చూశారు…
“నీ plan ఏంటి?”

కిరణ్ చిన్నగా నవ్వి:
“నేను simple ga చెప్తా…
‘Library కి వెళ్తున్నా… చదవాలి’ అని.”

వినయ్:
“నీ parents doubt అడగరా?”

కిరణ్:
“నామీద నమ్మకం ఉంది రా వాళ్లకి…”

అందరూ ఒకరినొకరు చూసుకున్నారు”
“ఒక క్షణం నిశ్శబ్దం నెలకొంది”

🤝 Final Pact
అఖిల్ చేతిని ముందుకు చాపాడు:
“ఏమైనా… మన plan బయటికి రావద్దు!”
అందరూ చేతులు కలిపారు.

⚠️ చిన్న భయం…

అందరూ నవ్వుతూ మాట్లాడుతున్నా…
లోపల మాత్రం ఒక చిన్న భయం ఉంది…

రోహిత్ నెమ్మదిగా అన్నాడు:
“ ఏదైనా wrong అయితే రా...?”

కిరణ్ కాసేపు ఆలోచించి:
“మనము careful గా ఉంటే… nothing happens.”

సాయి మాత్రం ఇంకా uneasy గా:
“నాకు ఏదో feel వస్తోంది రా…”

అఖిల్:
“Relax! ఇది life లో best trip అవుతుంది 😎”

🌄 Journey Start Hint

ఇలా ఆ రోజు వాళ్లు plan finalize చేసి…

time, bus, money అన్నీ fix చేసుకున్నారు.

తర్వాత ఇంటికి వెళ్లారు.

Sunday Early Morning – Secret Journey Begins

Sunday early morning…

అప్పుడే ఉదయం 4:30 అయ్యింది…
బయట ఇంకా చీకటి పూర్తిగా తగ్గలేదు…
ఆకాశంలో కొద్దిగా తెల్లని వెలుగు కనిపిస్తోంది.
గాలి చల్లగా వీచుతోంది…
అంతా నిశ్శబ్దం…

కానీ…
ఐదు ఇళ్లలో మాత్రం నిద్ర లేకుండా ఒక excitement… ఒక భయం… కలిసిపోయి ఉంది…

👦 కిరణ్ ఇంట్లో
కిరణ్ మెల్లగా లేచాడు…
అతని కళ్లలో నిద్ర కన్నా ఆలోచనలు ఎక్కువ…
“ఇది correct ఆ …?” ఒక క్షణం doubt వచ్చింది…
అతను తన చిన్న బ్యాగ్ తీసుకుని, అందులో ఒక water bottle, snacks, notebook పెట్టుకున్నాడు

అమ్మ నిద్రలో ఉంది…

ఒక్కసారి ఆమె వైపు చూసి…
చిన్నగా మనసులో అన్నాడు:
“సారీ అమ్మ… తిరిగి వచ్చాక చెప్పేస్తా…”

అతను నిశ్శబ్దంగా బయటకు వచ్చాడు…

👦 అఖిల్ ఇంట్లో
అఖిల్ మాత్రం full excitement 😎
Alarm మోగకముందే లేచిపోయాడు…
“Trip day ra… finally!” అని mirror లో చూసుకుని smile చేశాడు.
Quick ga ready అయి…
కొంచం money తీసుకుని pocket లో పెట్టుకున్నాడు.
Door దగ్గరకి వచ్చేసరికి…
అతని dad గదిలో నుంచి చిన్నగా దగ్గు శబ్దం వచ్చింది…

అఖిల్ ఒక్కసారిగా freeze అయ్యాడు 😳
2 seconds silence…

“పర్లేదు…” అని slowly door తెరిచి బయటకు జారుకున్నాడు…

👦 వినయ్ ఇంట్లో
వినయ్ alarm 3 సార్లు snooze చేశాడు 😴
చివరికి late అవుతానని లేచాడు…

“అయ్యో… already 5 అయ్యిందా!” అని panic అయ్యాడు.
Quick ga bag వేసుకుని…
Phone silent లో పెట్టి…
“Call చేస్తే problem అవుతుంది…” అనుకొని

Window ద్వారా బయటకు చూస్తూ:
“ఇది adventure ra…” అని చిన్నగా నవ్వాడు 😅

👦 సాయి ఇంట్లో
సాయి మాత్రం చాలా tension లో ఉన్నాడు…
బ్యాగ్ తీసుకున్నాడు… కానీ చేతులు కొంచం వణుకుతున్నాయి…
“నిజంగా వెళ్లాలా…?” అని doubt…
అమ్మ దగ్గరకు వెళ్లి చూసాడు…

సాయి

ఆమె సైలెంట్ గా నిద్రపోతుంది…
సాయి కళ్లలో కొంచం guilt 😔

“ఒక్కరోజే కదా…” అని తనను తానే convince చేసుకున్నాడు…
చివరికి slowly బయటకు వచ్చాడు…

👦 రోహిత్ ఇంట్లో
రోహిత్ ready అయ్యి… door దగ్గర ఆగిపోయాడు…

తన dad మాటలు గుర్తొచ్చాయి:
“ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లాలి…”
అతను కాసేపు ఆలోచించాడు…
“ఇది wrong ra…” అనిపించింది…

కానీ…
friends గుర్తొచ్చారు…
“వాళ్లు wait చేస్తుంటారు…” అని deep breath తీసుకుని బయటకు వచ్చాడు…

🚏 Meeting Point

5:30 AM…
Town outskirts లో ఒక చిన్న bus stop దగ్గర…

మొదట కిరణ్ వచ్చాడు…
కొద్దిసేపటికి అఖిల్, వినయ్ వచ్చారు…
“రేయ్ finally!” అని high-five ఇచ్చుకున్నారు ✋
కొద్దిసేపటికి రోహిత్, సాయి కూడా వచ్చారు…
అందరూ ఒకరికొకరు చూసుకుని…
ఒకే expression:

😄 excitement + 😰 tension

🤝 Last Check
అఖిల్:
“Tickets ok… money ok… all set!”

వినయ్:
“Phones silent లో పెట్టండి ra…”

సాయి:
“ఎవరికీ call రావొద్దు…”

రోహిత్:
“ఏదైనా problem అయితే… వెంటనే back వస్తాం.”

అందరూ కిరణ్ వైపు చూశారు…

కిరణ్ calm గా:
“Guys… enjoy చేద్దాం… కానీ careful గా ఉండాలి.”

🚌 Bus Arrival

అప్పుడే…
దూరంగా ఒక bus light కనిపించింది… 🔦

“అదే మన bus!” అని అఖిల్ excited గా అన్నాడు.

Bus దగ్గరకు రాగానే…

engine sound…
headlights…

అది వాళ్ల journey start కి signal లా అనిపించింది…

😨 Final Moment

Bus ఎక్కే ముందు…
అందరూ ఒకసారి వెనక్కి చూసారు…

తమ ఇళ్లు…
తమ parents…
తమ normal life…
అన్ని ఒక క్షణం గుర్తుకు తెచ్చుకున్నారు…

అఖిల్ నవ్వుతూ:
“Come on guys… adventure starts now!”

అఖిల్, వినయ్, సాయి, రోహిత్, కిరణ్

అందరూ bus లోకి ఎక్కారు…
Bus slowly move అయ్యింది…

⚠️ Suspense Hint
వాళ్లకు తెలియదు…
ఆ early morning excitement…

కొద్ది గంటల్లోనే
ఒక పెద్ద సమస్యగా మారబోతుందని…

Sunday early morning…
అందరూ secretly బయలుదేరబోతున్నారు…

కానీ వాళ్లకు తెలియదు…
ఆ చిన్న అబద్ధం వాళ్ల జీవితంలో ఎంత పెద్ద మలుపు తిప్పబోతుందని…

😨 Suspense
“ఒక చిన్న అబద్ధం…
ఒక చిన్న trip…

కానీ…
అది వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని వాళ్లకు అప్పటివరకు తెలియదు…”

👉 అది safe ga పూర్తవుతుందా?
👉 లేక unexpected problem వస్తుందా?

చిన్న అబద్ధం అనిపించినా… అది పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. ఆ రోజు వాళ్లు నేర్చుకున్న ఒక నిజం — తల్లిదండ్రుల నమ్మకం కంటే పెద్దది ఈ లోకంలో ఏదీ లేదు…”

Comments

Popular posts from this blog

“రహస్య గది – Part 2 పెద్దింటి రహస్యం – Part 2 “Telugu Horror Story”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడుస్తూ… పెద్దలు అసహాయంగా చూస్తూ… కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి. ఒకసారి భారీ కరువు వచ్చింది… పొలాల్లో పంట...

నువ్వు సేఫ్‌గా ఉన్నావా? హారిక కథ Part-2 "నీడ వెనుక నిజం”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్ల. 8:59 PM… ఇప్పుడు గుండె శబ్దమే ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. “ఈసారి వస్తే… నేను రిప్లై ఇస్తాను…” అని ఆమె తనలో తాను నిర్ణయించుకుంది. ఆమె...

90s లోని ఆడిన ఆటలు part-3

90s లో పిల్లలు బయట ఆడిన ఆటలు చాలా simple అయినా super fun ఉండేవి 😄  ఇప్పుడు mobile games ఎక్కువ అయినా, ఆ కాలం games లో ఉన్న excitement వేరు! ఇక్కడ కొన్ని best indoor & outdoor games వివరంగా తెలుసుకుందాం 👇 21.  దొంగ – పోలీస్ ఆట (Thief & Police Game Rules in Telugu)           దొంగ–పోలీస్ (Chor Police) అనేది చాలా ఫన్‌గా ఉండే పిల్లల ఆట. ఈ ఆటలో పరుగులు, తెలివి, ప్లానింగ్—all కలిసి ఉంటాయి 😄 ఎంతమంది ఆడాలి? కనీసం 4–5 మంది ఎక్కువమంది ఉంటే ఇంకా ఫన్ 👍 ఆట యొక్క ఉద్దేశ్యం పోలీస్ → దొంగలను పట్టుకోవాలి దొంగలు → పోలీస్‌కి చిక్కకుండా తప్పించుకోవాలి ఆట మొదలుపెట్టే విధానం అందరూ కలిసి ఒక చోట నిలబడాలి “ఒంటి కాలి, రెంటి కాలి…” లాంటి పద్ధతితో ఎవరు పోలీస్ అవుతారో నిర్ణయించాలి మిగతా వాళ్ళంతా దొంగలు ఆట ఎలా ఆడాలి? 🔹 Step-by-step : 1. స్టార్ట్ “పోలీస్ కళ్ళు మూసుకుని 1 నుంచి 20 వరకు లెక్కపెడతాడు” ఆ సమయంలో దొంగలు దాక్కుంటారు 🏃‍♂️ 2. వెతకడం కౌంట్ పూర్తయ్యాక పోలీస్ వెతకడం మొదలుపెడతాడు 3. పట్టుకోవడం పోలీస్ దొంగను తాకితే →...

“రహస్య గది – Part 1 (తెలుగు Horror Story)”

“పెద్దింటి రహస్యం – భయంకర కథ”   ఒక గ్రామంలో పెద్ద ఇల్లు. ఆ ఇల్లు చాలా పెద్ద సంసారం ఉన్న ఇల్లు.       గ్రామంలో అందరూ ఆ ఇంట్లో వాళ్ళను పెద్దింటి వాళ్ళు అనేవారు. ఆ పెద్దింట్లో ఒక అబ్బాయికి పెళ్లి నిశ్చయం అయ్యింది.      ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా పెళ్లి ఏర్పాట్లు జరిగుతున్నాయి.       ఇంటి ముందు మామిడి ఆకుల తోరణాలు, గాలి తాకిడికి ఊగుతూ… రంగురంగుల లైట్లు రాత్రి ఆకాశాన్ని కూడా వెలిగిస్తున్నాయి.       గ్రామం మొత్తం ఆహ్వానం పొందింది. ఎవరైనా వచ్చి తినొచ్చు… చూడొచ్చు… ఆశీర్వదించొచ్చు. పెళ్లి రోజు ఉదయం… నాదస్వరాలు మోగుతుండగా, డప్పులు, తాళాలు గ్రామం అంతా వినిపిస్తున్నాయి.  పెళ్లి కొడుకు రాజశేఖర్…        తెల్ల పంచె కట్టుకొని, తిలకం పెట్టుకొని, అద్భుతంగా కనిపిస్తున్నాడు.   పెళ్లికూతురు నాదియా…        పసుపు పచ్చ, ఎర్రటి అంచు పట్టు చీర ఇంకా బంగారు ఆభరణాలు         ఆమె ముఖంలో చిన్న నవ్వు పెద్ద సంతోషం. పెళ్లి సందడులు చాలా సరదాగా నడుస్తూ ఉండేది.  ఇలా ఉండగా, ...

90s లోని ఆడిన ఆటలు part-2

90s లో పిల్లలు బయట ఆడిన ఆటలు చాలా simple అయినా super fun ఉండేవి 😄  ఇప్పుడు mobile games ఎక్కువ అయినా, ఆ కాలం games లో ఉన్న excitement వేరు! ఇక్కడ కొన్ని best indoor & outdoor games వివరంగా తెలుసుకుందాం 👇 11. Tiger & Goat (పులి–మేక ఆట)        పులి–మేక ఆట (Tiger & Goat game) ఒక పురాతన భారతీయ స్ట్రాటజీ గేమ్. దీన్ని కొన్ని ప్రాంతాల్లో “Bagh-Chal” అని కూడా అంటారు. ఇది 2 మంది ఆడే ఆట — ఒకరు పులి (Tiger), మరొకరు మేకలు (Goats) పాత్రలు తీసుకుంటారు. ఆట లక్ష్యం (Goal) 🐯 పులి (Tiger) → ఎక్కువ మేకలను పట్టుకోవాలి (తినాలి) 🐐 మేకలు (Goats) → పులిని కదలకుండా బ్లాక్ చేయాలి ఆటకు కావలసినవి ఒక ప్రత్యేకమైన బోర్డు (Board) (లైన్లు, పాయింట్లు ఉంటాయి) 4 పులులు (Tigers) 20 మేకలు (Goats) ఆట ప్రారంభం ఎలా? బోర్డు మీద ముందే ఉన్న 4 మూలలలో లేదా నిర్ణయించిన స్థానాల్లో పులులు పెట్టాలి మేకలు మొదట బోర్డులో ఉండవు మేకల ఆటగాడు ఒక్కోసారి ఒక్క మేకను బోర్డులో ఖాళీ స్థలంలో పెట్టాలి. 🐐 మేకల ఆటగాడు (Goat Player ) ఒక్కో...