Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

మూసిన గది రహస్యం Part 2 – అద్దంలో కనిపించిన ప్రతీకారం

మూసిన గది రహస్యం – Part 2: అద్దంలో ప్రతీకారం”


కథ ప్రారంభం
నిన్న రాత్రి జరిగిన ఘటన తర్వాత… గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో భయం స్థిరపడిపోయింది గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. పోలీసులు, ఇంకా అపార్ట్మెంట్ జనం అంతా అన్విత ఇంటిని చుట్టుముట్టారు. నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి అందరూ ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు… హార్ట్ అటాక్ అయ్యిందట… లేదు… ఏదో భయంతో చనిపోయిందట… ఆ గదిలో ఏదో ఉంది…

అయితే… ఎవరికి అసలు నిజం తెలియదు. అద్వైత్ మాత్రం నిశ్శబ్దంగా తన బాల్కనీలో నిలబడి అంతా చూస్తున్నాడు… ఆ రాత్రి జరిగిన ప్రతి క్షణం అతని మెదడులో తిరుగుతోంది… ఆమె భయం… అద్దం పగలడం… అంతా చాలా అసహజంగా ఉంది. ఇది సాధారణం కాదు… అని అతను తనలోనే అనుకున్నాడు.

ఆ రోజు సాయంత్రం… పోలీసులు మళ్లీ అన్విత ఫ్లాట్‌లోకి వెళ్లారు. ఇన్స్పెక్టర్ రాఘవ్… అతని చూపు గదిలో ప్రతి మూలను పరిశీలిస్తోంది. ఏ గాయం లేదు… కానీ చనిపోయింది…” అని అతను అనుమానంగా అన్నాడు. 

అప్పుడే… ఒక కానిస్టేబుల్ గట్టిగా పిలిచాడు. సర్… ఇక్కడ ఒక డైరీ ఉంది!. అద్వైత్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది.

డైరీ…? ఇన్స్పెక్టర్ ఆ డైరీ తీసుకుని తెరిచాడు…

  • ఇది చదివిన తర్వాత… రాఘవ్ ముఖం మారిపోయింది…”
  • ఈ డైరీ… సాధారణం కాదు…

  • అన్విత గతం అందులో

     నా పేరు అన్విత… నా చిన్నప్పుడే నా జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది. అమ్మ, నాన్న ఇద్దరూ ఒక ప్రమాదంలో నన్ను వదిలి వెళ్లిపోయారు… ఆ రోజు నుంచి నా ప్రపంచం ఖాళీ అయిపోయింది. అప్పుడు, నన్ను తన ఒడిలోకి తీసుకుంది నా నాన్నమ్మ.

    కాలం గడిచింది… నేను చదువులో ముందుకు వెళ్లాను. అందుకు పై చదువుల కోసం నేను టౌన్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మొదటిసారి… నా ఊరిని, నా నాన్నమ్మని వదిలి వెళ్లే రోజు… నా గుండె నిండా భయం… కళ్లలో నీళ్లు… కానీ… ఆశ కూడా ఉంది. జాగ్రత్తగా ఉండు… ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి… అని నా నాన్నమ్మ కన్నీళ్లతో నన్ను పంపించింది.

    టౌన్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు… అది నాకు కొత్త ప్రపంచం లాంటిది.  ఎత్తైన బిల్డింగ్స్… బిజీ రోడ్లు… తెలియని మనుషులు… నేను పూర్తిగా ఒంటరిగా అనిపించుకుంది. డిగ్రీ కాలేజీ మొదటి రోజు… క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టినప్పుడు ఎవరూ నాకు పరిచయం లేరు… ఎవరితో మాట్లాడాలో తెలియదు…

    అప్పుడు… ఒక వాయిస్ వినిపించింది— హాయ్… నువ్వు కొత్త స్టూడెంట్ కదా? నేను వెనక్కి తిరిగి చూసాను…

    అతను… అద్వైత్.

    అతని ముఖంలో ఒక సింపుల్ స్మైల్… కళ్లలో నమ్మకం, మాటల్లో ఓ స్నేహం కనిపించింది. నేను అద్వైత్… అని తనను పరిచయం చేసుకున్నాడు. ఆ చిన్న పరిచయం… నా జీవితంలో ఒక పెద్ద మార్పు అయ్యింది. ఆ రోజు నుంచి… క్లాస్‌లో నాకు పక్కన కూర్చునేది అతనే… నాకు అర్థం కాని సబ్జెక్ట్స్ అతనే చెప్పేవాడు… నేను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాట్లాడించేది కూడా అతనే… నెలలు గడిచేకొద్దీ… మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాము. నేను నవ్వడం మళ్లీ నేర్చుకున్నాను… జీవితాన్ని మళ్లీ ప్రేమించడం మొదలుపెట్టాను…

    కానీ… ఆ స్నేహం నాలో మెల్లగా ఇంకేదో భావంగా మారుతోంది అని నాకు అర్థం కాలేదు… అది స్నేహమా…? లేదా… ప్రేమా…? అప్పటికి నాకు తెలియదు… కానీ నా గుండె మాత్రం అతని కోసం కొట్టుకోవడం మొదలుపెట్టింది… తర్వాత మా చదువులు పూర్తయ్యాయి… కానీ నా మనసు మాత్రం ఒక్కటే ఆలోచిస్తోంది— అద్వైత్ లేకుండా నేను ఎలా ఉంటాను…? అదృష్టం అనుకోవాలో … లేక విధి ఆట అనుకోవాలో  మా ఇద్దరికీ ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది.

    ఆ రోజు నాకు ప్రపంచమే దొరికినట్టుగా అనిపించింది… రోజూ అతన్ని చూడొచ్చు… మాట్లాడొచ్చు… అతనితో టైం గడపొచ్చు… ఆఫీస్‌లో మొదటి రోజు… మళ్లీ అదే ఫీలింగ్... కానీ ఈసారి నేను ఒంటరిగా లేను… అద్వైత్ నా పక్కన ఉన్నాడు. కాఫీ బ్రేక్‌లు… లంచ్ టైమ్ చాట్స్… వర్క్‌లో హెల్ప్… ప్రతి చిన్న విషయం కూడా నాకు ప్రత్యేకంగా అనిపించేది. అతను నవ్వితే… నా రోజు బాగుంటుంది… అతను మాట్లాడితే… నా ప్రపంచం ఆగిపోయినట్టే అనిపిస్తుంది… అలా రోజులు గడుస్తున్నకొద్దీ… నా మనసులో ఉన్న భావాలు మరింత బలంగా మారాయి.

    అవును… నేను అద్వైత్‌ను ప్రేమిస్తున్నాను. ఈ నిజాన్ని నేను ఒప్పుకున్న రోజు… నా గుండె ఒకేసారి భయంతో, ఆనందంతో కొట్టుకుంది. ఈ రోజు చెబుతా… లేదంటే రేపు చెబుతా… అలా నేను చాలా రోజుల పాటు ధైర్యం కూడబెట్టుకుంటూ ఉన్నాను.

    ఒక రోజు…
    అతనితో కాఫీకి వెళ్లినప్పుడు చెప్పేయాలని నిర్ణయించుకున్నాను… నా గుండె బలంగా కొట్టుకుంటోంది… మాటలు నోటి దగ్గరకి వచ్చి ఆగిపోయాయి… అప్పుడే… నా ఫోన్ మోగింది.

    ఆ కాల్… నా జీవితాన్ని మళ్లీ పూర్తిగా మార్చేసింది. అన్విత… నీ నాన్నమ్మ… అంతే… నా చేతిలో ఫోన్ జారి పడిపోయింది. నా ప్రపంచం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది… నేను మళ్లీ ఒంటరిగా మారిపోయాను. వెంటనే ఊరికి వెళ్లాల్సి వచ్చింది… ఆ ప్రయాణం అంతా… నా కళ్లలో కన్నీళ్లు మనసులో బాధ… చెప్పాల్సిన మాట… చెప్పలేకపోయాను… అనే పశ్చాత్తాపం. ఊరికి వెళ్లిన తర్వాత… అక్కడ ప్రతి మూల… నా నాన్నమ్మ జ్ఞాపకాలతో నిండిపోయింది.

    కొన్ని రోజులు… నేను బయట ప్రపంచం గురించి మర్చిపోయాను… కానీ ఒక ఆలోచన మాత్రం నన్ను వెంటాడుతోంది— అద్వైత్‌కు ఇంకా చెప్పలేదు… కొంతకాలం తర్వాత నేను తిరిగి టౌన్‌కి వచ్చాను. నా గుండెల్లో ఒక చిన్న ఆశ— ఇప్పటికైనా చెబుతాను… కానీ… అది ఆలస్యమైపోయింది. ఆఫీస్‌కి వెళ్లిన మొదటి రోజే… నాకు ఒక వార్త తెలిసింది. అద్వైత్ పెళ్లి ఫిక్స్ అయ్యింది… ఆ మాట విన్న క్షణం… నా చెవుల్లో ఏమీ వినిపించలేదు… నా కళ్ల ముందు అంతా బ్లర్ అయిపోయింది… లేదు… ఇది నిజం కాదు… అని నేను నన్నే నమ్మించుకోవడానికి ప్రయత్నించాను.

    కానీ… కొన్ని రోజుల్లోనే, ఆ వార్త నిజమైపోయింది. అతని పెళ్లి అయిపోయింది. ఆ రోజు… నా గుండె ముక్కలైపోయింది. నేను చెప్పలేకపోయిన ఒక్క మాట… నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. అతను లేని ఆఫీస్‌ నేను భరించలేకపోయాను… అతని నవ్వు… అతని ఆనందం… అన్నీ నాకు నొప్పిగా మారాయి. అక్కడ ఉంటే… ప్రతి జ్ఞాపకం నన్ను వెంటాడుతోంది…

    అందుకే…  నేను ఆ టౌన్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. పారిపోవాలని కాదు… మర్చిపోవాలని… నేను తిరిగి మా ఊరికి వెళ్ళిపోయాను… ఆ ఊరు ఒకప్పుడు నాకు ఆప్యాయంగా అనిపించిన అదే ఊరు ఇప్పుడు మాత్రం పూర్తిగా ఖాళీగా అనిపించింది. ఇంటి లోపల నిశ్శబ్దం గోడలపై పాత జ్ఞాపకాలు… ప్రతి మూలలో నా నాన్నమ్మ గుర్తులు…

    రోజులు గడుస్తున్నాయి… కానీ నా జీవితం మాత్రం ఎక్కడో ఆగిపోయినట్టే ఉంది. ఉదయం లేస్తాను. ఏ పని లేకుండా అలాగే కూర్చుంటాను… రాత్రి పడుకుంటాను… కానీ నిద్ర మాత్రం రాదు… అలా కొన్నిరోజులు…  నెలలు అయ్యాయి. ఇంట్లో ఉన్న డబ్బు…  నెమ్మదిగా కరిగిపోయింది.

    ఒక రోజు… అల్మారాలో చివరి నోటు కూడా తీసుకున్నప్పుడు… నాకు ఒక్కసారిగా అనిపించింది... ఇలా కొనసాగితే… నేను పూర్తిగా ఒంటరిగా పడిపోతాను… బతకాలి అంటే…  ముందుకు వెళ్లాలి. గతాన్ని మర్చిపోవాలి… అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను— మళ్లీ పని చేయాలి. మళ్లీ నా జీవితాన్ని నేనే నిలబెట్టుకోవాలి. ఆ నిర్ణయం తీసుకున్న రాత్రి… చాలా రోజుల తర్వాత నాకు కాస్త బలంగా అనిపించింది.

    కొన్ని రోజుల్లోనే… నా బ్యాగ్ సర్దుకున్నాను… ఇంటి తలుపు మూసే ముందు ఒక్కసారి లోపల చూసాను… అక్కడ నా గతం ఉంది…  కానీ నేను మాత్రం వెళ్లిపోతున్నాను… మళ్లీ టౌన్‌కి వచ్చాను. ఆ నగరం… మళ్లీ నన్ను స్వాగతించినట్టే ఉంది… కానీ ఈసారి నేను మారిపోయాను. పని కోసం వెతకడం ప్రారంభించాను… రోజంతా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ… ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ… కొన్ని చోట్ల— మేము కాల్ చేస్తాం… అని పంపేశారు. కొన్ని చోట్ల— ఎక్స్‌పీరియన్స్ లేదు… అని రిజెక్ట్ చేశారు. ప్రతి రిజెక్షన్… నా గుండె మీద ఒక గాయం లాంటిదే. కానీ…     ఈసారి నేను ఆగలేదు. ఎందుకంటే…   ఇప్పుడు వెనక్కి వెళ్లే దారి లేదు.

    చివరికి…

    ఒక రోజు… ఒక చిన్న కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చాను. సింపుల్ ప్రశ్నలు… సింపుల్ సమాధానాలు… కానీ నా కళ్లలో ఉన్న ఆ తపన… నా మాటల్లో ఉన్న ఆ నిజం… వాళ్లను నమ్మించింది. మీరు రేపటి నుంచి జాయిన్ అవ్వండి… అని చెప్పారు. ఆ మాట విన్న క్షణం… నా కళ్లలో ఆనందం… మనసులో ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. చాలా రోజుల తర్వాత…    నేను మళ్లీ నిలబడ్డాను. కొత్త జాబ్…  కొత్త జీవితం…

    కానీ… నా గుండె లోపల ఎక్కడో ఒక చోట… పాత జ్ఞాపకాలు ఇంకా నిశ్శబ్దంగా ఉన్నాయి. నాకు తెలియకుండా… అవి మళ్లీ బయటికి రావడానికి, సరైన సమయాన్ని ఎదురు చూస్తున్నాయి… అక్కడే ఒక ఇల్లు కూడా చూసుకున్నాను. గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్… ఆ అపార్ట్‌మెంట్ మొదట చూసినప్పుడు, అది చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా అనిపించింది.

    పచ్చని చెట్లు చుట్టూ… బిల్డింగ్ బయట సింపుల్ డిజైన్… లోపలికి వెళ్తే… కొంచెం పాతదనపు వాసన… అది కొత్తగా నిర్మించిన భవనం కాదు. కానీ… ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఇక్కడే ఉండొచ్చు… అనిపించింది. ఫ్లాట్ చిన్నదే… ఒక హాల్… ఒక బెడ్‌రూమ్… చిన్న కిచెన్… కానీ నాకు అది సరిపోతుంది. ఎందుకంటే… నాకు పెద్ద స్థలం అవసరం లేదు… ఒక శాంతి కావాలి. ఇంటి తాళం తీసుకుని మొదటిసారి లోపల అడుగు పెట్టినప్పుడు… ఒక చల్లని గాలి నా ముఖాన్ని తాకింది… కిటికీ దగ్గర కర్టెన్ నెమ్మదిగా కదిలింది…

    ఒక్క క్షణం… ఎవరో నన్ను గమనిస్తున్నట్టుగా అనిపించింది. నేను ఒక్కసారి చుట్టూ చూసాను. ఎవరూ లేరు. అలసట వల్లే ఇలా అనిపిస్తుంది… అని నన్నే నమ్మించుకున్నాను. రోజులు గడుస్తున్నాయి… ఆఫీస్ → ఇల్లు ఇల్లు → ఆఫీస్  అలా నా జీవితం మళ్లీ రొటీన్‌లో పడిపోయింది. అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లు కూడా సైలెంట్ గానే ఉండేవారు… ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కారిడార్‌లో నడుస్తుంటే… కొన్ని ఫ్లాట్స్ ఎప్పుడూ మూసే ఉంటాయి… రాత్రి అయ్యేసరికి… ఆ అపార్ట్‌మెంట్ ఇంకా నిశ్శబ్దంగా మారిపోతుంది.

    ఒక రోజు… రాత్రి 11 దాటిపోయింది… నేను కిచెన్‌లో నీళ్లు తీసుకుంటూ ఉండగా… ఎక్కడో నుంచి ఒక సున్నితమైన శబ్దం వినిపించింది… టక్… టక్… నేను ఆగిపోయాను. మళ్లీ…  టక్… టక్… అది గోడ వైపు నుంచి వస్తోంది… లేదా… ఎదురుగా ఉన్న ఫ్లాట్ నుంచి…? నా గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్లి చూసాను… కారిడార్ ఖాళీగా ఉంది. లైట్లు మాత్రం మసకబారుతున్నాయి… ఎదురుగా ఉన్న ఫ్లాట్ తలుపు… సగం తెరిచి ఉంది. ఇక్కడ ఎవరో ఉన్నారా…? అని అనిపించింది. కానీ…  ఎవరూ బయటకు రాలేదు. నేను మళ్లీ నా ఫ్లాట్‌లోకి వచ్చేసాను… తలుపు బిగించి వేసుకున్నాను.

    ఆ రాత్రి… నాకు నిద్ర రాలేదు. అది చిన్న శబ్దమే కావచ్చు… లేదా నా ఊహలే కావచ్చు… కానీ… ఆ గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్‌లో ఏదో సరైనది లేదని నాకు మొదటిసారి అనిపించింది… అప్పుడు నాకు తెలియదు… అదే చోట నా గతం మళ్లీ నా ముందుకు వస్తుందని… అది కూడా… నేను ఎప్పటికీ మర్చిపోవాలని అనుకున్న రూపంలో… అక్కడే నాకు నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టయింది...

    తనకు ఎందుకు అలా అనిపించింది...?

    తర్వాత ఏమి జరిగింది...?

    అన్విత చనిపోవడానికి కారణం ఏమిటి...?


    👉 ఈ రహస్యాలన్నీ Part-3 లో చూడండి…

    Follow చేయండి.

    Part-3 త్వరలోనే వస్తుంది.

    Part-3 Click Here

    Comments

    Popular posts from this blog

    మూసిన గది రహస్యం Part 3 ముగింప

    అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

    Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

      అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

    పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

    ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

    Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

    ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

    “ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

    “హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...