Skip to main content

25 మామిడి చెట్ల గణిత పజిల్ | రైతుకు ఎంత డబ్బు వచ్చింది? | Telugu Maths Puzzle

  మునుపటి సమాధానం 🖼️ చిత్రం 1 ఈ చిత్రంలో "మ" అనే అక్షరం నుండి ప్రారంభమయ్యే వస్తువులు ఎన్ని ఉన్నాయి ? " మ" అక్షరంతో ప్రారంభమయ్యే వస్తువులను జాగ్రత్తగా లెక్కించాలి. సమాధానం = 10 1.    మామిడి చెట్టు 2.   మామిడి కాయలు 3.    మొసలి 4.    మేఘాలు 5.   మేక 6.    మోటార్ సైకిల్ 7.    ముక్కు 8.    ముక్కుపుడక 9.    మల్లె పూవు 10.   మందారం పూవు   🖼️ చిత్రం 2  ఈ చిత్రంలో మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ?    చిన్న త్రిభుజాలను మాత్రమే కాకుండా పెద్ద త్రిభుజాలను కూడా లెక్కించాలి. సమాధానం = 18 చిన్న త్రిభుజాలు 5 పెద్ద త్రిభుజాలు 5 జాయింట్ త్రిభుజాలు 8   ఈ రోజు గణిత ప్రశ్న ఒక రైతు 25 మామిడి మొక్కలను నాటాడు. ఆ మొక్కలు పెరుగుతూ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. ఒక సీజన్‌లో ప్రతి చెట్టుకు 500 మామిడి కాయలు వచ్చాయి.      రైతు 20 కాయలను తన ఇంటికి తీసుకున్నాడు.      తన బంధువుల 5 ఇళ్లకు ఒక్కో ఇంటికి చొప్పున 10 కాయల ఇచ...

అన్విత జీవితంలోకి వచ్చిన ఆర్య! అసలు తన జీవితంలో జరిగింది ఏమిటీ?


అన్విత ఒక సాధారణమైన అమ్మాయి. చిన్నప్పటి నుంచే  చాలా మృదువైన మనసు. ఇతర పిల్లల్లా ఎప్పుడూ అల్లరి చేసిందేలేదు, తన ప్రపంచంలో తానే ఉండేది.

ఆమె చిన్న చిన్న విషయాల్లోనే తన ఆనందం వెతుక్కునేది…  వాన పడితే కిటికీ దగ్గర కూర్చుని చినుకులు లెక్కపెట్టడం, పూలు పూస్తే వాటిని చూసి మురిసిపోయేది... చిన్న పుస్తకాలు చదువుతూ తనలో తానే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొనేది…

ఇవే తన రోజు అలవాటుగా మారింది. 

తన ఇంట్లో కూడా మంచి క్రమశిక్షణతోనే పెరిగింది. తన తల్లిదండ్రులే ఆమెకు ప్రపంచం, వాళ్ల మాటే ఆమెకు దారి, వాళ్ల సంతోషమే తన లక్ష్యం.

ఆమె తండ్రి ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు –
“జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా, అది నీకు సంతోషం ఇవ్వాలి” అని.

ఆ మాట అన్విత మనసులో బలంగా నాటుకుపోయింది. అమ్మతో ఆమెకు ఒక ప్రత్యేకమైన బంధం ఉండేది. చిన్న చిన్న విషయాలు కూడా అమ్మతో పంచుకుంటూ,
అమ్మ ఒడిలో పడుకుని తన భావాలను చెబుతూ ఉండేది.

     ఆమెకు పెద్ద పెద్ద కలలు లేకపోయినా, తన జీవితాన్ని సింపుల్‌గా, సంతోషంగా గడపాలని ఒక చిన్న కోరిక ఉండేది. కానీ ఒక విషయం మాత్రం ఆమె మనసులో ఎప్పుడూ ఉండేది…

“ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, ఆ ప్రేమ నిజమైనదై ఉండాలి” అని.

ఎందుకంటే...
తన చిన్నప్పుడు ఇంటి పక్కన ఉన్న కుటుంబంలో జరిగిన ఒక సంఘటన వల్ల. 

ఆ కుటుంబంలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను వాళ్ళ అమ్మ నాన్నల మాటలు వింటూ పెరిగాడు. వారు ఏది చెబితే అదే సరి, ఏది తప్పంటే అదే తప్పు అని నమ్మేవాడు. 

అతడు తన పై చదువుల కోసం వేరే ఊరు వెళ్ళాడు.  అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి పేరు రమ్య. తను చదువులో ఎప్పుడూ first వచ్చేది. రవి అంతంత మాత్రమే చదివేవాడు.  వాళ్ళ class లో రవికు స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే రవి వాళ్ళ అమ్మ నాన్న ఎవరితో ఎక్కువగా మాట్లాడకు అని చెప్పి పంపించారు. 

ఎప్పుడైనా ఏవైన చదువులో సందేహాలు ఉంటే వెళ్లి రమ్యతో అడిగేవాడు. మొదట్లో రమ్యకు కొంచం ఇబ్బందిగా ఉండేది. ఐనా చదువే కదా అని ఏ సందేహామైన తీర్చేది. 

అలా వాళ్ళిద్దరి మధ్యన మెల్లగా స్నేహం మొదలైంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. 

ఒకరోజు వారిద్దరి పరీక్షలు కూడా ముగిసాయి. ఇక సెలవులు ప్రకటించారు. రవి తొందరలోనే మా అమ్మ నాన్నలతో మన పెళ్లి విషయం గురించి మాట్లాడటానికి మీ ఇంటికి వస్తాము అంటూ రమ్యను రైలు ఎక్కించి పంపించాడు. 

రవి అన్నట్టుగానే తన అమ్మ నాన్నలను తీసుకొని నేరుగా రమ్య ఇంటికీ వెళ్లి వారిద్దరి పెళ్లి గురించి రమ్య వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడారు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అనే కారణంతో రమ్య ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. 

అలా వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. ఎన్నో ఆశలతో రమ్య  అత్తవారింటికి అడుగుపెట్టింది. కొద్ది రోజులు బాగానే ఉంది. అప్పుడే పక్కింట్లోనే ఉంటున్న అన్విత వాళ్ళ అమ్మను పరిచయం చేసుకుంది. వారిద్దరూ ప్రతీ చిన్న విషయాలు కూడా మాట్లాడుకునేవారు. 

ఒకరోజు రమ్య బయట ఏడుస్తూ నించుంది. అన్విత వాళ్ళ అమ్మ ఏమైంది అని అడిగింది. వారింట్లో జరిగిన చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అని ఈ విషయం రవికి తెలిసినా కానీ రవి దాని గురించి ఏవీ పట్టించుకునేవాడు కాదు. కొన్ని రోజులకు రవికు రమ్య మీద ప్రేమ తగ్గింది. రవి అమ్మ నాన్నల ముందే రమ్యకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. తర్వాత పోను పోను రవి అమ్మ నాన్న చేతిలో కీలుబొమ్మగా మారాడు. అప్పట్నుంచి గొడవలు జరుగుతూనే ఉండేవి. రమ్య ఏడుస్తూనే ఉండేది. 

ఒకరోజు పెద్ద గొడవే జరిగింది రమ్య ఎంత ఏడ్చి మొత్తుకున్న తన మాట ఎవరూ వినలేదు. అంతే రవి రమ్యను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు.

రమ్య వాళ్ళ ఇంట్లోవాళ్ళు కూడా వచ్చి అడిగారు మా అమ్మాయి బ్రతుకు నాశనం చేయొద్దు బాబు అంటూ రవిని ప్రదేయపడ్డారు. కానీ రవి వినలేదు విడాకుల నోటీసు చేతిలో పెట్టాడు. 

అంతే ఇక ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు. రమ్య ఇంకా రవికి విడాకులు మంజూరయ్యాయి. శాశ్వతంగా విడిపోయారు.  

అన్విత ఎప్పుడూ అనుకునేది అప్పటి రవి, రమ్య  వారిద్దరి ప్రేమ ఇప్పుడు ఏమైంది అని. అందుకే ప్రేమ అనే విషయాన్ని ఆమె చాలా జాగ్రత్తగా,
కొంచెం భయంతోనే చూస్తూ ఉండేది.

కానీ ఆమెకు తెలియదు…
ఒక రోజు బస్సులో కలిసే ఒక చూపు తన జీవితాన్ని అంతగా మార్చేస్తుందని…
    
College Life
 కాలేజ్‌ లో కూడా అన్వితకు ఇద్దరు మాత్రమే close friends ఉండేవారు స్నేహ ఇంకా దీప్తి వాళ్ళు ముగ్గురు చాలా సరదాగా ఉండేవారు. 

     కాలేజ్‌లో ప్రతి lecturer కి ఒక ప్రత్యేక style ఉండేది.
Maths sir చాలా strict. late అయితే class లోపలికే రానివ్వరు. ఒక రోజు అన్విత బస్ late అవ్వడంతో class కి కొంచం ఆలస్యంగా వచ్చింది. Door దగ్గరే నిలబడి “May I come in sir…”  అని మెల్లగా అడిగింది.

Sir గట్టిగా చూస్తూ – “Time ఎవరికి wait చేయదు… 
మీరు కూడా timeకి respect ఇవ్వాలి” అన్నారు. ఆమె కాస్త బాధపడింది. కానీ అదే రోజు, class చివరలో sir ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పారు. “నువ్వు sincere student… next time careful.”
ఆ మాట విన్న తర్వాత ఆమెకు ఒక చిన్న smile వచ్చింది 

🚌 Bus Journey..
మొదట్లో అది ఒక సాధారణ ప్రయాణమే… అన్విత ఎప్పటిలాగే కిటికీ దగ్గర కూర్చుని బయట చూస్తూ వెళ్లేది. 

ఒక రోజు అనుకోకుండా ఆమె కళ్ళకు ఇంకో చూపు తగిలింది. అతని పేరు ఆర్య... ఈ ఆర్య అన్వితకు అన్నీ విషయాల్లో భిన్నంగా ఉండేవాడు. మాటలు చాలా తక్కువ, కానీ కళ్లలో మాత్రం ఎన్నో భావాలు దాగి ఉండేది. ఎవరితోనూ ఎక్కువగా కలవడు, మాట్లాడడు, కానీ ఒకసారి మనసు పెడితే దాన్ని పూర్తయ్యే వరకు వదలడు. 

     అన్వితకు ఆ రోజు సాధారణమైన రోజు అనిపించింది. రోజూ లాగానే బస్సులో కాలేజ్ కు వెళ్ళసాగింది. కానీ ఆర్య కనిపించిన రోజు నుంచి, ఆ ప్రయాణం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారింది.

Day 1:
ఒక్క చూపు మాత్రమే… కానీ ఆ చూపులో ఏదో ఉంది.

Day 2:
ఆమె బస్సులోకి ఎక్కగానే… తెలియకుండానే అతన్ని వెతికింది. మాటలు లేకపోయినా… ఇద్దరి కళ్ళు మాత్రం ప్రతి రోజు ఒకరినొకరు వెతుకుతున్నాయి .

Day 4:
బస్సులో crowd ఎక్కువగా ఉండడంతో, ఆమెకు దగ్గరలోనే ఆర్య నిలబడ్డాడు. అప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. బస్సు sudden brake వేసింది.
అన్విత almost పడిపోవడంతో, ఆర్య మెల్లగా ఆమెకు support ఇచ్చాడు. “జాగ్రత్త…” అని మెల్లగా అన్నాడు.

అది వాళ్ళ మధ్య మొదటి మాట. ఆ ఒక్క మాటతో… ఇద్దరి మధ్య ఉన్న దూరం కొంచెం తగ్గింది. అన్విత కాస్త సిగ్గుతో “థ్యాంక్యూ…” అంది. ఆర్య చిన్నగా తల ఊపాడు. 

ఆ రోజు నుంచి… ఒక చిన్న smile, ఒక చిన్న చూపు, ఒక చిన్న మాట. అలా వాళ్ళ పరిచయం మెల్లగా పెరిగింది. పరిచయం చిన్నదే అయినా… అందులోని భావాలు మాత్రం చాలా పెద్దవి. ఆ బస్సులో మొదలైన ఆ పరిచయం… ఇద్దరి జీవితాలను మెల్లగా ఒకే దారిలోకి తీసుకెళ్లడం మొదలుపెట్టింది.

ఒక రోజు సాయంత్రం అన్విత బస్సు దిగిన తర్వాత కొంచెం దూరంలో ఆర్య కూడా బస్సు దిగాడు. అన్విత కొంచెం ఆశ్చర్యంగా చూసింది… “ఇక్కడ ఎందుకు…?” అని అడగాలనిపించినా, మాటలు బయటకు రాలేదు. ఆర్య ముఖంలో ఏదో గంభీరత… అతని కళ్లలో ఒక నిర్ణయం స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ సాయంత్రం… ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది. 
సూర్యుడు మెల్లగా అస్తమించిపోతూ, ఆ క్షణాన్ని ఇంకా అందంగా మార్చేస్తున్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. గాలి మెల్లగా వీచుతూ, ఆ నిశ్శబ్దాన్ని ఇంకా గాఢంగా చేస్తోంది. ఆర్య గుండె బలంగా కొట్టుకుంటోంది… ఇంతకాలం తనలో దాచుకున్న భావాలను ఇప్పుడు బయట పెట్టాల్సిన సమయం వచ్చింది.

అతను ఒక గాఢంగా శ్వాస తీసుకుని, అన్విత వైపు మెల్లగా అడుగులు వేసాడు. “అన్విత…” అని పిలిచాడు. ఆ ఒక్క మాటలోనే అతని భావాలన్నీ దాగి ఉన్నాయి. అన్విత తల పైకెత్తి అతని కళ్లలోకి చూసింది… ఆ చూపులో కాస్త ఆత్రం, కాస్త భయం, ఇంకా ఏదో తెలియని అనుభూతి.

ఆర్య మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు — “నిన్ను మొదటిసారి చూసిన రోజు… అది ఒక సాధారణ రోజు అనుకున్నాను. కానీ ఆ ఒక్క చూపు… నా జీవితాన్ని అంతగా మార్చేస్తుందని అనుకోలేదు.”

అతని స్వరం కొంచెం కంపించింది… “నువ్వు నవ్విన ప్రతిసారి… నా రోజు పూర్తవుతుంది అనిపించింది.
నువ్వు కనిపించని రోజు… ఏదో కోల్పోయిన భావన.” అని చెప్పాడు. అన్విత గుండె వేగంగా కొట్టుకుంటోంది… ఆ మాటలు ఆమె మనసులో నేరుగా తాకుతున్నాయి.

ఆర్య ఇంకాస్త దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు —“నువ్వు నాకు అలవాటయ్యావు అన్విత… 

కొన్ని క్షణాలు ఆగి…
తన కళ్లలోకి నేరుగా చూస్తూ అన్నాడు...

“ఇది ఒక చిన్న attraction కాదు… ఇది నా హృదయం తీసుకున్న నిర్ణయం.” అంటూ మెల్లగా తన మనసులోని మాట బయటపెట్టాడు 

“నీ నవ్వు నా రోజుని వెలుగులోకి తీసుకువస్తుంది…
నువ్వంటే నాకు చాలా ఇష్టం… నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్విత.”

ఆ మాటలు విన్న క్షణం… ఆమెకు ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయినట్టైంది. గుండె వేగంగా కొట్టుకుంటోంది… ఆమె తల మెల్లగా వంచింది…
సిగ్గుతో ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వులోనే ఆమె సమాధానం దాగి ఉంది. ఆర్య ఆ నవ్వు చూసి…
తన గుండెల్లో ఉన్న భారం ఒక్కసారిగా తగ్గిపోయింది.

ఆ క్షణం… వాళ్ళ ప్రేమకు మాటలకంటే ఎక్కువ అర్థం ఇచ్చింది. అన్విత నెమ్మదిగా తల ఊపింది…

అప్పుడు మొదటిసారి… వాళ్ళ మధ్య నిశ్శబ్దం కాకుండా,
ప్రేమ మాట్లాడింది. ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి చెప్పింది. వాళ్లు ప్రశాంతంగా విని, మెల్లగా చెప్పారు…

“జీవితంలో భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ప్రేమ ఉండాలి… కానీ బాధ్యత కూడా ఉండాలి. అతను నిన్ను గౌరవిస్తాడా? నీ సంతోషాన్ని అర్థం చేసుకుంటాడా? ఇవన్నీ ఆలోచించు.”

ఆమె మౌనంగా వాళ్ల మాటలు వింటూ ఉంది. అప్పుడే రవి-రమ్యల ప్రేమ జ్ఞాపకం వచ్చింది. 

కానీ ఆర్యను చూసిన క్షణం అ విషయం మర్చిపోయింది. ఒకరోజు, ఆర్య తన భావాలను ఆమెతో వ్యక్తపరచుకోవాలని, ఒక ప్రత్యేకమైన రోజును పంచుకోవాలని, స్వచ్ఛమైన ప్రదేశాలకు తీసుకెళ్లి, అక్కడ ఒక రొమాంటిక్ క్షణాన్ని గడపాలని అంటాడు. 

ఆ రోజు ఆర్య చెప్పిన మాటలు విన్న తర్వాత…
అన్విత మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. ఒక వైపు తన తల్లిదండ్రుల ఆశలు, వాళ్లు చెప్పిన జాగ్రత్తలు…

మరో వైపు ఆర్యపై పెరిగిన ప్రేమ. ఆమె గుండె లోపల చిన్న యుద్ధమే జరుగుతోంది.

“ఇది సరైన నిర్ణయమా…?” అని ఒక స్వరం అడిగింది.
“కానీ అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు…” అని మరో స్వరం చెప్పింది. ఆర్యతో గడిపిన ప్రతి క్షణం ఆమె కళ్లముందు మెరుస్తోంది 

బస్సులో మొదలైన ఆ చూపులు, మాటలకంటే ఎక్కువగా మాట్లాడిన నిశ్శబ్దం, అతని చిన్న చిన్న జాగ్రత్తలు…

“ఇంత నిజమైన ప్రేమ మళ్లీ దొరుకుతుందా…?” అని ఆమె మనసు మెల్లగా ఒప్పుకుంది. కొద్ది సేపు నిశ్శబ్దంగా కూర్చుంది. తర్వాత ఒక గాఢంగా శ్వాస తీసుకుంది. “ఏమైతే అది జరగనీ… నా హృదయం ఎంచుకున్న దారిలోనే నేను నడుస్తాను” అని తనలో తానే నిర్ణయించుకుంది.

   ఆలోచనలతో నిండిన ఆ క్షణం తర్వాత, ఆమె మెల్లగా నవ్వుతూ ఆర్య వైపు చూసింది… ఆ నవ్వులోనే ఆమె నిర్ణయం దాగి ఉంది. తరువాత ఎప్పటిలాగానే చెప్పినదానికి ఒప్పుకొని తనతో వెళ్ళింది. 

     ఎవరూ లేని నిశ్శబ్దమైన ప్రదేశం చూసుకొని ఆర్య తనతో ఒక మాట చెప్పాడు. "నేను నీకు ఎప్పటికి మోసం చెయ్యను. నా జీవితంలో నువ్వు కలిసిన క్షణం ఎంతో గొప్పది. నువ్వు నా జీవితానికి వెలుగై, ప్రతి అణువులో నా ఊహలను సాకారం చేశావు. ఈ ప్రేమను జీవితం అంతా నీతోనే పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను." అన్నాడు. 

అన్విత "మీ అమ్మ నాన్నల గురించి" అని అడిగింది. అందుకు ఆర్య నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు నేను మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. వారు నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగానే చూసుకున్నారు అన్నాడు.

ఆ మాట విన్న అన్విత ఆశ్చర్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఆ వాక్యాలను వింటూ, ప్రేమతో సమాధానమిచ్చింది. 

"ఆర్య... 

నువ్వు నాకు ఇచ్చిన ప్రతి క్షణం, ప్రతి భావన నన్ను హృదయపూర్వకంగా మార్చేసింది." అని చెప్పింది.

   తర్వాత అందరిని ఒప్పించి పెళ్లి చేసుకొని హ్యాపీ గా జీవితాన్ని కొనసాగించారు.

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...