"ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి... ఆ కొండపై కనిపించే దేవకన్యను చూసినవాళ్లు తిరిగి గ్రామానికి రాలేదట... అది కేవలం కథే అనుకున్నారు అందరూ... కానీ 1987లో ఒక అమ్మాయి ఆ నిజాన్ని వెతకాలని నిర్ణయించుకుంది..." 1987 సంవత్సరం… పచ్చని కొండల మధ్యలో దాగి ఉన్న చిన్న గ్రామం — వెలగంపల్లి. ఉదయం పొగమంచు కమ్ముకున్నా… సాయంత్రం గాలిలో పక్షుల అరుపులు వినిపించినా… ఆ ఊరిలో ఒక్క విషయం మాత్రం అందరి మనసుల్లో భయంగా ఉండేది. ఆ కొండపై ఉన్న పాత దేవాలయం గ్రామానికి ఎంతో ప్రత్యేకమైనది. ఎత్తైన రాతి మెట్లను ఎక్కి వెళ్లాల్సి ఉండేది. చుట్టూ దట్టమైన చెట్లు , పక్షుల కిలకిలారావాలు , గాలికి ఊగే కొమ్మల శబ్దం ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇచ్చేవి. దేవాలయం గోడలు కాలగమనానికి సాక్ష్యాల్లా కనిపించేవి. కొన్ని చోట్ల రాళ్లు చెక్కుచెదిరిపోయినా , ఆ ఆలయం వైభవం మాత్రం ఇప్పటికీ అందరినీ ఆకర్షించేది. చాలా ఏళ్ల క్రితం అక్కడ పెద్ద జాతరలు జరిగేవని పెద్దలు చెప్పుకునేవారు. జాతర సమయం వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయేవట. కొండ దారంతా రంగురంగు...
"ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి...
ఆ కొండపై కనిపించే దేవకన్యను చూసినవాళ్లు తిరిగి గ్రామానికి రాలేదట...
అది కేవలం కథే అనుకున్నారు అందరూ...
కానీ 1987లో ఒక అమ్మాయి ఆ నిజాన్ని వెతకాలని నిర్ణయించుకుంది..."
1987 సంవత్సరం…
పచ్చని కొండల మధ్యలో దాగి ఉన్న చిన్న గ్రామం — వెలగంపల్లి.
సాయంత్రం గాలిలో పక్షుల అరుపులు వినిపించినా…
ఆ ఊరిలో ఒక్క విషయం మాత్రం అందరి మనసుల్లో భయంగా ఉండేది.
చుట్టూ దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, గాలికి ఊగే కొమ్మల శబ్దం ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన
ప్రశాంతతను ఇచ్చేవి.
దేవాలయం గోడలు కాలగమనానికి సాక్ష్యాల్లా కనిపించేవి.
కొన్ని
చోట్ల రాళ్లు చెక్కుచెదిరిపోయినా, ఆ ఆలయం వైభవం మాత్రం ఇప్పటికీ అందరినీ ఆకర్షించేది.
చాలా ఏళ్ల క్రితం అక్కడ పెద్ద జాతరలు జరిగేవని పెద్దలు చెప్పుకునేవారు.
జాతర
సమయం వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయేవట.
కొండ
దారంతా రంగురంగుల జెండాలు, తోరణాలతో అలంకరించబడేది.
ఉదయం నుంచే డప్పుల మోతలు, భజనలు, హారతుల శబ్దాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయేదట.
పిల్లలు కొత్త
బట్టలు వేసుకుని ఆనందంగా తిరిగేవారు.
వ్యాపారులు తమ దుకాణాలను ఏర్పాటు చేసి
బొమ్మలు, మిఠాయిలు, గాజులు, చిన్నచిన్న వస్తువులు అమ్మేవారు.
దూరదూరాల నుంచి ప్రజలు వచ్చి పూజలు చేసేవారట.
ఎద్దుబండ్లలో, గుర్రపు బండ్లలో, కొందరు నడుచుకుంటూ కూడా రోజుల ప్రయాణం చేసి ఆలయానికి
చేరుకునేవారట.
దేవుడిని దర్శించుకుని తమ కోరికలు చెప్పుకునేవారు.
కొందరు మొక్కులు
తీర్చుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించేవారు.
ఆలయ ప్రాంగణం భక్తులతో
కిటకిటలాడేది.
సాయంత్రం వేళ వందలాది దీపాలు వెలిగించగానే కొండంతా బంగారు వెలుగులతో
మెరిసిపోయేదట.
ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూసినవారు జీవితాంతం మర్చిపోలేరని గ్రామంలోని
వృద్ధులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు.
కానీ ఒక రోజు అకస్మాత్తుగా ఆ దేవాలయం మూసుకుపోయింది.
కానీ ఒక రోజు అకస్మాత్తుగా ఆ దేవాలయం మూసుకుపోయింది.
ఎందుకు మూసుకుపోయిందో…
అక్కడ ఏమి జరిగిందో…
ఎవరూ స్పష్టంగా చెప్పేవారు కాదు.
ఆ తర్వాత గ్రామం కూడా మారిపోయింది.
ఒకప్పుడు జాతరలతో కళకళలాడిన దారులు నిశ్శబ్దంగా మారిపోయాయి.
కొండపైకి వెళ్లే మెట్లపై ముళ్లపొదలు పెరిగాయి.
సాయంత్రం అయ్యాక ఆ దారివైపు చూడటానికే ప్రజలు భయపడేవారు.
కొందరు రాత్రివేళ ఆలయం వైపు నుంచి విచిత్రమైన గంట శబ్దాలు వినిపిస్తాయని చెప్పేవారు.
మరికొందరు చంద్రకాంతి రాత్రుల్లో ఆలయ గోపురం దగ్గర ఒక తెల్లని నీడ కనిపించేదని ప్రమాణాలు చేసేవారు.
అలా సంవత్సరాలు గడిచిపోయాయి.
కానీ ఒక నమ్మకం మాత్రం తరతరాలుగా వస్తూనే ఉంది…
“ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి…
ఆ దేవాలయంలో ఒక దేవకన్య కనిపిస్తుంది” అని.
“ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి…
ఆ దేవాలయంలో ఒక దేవకన్య కనిపిస్తుంది” అని.
ఆమె తెల్లని వస్త్రాలు ధరించి…
చంద్రకాంతిలో నెమ్మదిగా దేవాలయం మెట్లపై నడుస్తూ కనిపిస్తుందట.
ఆమె ముఖం పూర్తిగా ఎవరికీ కనిపించదట.
కానీ ఆమె కళ్లలోకి ఒక్కసారి చూసిన వాళ్లు…
తర్వాత మళ్లీ ఊరికి తిరిగి రాలేదట.
కొంతమంది "వాళ్లు దేవకన్యతో వెళ్లిపోయారని"
మరికొందరు…
“ఆ కొండ వాళ్లను మింగేసింది” అని ఎన్నో విషయాలను చెప్పుకునేవారు.
చంద్రకాంతిలో నెమ్మదిగా దేవాలయం మెట్లపై నడుస్తూ కనిపిస్తుందట.
ఆమె ముఖం పూర్తిగా ఎవరికీ కనిపించదట.
కానీ ఆమె కళ్లలోకి ఒక్కసారి చూసిన వాళ్లు…
తర్వాత మళ్లీ ఊరికి తిరిగి రాలేదట.
కొంతమంది "వాళ్లు దేవకన్యతో వెళ్లిపోయారని"
మరికొందరు…
“ఆ కొండ వాళ్లను మింగేసింది” అని ఎన్నో విషయాలను చెప్పుకునేవారు.
1987 సంవత్సరం వచ్చింది...
మళ్లీ ఆ 12 ఏళ్ల చక్రం పూర్తయింది.
ఆ విషయం గుర్తొచ్చినప్పటి నుంచి వెలగంపల్లిలో భయం మళ్లీ మొదలైంది.
సాయంత్రం పడితే తలుపులు త్వరగా మూసేసేవారు.
రాత్రి అయ్యాక బయటకు రావడానికి కూడా ఎవరూ ధైర్యం చేసేవారు కాదు.
ఆ విషయం గుర్తొచ్చినప్పటి నుంచి వెలగంపల్లిలో భయం మళ్లీ మొదలైంది.
సాయంత్రం పడితే తలుపులు త్వరగా మూసేసేవారు.
రాత్రి అయ్యాక బయటకు రావడానికి కూడా ఎవరూ ధైర్యం చేసేవారు కాదు.
అలా కథలు వింటూ, ఆ భయాల మధ్యే పెరిగింది 17 ఏళ్ల మాధవి."
చిన్నప్పుడు మాధవి తన తాతయ్య పక్కన కూర్చుని ఈ కథలు వింటూ ఉండేది.
తాతయ్య చెప్పే ప్రతి మాట ఆమె ఊహల్లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేది.
భయంగా అనిపించినా...
ఆ దేవాలయం గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గేది కాదు.
ఒకసారి స్నేహితులతో కలిసి కొండ దారి వరకు వెళ్లినా, పెద్దలు చూసి వెంటనే ఇంటికి తీసుకువచ్చారు.
ఒక రోజు…
పై చదువుల కోసం పట్నం వెళ్లింది మాధవి.
పై చదువుల కోసం పట్నం వెళ్లింది మాధవి.
పట్నంలోని కాలేజీ జీవితం ఆమెకు కొత్తగా అనిపించింది.
కొత్త స్నేహితులు…
కొత్త ప్రదేశాలు…
కొత్త అనుభవాలు…
అలా మెల్లగా ఆ ప్రదేశానికి అలవాటుపడింది.
రోజులు వేగంగా గడుస్తుండగా...
ఒక రోజు వారి చరిత్ర అధ్యాపకుడు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ప్రకటించాడు.
“మీరు అందరూ ఒక పురాతన వస్తువు, చారిత్రక ప్రదేశం లేదా కాలగర్భంలో కలిసిపోతున్న ఒక రహస్యమైన విషయాన్ని ఎంచుకుని దాని గురించి పూర్తి వివరాలతో ఒక పుస్తకం రాయాలి” అది కూడా ఒక నెలలోపు అని చెప్పారు.
ఆ ప్రాజెక్ట్ కాలేజీలో చాలా ప్రతిష్టాత్మకమైనది.
ఉత్తమంగా రాసిన పుస్తకాన్ని రాష్ట్రస్థాయి పోటీకి పంపిస్తామని కూడా చెప్పారు.
అందరూ తమ తమ విషయాలను ఎంచుకోవడం మొదలుపెట్టారు.
కొందరు కోటల గురించి…
మరికొందరు రాజవంశాల గురించి…
ఇంకొందరు పురాతన వస్తువుల గురించి సమాచారం సేకరించడం ప్రారంభించారు.
కానీ మాధవికి మాత్రం ఏ విషయం ఎంచుకోవాలో అర్థం కాలేదు.
ఆమె లైబ్రరీలో గంటల తరబడి వెతికింది.
పురాతన దేవాలయాలపై ఉన్న పుస్తకాలు...
జానపద కథల సంకలనాలు...
పాత వార్తాపత్రికల కట్టలు...
ఇలా దొరికిన ప్రతి విషయాన్ని ఆమె నోట్ చేసుకుంటోంది.
కానీ వెలగంపల్లి దేవాలయం గురించి మాత్రం ఒక్క చిన్న సమాచారం కూడా దొరకలేదు.
అదే ఆమె ఆసక్తిని మరింత పెంచింది.
రోజులు గడుస్తున్నాయి.
అయినా ఆమె మనసుకు నచ్చే విషయం దొరకలేదు.
ప్రాజెక్ట్ సమర్పించేందుకు ఇంక 15 రోజులు మాత్రమే ఉంది.
అప్పుడే ఒక సాయంత్రం ఆమె జీవితాన్ని మార్చబోయే ఒక ఉత్తరం కాలేజీ హాస్టల్‌కు వచ్చింది.
ఆ ఉత్తరం వాళ్ల అమ్మ రాసింది.
గ్రామంలోని విషయాలు…
పొలాల పరిస్థితి…
పక్కింటి వాళ్ల సంగతులు…
ఇలా ఎన్నో విషయాలు రాసింది.
మాధవి ఆ ఉత్తరాన్ని నెమ్మదిగా చదువుతోంది.
అంతలో ఒక వాక్యం ఆమె దృష్టిని ఆకర్షించింది.
“ఈ మధ్య మళ్లీ ఊరిలో అందరూ కొండపై ఉన్న పాత దేవాలయం గురించే మాట్లాడుకుంటున్నారు...
ఈసారి కూడా ఆ దేవకన్య కనిపిస్తుందని పెద్దలు చెబుతున్నారు…”
అని రాసి ఉంది.
ఆ ఒక్క వాక్యం చదివిన క్షణమే మాధవి చేతులు ఆగిపోయాయి.
ఆమెకు చిన్నప్పటి నుంచి వినిపించిన కథలు గుర్తొచ్చాయి.
ఆ మూసివేసిన దేవాలయం…
ప్రతి 12 సంవత్సరాలకు కనిపిస్తుందని చెప్పే దేవకన్య…
అదృశ్యమైన మనుషులు…
ఎవరికీ తెలియని నిజం…
అన్నీ ఒక్కసారిగా ఆమె మనసులో మెదిలాయి.
“ఇది కేవలం గ్రామ కథ మాత్రమేనా...?
లేదా నిజంగా దీని వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా...?”
అని ఆమె ఆలోచించడం ప్రారంభించింది.
అప్పుడే ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది.
తన ప్రాజెక్ట్ కోసం అదే విషయాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది.
“వెలగంపల్లి కొండ దేవాలయం — మరచిపోయిన ఒక రహస్యం”
అనే పేరుతో పుస్తకం రాయాలని అనుకుంది.
కానీ ఆ పుస్తకం రాయాలంటే కథలు వినడం సరిపోదు.
నిజాలు తెలుసుకోవాలి.
ఆ దేవాలయం ఎందుకు మూసుకుపోయింది?
దేవకన్య కథ ఎక్కడి నుంచి మొదలైంది?
అదృశ్యమైన వాళ్లకు ఏమైంది?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కనుక్కోవాలి.
ఆ నిర్ణయం తీసుకున్న క్షణంలోనే మాధవికి తెలియదు...
ఆమె ప్రారంభించబోతున్న పరిశోధన కేవలం ఒక కాలేజీ ప్రాజెక్ట్ మాత్రమే కాదని...
ఆ దేవాలయం మూసివేయడానికి కారణమైన చివరి వ్యక్తి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని...
ఇంకా అతను ఆమె కోసం ఎదురుచూస్తున్నాడని...




Comments
Post a Comment