Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Episode–9 ఉమ్మడి కుటుంబం| కొత్త కష్టం, కొత్త నిర్ణయం


"ఒక్క రాత్రి... నెలల తరబడి చేసిన కష్టం నీటిలో కలిసిపోయింది... రైతుల కలలు మట్టిలో కూరుకుపోయాయి... కానీ ఆ నష్టానికంటే పెద్ద పరీక్ష ఇంకా వారి ముందుందని రాఘవుడికి తెలియదు..." ఇది ఒక రైతు పోరాటం కథ...


జరగబోయే కథ 👇
ఆ రోజంతా ఊరిలో వరద గురించే చర్చ జరిగింది. ఎవరి ఇంట్లో ఎంత నష్టం జరిగిందో… ఎవరు ఎవరిని కాపాడారో… ఆ రాత్రి జరిగిన సంఘటనలనే అందరూ మాట్లాడుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఊరు మళ్లీ మామూలు జీవితంలోకి అడుగుపెట్టడం మొదలుపెట్టింది. కానీ...
ప్రతి ఇంటి మనసులో ఒక భయం మాత్రం మిగిలింది. మళ్లీ ఇలాంటిది జరగకూడదు... అని.

మరుసటి రోజు ఉదయం. సూర్యుడు ఉదయించగానే రాఘవుడు, సిద్ధయ్య ఇద్దరూ పొలానికి బయలుదేరారు. రాత్రి వరదలో గట్టు దగ్గర గడిపిన అలసట ఇంకా శరీరంలో ఉన్నా... పొలం పరిస్థితి చూడాలనే ఆందోళన వాళ్లను నిలబడనివ్వలేదు. దారంతా ఇద్దరూ ఎక్కువగా మాట్లాడలేదు. వాళ్ల మనసులో ఒకటే ఆశ. ఎంతైనా పంటలో కొంతైనా మిగిలి ఉండాలి అని. కొద్దిసేపటికి పొలం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. పొలం మొత్తం నీటితో నిండిపోయింది. కొన్ని చోట్ల వరి మొక్కలు నేలకూలిపోయాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా మట్టిలో కూరుకుపోయాయి. నీటి ప్రవాహం పొలం అంచులను కూడా కొట్టుకుపోయింది. సిద్ధయ్య చేతిలో ఉన్న కర్ర నేలపై జారిపోయింది. అతడు మాటలు రాక అలాగే నిలబడ్డాడు.

రాఘవుడు నెమ్మదిగా ముందుకు నడిచాడు. ఒకప్పుడు పచ్చగా కళకళలాడిన పొలం... ఇప్పుడు యుద్ధభూమిలా కనిపిస్తోంది. అతడు వంగి ఒక వరి మొక్కను చేతిలోకి తీసుకున్నాడు. అది పూర్తిగా విరిగిపోయింది. కొన్ని క్షణాలు... అతని కళ్లలో నీళ్లు మెరిశాయి. సిద్ధయ్య బరువైన గొంతుతో అన్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఈసారి కొంచెం బాగుంటుందని అనుకున్నా రాఘవా... అప్పులు కూడా కొంత తీరుతాయని ఆశపడ్డా...

అతని గొంతు కంపించింది. రాఘవుడు మాత్రం మౌనంగా నిలబడ్డాడు. ఏదో చెప్పాలని అనిపించింది. కానీ మాటలు రావడం లేదు. ముందు కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యమే అతని గుండెను భారంగా మార్చేసింది. కొన్ని గంటల క్రితం వరకు పచ్చగా కళకళలాడిన పొలం... ఇప్పుడు మట్టితో, నీటితో కలిసిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. ఆ మొక్కల్ని నాటిన రోజు గుర్తొచ్చింది. ఎన్ని ఆశలతో విత్తనాలు చల్లారో గుర్తొచ్చింది. ఎన్ని ఉదయాలు నిద్ర మానుకుని పొలం దగ్గరికి వచ్చాడో గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు... అన్ని కళ్ల ముందే కూలిపోయిన కలల్లా అనిపిస్తున్నాయి. అతని పక్కనే నిలబడ్డ రైతులు కూడా మౌనంగానే ఉన్నారు. ఎవరి ముఖంలోనూ మాటలు లేవు. ఎవరి కళ్లలోనూ ఆశ కనిపించడం లేదు.

ఒక వృద్ధ రైతు వంగి నేలను చేత్తో తడిమాడు. తడి మట్టిని అరచేతిలోకి తీసుకుని కొద్దిసేపు చూస్తూ నిలబడ్డాడు. తర్వాత నెమ్మదిగా ఆ మట్టిని కిందకు జారవిడిచాడు. ఆ చర్యలోనే అతని బాధ అంతా కనిపించింది. గాలి కూడా భారంగా వీచినట్టే అనిపించింది. కాలువ వైపు నుంచి ఇంకా నీటి శబ్దం వినిపిస్తూనే ఉంది. ఆ శబ్దం ప్రతి క్షణం వారి నష్టాన్ని గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది. కొద్దిసేపటి వరకు అక్కడే నిలబడ్డారు. ఎవరూ ఒకరితో ఒకరు మాట్లాడలేదు. ఎందుకంటే చెప్పడానికి ఓదార్పు మాటలు లేవు. నిజం ఒక్కటే ఉంది.

పంట పోయింది. నెలల తరబడి కష్టపడి పెంచిన పంట... రైతుల ఆశలన్నింటినీ వెంట తీసుకెళ్లిపోయింది. చివరకు ఒక రైతు నిట్టూర్పు విడిచాడు. "ఇక ఇక్కడ చేసేదేముంది..." అన్నాడు మెల్లగా. ఆ మాట విన్న తర్వాత అందరూ ఒకసారి పొలం వైపు చూశారు. అది వీడ్కోలు చూపులా అనిపించింది. తర్వాత భారమైన అడుగులతో ఇంటి దారి పట్టారు. ఎవరూ తొందరగా నడవలేదు. ఎందుకంటే ఇంటికి వెళ్లాక కూడా చెప్పాల్సిన బాధాకరమైన వార్త వాళ్ల కోసం ఎదురుచూస్తోందని అందరికీ తెలుసు. రాఘవుడు కూడా నెమ్మదిగా నడుస్తున్నాడు. అతని అడుగులు ముందుకు పడుతున్నాయి. కానీ మనసు మాత్రం ఇంకా ఆ పొలంలోనే నిలిచిపోయింది. ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం చీకట్లు కమ్ముకోవడం మొదలైంది. ఆవరణలో దీపం వెలుగుతోంది. వాకిట్లో నిలబడి ఉన్న రాములమ్మ దూరం నుంచే వాళ్లను గమనించింది. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. సాధారణంగా పొలం నుంచి తిరిగొచ్చేటప్పుడు ఏదో ఒక మాట వినిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం అందరూ మౌనంగా వస్తున్నారు. అది చూసిన క్షణమే ఆమె గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. వాళ్లు దగ్గరకు వచ్చే కొద్దీ ఆ భయం మరింత పెరిగింది. 

రాములమ్మ వాళ్ల ముఖాలు చూడగానే అర్థం చేసుకుంది. ఏదో పెద్ద అనర్థం జరిగిందని ఆమెకు తెలిసిపోయింది. ఆమె పెదవులు స్వల్పంగా వణికాయి. పంట... బాగానే ఉందా?" అని అడగబోయింది. కానీ వాళ్ల ముఖాలు చూసిన క్షణమే ఆ మాట గొంతులోనే ఆగిపోయింది.  ఆ ఒక్క మాటలోనే ఆమె భయం... ఆందోళన... మరియు సమాధానం తెలిసినా వినడానికి భయపడుతున్న మనసు అంతా దాగి ఉంది. సిద్ధయ్య తల దించుకున్నాడు. అంతే. ఆమెకు సమాధానం తెలిసిపోయింది. సుమతి కూడా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. కొద్దిసేపటి తర్వాత రాములమ్మ కళ్లను తుడుచుకుంటూ అంది.

"దేవుడు ఈసారి కాస్త కనికరం చూపిస్తాడనుకున్నా... ఇంకా మన పరీక్షలు అయిపోలేదేమో..." అంది. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. అక్కడ ఉన్న శారదకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. కానీ అందరూ బాధగా ఉండడం మాత్రం ఆమె గమనించింది. ఆమె మెల్లగా రాఘవుడి దగ్గరకు వెళ్లి...

"నాన్నా..." అంది. 

రాఘవుడు ఆమెవైపు చూశాడు. "ఏమైంది తల్లి? పొలం మళ్లీ బాగవుతుందా?" అని అమాయకంగా అడిగింది. ఆ ప్రశ్న విన్న వెంటనే అందరూ ఒక్కసారిగా ఆమెవైపు చూశారు. రాఘవుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆమె తల నిమురుతూ అన్నాడు.

"బాగవుతుంది తల్లి..." రాఘవుడు కళ్లలోని బాధను దాచుకుంటూ చిరునవ్వు నవ్వాడు.

"మట్టి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. మళ్లీ కష్టపడితే మళ్లీ పంట ఇస్తుంది." అన్నాడు. ఆ మాటలు చెప్పినా.. అతని మనసులో మాత్రం ఎన్నో సందేహాలు ఉన్నాయి.

అప్పులు, ఇంటి ఖర్చులు, విత్తనాలు, వచ్చే కాలం... అన్నీ అతని ఆలోచనల్లో తిరుగుతున్నాయి. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక... రాఘవుడు ఒంటరిగా ఇంటి బయట అరుగుపై కూర్చున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు మెరిస్తున్నాయి. వరద వెళ్లిపోయింది. కానీ దాని గాయం మాత్రం ఇంకా మిగిలే ఉంది. 

అప్పుడే వెనుక నుంచి సిద్ధయ్య వచ్చి అతడి పక్కన కూర్చున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు రాఘవా? అని అడిగాడు. రాఘవుడు చిన్నగా నవ్వాడు. మన భవిష్యత్తు గురించే నాన్న... అన్నాడు. సిద్ధయ్య కొద్దిసేపు ఆకాశం వైపు చూసి అన్నాడు. "నాకు అరవై ఏళ్లు వచ్చాయి రాఘవా... ఈ నేల మీద ఎన్నో వరదలు చూశా... ఎన్నో కరువులు కూడా చూశా... కానీ ఒక విషయం మాత్రం నిజం." 

రాఘవుడు అతనివైపు చూశాడు. సిద్ధయ్య నెమ్మదిగా అన్నాడు— ఓడిపోయిన రైతు నేను చూడలేదు. పడిపోయిన రైతు చూశా... ఏడ్చిన రైతు చూశా... అన్నీ కోల్పోయిన రైతు కూడా చూశా... కానీ మళ్లీ లేచి నిలబడకుండా ఉన్న రైతు మాత్రం చూడలేదు." ఆ మాటలు రాఘవుడి మనసులో లోతుగా దిగిపోయాయి.

ఆ రాత్రి... అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. పంట నష్టపోయింది. కానీ ఆశను మాత్రం నష్టపోనివ్వకూడదు. ఎంత కష్టం వచ్చినా... ఈసారి తన కుటుంబాన్ని అప్పుల బారిన పడనివ్వకూడదు. దానికి ఏదో ఒక మార్గం కనుక్కోవాలి. 


తర్వాత ఏమి జరుగుతుందో Next Episode లో చూడండి.

పంట నష్టంతో కుంగిపోయిన రాఘవుడి జీవితంలోకి ఒక అపరిచితుడు ప్రవేశిస్తాడు... అతడు ఎవరు?

ఎందుకు ఊరికి వచ్చాడు?

అతడు చెప్పిన ఒక ప్రతిపాదన రాఘవుడి జీవితాన్ని ఎలా మార్చబోతోంది?

తదుపరి భాగంలో తెలుసుకోండి...

Episode - 10 ఉమ్మడి కుటుంబం

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...