Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Episode - 5 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి| వెండి గాజు రహస్యం

Episode - 5 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి

"ఆ రాత్రి రాఘవకు తెలియదు, అతను తెరవబోతున్న పాత డైరీ, నలభై ఏళ్లుగా దాగి ఉన్న ఒక రహస్యాన్ని బయటపెడుతుందని...

ఆ రహస్యం ఒక అమ్మాయి మరణానికి మాత్రమే కాదు మొత్తం ఊరి భవిష్యత్తుకూ సంబంధించినదని, కానీ కొన్ని నిజాలు ఎంతకాలం దాగి ఉన్నా, వాటిని వెలుగులోకి తీసుకురావడానికి విధి ఒకరిని ఎంచుకుంటుంది"

తర్వాతి కథ👇 

మెల్లగా డైరీ తెరిచాడు. అందులో పసుపు రంగులోకి మారిపోయిన పాత కాగితాలు, అందమైన అక్షరాలతో వాక్యాలు రాసి ఉంది. డైరీ మొదటి పేజీలో ఇలా ఉంటుంది:

"నేను లక్ష్మిని ఈ డైరీ ఎవరి చేతికి పడినా... దయచేసి నిజాన్ని బయట పెట్టండి."

ఆ అక్షరాలపై కొన్ని కన్నీటి చుక్కల మచ్చలు ఇంకా కనిపిస్తున్నాయి. ఆ పేజీని చూస్తూనే రాఘవ గుండెలో తెలియని బాధ కలిగింది. అతను తర్వాతి పేజీ తిప్పాడు.

"ఆగస్టు 14, 1983...
ఈ రోజు చెరువు దగ్గర నేను ఒక విచిత్రమైన విషయం చూశాను. ఊరిలో అందరూ గౌరవించే ముగ్గురు పెద్దలు అర్ధరాత్రి సమయంలో పాత గోదాం దగ్గరకు వచ్చారు. వాళ్లతో పాటు ఇంకొక చిన్న అమ్మాయి కూడా ఉంది" రాఘవ ఒక్కసారిగా ఆగిపోయాడు. “ఇంకో అమ్మాయి...?” అని ఆశ్చర్యంగా అన్నాడు.

చన్నయ్య ముఖం పాలిపోయింది. “అది చదవకు” అని మళ్లీ చెప్పాడు. కానీ రాఘవ వినలేదు. తర్వాతి పేజీ తిప్పాడు.

"ఆ అమ్మాయి చాలా భయపడుతోంది, ఏడుస్తోంది. నేను దూరం నుంచి చూస్తున్నాను. వాళ్లు ఆమెను గోదాంలోకి తీసుకెళ్లారు. అప్పుడు నాకు అర్థమైంది. ఊరిలో అందరూ నమ్ముతున్న కథలు అబద్ధాలు అని."

అప్పుడే... గోదాం లోపల చల్లని గాలి ఒక్కసారిగా వీచింది. డైరీ పేజీలు వాటంతట అవే తిరగసాగాయి.

టక్...
టక్...
టక్...

ఎవరో మెల్లగా నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. రాఘవ, చన్నయ్య ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూశారు. గోదాం చివర, చీకటిలో, తెల్లటి వస్త్రం ధరించిన ఒక ఆకారం కనిపించింది. పొడవాటి జుట్టు, చేతికి వెండి గాజు, అది మెల్లగా ముందుకు వస్తోంది. ఆమె అడుగులు నేలను తాకుతున్నాయో లేదో కూడా అర్థం కావట్లేదు. 

చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడిపోయింది. చన్నయ్య కాళ్లు వణికిపోయాయి. “లక్ష్మి” అని అతని నోటి నుంచి మాట జారిపోయింది. ఆ ఆకారం మాత్రం ఏమీ మాట్లాడలేదు. కేవలం డైరీ వైపు చూపించింది. రాఘవ ధైర్యం చేసి మళ్లీ చదవడం ప్రారంభించాడు.

"నేను నిజాన్ని చూసాను. కానీ నన్ను కూడా వారు చూసేశారు. ఇప్పుడు నన్ను వెతుకుతున్నారు. నేను తిరిగి ఇంటికి చేరుకోగలనో లేదో తెలియదు. నాకు ఏదైనా జరిగితే, గోదాం వెనుక ఉన్న పాత బావిని చూడండి. అక్కడే అన్ని సమాధానాలు ఉన్నాయి."

ఆ వాక్యం చదివిన క్షణంలో గోదాం బయట ఒక్కసారిగా మెరుపు మెరిసింది.

ధడామ్...!

పిడుగు శబ్దంతో మొత్తం భవనం కంపించింది. అదే సమయంలో ఆ తెల్లటి ఆకారం మెల్లగా కనిపించకుండా పోయింది. కానీ వెళ్లే ముందు ఆమె కళ్లలో ఒక విచిత్రమైన ప్రశాంతత కనిపించింది. ఎన్నేళ్లుగా ఎదురు చూసిన వ్యక్తి చివరకు నిజం వైపు అడుగు వేసినట్టుగా రాఘవ డైరీని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు అతనికి ఒక విషయం స్పష్టమైంది.

లక్ష్మి మరణం వెనుక ఉన్న రహస్యం ఈ గోదాంలో లేదు. అది గోదాం వెనుక ఉన్న పాత బావిలో దాగి ఉంది. ఆ రాత్రి రాఘవ, చన్నయ్య ఇద్దరూ డైరీని పట్టుకుని గోదాం వెనుక ఉన్న పాత బావి దగ్గరకు వెళ్లారు. వర్షం మెల్లగా తగ్గుతోంది. కానీ బావి చుట్టూ మాత్రం ఒక విచిత్రమైన నిశ్శబ్దం అలుముకుంది.

చెట్ల ఆకులు కూడా కదలడం లేదు. ప్రకృతి మొత్తం ఏదో రహస్యం బయటపడబోతుందని ఎదురుచూస్తున్నట్టుంది. అప్పుడే బావి నీళ్లలో వెండి రంగు కాంతి మెరుస్తూ కనిపించింది. రాఘవ ఆశ్చర్యంగా లోపల చూశాడు. నీటి మీద ఎవరో నిలబడి ఉన్నట్టుగా కనిపించింది. మెరుపు వెలుగులో ఒక అద్భుతమైన రూపం బయటపడింది. తెల్లని వస్త్రాలు వెండి గాజులు, చంద్రకాంతిలా మెరిసే ముఖం, ఆమె సాధారణ అమ్మాయి కాదు ఒక అప్సరసలా కనిపిస్తోంది.

ఆమె చుట్టూ చంద్రకాంతి వలయం ఏర్పడింది. ఆమెను చూస్తుంటే భయం కంటే భక్తి ఎక్కువగా కలుగుతోంది. ఆ రూపం కళ్లలో కోపం లేదు. వేదన మాత్రమే ఉంది. రాఘవ చేతిలో ఉన్న డైరీ ఒక్కసారిగా తెరుచుకుంది. చివరి పేజీ గాలికి కదిలింది. అందులో ఇలా రాసి ఉంది:

"నేను చూసింది నేరం కాదు, అది ఒక రహస్యం. చెరువు దగ్గర కనిపించే ఆ రూపం ఆత్మ కాదు. ఆమె ఈ చెరువును కాపాడే దైవ శక్తి."

రాఘవ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఆ అప్సరస రూపం మెల్లగా మాట్లాడింది.

"ఎన్నేళ్ల క్రితం ఈ ఊరు నీళ్ల కోసం, పంటల కోసం నన్ను ప్రార్థించేది. కానీ కొందరు స్వార్థంతో చెరువును నాశనం చేయాలని ప్రయత్నించారు. లక్ష్మి ఆ నిజాన్ని తెలుసుకుంది."

చన్నయ్య తల వంచుకున్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు కనిపించాయి.

"అవును..." అని మెల్లగా అన్నాడు.

"మేము తప్పు చేశాం."
"చెరువు భూమిని అమ్మేయాలని కొందరు పెద్దలు కుట్ర చేశారు.  

వాళ్ళతో కొన్ని రోజులు నేను కూడా చెయ్యి కలిపాను. తర్వాత నా తప్పు తెలుసుకొని వదిలిపెట్టాను. 

"నన్ను క్షమించండి."

"లక్ష్మి ఈ విషయాన్ని అందరికీ చెప్పబోయింది."

ఆ మాటలు వినగానే...
బావి నీళ్లు ఒక్కసారిగా అలలతో ఉప్పొంగాయి. ఆకాశంలో చంద్రుడు మేఘాల వెనుక నుంచి బయటకు వచ్చాడు. అప్సరస రూపం మరింత ప్రకాశించింది.

అప్సరస రూపం మరింత ప్రకాశించింది.

"లక్ష్మిని ఎవరూ చంపలేదు. ఆమె నన్ను కాపాడేందుకు వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. కానీ ఆమె ఆత్మకు ఒక కోరిక మిగిలిపోయింది. నిజం బయటకు రావాలి."

ఆ మాటలతో చెరువు నీటి మధ్య నుంచి ఒక చిన్న వెండి గాజు పైకి తేలింది. అదే లక్ష్మి చేతికి ఉండే గాజు. రాఘవ దానిని చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే చుట్టూ తెల్లటి కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో లక్ష్మి చిరునవ్వుతో కనిపించింది. ఏళ్లుగా ఆమె హృదయంలో మిగిలిపోయిన భారమంతా ఒక్క క్షణంలో కరిగిపోయినట్టుగా అనిపించింది.

భయం లేదు.
వేదన లేదు.

ఏళ్లుగా ఎదురుచూసిన ప్రశాంతత మాత్రమే ఉంది.

"ధన్యవాదాలు..." అని ఆమె స్వరం మెల్లగా వినిపించింది.

"ఇప్పుడు నేను వెళ్లగలను..."

ఆ క్షణంలో ఆమె రూపం చంద్రకాంతిలో కలిసిపోయింది. అప్సరస రూపం కూడా ఆకాశం వైపు లేచి నెమ్మదిగా అదృశ్యమైంది. చెరువు మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. మరుసటి రోజు రాఘవ డైరీలో ఉన్న నిజాన్ని ఊరంతా చెప్పాడు. చెరువు భూమిని రక్షించారు. గోదాం కూల్చివేసి అక్కడ ఒక చిన్న స్మారక చిహ్నం నిర్మించారు. దాని మీద ఇలా రాశారు:

"లక్ష్మి – నిజం కోసం నిలిచిన ధైర్యవంతురాలు."

ఇప్పటికీ పౌర్ణమి రాత్రి చెరువు దగ్గరకు వెళితే, నీటి మీద చంద్రుడి కాంతి మధ్య ఒక వెండి గాజు మెరుస్తుందని అంటారు. కానీ ఇక ఎవరూ భయపడరు. ఎందుకంటే అది ఒక ఆత్మ కాదు. తన ఊరిని, తన చెరువును కాపాడిన ఒక ధైర్యమైన అమ్మాయి జ్ఞాపకం. రాఘవ ఆ వెండి గాజును చెరువు ఒడ్డున ఉన్న స్మారక చిహ్నం వద్ద ఉంచాడు. పౌర్ణమి చంద్రుడు దానిపై పడగా, అది మెల్లగా మెరిసింది. ఆ మెరుపు లక్ష్మి చివరి చిరునవ్వులా కనిపించింది.

ముగింపు ✨

నీతి:

నిజం ఎంతకాలం దాచినా, ఒక రోజు వెలుగులోకి వస్తుంది. ధైర్యంగా నిలిచిన మంచి మనుషుల జ్ఞాపకం ఎప్పటికీ మాయమవదు.


ఈ కథ మీకు నచ్చిందా?

లక్ష్మి స్థానంలో మీరు ఉంటే నిజాన్ని బయటపెట్టడానికి ధైర్యం చేసేవారా?

మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి.

ఇలాంటి మరిన్ని సస్పెన్స్, మిస్టరీ కథల కోసం మా బ్లాగ్‌ను Follow చేయండి

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...