అర్జున్ పుస్తకంలో ఉన్న పజిల్‌ను జాగ్రత్తగా లెక్కించాడు. (3 × 4) + (10 ÷ 2) - 14 = ? 12 + 5 - 14 = 3 కానీ కోటలోకి వచ్చినప్పుడు చదివిన సూచన అతనికి గుర్తొచ్చింది: "వచ్చిన సమాధానం నుండి 1 తీసివేయాలి." అంటే 3 - 1 = 2 అర్జున్ ధైర్యంగా గది 2 తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. గది అంతా చీకటిగా ఉంది. గోడలపై పాత చిత్రాలు వేలాడుతున్నాయి. మధ్యలో ఒక చిన్న రాతి బల్ల కనిపించింది. ఆ బల్లపై ఒక తాళంచెవి కాదు... తాళంచెవుల గుత్తి! కనిపించింది. "అయితే వీటిలో ఒకటి పెద్ద ఇనుప తలుపుకు సరిపోతుందేమో!" అని సంతోషంగా అనుకున్నాడు. అర్జున్ వెంటనే ఆ గుత్తిని తీసుకుని భారీ ఇనుప తలుపు దగ్గరకు వెళ్లాడు. అతను ఒక తాళంచెవిని తీసి తాళంలో పెట్టబోతుండగా... అకస్మాత్తుగా కోట అంతా కంపించింది! గోడల మధ్య నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. "సరిగ్గా ఆలోచించు ప్రయాణికుడా! నీకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది!" అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అప్పుడే తాళం మీద బంగారు అక్షరాలు వెలిగాయి. "సరైన తాళంచెవి సంఖ్యను కనుగొనకపోతే ఈ తలుపు ఎప్పటికీ తెరుచుకోదు." అప్పుడే అతని ముందు రెండు చిత్రాలు ప్రత్యక్షమయ...
Episode -4 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి
ముప్పై ఏళ్లుగా మూసి ఉన్న గోదాం తలుపు తెరిచిన రాత్రి... చనిపోయిందని అనుకున్న లక్ష్మి చేతిరాత మళ్లీ కనిపించింది."
"ఆ డైరీలో ఉన్న ఒక్క వాక్యం...
ఊరి చరిత్రనే మార్చబోతోందని అప్పటికి రాఘవకు తెలియదు."
"ఆ రాత్రి లక్ష్మి ఒంటరిగా లేదు” ఆ మాట వినగానే రాఘవ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. చన్నయ్య గొంతు మాత్రం స్పష్టంగా వినిపించింది. అతని కళ్ళు గోదాం తలుపు మీదే నిలిచిపోయాయి. గోదాం తలుపు పక్కన వేలాడుతున్న పాత ఇనుప గొలుసు చిరుచిరు మంటూ ఊగింది. చన్నయ్య వేగంగా శ్వాసాను తీసుకున్నాడు.
అతని గొంతు బరువెక్కింది. చన్నయ్య ముఖం క్షణం పాటు స్పష్టంగా కనిపించింది. ఏళ్లుగా దాచిపెట్టిన పాపభీతి కూడా కనిపించింది.
"ఏదో చూసింది... ఇది ముందు ధాన్యం నిల్వ చేసే చోటు కాదు రాఘవా…”
అక్కడ వినిపిస్తున్న కప్పల అరుపులు కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. వాన నీళ్లు మట్టిలో పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. అతని గొంతు ఆగిపోయింది. ఇప్పుడు మరింత వేగంగా బయటికి వస్తున్నట్టుగా కనిపించాయి. "ఈ ఊరిలో కొంతమంది పెద్దలు చేసిన పని ఎవరూ తెలుసుకోకూడదని అనుకున్నారు ఆ నిజం చూసింది.”
లోపల నుంచి ఎవరో మెల్లగా తడుముతున్నట్టుగా కంపించాయి. గోదాం లోపల నేలపై మెల్లగా నడుస్తున్నట్టుగా, ఎవరో నిలబడి ఉన్నట్టుగా నీడ కనిపించినట్టైంది.
"ఆ తర్వాత ఆమెను కాపాడలేకపోయాం రాఘవా” ఒక్కసారిగా గట్టిగా తలుపు బాదిన శబ్దం ఇంకా ఆ చెరువు దగ్గర విన్న అమ్మాయి స్వరం కూడా వినిపించింది.
“నన్ను బయటికి తీయండి” చన్నయ్య ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. అప్పుడే అశ్చర్యంగా
“ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆమె ఇంకా ఇక్కడే ఉందా…?” అని వణుకుతున్న స్వరంతో అన్న క్షణం ఆ గోదాం చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా భారంగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు మరింత దగ్గరగా చేరుకున్నట్టుగా కనిపించాయి. మెరుపు వెలుగు కొన్ని క్షణాలు గోదాం గోడల మీద పడింది.
పాత ఇటుకల మధ్య పెరిగిన పచ్చిక, తుప్పు పట్టిన ఇనుప కడ్డీలు, చిరిగిపోయిన కిటికీ పలకలు అన్నీ కలిపి ఆ ప్రదేశాన్ని ఇంకా భయంకరంగా మార్చేశాయి. రాఘవ చెవులు మాత్రం ఇంకా ఆ స్వరాన్నే వింటున్నాయి.
“నన్ను బయటికి తీయండి.”
ఆ మాటల్లో ఒక భయం ఉంది, వేదన ఉంది, ఇంకా ఏళ్ల తరబడి ఎవరో చీకట్లో బంధించబడినట్టు అనిపించే బాధ ఉంది. చన్నయ్య నెమ్మదిగా తలుపు వైపు చూసాడు.
అతని కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది.
“ఈ తలుపు ముప్పై ఏళ్ల నుంచి ఎవరూ తీయలేదు రాఘవా” అని అతను అన్నాడు. రాఘవ ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు.
“ఎందుకు…?”
చన్నయ్య పెదవులు వణుకుతూ “ఆ రాత్రి తర్వాత…
ఈ గోదాం దగ్గరకు రావడానికే ఊరి వాళ్లు భయపడ్డారు.” అన్న వెంటనే గాలి మళ్లీ బలంగా వీచింది. తలుపుకి వేలాడుతున్న తుప్పు పట్టిన గొలుసు
“కీచ్… కీచ్…” అంటూ కదిలింది. ఆ శబ్దం వినగానే రాఘవ ఇంకా చన్నయ్య ఇద్దరికీ గుండె ఆగినటైంది.
ఎందుకంటే…
గొలుసు గాలికి కదిలినట్టుగా అనిపించలేదు. లోపల నుంచి
ఎవరో నెమ్మదిగా తలుపును తాకుతున్నట్టుగా అనిపించింది. రాఘవ చేతుల్లో చెమట పట్టింది.
“అంటే…?” అని రాఘవ అడిగాడు.
“ఆ రాత్రి”
“లక్ష్మి ఒంటరిగా చెరువు దగ్గరకు వెళ్లలేదు రాఘవా”
రాఘవ మెల్లగా అతని దగ్గరికి అడుగు వేసాడు.
“అయితే ఆమెతో పాటు ఇంకెవరు ఉన్నారు?”
దూరంగా చెరువు వైపు నుంచి ఆ నిశ్శబ్దం మధ్యలో చన్నయ్య నెమ్మదిగా తల పైకి ఎత్తాడు.
“ఏళ్ల క్రితం లక్ష్మి ఒక రాత్రి... "
అంతే... అదే సమయంలో గోదాం లోపల నుంచి
ఎవరో ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపించింది.
“హ్హ్… హ్హ్…”
ఆ శబ్దం చాలా బలహీనంగా ఉంది. కానీ స్పష్టంగా వినిపిస్తోంది. రాఘవ ఊపిరి బిగుసుకుంది. చన్నయ్య ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు.
“మళ్లీ మొదలైంది…” అని చన్నయ్య వణికిపోయే గొంతుతో అన్నాడు.
గోదాం తలుపు చెక్కలు
టక్…
టక్…
టక్…
ప్రతి శబ్దం మధ్యలో కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే ఇంకా భయంకరంగా అనిపిస్తోంది. రాఘవ చెవులకు ఇప్పుడు మరో శబ్దం కూడా వినిపించింది. నీళ్లు చిందుతున్న శబ్దం కాదు.
ఎవరో తడిసిన కాళ్లతో
చప్ప్…
చప్ప్…
చప్ప్…
అప్పుడే మెరుపులు మరోసారి మెరిసింది. ఆ క్షణంలో—
గోదాం తలుపు కింద ఉన్న చిన్న పగుళ్ల మధ్య నుంచి తెల్లగా… నిశ్చలంగా…
“చన్నయ్య!” అని అతను భయంతో పిలిచాడు. కానీ చన్నయ్య మాత్రం అక్కడే గడ్డకట్టినట్టుగా నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి.
“మేము…"
అతని మాట పూర్తవగానే— గోదాం లోపల నుంచి
ధమ్…!
రాఘవ, చన్నయ్య ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాఘవ ఇక ఆగలేకపోయాడు. వెంటనే ఆ గోదాం దగ్గరకు వెళ్లి తాళాన్ని బలంగా లాగాడు. తుప్పు పట్టిన తాళం ఒక్కసారిగా విరిగిపోయింది.
కీచ్…! తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల చూస్తే ఎవరూ లేరు. పూర్తిగా చీకటి. పాత మట్టి వాసన, తడి నేల, ఇంకా గదిమధ్యలో పడి ఉన్న ఒక పెద్ద చెక్క పెట్టె. ఆ పెట్టె మీద కూడా
అదే వెండి గాజు గుర్తు చెక్కి ఉంది.
చన్నయ్య రాఘవ దగ్గరకు వెళ్లి చేతితో పెట్టెకు అంటుకున్న మట్టిని తుడిచాడు. అప్పుడే పెట్టె మూత మీద చిన్న అక్షరాలు కనిపించాయి. అవి చాలా పాతవిగా ఉన్నాయి. కాలం వాటి మీద తన ముద్ర వేసినట్టుగా, కొన్ని అక్షరాలు చెరిగిపోయాయి. మరికొన్ని మాత్రం ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాఘవ కళ్లను చిన్నగా చేసి
ఆ అక్షరాలను జాగ్రత్తగా చూడసాగాడు.
పెట్టె మూలలన్నీ దుమ్ముతో కప్పబడి ఉన్నాయి. అక్కడక్కడా సాలీడు గూళ్లు వేలాడుతున్నాయి. గదిలోకి బయట నుంచి వచ్చిన గాలి ఆ గూళ్లను నెమ్మదిగా కదిలించింది. అవి కదులుతున్న ప్రతి క్షణం
ఆ చీకటి గదిలో ఎవరో నిశ్శబ్దంగా నడుస్తున్నట్టుగా అనిపించింది. గోడలపై తేమ మరకలు ఉన్నాయి.
కొన్ని చోట్ల పాత సున్నం ఊడిపోయి లోపల ఇటుకలు బయటకు కనిపిస్తున్నాయి.
పైకప్పు నుంచి నీటి చుక్కలు టప్... టప్... అంటూ పడుతున్నాయి. ఆ శబ్దం తప్ప ఆ గదిలో ఇంకే శబ్దమూ లేదు. "రాఘవా మనం ఇది తెరవకపోతే మంచిది," అని చన్నయ్య మెల్లగా అన్నాడు.
రాఘవ చేతిలో ఉన్న టార్చ్ వెలుగు పెట్టె మీద పడింది. ఆ వెలుగులో వెండి గాజు గుర్తు ఒక్కసారిగా మెరుస్తూ కనిపించింది. అది సాధారణ గుర్తులా లేదు. దాని చుట్టూ చిన్న చిన్న గీతలు, వంకర ఆకారాలు, ఎవరో ఉద్దేశపూర్వకంగా చెక్కిన చిహ్నాల్లా కనిపించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ తాకనట్టుగా ఉన్న ఆ పెట్టె
అక్కడ నిశ్శబ్దంగా పడి ఉంది. కానీ దాన్ని చూస్తే మాత్రం అది ఏదో రహస్యాన్ని దాచిపెట్టినట్టుగా అనిపిస్తోంది.
రాఘవ గుండె చప్పుళ్లు ఆ నిశ్శబ్ద గదిలోనే వినిపిస్తున్నట్టుగా అనిపించాయి. అతని చూపు మాత్రం
పెట్టె మూతపై కనిపించిన ఆ చిన్న అక్షరాల మీదే నిలిచిపోయింది. అవి ఏమి చెబుతున్నాయో తెలుసుకోవాలనే ఆత్రుత అతని మనసులో ప్రతి క్షణం మరింత పెరుగుతోంది. గదిలోని చీకటి, పాత చెక్క పెట్టె, వెండి గాజు గుర్తు ఇంకా ఆ మసకబారిన అక్షరాలు— అన్నీ కలిసి ఎన్నేళ్లుగా మూసి ఉంచిన ఒక రహస్యం
ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధమవుతున్నట్టుగా అనిపించాయి.
రాఘవ కూడా చేతితో మట్టిని తుడిచాడు. అప్పుడే…
పెట్టె మూత మీద చిన్న అక్షరాలు కనిపించాయి. రాఘవ మట్టిని పూర్తిగా తుడిచాడు. మొదటి అక్షరం "ల" రెండోది "క్ష్మి" చివరకు మొత్తం పేరు స్పష్టమైంది.
“లక్ష్మి” రాఘవ చేతులు వణికసాగాయి. అతను మెల్లగా పెట్టె మూతను పైకి లేపాడు. మూత తెరుచుకున్న క్షణంలో, చన్నయ్య ఒక్కసారిగా గట్టిగా అరవసాగాడు. ఎందుకంటే ఆ పెట్టెలో ఏళ్లుగా పాడైపోయిన పాత బట్టల మధ్య…
ఒక చిన్న డైరీ ఉంది. డైరీ పేజీల అంచులపై కొన్ని తాజా నీటి చుక్కలు కనిపించాయి.
అవి పైకప్పు నుంచి పడినవా? లేక ఇప్పుడే ఎవరో ఆ డైరీని తాకారా? డైరీ మొదటి పేజీని అతను నెమ్మదిగా తెరిచాడు. ఆ పేజీలో రాసిన మొదటి వాక్యం చూసిన క్షణంలో అతని ముఖం పాలిపోయింది.
ఆ డైరీలో లక్ష్మి ఏమి రాసింది…?
ఆమె నిజంగా ఏమి చూసింది…?
ఇంకా
ఆ రహస్యం బయటపడితే ఊరిలో ఎవరి జీవితం పూర్తిగా మారిపోతుంది?
తెలుసుకుందాం తర్వాతి భాగంలో…
తర్వాతి భాగం త్వరలోనే వస్తుంది.
పూర్తి కథ చూడడానికి మా బ్లాగ్ ను ఫాలో అవ్వండి.
Part - 5 👉 Click Here

Comments
Post a Comment