Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Part-1 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవ

“Unknown Number నుంచి వచ్చిన కాల్”
అర్ధరాత్రి 2 గంటలు. ఇంట్లో గడియారం టిక్… టిక్… అని వినిపిస్తోంది. బయట గాలి మెల్లగా వీచుతోంది. చుట్టూ అంతా నిశ్శబ్దం. రవి మంచం మీద పడుకుని ఉన్నాడు… కానీ నిద్ర మాత్రం రావడం లేదు. ఎందుకో తెలియదు… ఆ రాత్రి అతనికి అసహజంగా అనిపిస్తోంది. అప్పుడే… ట్రింగ్… ట్రింగ్… ఫోన్ ఒక్కసారిగా గట్టిగా మోగింది. నిశ్శబ్దంలో ఆ శబ్దం చాలా పెద్దగా వినిపించింది. రవి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఈ టైమ్‌లో ఎవరు కాల్ చేస్తారు…?” అని అతను తనలోనే అనుకున్నాడు.

ఫోన్ స్క్రీన్ వైపు చూసాడు. Unknown Number. ఒక్క క్షణం ఆలోచించాడు… లిఫ్ట్ చేయాలా… వద్దా… ఫోన్ మోగుతూనే ఉంది. మరోసారి… మరోసారి… చివరికి ధైర్యం చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో…” అని నెమ్మదిగా అన్నాడు. అవతల నుంచి ఎలాంటి సమాధానం లేదు. కేవలం… నిశ్శబ్దం.

రవి: హలో… ఎవరు మాట్లాడుతున్నారు?” అని మళ్లీ అడిగాడు. ఇంకా సమాధానం లేదు. కానీ…చాలా జాగ్రత్తగా వింటే… అవతల నుంచి సున్నితంగా ఊపిరి పీల్చిన శబ్దం వినిపిస్తోంది. రవి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అతను ఫోన్‌ను చెవికి దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా విన్నాడు.

కొన్ని సెకన్లు గడిచాయి… అప్పుడే ఒక స్త్రీ గొంతు చాలా నెమ్మదిగా, కంపించినట్లుగా వినిపించింది: రవి…” రవి షాక్ అయ్యాడు. నా పేరు…?” అని అతను తనలోనే అనుకున్నాడు. ఆ గొంతు మళ్లీ వచ్చింది: రవి… విను…” ఇప్పుడు రవి కంగారు పడిపోయాడు. ఎవరు మీరు? నా నెంబర్ మీకు ఎలా వచ్చింది?” అని అడిగాడు. కొన్ని క్షణాలు మళ్లీ నిశ్శబ్దం… అతని గుండె శబ్దమే అతనికి వినిపిస్తోంది.

తర్వాత ఆ స్త్రీ గొంతు కాస్త గట్టిగా… కానీ ఇంకా భయంతోనే: నువ్వు ఏం చేసినా… తలుపు మాత్రం తెరవకు.” రవి ఒక్కసారిగా చుట్టూ చూసాడు. తలుపు వైపు అతని చూపు వెళ్లింది. ఎందుకు? ఏమైంది?” అని అతను గట్టిగా అడిగాడు. ఆమె మళ్లీ మాట్లాడింది… ఈసారి కాస్త స్పష్టంగా… కానీ చాలా ఆందోళనతో: ఎవరైనా తలుపు తట్టినా… ఎప్పుడూ తెరవకు.” రవి కంగారు పడ్డాడు. ఎందుకు? ఏమైంది? మీరు ఎవరు?” అని వరుసగా తడబడుతూ అడిగాడు.  


కాసేపు మళ్లీ నిశ్శబ్దం… ఆ నిశ్శబ్దం లోనే ఏదో భయం దాగి ఉన్నట్టుగా... అవతల నుంచి ఒక్క మాట మాత్రమే వచ్చింది: అది ఇప్పటికే అక్కడికి వచ్చేసింది…” అంతే తర్వాత ఆమె మాట్లాడలేదు. హలో… హలో… వినిపిస్తుందా?” అని రవి గట్టిగా అన్నాడు.

అంతే… కాల్ ఒక్కసారిగా కట్ అయిపోయింది. ఫోన్ స్క్రీన్ మళ్లీ నిశ్శబ్దంగా వెలుగుతోంది.
“Call Ended.” 

రవి చేతులు కొంచెం వణుకుతున్నాయి. ఫోన్‌ను నెమ్మదిగా కింద పెట్టాడు. అతను కాసేపు అక్కడే నిలబడి ఉన్నాడు… ఏం జరిగిందో అర్థం కాక. నెమ్మదిగా చుట్టూ చూసాడు. ఇంటి లోపల అంతా నిశ్శబ్దం. గడియారం టిక్… టిక్… అని వినిపిస్తోంది. కానీ ఇప్పుడు ఆ శబ్దం కూడా అతనికి అసహజంగా అనిపిస్తోంది. అతని చూపు నెమ్మదిగా తలుపు వైపు వెళ్లింది. ఆమె చెప్పిన మాటలు అతని మెదడులో తిరుగుతున్నాయి: తలుపు తెరవకు… ఇది ఏమిటి? ఎవరు ఆమె? ఇలా ఎందుకు చెప్పింది? అని రవి తనలోనే అనుకుంటున్నాడు.

అప్పుడే… ఒక చిన్న గాలి తాకింది. తలుపు దగ్గర వేలాడుతున్న కర్టెన్ కొంచెం కదిలింది. రవి ఒక్కసారిగా గమనించాడు. తలుపు వైపు చూస్తూ నిలిచిపోయాడు. కొన్ని క్షణాలు… ఏ శబ్దం లేదు. రవి కాస్త ఊపిరి తీసుకున్నాడు. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో…” అని తనను తాను ఓదార్చుకున్నాడు. అప్పుడే అవతల నుండి కొన్ని వింత శబ్దాలు వినబడటం మొదలయ్యాయి.  అంతే... రవి నిశ్శబ్దంగా అలాగే నిలబడ్డాడు… కదలలేక. తలుపు బయట ఎవరు ఉన్నారు…? అని అనుకున్నాడు.

అప్పుడే… టక్… టక్… టక్… ఎవరో తలుపు తట్టారు. ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో చాలా గట్టిగా వినిపించింది. రవి ఒక్కసారిగా గట్టిగా నిలిచిపోయాడు. శరీరం మొత్తం చెమటలు పట్టిపోయాయి. చేతులు చల్లగా మారిపోయాయి. ఫోన్‌లో కొన్ని క్షణాల క్రితం వినిపించిన మాటలు అతని చెవుల్లో మళ్లీ మళ్లీ మార్మోగుతున్నాయి: ఎవరైనా తలుపు తట్టినా… ఎప్పుడూ తెరవకు.”

మళ్లీ… టక్… టక్… ఈసారి కొంచెం గట్టిగా. రవి నెమ్మదిగా తలుపు వైపు ఒక అడుగు వేసాడు… కానీ వెంటనే ఆగిపోయాడు. ఇది నిజంగానే ఎవరోనా…? లేక…” అని తనలోనే అనుకున్నాడు. అప్పుడే బయట నుంచి ఒక గొంతు వినిపించింది: రవి… నేనే రా… తలుపు తెరువు.” ఆ గొంతు చాలా పరిచితంగా ఉంది. రవి కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అరుణ్…?” అని అతను మెల్లగా అన్నాడు. అది నిజంగా అతని ఫ్రెండ్ అరుణ్ గొంతులానే అనిపిస్తోంది. అదే టోన్… అదే స్టైల్… కానీ… రవి మనసులో ఇంకో వాయిస్ కూడా వినిపిస్తోంది. తలుపు తెరవకు…” అతను అయోమయంలో పడిపోయాడు. అరుణ్ నిజంగానే వచ్చాడా? లేక… ఇది ఇంకేదైనా?

మళ్లీ తలుపు మీద శబ్దం పెరిగింది. టక్! టక్! టక్! ఈసారి ఆ గొంతు కాస్త ఆందోళనగా: రవి! త్వరగా తలుపు తెరువు… నాకు సమస్య వచ్చింది!” రవి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు?” అని ఆలోచించాడు. బయట నుంచి మళ్లీ: రా! దయచేసి తలుపు తెరువు… బయట నిలబడలేకపోతున్నా…” ఆ గొంతులో వేడుక ఉంది. అది నిజంగానే అరుణ్ లాగా అనిపిస్తోంది. రవి తలుపు దగ్గరకు వెళ్లి ఆగిపోయాడు. చేతిని లాక్ దగ్గర పెట్టాడు… కానీ ఇంకా తీయలేదు.

అరుణ్… నువ్వేనా?” అని గట్టిగా అడిగాడు. కొన్ని సెకన్లు నిశ్శబ్దం… తర్వాత వెంటనే సమాధానం: అవును రా… నేనే! నువ్వు ఎందుకు ఇంత టైమ్ తీసుకుంటున్నావ్?” రవి కొంచెం వెనక్కి తగ్గాడు. ఏదో సరిగా లేదని అనిపిస్తోంది. నువ్వు ఎక్కడినుంచి వచ్చావ్?” అని అడిగాడు. బయట నుంచి వెంటనే సమాధానం రాలేదు. కొన్ని క్షణాలు గడిచాయి…

తర్వాత కాస్త తడబడిన గొంతు: అది… తర్వాత చెబుతాను… ముందు తలుపు తెరువు.” అప్పుడే… తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్ దగ్గర ఒక నీడ కదిలింది. ఎవరో అక్కడ నిలబడి ఉన్నట్టు. రవి శ్వాస ఆపుకుని ఆ గ్యాప్ వైపు చూశాడు. కానీ అతనికి ఏమి కనిపించలేదు.  నిజంగానే అరుణ్ కు ఏమైనా సమస్య వచ్చిందా..." అని అనుకున్నాడు.

ఒకవైపు ఫ్రెండ్ గొంతు… మరోవైపు ఫోన్‌లో వచ్చిన హెచ్చరిక… ఎవరిని నమ్మాలి…?”  రవి పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. ఏది నిజం… ఏది తప్పు… అర్థం కావడం లేదు. తలుపు బయట నిలబడి ఉన్నది నిజంగా అరుణ్ అయితే? అతను ప్రమాదంలో ఉంటే?

“నేను తలుపు తెరవకపోతే…” అన్న ఆలోచన అతన్ని ఇంకా కలవరపరిచింది. కానీ… ఆ స్త్రీ చెప్పిన మాటలు కూడా అతని మెదడులో గట్టిగా వినిపిస్తున్నాయి: తలుపు తెరవకు…” రవి కళ్ళు మూసుకుని ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. చివరికి ధైర్యం చేసి తలుపు దగ్గరకు నడిచాడు. అతని అడుగులు నెమ్మదిగా… ప్రతి అడుగు కూడా భారంగా అనిపిస్తోంది. తలుపు దగ్గరకి చేరుకుని ఆగిపోయాడు. కొన్ని క్షణాలు మాట్లాడకుండా నిలబడ్డాడు.

ఎవరవు?” అని కాస్త గట్టిగా అడిగాడు. అవతల నుంచి వెంటనే సమాధానం వచ్చింది: నేనే అరుణ్ రా… నువ్వు తలుపు తెరువు.” ఆ గొంతు… చాలా సహజంగా ఉంది. ఏ అనుమానం రాకుండా మాట్లాడుతోంది. రవి తలుపు లాక్ వైపు చూసాడు. అతని చేయి నెమ్మదిగా లాక్‌పైకి వెళ్లింది. చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. ఇది నిజంగా అరుణ్ అయితే… నేను ఎందుకు భయపడుతున్నాను?” అని తనలోనే అనుకున్నాడు. బయట నుంచి మళ్లీ గొంతు: రవి… ప్లీజ్ రా… త్వరగా తలుపు తెరువు…” ఆ మాటల్లో ఒక ఒత్తిడి ఉంది. రవి ఇక ఎక్కువ ఆలోచించలేకపోయాడు.

నెమ్మదిగా… లాక్ తిప్పడం మొదలుపెట్టాడు. క్లిక్… మొదటి లాక్ ఓపెన్ అయింది. అతను రెండో లాక్ వైపు చేయి తీసుకెళ్లాడు… అప్పుడే… ట్రింగ్… ట్రింగ్… ఫోన్ ఒక్కసారిగా మోగింది! ఆ శబ్దం రవిని గట్టిగా కుదిపేసింది. అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఫోన్ స్క్రీన్ వెలుగుతోంది… అదే నెంబర్. రవి గుండె మరింత వేగంగా కొట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఎందుకు కాల్…?” అని అయోమయంలో పడిపోయాడు. బయట నుంచి ఆ గొంతు ఇంకా వినిపిస్తోంది: రవి! ఫోన్ పట్టుకోకు… ముందు తలుపు తెరువు!” ఇప్పుడు రవి పూర్తిగా గందరగోళంలో పడిపోయాడు.

ఒకవైపు ఫోన్… మరోవైపు తలుపు… ఫోన్ మోగుతూనే ఉంది. ఒక్కసారి… రెండుసార్లు… చివరికి అతను తడబడుతూ ఫోన్ దగ్గరకు వెళ్లాడు. తలుపు వైపు చూస్తూనే… ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో…” అని నెమ్మదిగా అన్నాడు. అవతల నుంచి వెంటనే ఆ స్త్రీ గొంతు: ఈసారి… ముందుకంటే ఎక్కువ ఆతురంగా… రవి! వెంటనే తలుపు దగ్గర నుంచి దూరంగా వెళ్లు!” రవి గుండె ఒక్కసారిగా గుబులు కొట్టింది. ఎందుకు? బయట ఉన్నది అరుణ్!” అని అతను గట్టిగా అన్నాడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం… తర్వాత ఆమె నెమ్మదిగా… కానీ భయంకరంగా చెప్పింది: అయితే… నీ వెనకాల నిల్చున్నవాడు ఎవరు?”  రవి గుండె ఆగినట్టయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసాడు… అక్కడ… అరుణ్ నిలబడి ఉన్నాడు. అరుణ్: రవి ఎందుకు రా అలా ఉన్నావు?"

రవి కొంచం కంగారుగా... పొద్దున్న నువ్వు ఊరికి బయలుదేరావు కదా... ఎప్పుడు వచ్చావు" అని అడిగాడు.  నేను అప్పుడే వచ్చాను కానీ తలుపు ఎవరు అప్పట్నుంచి అలా తట్టుతున్నారు?  అని అరుణ్ ఒక్కసారిగా అడిగాడు. రవి: ఏమో తెలియదు నీ పేరే చెబుతున్నారు. అరుణ్ కంగారు పడుతూ  తలుపు తెరవకు రా… బయట ఉన్నది నేనే కాదు…”

టక్… టక్… టక్…

తర్వాత ఏమి జరిగిందో 
Next Part లో చూద్దాం..

Part-2 👉 Click Here



Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...