Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Episode - 2 ఉమ్మడి కుటుంబం1980 పల్లె జ్ఞాపకాలు

 

“1980లో… ఒక చిన్న పల్లెలో జరిగిన సాధారణ సంఘటన… ఏళ్ల తర్వాత కూడా ఆ ఊరి వాళ్లు మర్చిపోలేకపోయారు. ఆ కథ మొదలైంది మాత్రం… ఒక చిన్నారి చేతిలో ఉన్న మట్టి కుండ దగ్గర నుంచే…”

తర్వాత భాగం👇

శారద మళ్లీ తన చిన్న కుండను నీళ్లలో ముంచింది. ఈసారి మాత్రం జాగ్రత్తగా రెండు చేతులతో పట్టుకుంది. కొంచెం నీళ్లు కుండలో నిండగానే… ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోయింది. అమ్మా చూడు… నింపేశా!” అంటూ గట్టిగా అరిచింది. అక్కడున్న ఆడవాళ్లు నవ్వుకుంటూ, అయ్యో… మన శారద ఇప్పుడు పెద్దమ్మాయి అయిపోయిందే!” అన్నారు. శారద సిగ్గుపడుతూ అమ్మ వెనకాల దాక్కుంది. అప్పుడే కాలువ పక్కన కూర్చున్న పెద్దావిడ వెంకటమ్మ మాట్లాడుతూ, సుమతి… ఈ ఏడాది వానలు బాగున్నాయి. పంట కూడా బాగుంటుందేమో!” అంది.

సుమతి నీళ్లు కుండలో నింపుకుంటూ, దేవుడు దయ చేస్తే అప్పులు కొంచెం తీరతాయి పెద్దమ్మ…” అంది నెమ్మదిగా. ఆ మాట విన్న దగ్గరున్న వాళ్లు ఒక్కసారి మౌనంగా అయ్యారు. ఆ రోజుల్లో రైతు జీవితమంటే అలానే ఉండేది. వానలు బాగా పడితే పంట బాగుంటుంది. లేకపోతే ఏడాది మొత్తం కష్టమే. ఇంతలో కాలువ పక్కనే ఉన్న పిల్లలు మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేస్తున్నారు. శారద కూడా వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చుంది. ఇది మా ఇల్లు…” అంటూ మట్టితో చిన్న గోడ కట్టింది. ఇది మా ఆవు…” అంటూ పక్కనే ఇంకో మట్టి ముద్ద పెట్టింది. పిల్లల ఊహల్లో ఆ చిన్న మట్టి ప్రపంచమే నిజమైన రాజ్యం.

సుమతి నీళ్లు నింపేసి, “శారద… వెళదామా?” అని పిలిచింది. కానీ శారద మాత్రం, “ఇంకొంచెం సేపు ఆడుకుంటా అమ్మా…” అంది మొహం చిట్లిస్తూ. ఇంటికి వెళ్లాక మీ నాన్న పొలానికి వెళ్లాలి. నాకు ఇంకా చాలా పనులున్నాయి.” అంది సుమతి. అంతే… శారద తన చిన్న కుండను మళ్లీ ఎత్తుకుంది. తిరుగు దారిలో సూర్యుడు కొంచెం పైకి ఎక్కాడు. మట్టిదారిపై చెట్ల నీడలు పడుతున్నాయి. దారిమధ్యలో ఒక బండిపై ఇద్దరు రైతులు వరి సంచులు తీసుకెళ్తున్నారు.

ఎద్దులు నెమ్మదిగా నడుస్తుంటే… వాటి మెడల్లో ఉన్న గంటలు టన్… టన్… అంటూ మోగుతున్నాయి. శారద ఆ శబ్దం విని ఆనందంగా, “అమ్మా… మన ఎద్దులకీ ఇలా గంటలు కడదాం!” అంది. సుమతి నవ్వుతూ, ముందు మనవి పంట కోత దాకా బలంగా ఉండాలి కదమ్మా!” అంది. ఇంటికి చేరేసరికి సుమతి అత్త అయిన రాములమ్మ బయట మగ్గం దగ్గర కూర్చుని పాత చీర అల్లుతోంది. ఇంత సేపా?” అంది కాస్త గట్టిగా. పాప కూడా వచ్చింది కదా అమ్మా… అందుకే కొంచం ఆలస్యమైంది.” అంది సుమతి. రాములమ్మ శారద చేతిలో ఉన్న చిన్న కుండ చూసి నవ్వుకుంది. అయ్యయ్యో… మన చిన్నమ్మ కూడా ఇప్పుడు నీళ్లు తెస్తుందా?” అంది. శారద గర్వంగా తల ఊపింది. 

ఆ రోజులలో ఇళ్లన్నీ దాదాపు ఉమ్మడి కుటుంబాలే. ఒకే ఇంట్లో తాతలు... అమ్మమ్మలు… అన్నదమ్ములు… వారి పిల్లలు… అందరూ కలిసి ఉండేవారు. ఇంటి మధ్యలో పెద్ద మేడ. ఒక మూలలో ధాన్యం బస్తాలు. మరొక వైపు ఆవుల కొట్టు. వంట మాత్రం ఒకటే. పెద్ద గిన్నెల్లో అన్నం వండేవారు. మధ్యాహ్నం అయ్యేసరికి అందరూ నేలమీద వరుసగా కూర్చుని కలిసి తినేవారు. వీళ్ళ ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు అత్తయ్య - మావయ్య, సుమతి - సుమతి భర్త ఇంకా వాళ్ళ కూతురు శారద.  శారద ఒక్కతే కూతురు అయినందుకు తనని అల్లారు ముద్దుగా చూసుకొనేవారు.  శారద ఇంట్లో ఉంటే చాలు ఇల్లంతా సందడిగా ఉండేది. సుమతి భర్త పొలానికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. అంతలో ఇంటి ముందున్న చిన్న మట్టిమేడ మీద కుండలు వరుసగా పెట్టింది సుమతి ఇంకా శారద. కొత్తగా తెచ్చిన నీళ్ల చల్లదనం ఇంకా వాటి మీద కనిపిస్తూనే ఉంది. అప్పుడే లోపల నుంచి రాఘవుడు బయటికి వచ్చాడు. పొలానికి వెళ్లేందుకు… తెల్లని పంచె కట్టుకుని, భుజాన గొడ్డలి వేసుకుని, చేతిలో చిన్న తాడు పట్టుకుని నడుస్తూ వచ్చాడు.

ఇంటిముందు నిలబడి కుండలను చూసి, నీళ్లు తెచ్చావా?” అని అడిగాడు. సుమతి చెమటను చీరకొంగుతో తుడుచుకుంటూ నవ్వింది. తెచ్చా… కానీ ఈరోజు నీ కూతురు కూడా పెద్ద పని చేసింది.” అంది. రాఘవుడు ఆశ్చర్యంగా శారద వైపు చూసాడు. అయ్యో… ఏం చేసింది మన బుజ్జి?” అని అడిగాడు. 

అంతే… శారద వెంటనే ఇంటి మూలన పెట్టిన తన చిన్న మట్టి కుండ దగ్గరకు పరుగెత్తింది. రెండు చేతులతో ఆ చిన్న కుండను ఎత్తుకుని చూపిస్తూ, నేనే నీళ్లు తెచ్చా!” అంది గర్వంగా. ఆ చిన్న ముఖంలో కనిపించిన ఆనందం చూసి… రాఘవుడు పెద్దగా నవ్వేశాడు. అయ్యో అయ్యో… ఇక నాకు సహాయం చేసే వాళ్లు పెరిగిపోయారే!” అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. శారద నవ్వుతూ తండ్రి మెడ పట్టుకుంది. నేను పెద్దయ్యాక నీతో పొలానికి కూడా వస్తా!” అంది అమాయకంగా. అలానా? మరి నాకు అన్నం కూడా తెస్తావా?” అన్నాడు రాఘవుడు సరదాగా. వెంటనే హుమ్ తెస్తా!” అంది శారద. మరి అమ్మను ఎవరు చూసుకుంటారు?” అని అడిగితే  శారద కాసేపు ఆలోచించి, అమ్మ కూడా మనతో వస్తుంది!” అను చెప్పింది. ఆ మాట విన్న సుమతి నవ్వకుండా ఉండలేకపోయింది.

అలా ఆ రోజు… ఆ చిన్న ఇంట్లో నవ్వులు, మాటలు, ఆప్యాయతలతో ఒక ప్రత్యేకమైన ఆనందం నిండిపోయింది. కొద్దిసేపటికే సుమతి పొయ్యి మీద పెట్టిన పెద్ద గిన్నెలో నీళ్లు బాగా వేడయ్యాయి. ఆవిరి నెమ్మదిగా పైకి ఎగిరిపోతూ ఉండగా… సుమతి శారదను దగ్గరకు పిలిచింది. సరే చిట్టితల్లి… నీళ్లు వేడి అయ్యాయి. ఇక పద, నీకు స్నానం చేయిస్తా.” అంది ముద్దుగా. శారద చిన్నగా నవ్వుతూ పరుగెత్తుకుంటూ వచ్చింది. చల్లని నీళ్లు పోయొద్దమ్మా…” అంది ముందుగానే భయపడుతూ. అయ్యో… మా బంగారానికి చల్లని నీళ్లు పోస్తానా?” అంటూ సుమతి నవ్వింది.

ఇంటి వెనుక చిన్న మట్టిమేడ దగ్గర పెద్ద బిందెలో వేడి నీళ్లు పోసి, కొద్దిగా చల్లని నీళ్లు కలిపింది.
చేత్తో నీళ్ల వేడి చూసి, ఇప్పుడు బాగున్నాయి…” మెల్లగా చెప్పింది. శారదను చిన్న పీట మీద కూర్చోబెట్టి నెమ్మదిగా స్నానం చేయించడం మొదలుపెట్టింది. కళ్ళు మూసుకోమ్మా…” అని చెప్పగానే శారద రెండు చేతులతో ముఖం కప్పుకుంది. సుమతి ఆమె తలపై నీళ్లు పోస్తూ, అయ్యో… ఎంత పెద్దమ్మాయైపోయిందో మా చిట్టితల్లి…”  అంటూ ప్రేమగా సరదాగా మాట్లాడుతూ స్నానం చేయించింది. స్నానం అయిపోయాక… లోపలికి తీసుకెళ్లి చెక్క పెట్టెలో మడతపెట్టి పెట్టిన మంచి బట్టలు తీసింది. పసుపు రంగు చిన్న లంగా, ఎరుపు జాకెట్ వేసింది.

తర్వాత జుట్టు నెమ్మదిగా దువ్వి, రెండు చక్కని జడలు వేసింది. జడల చివర ఎర్రటి రిబ్బన్లు కట్టింది. శారద అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటూ నవ్వుకుంది. అది చూసిన సుమతి గుండె నిండిపోయింది. ముఖానికి చిన్న నల్ల బొట్టు పెట్టి, ఇప్పుడు చూడు మా చిట్టితల్లి ఎలా మెరుస్తోందో…”  అంటూ చెంపపై చిన్న దృష్టి చుక్క కూడా పెట్టింది. ఎందుకమ్మా ఇది?” అని శారద అడిగితే  మా బంగారాన్ని ఎవరి దృష్టి తగలకుండా ఉండాలని…” అంది సుమతి. శారదకు అది పూర్తిగా అర్థం కాకపోయినా... అమ్మ ప్రేమ మాత్రం బాగా అర్థమైంది. ఇక్కడే కూర్చోమ్మా… కదలొద్దు” అని చెప్పి సుమతి లోపలికి వెళ్లింది. 

కొద్దిసేపటికి ఒక చిన్న గిన్నెలో వేడి వేడి అన్నం, పప్పు, కొద్దిగా నెయ్యి కలుపుకుని వచ్చింది. శారద ముందు కూర్చుని చిన్న ముద్దలు చేస్తూ తినిపించడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక చిన్న పిట్ట ఉండేదట…” అంటూ కథ కూడా చెప్పసాగింది. కథ వింటూ శారద కళ్ళు పెద్దవిగా చేసుకుంది. అమ్మా… ఆ పిట్ట ఎక్కడికి వెళ్లింది?” అంటూ మధ్య మధ్యలో అడుగుతోంది. ముందు ముద్ద తిను… తర్వాత చెబుతా…” అంటూ సుమతి నవ్వింది.

ఆ చిన్న ఇంట్లో… పొయ్యి మీద మరిగే కూర వాసన, బయట నుంచి వినిపించే పక్షుల అరుపులు, అమ్మ కూతుళ్ల నవ్వులు… అన్నీ కలిసి ఒక ప్రశాంతమైన ఉదయాన్ని మరింత అందంగా మార్చేశాయి. తినిపించడం పూర్తయ్యాక సుమతి ఆమె చేతులు కడిగి, సరే తల్లి… ఇక నువ్వు బయటికి వెళ్లి ఆడుకో. నేను వంట చేస్తా.” అంది. దూరంగా వెళ్లను అమ్మా…” అంటూ శారద బయటికి పరుగెత్తింది. సుమతి కూడా నవ్వుకుంటూ తిరిగి పొయ్యి దగ్గరకు వెళ్లింది. ఊరి పిల్లలంతా పెద్ద చెట్టు కింద చేరుకున్నారు. కొందరు గిల్లి దండా ఆడుతున్నారు. మరికొందరు గోళీలు ఆడుతున్నారు. ఆడపిల్లలు మాత్రం చెయ్యి పట్టుకుని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఆ కాలంలో ఆటలంటే నిజంగా ఆటలే… ఫోన్లు… టీవీలు… ఏమీ లేని రోజులవి.

అలా శారద పిల్లలతో ఆడుకుంటూ ఉండగా… సుమతి తన ఇంటి పనులంతా ముగించి శారద దగ్గరకు వచ్చింది. ప్రేమగా, శారదా రామ్మా… భోజనం తిందువు…” అంటూ దగ్గరకు వచ్చింది సుమతి. 

కానీ… ఆ రోజు మధ్యాహ్నం వాళ్ల ఇంటి ముందుకు వచ్చిన ఒక వ్యక్తి. ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడని అప్పుడు ఎవరికీ తెలియదు…
తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి మమ్మల్ని Fallow అవ్వండి. 

Episode - 3 త్వరలో వస్తుంది 

Click Here👉 Part - 3

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...