Skip to main content

25 మామిడి చెట్ల గణిత పజిల్ | రైతుకు ఎంత డబ్బు వచ్చింది? | Telugu Maths Puzzle

  మునుపటి సమాధానం 🖼️ చిత్రం 1 ఈ చిత్రంలో "మ" అనే అక్షరం నుండి ప్రారంభమయ్యే వస్తువులు ఎన్ని ఉన్నాయి ? " మ" అక్షరంతో ప్రారంభమయ్యే వస్తువులను జాగ్రత్తగా లెక్కించాలి. సమాధానం = 10 1.    మామిడి చెట్టు 2.   మామిడి కాయలు 3.    మొసలి 4.    మేఘాలు 5.   మేక 6.    మోటార్ సైకిల్ 7.    ముక్కు 8.    ముక్కుపుడక 9.    మల్లె పూవు 10.   మందారం పూవు   🖼️ చిత్రం 2  ఈ చిత్రంలో మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ?    చిన్న త్రిభుజాలను మాత్రమే కాకుండా పెద్ద త్రిభుజాలను కూడా లెక్కించాలి. సమాధానం = 18 చిన్న త్రిభుజాలు 5 పెద్ద త్రిభుజాలు 5 జాయింట్ త్రిభుజాలు 8   ఈ రోజు గణిత ప్రశ్న ఒక రైతు 25 మామిడి మొక్కలను నాటాడు. ఆ మొక్కలు పెరుగుతూ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. ఒక సీజన్‌లో ప్రతి చెట్టుకు 500 మామిడి కాయలు వచ్చాయి.      రైతు 20 కాయలను తన ఇంటికి తీసుకున్నాడు.      తన బంధువుల 5 ఇళ్లకు ఒక్కో ఇంటికి చొప్పున 10 కాయల ఇచ...

Episode 1 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story

చెరువు దగ్గర కనిపించిన అసాధారణ అమ్మాయి

“ప్రతి పౌర్ణమికి రాత్రిపూట చెరువు దగ్గర ఒక అమ్మాయి కనిపించేదట. ఆమె నీళ్ల మీద నడుస్తుందని ఊరివాళ్లు ఎప్పుడూ చెప్పుకునేవారు.

కానీ…
ఆమెను దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం మళ్లీ ఎప్పుడూ సాధారణంగా ఉండలేదట… పిచ్చివారిలా మారుతారట. ఆమె నిజంగా మనిషేనా… లేక రాత్రిళ్లు చెరువు దగ్గర కనిపించే ఒక దయ్యమా …?”


అది 1985 కాలం…
కొండల మధ్యలో  పచ్చని చెట్లతో నిండిపోయి ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు వేములపల్లి. ఉదయం సూర్యుడి వెలుగు కొండల వెనక నుంచి నెమ్మదిగా బయటికి కనిపిస్తుంటే అప్పుడు ఆ ఊరు మెల్లగా మేల్కొనేది. ఇళ్ల ముందు మహిళలు కల్లాపు నీళ్ళు చల్లి ముగ్గులు వేస్తూ ఉండేవారు. దూరంగా కోళ్లు కూస్తూ, ఎద్దుల బండ్ల గంటల శబ్దం పొలాల దారి మొత్తం వినిపించేది. నీరు  తాగడానికి ఆ ఊరి ప్రజలందరికీ ఒకటే ఆధారం, గ్రామం చివర ఉన్న ఒక  పెద్ద చెరువు. ఆ చెరువు నీళ్లు ఎప్పుడూ చల్లగా, స్వచ్ఛంగా ఉండేవి. 

ఉదయం తెల్లారిందంటే చాలు ప్రతి ఇంటి ఆడవాళ్లు తమ తమ ఇళ్ళల్లో ఉన్న మట్టి  కుండలు, పిత్తల బిందెలు తీసుకుని చెరువు దారి పట్టేవారు. కొంతమంది మాట్లాడుకుంటూ వెళ్లేవారు. వారింట్లో ఏమైంది, విరింట్లో ఏమైంది అంటూ ప్రతీ ఇంటి సమాచారాలు మాట్లాడుకునేవారు. మరికొందరు పాటలు పాడుకుంటూ కథలు చెప్పుకుంటూ  నడిచేవారు. పిల్లలు మాత్రం చెరువు దగ్గరికి వెళ్లగానే నీళ్లలో రాళ్లు వేస్తూ, అక్కడున్న మట్టితో బొమ్మలు చేస్తూ ఇంకా వారికీ నచ్చిన ఆటలు ఆడుకునేవారు. 

సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే ముందే అందరూ తొందర తొందరగా అక్కడినుండి బయలుదేరేవారు. సాయంత్రం అయ్యిందంటే చాలు చెరువు దారి మొత్తం  నిశ్శబ్దంగా మారిపోయేది. ఎందుకంటే ఆ చెరువు నీళ్ల మీద పడే ఎర్రటి వెలుగు చూస్తే, అది నిజంగా ఏదో ఒక శక్తి వేసిన చిత్రంలా కనిపించేది. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రం, ఆ చెరువు వైపుకు కూడా ఎవరూ వెళ్లేవారు కాదు.


పగలంతా నవ్వులతో కిక్కిరిసిపోయే ఆ ప్రదేశం, రాత్రి అయితే భయంతో అంతా మూగబోయినట్టుగా కనిపించేది. పిల్లలు కూడా చీకటి పడకముందే ఇళ్లకు చేరుకునేవారు. ఊరంతా అలానే చేసేవారు. ఆ చెరువు వైపుకు చూడటానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు “రాత్రివేళ చెరువు దగ్గరికి  వెళ్లొద్దు…” అని గట్టిగా చెప్పేవారు. ఆ మాట ఊరిలో ప్రతి ఇంట్లో కూడా వినిపించేది. ఎందుకంటే ప్రతి పౌర్ణమి రాత్రి ఆ చెరువు దగ్గర ఎవరో తెల్లని చీరతో తిరుగుతారని ఊరివాళ్లు చెప్పుకునేవారు.

కొంతమంది చెబుతుండేవారు... ఆమె నీళ్ల అంచున నిలబడి చంద్రుణ్ని చూస్తూ ఉంటుందని. మరికొందరు మాత్రం… ఆమె ఏడుస్తున్న శబ్దం కూడా వినిపించిందని ప్రమాణం చేసి చెప్పేవారు. 

ఒకసారి… రామయ్య అనే రైతు పొలం పని ముగించుకుని రాత్రి ఆలస్యంగా చెరువు పక్క నుండి వెళుతుండగా 
నీళ్లలో తెల్లగా కదులుతున్న నీడను చూసాడట. భయంతో అతని చేతిలో ఉన్న లాంతరు నేలపై పడిపోయింది. అప్పట్నుంచి… రామయ్య ఎప్పుడూ రాత్రి ఒంటరిగా బయటకు రావడమే మానేశాడు.

అంతేకాదు… పౌర్ణమి రాత్రి వచ్చినప్పుడల్లా
చెరువు నీళ్లు కూడా విచిత్రంగా అలజడిని సృష్టిస్తాయని
ఊరిలో పెద్దవాళ్లు చెప్పుకునేవారు. గాలి లేకపోయినా…
నీళ్ల మీద అలలు మాత్రం పుడుతుండేవట. ఆ మాటలు విన్న తర్వాత ఆ చెరువు దగ్గరికి వెళ్లేందుకు ఎవరికీ ధైర్యం ఉండేది కాదు.

ఒక రోజు… రాఘవ అనే యువకుడు పట్టణం నుంచి తన ఊరైన వేములపల్లికి తిరిగి వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వచ్చిన అతనికి, పాత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు తాను ఆడుకున్న వీధులు, స్నేహితులతో తిరిగిన పొలాల దారులు, ఇంకా గ్రామం చివర ఉన్న ఆ పెద్ద చెరువు.

కానీ… ఊరిలోకి అడుగుపెట్టినప్పటి నుంచే అతనికి ఒక విషయం మాత్రమే పదే పదే వినిపించింది. “రాత్రిపూట చెరువు దగ్గరికి వెళ్లొద్దు…” ఎవరిని అడిగినా అదే మాట. కొంతమంది భయంతో మెల్లగా చెప్పేవారు… మరికొందరు మాత్రం ఆ విషయం ప్రస్తావనకే వణికిపోయేవారు. రాఘవకి ఇవన్నీ విని నవ్వొచ్చింది. పట్టణంలో చదువుకుని వచ్చిన అతనికి దెయ్యాలు, భూతాలు, ఆత్మలు అన్నవి కేవలం మూఢనమ్మకాల్లా అనిపించాయి. “ఎవరైనా భయపెట్టడానికి కథలు సృష్టించి ఉంటారు…”
అని అతను నిర్లక్ష్యంగా అన్నాడు.

ఆ రాత్రే… “నిజంగా ఎవరో ఉంటే నేనూ చూస్తా!”
అని ధైర్యంగా చెప్పి, ఒక లాంతరును చేతిలో పట్టుకుని
చెరువు దారి పట్టాడు. ఆ రోజు పౌర్ణమి...
ఆకాశంలో పెద్ద పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చల్లని గాలి నెమ్మదిగా వీచుతోంది. చెరువు నీళ్లలో చంద్రుని ప్రతిబింబం వెండి తళుకులా మెరిసిపోతోంది.

చుట్టూ చూశాడు, ఎక్కడా ఏ మనిషి శబ్దం కూడా లేదు. దూరంగా అప్పుడప్పుడు వినిపిస్తున్న గుడ్లగూబ అరుపు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని ఆ శబ్దం ఇంకా భయంకరంగా మార్చేస్తోంది. రాఘవ మాత్రం భయపడలేదు. అతను చెరువు అంచున నిలబడి చుట్టూ గమనించాడు. “ఎక్కడుంది ఆ తెల్లచీర దెయ్యం…?”
అని నవ్వుకున్నాడు.

అప్పుడే…
చెరువు మధ్యలో ఎవరో నిలబడి ఉన్నట్టు కనిపించింది. మొదట అది కేవలం చంద్రుని ప్రతిబింబం మాత్రమే అనుకున్నాడు రాఘవ. కానీ… కొన్ని క్షణాల తర్వాత
ఆ ఆకారం నెమ్మదిగా స్పష్టంగా కనిపించడం మొదలైంది. తెల్లని వస్త్రం… నీళ్ల మీద గాలికి అలా ఊగుతోంది. పొడవాటి జుట్టు... ముఖం సగం వరకు మాత్రమే కనిపిస్తోంది. చంద్రుని కాంతి ఆ రూపం మీద పడుతూ
వింతగా మెరుస్తోంది. ఆమె మాత్రం కదలకుండా
చెరువు మధ్యలోనే నిలబడి ఉంది.

ఆమె చుట్టూ గాలి కూడా అకస్మాత్తుగా ఆగిపోయినట్టైంది. నీళ్లలో చిన్న చిన్న అలలు వస్తున్నాయి, కానీ ఆమె కాళ్ల దగ్గర మాత్రం ఏ నీరు కూడా అస్సలు కదలడం లేదు. అది చూసి రాఘవ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. అతను కళ్ళు పెద్దగా చేసి మళ్లీ జాగ్రత్తగా చూశాడు. అప్పుడు ఆమె ముఖం మెల్లగా పైకి ఎత్తింది. చంద్రకాంతిలో మెరుస్తున్న ఆమె కళ్ళు నేరుగా రాఘవ వైపే చూస్తున్నాయి…

కొన్ని క్షణాలు అతను కదలకుండా అక్కడే నిలబడి చూస్తున్నాడు. చెరువు మధ్యలో నిలబడి ఉన్న ఆ అమ్మాయి తన తలను రాఘవ వైపు తిప్పింది. ఒకవైపు రాఘవ భయపడుతూ అలాగే ఆమె కాళ్లవైపు చూసాడు.  ఆమె నీళ్లపై నిలబడి ఉంది కానీ ఆమె కాళ్లు మాత్రం  కొంచం కూడా నీళ్లలో మునగనే లేదు.

నీళ్లు అలలతో కదులుతున్నా…
ఆమె మాత్రం కదలకుండా గాల్లో తేలుతున్నట్టుగా కనిపించింది. ఆ అమ్మాయి పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వులో విచిత్రమైన ఒక బాధ ఉంది, అలాగే భయంకరమైన ప్రశాంతత కూడా ఉంది. ఆమె నిధనంగా మాట్లాడింది.

“ఎన్నేళ్ల తర్వాత…
ఇక్కడికి మళ్లీ ఎవరో వచ్చారు…”

ఆమె స్వరం చెరువు మొత్తం మార్మోగింది. అది సాధారణ మనిషి గొంతులా లేదు. దూరం నుంచి వినిపిస్తున్నట్టూ, అలాగే చెవుల దగ్గరే మాట్లాడుతున్నట్టూ అనిపించింది. 

రాఘవ వెన్నులో చలి పుట్టింది. అంతే ఇక చెరువు నీళ్లు బలంగా అలజడిని సృష్టించాయి. గాలి వేగంగా తిరగసాగింది. నీళ్లలో పెద్ద పెద్ద అలలు పుట్టి
చంద్రుని ప్రతిబింబాన్ని ముక్కలుగా చేసాయి. రాఘవ భయంతో వెనక్కి అడుగు వేసాడు. కానీ మరుసటి క్షణంలోనే ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె నిలబడ్డ చోటు ఇప్పుడు ఖాళీగా అయిపోయింది.  ఇక 
నీళ్లు మాత్రమే ఉన్నాయి. చుట్టూ మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయింది.

అయితే రాఘవ చె విలో మాత్రం ఆమె నవ్వు ఇంకా ఆమె మాట మార్మోగుతూనే ఉంది. అయితే అక్కడ నీళ్లపై ఒక చిన్న వెండి గాజు తేలుతూ ఉండటం కనిపించింది.

చంద్రకాంతి ఆ గాజుపై పడుతూ వింతగా మెరుస్తోంది. రాఘవ జాగ్రత్తగా ముందుకు వెళ్లి ఆ గాజును తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ గాజును చూస్తే చాలా పాతదిగా కనిపించింది. వెండి రంగు మసకబారిపోయినా
దానిపై చెక్కిన చిన్న చిన్న ఆకారాలు మాత్రం ఇంకా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అతను ఆ గాజును గట్టిగా పట్టుకున్న సమయంలోనే ఎవరో చల్లని చేతితో తన భుజాన్ని తాకినట్టుగా అనిపించింది.

రాఘవ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు కానీ అక్కడ ఎవరూ లేరు. చుట్టూ గాలి శబ్దం మాత్రమే ఉంది అది తప్ప ఇంకేమీ వినిపించలేదు… అతని మనసులో మాత్రం ఒకే ఒక ప్రశ్న పదే పదే అతన్ని వెంటాడుతూనే ఉంది.

ఆ గాజు ఎవరిది…?

చెరువులో కనిపించిన ఆ అమ్మాయి నిజంగా దెయ్యమా లేక ఇంకేమన్నానా…? లేకపోతే… ఆ చెరువు నీళ్ల వెనుక ఏళ్లుగా దాచిపెట్టిన ఇంకేదైనా భయంకరమైన రహస్యముందా…?

ఆ గాజు ఎవరిదో తెలుసుకునే ప్రయత్నంలో…
రాఘవ ఒక భయంకరమైన నిజాన్ని ఎదుర్కొనబోతున్నాడు…”

చూడండి తర్వాతి భాగంలో…

Part - 2 👉 Click Here


ఇలాంటి మరిన్ని కథలు 👇

రామాపురం కోటలో ఖజానా రహస్యం 👉 Click here

నువ్వు సేఫ్‌గా ఉన్నావా? హారిక కథ Part-1👉 Click here

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”👉 Click here

గ్రామాన్ని కాపాడిన ధార్మిక – నిజం ఏమిటి? “Telugu Story / Moral Story👉 Click here

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...