Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

అమ్మ నవ్వు వెనుక దాగిన కష్టం… ప్రతి కొడుకు తప్పక చదవాల్సిన కథ

రాత్రి 2 గంటలు…  అందరూ నిద్రపోతున్నారు. కానీ ఒక అమ్మ మాత్రం ఇంకా మేల్కొని ఉంది. ఒక చేత్తో తన పిల్లాడికి జ్వరం తగ్గేలా తడి గుడ్డ పెట్టుతోంది… మరో చేత్తో రేపటి స్కూల్ ఫీజు ఎలా కట్టాలో లెక్కలు వేసుకుంటోంది… ఆమె అలసిపోయింది. కానీ ఓడిపోలేదు. ఎందుకంటే… అమ్మ” అనే పదానికి అలసట ఉండొచ్చు…కానీ  వదిలేయడం” అనే అర్థం ఉండదు. కానీ… ఒక రోజు ఆమె చేతిలో పడిన ఒక చిన్న Paper ఆమె జీవితాన్నే ఒక్కసారిగా కుదిపేసింది. అమ్మ నవ్వు వెనుక దాగిన యుద్ధం” 


ఒక చిన్న గ్రామంలో లక్ష్మి అనే మహిళ ఉండేది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త చిన్న ఉద్యోగం చేసేవాడు. ఇంట్లో డబ్బులు చాలవు. కొన్ని రోజులు అయితే ఒక పూట తింటే మరో పూట ఎలా అని ఆలోచించే పరిస్థితి. కానీ పిల్లలకు మాత్రం ఆ విషయం ఎప్పుడూ తెలియనివ్వలేదు లక్ష్మి. ఉదయం 5 గంటలు కూడా కాకముందే లక్ష్మి కళ్లు తెరుచుకునేవి. అలారం అవసరం ఉండేది కాదు… బాధ్యతలే ఆమెను నిద్రలేపేవి. బయట ఇంకా చీకటిగానే ఉండేది. చలికాలంలో అయితే చేతులు గడ్డకట్టేంత చలి. అయినా… నెమ్మదిగా లేచి మొదట పిల్లల దగ్గరకు వెళ్లి చూసేది. వాళ్లు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఆమె ముఖంలో చిన్న నవ్వు కనిపించేది.

ఆ తర్వాత రోజు యుద్ధం మొదలయ్యేది. ముందుగా ఇంటి ముందు నీళ్లు చల్లేది. తర్వాత Stove వెలిగించి వంట మొదలుపెట్టేది. ఒకవైపు అన్నం ఉడుకుతుంటే… మరోవైపు పిల్లల lunch boxes సిద్ధం చేసేది. నా పిల్లలు ఆకలిగా ఉండకూడదు…” అదే ఆమెకు ముఖ్యమైన విషయం. కొన్ని రోజులు ఇంట్లో కూరగాయలు కూడా సరిపోవు. అయినా ఉన్న కొద్దితోనే రుచిగా వండి పిల్లలకి పెట్టేది. తర్వాత వాళ్లను ప్రేమగా లేపేది. లేవమ్మా… స్కూల్ టైమ్ అయింది…” అని నిదానంగా పలికేది.

పిల్లలు సిద్ధమయ్యేలోపు వాళ్ల Uniforms ఇస్త్రీ చేసేది. చెదిరిపోయిన బటన్లు కుట్టేది. పాత Shoes ని కూడా కొత్తలా శుభ్రం చేసేది. తనకి కొత్త చీర కొనడానికి డబ్బు లేకపోయినా… పిల్లల Books మాత్రం ఎప్పుడూ ఆగిపోనివ్వలేదు. వాళ్లను స్కూల్‌కి పంపించిన తర్వాత కూడా ఆమెకు విశ్రాంతి ఉండేది కాదు. ఇతరుల ఇళ్లకు పని చేయడానికి వెళ్లేది. ఎండైనా… వానైనా… జ్వరం వచ్చినా… ఒక్కరోజు పని మానేస్తే ఆ రోజు ఇంట్లో భోజనం కష్టమవుతుందని ఆమెకు తెలుసు. అందుకే అలసటను కూడా దాచుకుని పనిచేసేది. కొన్ని ఇళ్లలో పాత్రలు తోమేది… కొన్ని చోట్ల బట్టలు ఉతికేది… మరికొన్ని చోట్ల నేల తుడిచేది. చేతులు నొప్పితో వణికినా ముఖంలో మాత్రం నవ్వే పెట్టుకునేది. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి ఆమె శరీరం పూర్తిగా అలసిపోయి ఉండేది.

 కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె రోజు ఇంకా పూర్తికాలేదు. వంట, ఇంటిపనులు, పిల్లల చదువు... ఆమెకు విశ్రాంతి అనే పదం దాదాపు తెలియదు. అంతా అయ్యాక పిల్లల దగ్గర కూర్చుని:
ఈరోజు స్కూల్లో ఏమి నేర్చుకున్నావు?” అని అడిగేది. వాళ్లకు హోంవర్క్ చెప్పేది. తప్పులు చేస్తే కోపపడకుండా మళ్లీ మళ్లీ నేర్పేది. పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే… ఆ రోజు పడిన కష్టం అంతా ఒక్క క్షణంలో మరిచిపోయేది. ఎందుకంటే… ఆమెకు తన జీవితంలో సంతోషం అంటే తన పిల్లలు బాగా ఉండటమే.  కానీ… ఒక రోజు మాత్రం లక్ష్మి చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. పిల్లల స్కూల్ బ్యాగ్‌లో నుంచి ఒక Paper కింద పడింది. అది చూసిన క్షణం… ఆమె ముఖంలో ఉన్న నవ్వు మాయమైంది. కళ్లలో భయం కనిపించింది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. ఆ Paper ని మళ్లీ మళ్లీ చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది.

ఆ రోజు మొదటిసారి నా పిల్లల భవిష్యత్తు నిజంగా బాగుంటుందా…?” అని ఆమె మనసులో భయం మొదలైంది. ఆ Paper స్కూల్ ఫీజు Reminder. ఫీజు కట్టకపోతే Exams రాయనివ్వం” అని అందులో రాసి ఉంది. లక్ష్మి చేతిలో అప్పటికే డబ్బు లేదు. కానీ… తన పిల్లల చదువు మాత్రం ఆగకూడదని ఆమె మరోసారి జీవితంతో పోరాడాలని నిర్ణయించుకుంది.

ఒక రోజు… పెద్ద కొడుకు స్కూల్ నుంచి వచ్చి కోపంగా అన్నాడు: అమ్మ… అందరి అమ్మలు Bike మీద తీసుకెళ్తున్నారు. నువ్వు మాత్రం నడిపిస్తూ తీసుకెళ్తావు…”  అలా ఆ మాట చెప్పి కొడుకు లోపలికి వెళ్లిపోయాడు. కానీ లక్ష్మి మాత్రం బయటే నిలబడి కొంతసేపు నిశ్శబ్దంగా చూసింది. ఆ మాట గుర్తు చేసుకొని లక్ష్మి అప్పుడు నవ్వింది. కానీ ఆ రాత్రి మాత్రం దాచుకుని ఏడ్చింది.

ఎందుకంటే… తన కొడుకుకి Bike కొనివ్వాలనే కోరిక ఆమెకూ ఉంది. కానీ పరిస్థితులు అనుమతించలేదు. అయినా… మరుసటి రోజు మళ్లీ అదే నవ్వుతో పిల్లలను లేపింది. ఎందుకంటే ఒక అమ్మ బాధపడొచ్చు… కానీ పిల్లల ముందు బలహీనంగా కనిపించదు. సంవత్సరాలు గడిచాయి… ఆ చిన్నబ్బాయి పెద్దయ్యాడు. బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాడు.

ఒక రోజు తన కొత్త కారులో ఇంటి ముందు ఆపి: అమ్మ… ఇక నువ్వు నడవాల్సిన అవసరం లేదు” అన్నాడు. లక్ష్మి కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆమెకు ఆ కారు విలువ కాదు… తన కష్టాన్ని ఎవరో గుర్తుపట్టారనే ఆనందం. ఆ రోజు కొడుకు ఒక్క మాట అన్నాడు: అమ్మ… నాకు జీవితంలో గెలవడం నేర్పింది స్కూల్ కాదు… నీ కష్టమే.”❤️❤️❤️

నిజంగా అమ్మ అంటే… తన కష్టాలను దాచుకుని, మన భవిష్యత్తు కోసం నవ్వే మనిషి. మనకు చిన్న జ్వరం వచ్చినా భయపడే గుండె… మనం గెలిస్తే ప్రపంచం గెలిచినంత ఆనందపడే మనసు.

ఈ Mother’s Day రోజు… ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్లి: నీ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను అమ్మ…” అని చెప్పండి.

ఎందుకంటే… ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని ప్రేమ ఏదైనా ఉంటే, అది అమ్మ ప్రేమే.❤️

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...