Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...  అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...  కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు. "అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం." సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు. "మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా." ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపోయిన మొక్కల...

పని చిన్నది కాదు – ఒక యువకుడి జీవితాన్ని మార్చిన నిజం

“ఒక రైతు కొడుకు…
డిగ్రీలు పూర్తిచేసుకుని కూడా పని దొరకక ఊరిలో ఎగతాళి వినాల్సి వస్తే…?

ఒక రోజు అతన్ని చూసి నవ్విన వాళ్లే…
తర్వాత అతని ఇంటి ముందు నిలబడి గౌరవంగా మాట్లాడితే…?

అది అదృష్టం కాదు…
ఒక నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చిందో ఇదే ఆ కథ…”

సోమనాథపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది.


సోమనాథపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. 

ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, చిన్న చిన్న కాలువలు ఉండేవి. 

ఉదయం సూర్యోదయం అయ్యే సరికి పక్షుల కిలకిలారావాలతో గ్రామం మేల్కొనేది. 

కానీ ఆ అందమైన గ్రామంలో జీవితం అంత సులభం కాదు… ముఖ్యంగా రైతులది.

అక్కడ నారాయణ అనే ఒక రైతు ఉండేవాడు.
ఆయనకు ఒకే ఒక్క కొడుకు — రాఘవ్.

నారాయణ జీవితమంతా పొలమే.

ఎండ మండిపోతున్నా…  వాన కురుస్తున్నా…
అతను పొలంలోనే కనిపించేవాడు.

తన చేతులతోనే నేలను దున్నేవాడు…
విత్తనాలు వేసేవాడు…

పంట పండే వరకు రోజూ రాత్రి కష్టపడేవాడు.
కానీ… పంట ఎప్పుడూ తనను అనుకూలించేది కాదు.

ఒకసారి ఎండల వల్ల పంట ఎండిపోతుంది…
మరోసారి భారీ వర్షాల వల్ల నాశనం అవుతుంది.
ఒకసారి ఎండల వల్ల పంట ఎండిపోతుంది… మరోసారి భారీ వర్షాల వల్ల నాశనం అవుతుంది.

అయినా నారాయణ ఒక్కసారి కూడా చేతులు ఎత్తలేదు.
ఎందుకంటే అతని కళ్లలో ఒక పెద్ద కల ఉంది —

“నా కొడుకు నాలా కష్టం పడకూడదు… చదువుకుని పెద్ద మనిషి అవ్వాలి.”

రాఘవ్ చిన్నప్పటి నుంచే తన తండ్రి కష్టాన్ని చూస్తూ పెరిగాడు.

తండ్రి ఉదయం తెల్లవారక ముందే లేచి పొలానికి వెళ్తే…
అతను కూడా నిద్రలేచి చూస్తుండేవాడు.

ఒక రోజు రాఘవ్ అడిగాడు:
“నాన్న… మీరు ఎందుకు ఇంత కష్టం పడుతున్నారు?”

నారాయణ నవ్వుతూ చెప్పాడు:
“నువ్వు చదువుకుని మంచి స్థాయికి చేరాలి కాబట్టి.”

ఆ మాటలు రాఘవ్ మనసులో బలంగా ముద్రపడ్డాయి.
పేదరికం ఉన్నా…
నారాయణ తన కొడుకి చదువులో ఎక్కడా తగ్గలేదు.

పాఠశాల ఫీజులు కట్టడానికి…
పుస్తకాలు కొనడానికి…
అతను అప్పులు కూడా చేశాడు.

కొన్ని రోజులు తానే తక్కువ తిని…
కొడుకి అవసరాలు తీర్చాడు.

రాఘవ్ కూడా తన తండ్రి కష్టాన్ని వృథా చేయలేదు.
పాఠశాలలో ఎప్పుడూ మొదటి ర్యాంక్ తెచ్చేవాడు.

టీచర్లు కూడా అతన్ని ఎంతో ప్రశంసించేవారు.

రాత్రిళ్లు విద్యుత్ లేకపోతే…
చిరాగ్ వెలుగులో చదివేవాడు.

ఎంత కష్టం వచ్చినా… చదువు ఆపలేదు.
గ్రామం మొత్తం అతన్ని చూసి ఇలా అనుకునేది:
“ఈ అబ్బాయి తప్పకుండా పెద్ద స్థాయికి వెళ్తాడు.”

ఇలా…
ఒక రైతు కష్టం…
ఒక కొడుకు పట్టుదల…
కలిసి ఒక గొప్ప ప్రయాణానికి పునాది వేశాయి. 

డిగ్రీ… పోస్ట్‌గ్రాడ్యుయేషన్… అన్నీ పూర్తి చేశాడు రాఘవ్.

తన గ్రామంలోనే కాదు, దగ్గర్లో ఉన్న పట్టణంలో కూడా అతని చదువు గురించి అందరూ మాట్లాడుకునే వాళ్లు.

నారాయణ గుండెల్లో గర్వం పొంగిపొర్లేది.
“నా కొడుకు పెద్ద స్థాయికి వెళ్తాడు… నేను పడిన కష్టానికి ఫలితం ఇస్తాడు…” అని అనుకునేవాడు.

తన కొడుకు వల్ల ఒక రోజు తలెత్తుకుని నడుస్తానని ఆశపడ్డాడు.

కానీ జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా ఉండదు…

రాఘవ్ పట్టణం-పట్టణం తిరిగాడు.
ఇంటర్వ్యూలు ఇచ్చాడు… పరీక్షలు రాశాడు…
ప్రతి సారి ఒక ఆశతో వెళ్లి… నిరాశతో తిరిగి వచ్చేవాడు.

“మేము తర్వాత inform చేస్తాం…”
“మీరు overqualified…”
“Experience కావాలి…”

అన్న మాటలు మాత్రమే వినిపించేవి.
మేము తర్వాత inform చేస్తాం…” “మీరు overqualified…” “Experience కావాలి…” అన్న మాటలు మాత్రమే వినిపించేవి.

రోజులు గడిచాయి…
నెలలు గడిచాయి…
ఒక సంవత్సరం కూడా పూర్తయ్యింది.

ఇప్పటికే అతని ముఖంలో ఉన్న ఆత్మవిశ్వాసం… నెమ్మదిగా తగ్గిపోయింది.

కళ్లలో కనిపించే ఆశ… ప్రశ్నగా మారిపోయింది.
గ్రామంలో వాళ్లు కూడా మాట్లాడటం మొదలుపెట్టారు.

వీధిలో నడుస్తూ ఉంటే వెనుకనుంచి మాటలు వినిపించేవి:
“నారాయణ అతనిని ఎంతో కష్టపడి చదువించాడు… కానీ ఇతను మాత్రం ఊరికే తిరుగుతున్నాడు!”
“చదివితే ఏం ప్రయోజనం… పని లేకపోతే!”

ఆ మాటలు కత్తిలా రాఘవ్ గుండెను కోసేవి.

అతను బయటకు ఏమి చెప్పకపోయినా… లోపల మాత్రం బాగా విరిగిపోతున్నాడు.

ఇంతలో పెళ్లి విషయమూ వచ్చింది.
మొదట్లో మంచి సంబంధాలు వచ్చాయి.

కానీ ఈ ఒక్క మాట విన్నాకే వెనక్కి తగ్గిపోయారు:
“ఉద్యోగం లేదు… పైగా వాళ్లు పేదవాళ్లు!”
అని ప్రతి సంబంధం తిరస్కరించబడింది.

ఆ రోజు రాత్రి…
రాఘవ్ ఒంటరిగా కూర్చొని చాలా సేపు ఆలోచించాడు.

“నా చదువు ఎందుకు? నా కష్టం ఎందుకు?” అని తనను తాను ప్రశ్నించుకున్నాడు.

కళ్లలో నీళ్లు తిరిగాయి… కానీ వాటిని ఎవరూ చూడకుండా మింగేశాడు.

అది చూసిన నారాయణ మనసు కరిగిపోయింది.
అతను తన కొడుకు దగ్గరికి వచ్చి నెమ్మదిగా కూర్చున్నాడు.
“రాఘవ్…” అని పిలిచాడు.

రాఘవ్ తలదించుకుని ఉండిపోయాడు.

నారాయణ అతని భుజంపై చేయి వేసి అన్నాడు:
“బిడ్డా… జీవితం అంతా చదువుతోనే కాదు.
ఏ పని చిన్నది కాదు… పని చేయడం ముఖ్యం.”

“నేను పొలం దున్నడం చిన్న పని కాదు…
అది మనకు అన్నం పెడుతుంది.

అలాగే నువ్వు ఏ పని చేసినా… అది నీకు గౌరవం తీసుకొస్తుంది.”

ఆ మాటలు సాధారణంగా అనిపించినా…
రాఘవ్ మనసులో మాత్రం ఒక వెలుగు నింపాయి.

అతను మొదటిసారి అర్థం చేసుకున్నాడు:
“ఉద్యోగం కోసం ఎదురు చూడటం కన్నా… పని మొదలుపెట్టడం ముఖ్యం."

ఆ మాటలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి.

ఆ రోజు వరకు “ఉద్యోగం రావాలి” అని ఎదురు చూసిన రాఘవ్…

ఆ రోజు నుంచి “ఏ పని వచ్చినా నేర్చుకోవాలి” అని నిర్ణయించుకున్నాడు.

రాఘవ్ పట్టణానికి వెళ్లాడు.
చాలా చోట్ల తిరిగి… చివరికి ఒక చిన్న ఫ్యాక్టరీలో సాధారణ కార్మికుడిగా పని మొదలుపెట్టాడు.

అక్కడ పని అంత సులభం కాదు…
పొద్దున్నే సైరన్ మోగగానే పని మొదలవుతుంది…

రోజంతా నిలబడి పని చేయాలి… చేతులు నొప్పి, శరీరం అలసట…

కానీ రాఘవ్ ఒక్కరోజు కూడా వెనక్కి తగ్గలేదు.
రాఘవ్ తన పని మీద పూర్తి శ్రద్ధ పెట్టాడు.

సమయం కంటే ముందే వచ్చేవాడు…
తనకు ఇచ్చిన పని పూర్తిగా, తప్పులేకుండా చేసేవాడు…

మిగతావాళ్లు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా…
అతను కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు.

యంత్రాలు ఎలా పనిచేస్తాయో గమనించాడు…
సీనియర్స్ దగ్గర ప్రశ్నలు అడిగాడు…

తన పని మాత్రమే కాదు, మొత్తం ఫ్యాక్టరీ ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు.

కొన్ని రోజుల్లోనే…
అతని క్రమశిక్షణ అందరికీ కనిపించింది.

కొన్ని నెలల్లో…
అతని పనితీరు అందరి దృష్టిని ఆకర్షించింది.

ఒక రోజు ఒక పెద్ద సమస్య వచ్చింది ఫ్యాక్టరీలో.
ఒక యంత్రం సరిగా పనిచేయలేదు.

ఎవరూ దాన్ని వెంటనే సరి చేయలేకపోయారు.
అప్పుడు రాఘవ్ ముందుకు వచ్చాడు.

తాను గమనించిన విషయాలను ఉపయోగించి…
చిన్నగా ప్రయత్నించాడు…

చివరికి ఆ యంత్రాన్ని మళ్లీ పనిచేసేలా చేశాడు.
అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఆ విషయం ఫ్యాక్టరీ యజమాని చెవిలో పడింది.
అతను రాఘవ్‌ను పిలిపించాడు.

“నీ పని గురించి చాలా విన్నాను…” అని మొదలుపెట్టాడు.

రాఘవ్ వినయంగా నిలబడ్డాడు.
యజమాని చిరునవ్వుతో అన్నాడు:

“నువ్వు కేవలం పని చేయడం కాదు… నేర్చుకుంటున్నావు కూడా.
అదే నిన్ను ప్రత్యేకంగా చేస్తోంది.”

ఆ రోజు నుంచి…
రాఘవ్ జీవితంలో మరో మార్పు ప్రారంభమైంది.

ఒక సాధారణ కార్మికుడు…
గుర్తింపు పొందిన వ్యక్తిగా మారే ప్రయాణం మొదలైంది.

ఒక రోజు ఫ్యాక్టరీ యజమాని రాఘవ్‌ను తన ఆఫీసుకు పిలిచాడు.

రాఘవ్ కొంచెం ఆశ్చర్యంతో లోపలికి వెళ్లాడు… “ఏమైనా తప్పు జరిగిందా?” అని మనసులో అనుకున్నాడు.

యజమాని అతన్ని కూర్చోబెట్టి, చిరునవ్వుతో అన్నాడు:
“రాఘవ్… నేను చాలా రోజులుగా నిన్ను గమనిస్తున్నాను.”

“నీలా నిజాయితీగా పనిచేసే వాళ్లు చాలా అరుదు.
నీ పని మీద ఉన్న నిబద్ధత… నేర్చుకోవాలనే తపన… ఇవి నీలో ప్రత్యేకమైన లక్షణాలు.”

కొద్దిసేపు ఆగి… గర్వంగా చెప్పాడు:

 “ఇక నుంచి నువ్వే ఈ విభాగం మ్యానేజర్.”

ఆ మాటలు విన్న క్షణం…
రాఘవ్ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.

ఒకప్పుడు పని కోసం తిరిగిన అతను…
ఇప్పుడు తన పనితో గుర్తింపు పొందాడు.

అలా…
ఒక సాధారణ కార్మికుడు…
గౌరవనీయమైన స్థాయికి ఎదిగాడు.

కొన్ని రోజుల తర్వాత రాఘవ్ తన గ్రామానికి తిరిగి వెళ్లాడు.

అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ముందు అతన్ని చూసి ఎగతాళి చేసిన వాళ్లే…
ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నారు.

“రాఘవ్ వచ్చాడు!” అని అందరూ ఆనందంగా పలుకరించారు.

నారాయణ తలెత్తుకుని నడిచాడు…
తన కొడుకు మీద గర్వం అతని కళ్లలో స్పష్టంగా కనిపించింది.

ఇప్పటికే పెళ్లి విషయమూ మళ్లీ వచ్చింది.
ఈసారి మాత్రం…
అదే గ్రామం…
అదే వాళ్లు…
కానీ మాటలు పూర్తిగా మారిపోయాయి.

“రాఘవ్ చాలా మంచివాడు… కష్టపడే వాడు…”
అని మంచి సంబంధాలు రావడం మొదలయ్యింది.

అప్పుడు పని లేదు, పేదవాళ్ళు అని సంబంధాలు రాకుండా పోయాయి. 

కానీ ఇప్పుడు రాఘవ్ వంతు...
వారి గ్రామం నుండి ఏ సంబంధం వచ్చినా రాఘవ్ తిరస్కరించాడు. 

ఒక రోజు ఉదయం…
సోమనాథపురం గ్రామంలో అనుకోకుండా ఒక పెద్ద కారు వచ్చి నారాయణ ఇంటి ముందు ఆగింది.

ఒక రోజు ఉదయం… సోమనాథపురం గ్రామంలో అనుకోకుండా ఒక పెద్ద కారు వచ్చి నారాయణ ఇంటి ముందు ఆగింది.

ఆ గ్రామంలో ఇంత పెద్ద కారు రావడం అరుదు…
వెంటనే చుట్టుపక్కల వాళ్లు చేరిపోయారు.

“ఎవరు వచ్చారు?”
“ఎందుకు వచ్చారు?”

అని అందరూ నోటి మీద వేళ్లు పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

పిల్లలు కార్ చుట్టూ తిరుగుతున్నారు…
పెద్దలు దూరం నుంచి గమనిస్తున్నారు…
గ్రామం మొత్తం ఒక్కసారిగా ఆ ఇంటి వైపు చూసింది.

కారు డోర్ నెమ్మదిగా తెరుచుకుంది…
అందులోనుంచి దిగింది రాఘవ్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని.

అతన్ని చూసిన రాఘవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
“సార్… మీరు ఇక్కడ?” అని గౌరవంగా అడిగాడు.

నారాయణ కూడా వెంటనే వచ్చి అతన్ని ఆహ్వానించాడు.
ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు.

కొద్దిసేపు సాధారణంగా మాట్లాడిన తర్వాత…
ఫ్యాక్టరీ యజమాని ముఖం కొంచెం సీరియస్‌గా మారింది.

“నారాయణ గారూ… నేను ఒక ముఖ్యమైన విషయం కోసం వచ్చాను,” అని మొదలుపెట్టాడు.

అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయ్యారు.

“నాకు ఒకే ఒక్క కూతురు… పేరు సునీత,” అని చెప్పాడు.

“ఆమెకు మంచి స్వభావం ఉన్న, బాధ్యత గల అబ్బాయి కావాలి.”

కొద్దిసేపు ఆగి… నారాయణ వైపు చూసి అన్నాడు:
“మీ అబ్బాయి రాఘవ్… నాకు చాలా నచ్చాడు.”

“అతని నిజాయితీ, కష్టం… ఇవన్నీ చూసి…
నా కూతురికి అతనితో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను.”

ఆ మాటలు విన్న క్షణం…
నారాయణ, రాఘవ్ ఇద్దరూ ఒకరికొకరు చూసుకున్నారు.

ఇది వాళ్లు ఎప్పుడూ ఊహించని విషయం.

నారాయణ కొంచెం సంకోచంతో అన్నాడు:
“అయ్యో సార్… మీ స్థాయి, మా స్థాయి… మేము మీకు సరిపోతామా?”

అప్పుడు ఫ్యాక్టరీ యజమాని చిరునవ్వుతో అన్నాడు:
“నారాయణ గారూ… నాకు స్థాయి కాదు… మనసు ముఖ్యం.”

“మీ అబ్బాయి దగ్గర ఉన్న గుణాలు…
అవి చాలా గొప్పవి. అవే నాకు కావాలి.”

“దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు…

మీరు ‘సరే’ అని చెబితే చాలు.”

నారాయణ కళ్లలో నీళ్లు తిరిగాయి.
అతను రాఘవ్ వైపు చూసి అన్నాడు:
“నాదేముంది బిడ్డా… నీ జీవితమది… నువ్వే చెప్పు.”

రాఘవ్ కొంచెం నిశ్శబ్దంగా ఆలోచించాడు.
తన తండ్రి కష్టం…
తన ప్రయాణం…
ఫ్యాక్టరీ యజమాని నమ్మకం…

అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి.

అతను గౌరవంగా ముందుకు వచ్చి అన్నాడు:
“సార్… మీరు నాపై పెట్టిన నమ్మకానికి నేను ఎప్పుడూ తగ్గను.
మీరు అనుకుంటే… నాకు ఒప్పందమే.”

ఆ మాటలు విన్న వెంటనే…
అక్కడున్నవాళ్ల ముఖాల్లో ఆనందం మెరిసింది.

కొన్ని రోజుల్లోనే…
గ్రామం మొత్తం మాట్లాడుకునేలా పెద్దగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి.

ఇంటి ముందు రంగవల్లులు…
పూలతో అలంకరణ…
మంచి వంటల వాసన…
సంగీతం… నవ్వులు…

గ్రామం అంతా ఒక పండుగలా మారిపోయింది.

ముందు ఎగతాళి చేసిన వాళ్లే…
ఇప్పుడు పెళ్లికి వచ్చి ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు:
“చూడు… కష్టానికి ఫలితం ఇదే!”

రాఘవ్ – సునీతల పెళ్లి ఘనంగా జరిగింది.

రాఘవ్ – సునీతల పెళ్లి ఘనంగా జరిగింది.

నారాయణ కళ్లలో ఆనందబాష్పాలు…
తన కొడుకు జీవితాన్ని చూసి గర్వంగా నిలబడ్డాడు.

అలా…
ఒకప్పుడు నిరాశలో ఉన్న రాఘవ్…
ఇప్పుడు సంతోషంగా, గౌరవంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

అప్పట్నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు.


ముగింపు సందేశం:
“పని చిన్నది - పెద్దది కాదు…
పని చేసే మనసు పెద్దది.”

నిజాయితీగా చేసే ప్రతి పని గౌరవాన్నిస్తుంది.
అదే నిజమైన కార్మికుల దినోత్సవం అర్థం.

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...