Skip to main content

25 మామిడి చెట్ల గణిత పజిల్ | రైతుకు ఎంత డబ్బు వచ్చింది? | Telugu Maths Puzzle

  మునుపటి సమాధానం 🖼️ చిత్రం 1 ఈ చిత్రంలో "మ" అనే అక్షరం నుండి ప్రారంభమయ్యే వస్తువులు ఎన్ని ఉన్నాయి ? " మ" అక్షరంతో ప్రారంభమయ్యే వస్తువులను జాగ్రత్తగా లెక్కించాలి. సమాధానం = 10 1.    మామిడి చెట్టు 2.   మామిడి కాయలు 3.    మొసలి 4.    మేఘాలు 5.   మేక 6.    మోటార్ సైకిల్ 7.    ముక్కు 8.    ముక్కుపుడక 9.    మల్లె పూవు 10.   మందారం పూవు   🖼️ చిత్రం 2  ఈ చిత్రంలో మొత్తం త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ?    చిన్న త్రిభుజాలను మాత్రమే కాకుండా పెద్ద త్రిభుజాలను కూడా లెక్కించాలి. సమాధానం = 18 చిన్న త్రిభుజాలు 5 పెద్ద త్రిభుజాలు 5 జాయింట్ త్రిభుజాలు 8   ఈ రోజు గణిత ప్రశ్న ఒక రైతు 25 మామిడి మొక్కలను నాటాడు. ఆ మొక్కలు పెరుగుతూ పెద్ద పెద్ద చెట్లయ్యాయి. ఒక సీజన్‌లో ప్రతి చెట్టుకు 500 మామిడి కాయలు వచ్చాయి.      రైతు 20 కాయలను తన ఇంటికి తీసుకున్నాడు.      తన బంధువుల 5 ఇళ్లకు ఒక్కో ఇంటికి చొప్పున 10 కాయల ఇచ...

అర్ధరాత్రి 12:07కి వచ్చిన Video Call

అర్ధరాత్రి 12 గంటలకు

మూడు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి నుంచి వీడియో కాల్ వస్తే…?

అది prank అనుకున్న అర్జున్…
call lift చేసిన తర్వాత మాత్రం…

తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం చూసాడు…”

అర్జున్ అనే యువకుడు Bengaluru లో ఒంటరిగా ఒక చిన్న అద్దె గదిలో ఉండేవాడు.

పగలంతా బయట పనులు చూసుకుని…
రాత్రిళ్లు మాత్రం laptop ముందు కూర్చొని freelance projects చేసేవాడు.
పగలంతా బయట పనులు చూసుకుని… రాత్రిళ్లు మాత్రం laptop ముందు కూర్చొని freelance projects చేసేవాడు.

ఆ గది కూడా చాలా చిన్నది.

ఒక పక్క పాత wooden table…
దానిమీద half-broken laptop…
పక్కనే చల్లారిపోయిన tea glass…

ceiling fan “కీచ్… కీచ్…” అంటూ నెమ్మదిగా తిరుగుతుండేది.

ఆ రాత్రి బయట వర్షం కూడా మొదలైంది.
జల్లులు కిటికీ గాజుపై పడుతూ విచిత్రమైన శబ్దం చేస్తున్నాయి.

అర్జున్ మాత్రం headphones పెట్టుకుని పని చేస్తూనే ఉన్నాడు.

Time చూసాడు.
12:07 AM.

అప్పుడే…
ఫోన్ ఒక్కసారిగా vibrate అయింది.
టేబుల్ మీద ఉన్న మొబైల్ నెమ్మదిగా కదులుతూ వెలిగింది.

ఆ వెలుతురు చీకటి గదిలో మరింత భయంగా కనిపించింది.

అర్జున్ మొదట పట్టించుకోలేదు.

“ఈ టైమ్‌లో ఎవరు call చేస్తున్నారు…” అంటూ screen వైపు చూసాడు.

కానీ…
Screen మీద కనిపించిన పేరు చూసిన క్షణంలోనే అతని గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.

“Ravi Calling…”
అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి.
“Ravi Calling…” అర్జున్ కళ్ళు పెద్దవయ్యాయి.

చేతుల్లో చెమట పట్టింది.

గొంతు ఎండిపోయింది.

ఎందుకంటే…
ఆ రవి అతని childhood friend.

మూడేళ్ళ క్రితం జరిగిన ఒక ఘోరమైన accident లో అతను చనిపోయాడు.

ఆ రోజు జరిగిన విషయం ఇప్పటికీ అర్జున్ మర్చిపోలేదు.

ఆ accident జరిగిన రాత్రి కూడా…
ఇలాగే భారీ వర్షమే పడింది.

ఇంకా చివరిసారిగా రవి phone చేసినప్పుడు కూడా time సరిగ్గా 12 గంటలే.

ఆ తర్వాత…
రవి bike ఒక లోయలో పడిపోయిందని పోలీసులు చెప్పారు.

Body దొరికింది.
Funeral కూడా జరిగింది.
అంతా ముగిసిపోయిందనుకున్నారు.

కానీ ఇప్పుడు…
చనిపోయిన మనిషి number నుంచి call వస్తోంది.

అర్జున్ భయంతో phone వైపు చూస్తూనే ఉండిపోయాడు.
ఫోన్ మాత్రం ఇంకా vibrate అవుతూనే ఉంది…

“Ravi Calling…”
కొన్ని క్షణాలు ఆలోచించాడు.

“ఎవరైనా prank చేస్తున్నారా…?” అనుకున్నాడు.
కానీ ఒక విషయం గుర్తొచ్చిన వెంటనే అతని వెన్నులో చలి పరిగెత్తింది.

రవి చనిపోయిన తర్వాత…
ఆ number పూర్తిగా switched off లోనే ఉంది.

మూడు సంవత్సరాలుగా ఒక్క message కూడా రాలేదు.

కానీ ఇప్పుడు call ఎలా వస్తోంది…?
 
అది కూడా normal call కాదు.
Video Call.

కొన్ని క్షణాలు ఆలోచించి call lift చేశాడు.

Screen మొత్తం dark గా కనిపించింది.

మొదట camera పనిచేయడం లేదనుకున్నాడు అర్జున్.

“హలో… హలో…” అని రెండు మూడు సార్లు మాట్లాడాడు.

కానీ అటు వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

కేవలం…
చిన్నగా గాలి వీచినట్టొక శబ్దం మాత్రమే వినిపిస్తోంది.

కొద్దిసేపటి తర్వాత…
camera నెమ్మదిగా clear అయింది.

ఒక పాత ఇల్లు…
దుమ్ము పట్టిన గోడలు…
పగిలిపోయిన కిటికీలు…
చీకటితో నిండిన hallway…

ఒక పాత ఇల్లు… దుమ్ము పట్టిన గోడలు… పగిలిపోయిన కిటికీలు… చీకటితో నిండిన hallway…

camera ఎవరో చేతిలో పట్టుకుని నడుస్తున్నట్టుగా మెల్లగా ఊగుతోంది.

ఆ hallway లో ప్రతి అడుగు పడినప్పుడూ…
speaker లో “టప్… టప్…” అనే శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది.

అర్జున్ గుండెల్లో తెలియని భయం మొదలైంది.

“హలో… ఎవరు?” అని ఈసారి గట్టిగా అడిగాడు.

అప్పుడే…
ఫోన్ speaker లో చిన్నగా ఓ శబ్దం వినిపించింది.

మొదట అది clear గా వినిపించలేదు.

కొద్దిసేపటి తర్వాత…
“అర్జున్… నన్ను గుర్తుపట్టావా…?”

ఆ గొంతు…
రవి గొంతే.

అర్జున్ ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది.

ఎందుకంటే…
రవి మూడు సంవత్సరాల క్రితమే కనిపించకుండా పోయాడు.

“రవి…? నువ్వేనా?” అని అర్జున్ తడబడుతూ అడిగాడు.

కానీ సమాధానం రాలేదు.
camera మాత్రం ఇంకా hallway లో ముందుకు కదులుతూనే ఉంది.

గోడల మీద పాత ఫోటోలు వేలాడుతున్నాయి.
కొన్ని ఫోటోలు సగం చినిగిపోయాయి.

ఒక మూలలో పాత గడియారం వేలాడుతోంది.

అది ఆగిపోయినా…
speaker లో మాత్రం “టిక్… టిక్…” అనే శబ్దం వినిపిస్తోంది.

అర్జున్ శరీరం మొత్తం చల్లబడిపోయింది.

“ఇది ఎవరు? prank ఆపండి!” అని ఒక్కసారిగా గట్టిగా అరవడంతో…

camera ఒక్కసారిగా ఆగిపోయింది.

Hallway చివర…
తెల్ల చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.
అతని ముఖం పూర్తిగా చీకట్లో దాగిపోయింది.

కొన్ని క్షణాలు అతను కదలకుండా అలాగే నిలబడ్డాడు.

తర్వాత…
నెమ్మదిగా ముఖం పైకి లేపాడు.

అది…
రవి.
కానీ అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి.

అవి మనిషి కళ్ళలా అసలు కనిపించలేదు.

అర్జున్ భయంతో ఫోన్ చేతిలోంచి జారి నేలపై పడిపోయింది.

కొన్ని క్షణాలు గదిలో పూర్తిగా నిశ్శబ్దం.

అర్జున్ గుండె కొట్టుకునే శబ్దమే అతనికి స్పష్టంగా వినిపిస్తోంది.

మళ్లీ ధైర్యం చేసి phone తీసి చూసే సరికి…
call ఇంకా connect లోనే ఉంది.

కానీ ఇప్పుడు camera లో కనిపిస్తున్నది…

అర్జున్ గది.

అదే కుర్చీ…

అదే table…

అదే fan…

అదే గోడపై ఉన్న clock కూడా.

అర్జున్ చేతులు వణికిపోయాయి.

ఫోన్ screen వైపు చూడాలా… లేక వెంటనే switch off చేయాలా… అన్నట్టు అయిపోయాడు.

Camera లో మాత్రం స్పష్టంగా అతని గదే కనిపిస్తోంది.

అదే గోడపై వేలాడుతున్న clock…
అదే అర్ధం తెరిచి ఉన్న కిటికీ…
fan నెమ్మదిగా తిరుగుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది.

కానీ…
ఆ video angle మాత్రం విచిత్రంగా ఉంది.

ఎవరో అతని గదిలోని మూలలో నిలబడి phone పట్టుకుని record చేస్తున్నట్టుగా కనిపించింది.

అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు.

గది ఖాళీగా ఉంది.

తలుపు lock లోనే ఉంది.
కిటికీలు కూడా మూసే ఉన్నాయి.

అయినా…
video లో camera నెమ్మదిగా ముందుకు కదులుతోంది.

అర్జున్ శ్వాస బరువైంది.

“ఇది ఎలా possible…?” అని తడబడుతూ అన్నాడు.

అప్పుడే video లో ఉన్న camera…
అతని మంచం దగ్గరకు చేరింది.

మంచం పక్కనే…
అర్జున్ కూర్చుని ఉన్నాడు.

అదే బట్టలు.
అదే భయపడిన ముఖం.

కానీ నిజ జీవితంలో అర్జున్ మాత్రం ఇంకా chair మీదే ఉన్నాడు.

అతని కళ్ళు పెద్దవయ్యాయి.
“ఇది recording కాదు…” అర్జున్ phone ని దగ్గరగా పట్టుకుని మళ్లీ screen వైపు చూసాడు…

ఎందుకంటే…
video లో కనిపిస్తున్న “మరో అర్జున్” ఒక్కసారిగా తల తిప్పి camera వైపు చూసాడు.

నెమ్మదిగా నవ్వాడు.

ఆ నవ్వు సాధారణం కాదు.
ఎవరో గొంతు కోసినట్టుగా విరిగిపోయిన నవ్వు.

అప్పుడే speaker లో మళ్లీ రవి గొంతు వినిపించింది.

“అర్జున్…
నువ్వు ఆ ఇంట్లోకి రావాల్సింది కాదు…”

అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.

ఎందుకంటే…
రవి మూడు సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఉన్నప్పుడే చనిపోయాడు.

ఆ విషయం ఊరంతా చూసింది.

అర్జున్ ఒక్కసారిగా ఫోన్ cut చేయడానికి ప్రయత్నించాడు. కానీ screen freeze అయిపోయింది.

Battery 78% చూపిస్తున్న phone…
ఒక్కసారిగా 5% కి పడిపోయింది.
Battery 78% చూపిస్తున్న phone… ఒక్కసారిగా 5% కి పడిపోయింది.

Room లో fan ఆగిపోయింది.

Clock కూడా 12:07 దగ్గరే ఆగిపోయింది.

మొత్తం గది నిశ్శబ్దంగా మారింది.

అప్పుడే…

అర్జున్ వెనకాల నుంచి చాలా నెమ్మదిగా ఓ గొంతు వినిపించింది.

“ఇప్పుడు… నన్ను గుర్తుపట్టావా…?”

అది phone speaker నుంచి కాదు.

అతని వెనకాల నుంచే వచ్చింది.

అంటే…
ఎవరో అతని గదిలో నుంచే video తీస్తున్నారు.

అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు.

అప్పుడు…
తన వెనకాల నిలబడి ఉన్న shadow ని చూసి గట్టిగా అరిచేశాడు.

ఫోన్ ఒక్కసారిగా switch off అయిపోయింది.
తర్వాత అంతా normal గా అయిపొయింది.

అర్జున్ అలాగే కూర్చున్నాడు ఆ రాత్రంత.

ఆ రాత్రి తర్వాత…
అర్జున్ ఆ గదిని ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

కానీ విచిత్రం ఏంటంటే…
ఇప్పటికీ ప్రతి సంవత్సరం అదే తేదీ రాత్రి 12:07కి…
అర్జున్ కొత్త number కి ఒక video call వస్తూనే ఉంటుంది.

Screen మీద మాత్రం ఒక్క పేరే కనిపిస్తుంది.
“Ravi Calling…”


“కొన్ని calls ఎప్పటికీ answer చేయకూడదు అంటారు…

కానీ అర్జున్ ఆలస్యంగా ఆ విషయం తెలుసుకున్నాడు.”

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...