Skip to main content

Episode 2 చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి | Telugu Suspense Story

చెరువు దగ్గర కనిపించిన అమ్మాయి – Part 2 1980ల్లో… ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటనను ఇప్పటికీ అక్కడి పెద్దవాళ్లు పూర్తిగా మర్చిపోలేదు… పౌర్ణమి రాత్రి చెరువు దగ్గరకు వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి ఆ దారి వైపు చూడకుండా వచ్చేవారు…? అసలు… “లక్ష్మి” అనే ఆ అమ్మాయి నిజంగా ఎవరు…? ఆ రాత్రి… రాఘవ చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అతని అరచేతుల్లో ఇంకా చెరువు నీటి చల్లదనం మిగిలి ఉన్నట్టే అనిపిస్తోంది. అతని చేతిలో ఉన్న ఆ వెండి గాజు మాత్రం చంద్రకాంతి తగిలినప్పుడల్లా వింతగా మెరుస్తోంది. అది సాధారణ గాజులా కనిపించినా… దానిలో ఏదో చెప్పలేని భయం దాగి ఉన్నట్టుగా ఉంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. బయట అప్పుడప్పుడు వీచే గాలి పాత కిటికీ తలుపులను మెల్లగా కదిలిస్తోంది. దూరంగా ఎక్కడో కుక్కలు మొరుగుతున్న శబ్దం మాత్రమే ఆ నిశ్శబ్ద రాత్రిని చీల్చుతోంది. కానీ రాఘవకు మాత్రం కళ్లకు నిద్ర రాలేదు. అతను మంచం మీద పడుకున్నప్పుడల్లా చెరువు దగ్గర కనిపించిన ఆ అమ్మాయి ముఖమే గుర్తొస్తోంది. ఆమె కళ్ళలో కనిపించిన ఆ విచిత్రమైన బాధ… ఆమె మాటల్లో దాగి ఉన్న ఆ ఒంటరితనం… ఏదో అతని మనసును గట్టిగా పట్టేసినట్టుంది. ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఇంకా అత...

Telugu Suspense Story: అర్ధరాత్రి 12 గంటలకు వంతెన దగ్గరకు వెళ్లిన అమ్మాయి – బయటపడిన పెద్ద రహస్యం

“అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా వెళ్లిన అమ్మాయి – ఒక నిజాన్ని బయటపెట్టిన ధైర్యమైన కథ”

        అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు. రోడ్డుపై ఎవ్వరూ లేరు. చుట్టూ నిశ్శబ్దం, గాలి కూడా మెల్లగా ఊదుతోంది. రోడ్డుపై ఉన్న లైట్లు అలా మసకగా వెలుగుతున్నాయి. అక్కడక్కడ చిమ్మ చీకటి. అలాంటి సమయంలో ఒంటరిగా ఒక అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె పేరు అహల్య.

Ahalya

         అహల్య సాధారణమైన అమ్మాయి. చిన్నప్పటి నుంచే ఆమె చాలా ధైర్యంగా ఉండేది. చదువులో మంచి ప్రతిభ ఉంది, కానీ జీవితం మాత్రం అంత సులభంగా ఉండేది కాదు. తండ్రి చిన్న ఉద్యోగి, తల్లి గృహిణి. అయినా ఆమెకు మాత్రం ఒక మంచి జర్నలిస్ట్ అవ్వాలి… నిజాలను బయటపెట్టాలి, నిజాయితీగా ఉండాలి అనే ఆశ ఉండేది. కుటుంబం కోసం తన కలలను కొంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది.

         ఆ రోజురాత్రి అహల్య బయటకు రావడానికి ఒక కారణం ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమె ఫోన్‌కు ఒక అజ్ఞాత మెసేజ్ వచ్చింది.
“నీకు నిజం తెలుసుకోవాలంటే… ఈరోజు అర్ధరాత్రి పాత వంతెన దగ్గరకు రా.”

       ఆమె దాన్ని మొదట అవసరం లేని మెసేజ్ అనుకొని పట్టించుకోలేదు. మరుసటి రోజు కూడా అలాగే మెసేజ్ వచ్చింది. రిప్లై చేయడానికి కాదు, కాల్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎవరో ఆట పట్టిస్తున్నారేమో అనుకొని మళ్ళీ పట్టించుకోలేదు.

       కానీ రోజూ అదే మెసేజ్ రావడంతో ఆమెకు అనుమానం మొదలైంది. “ఈ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నాకే ఎందుకు పంపిస్తున్నారు?” అని ఆలోచించసాగింది.

      ఏదేమైనా నాకు ఈ విషయం తెలియాల్సిందే అని నిర్ణయించుకుని, ఇంట్లో ఎవరికీ ఏమి చెప్పకుండా ఒంటరిగా వంతెన దగ్గరకు వెళ్లింది.

      అక్కడ ఎవరూ లేరు. చిమ్మ చీకటి, గాలి మాత్రమే గట్టిగా ఊదుతోంది.

       అప్పుడే ఆమెకు “టక్… టక్…” అనే శబ్దం వినిపించింది. ఎవరో అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. అహల్య వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది.

         తిరిగి వెళ్ళిపోదాం అనుకొని కొంచెం ముందుకు వెళ్లగానే ఆమెకు ఒక పాత బ్యాగ్ కనిపించింది. ఆమె జాగ్రత్తగా దాన్ని తెరిచి చూసింది. అందులో కొన్ని పేపర్లు… ఫోటోలు ఉన్నాయి.

        ఆ ఫోటోలు చూసి ఆమె షాక్ అయింది. అవి ఒక పెద్ద అవినీతి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు. కొంతమంది పెద్ద అధికారుల ఫోటోలు, అక్రమ డబ్బు లావాదేవీల వివరాలు ఉన్నాయి. అది చాలా ప్రమాదకరమైన విషయం.

       అప్పుడే వెనక నుంచి ఒక కార్ లైట్ ఆమెపై పడింది. ఆమె భయంతో వెనక్కి తిరిగి చూసింది. కారు ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. అందులో నుంచి ఇద్దరు మనుషులు దిగి, “ఆ బ్యాగ్ మాకు ఇవ్వు” అని చెప్పారు.

          అహల్యకు వెంటనే అర్థమైంది — ఈ రహస్యం వాళ్లదే అని. ఆమె భయపడుతూ మెల్లగా ఒక అడుగు వెనక్కి వేసింది.

         వాళ్లు ఆ బ్యాగ్‌ను లాక్కోవడానికి ముందుకు రాగానే, అహల్య ఒక్కసారిగా వారిని తోసి బ్యాగ్‌ను తీసుకొని అక్కడి నుంచి పరుగెత్తింది. వాళ్లు కూడా ఆమె వెనకే పరుగెత్తారు.

         ఆ చీకట్లో ఒక గల్లీలో దాక్కుంది. కారు ఆమెను దాటి కొంచెం ముందుకు వెళ్లగానే అహల్య వెంటనే పోలీస్ స్టేషన్ వైపుకు పరుగెత్తింది. వాళ్లు కూడా ఆమెను వెంబడించారు. కానీ చివరికి ఆమె పోలీస్ స్టేషన్ చేరుకుంది.

        లోపలికి వెళ్లగానే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూర్చుని ఉన్నారు. అహల్య వెంటనే వాళ్ళతో జరిగినదంతా చెప్పింది.

         అంతా విన్న పోలీసులు, “సరే అమ్మా, దీని గురించి మేము విచారణ చేస్తాము” అని చెప్పారు. ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటిని తీసుకొని, అహల్యను క్షేమంగా ఇంటి దగ్గర వదిలేశారు.

కొన్ని రోజుల తర్వాత…

ఒక రోజు రాత్రి 11 గంటలకు అహల్య ఫోన్‌కు Unknown Number నుండి ఒక కాల్ వచ్చింది.

        ఆమె ఫోన్ ఎత్తగానే, ఆవైపు నుండి ఒక నెమ్మదైన గొంతు వినిపించింది:
  “అహల్య… నిజం ఇంకా పూర్తిగా బయటపడలేదు.”

         అహల్య షాక్ అయింది. “ఎవరు మీరు?” అని అడిగింది. కానీ ఫోన్ కట్ అయిపోయింది.

ఆ రాత్రి అహల్యకు నిద్ర పట్టలేదు.

         మరుసటి రోజు ఆమె ఇంటి తలుపు ముందు ఒక చిన్న కవర్ కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక పాత ఫోటో… ఇంకా ఒక పేపర్ ఉంది.

          ఆ ఫోటో చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది.

         ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వేరెవరో కాదు — అహల్య తండ్రి.

        ఆ పేపర్ మీద ఒక్క వాక్యం మాత్రమే ఉంది:

“ఈ కథ మొదలైంది 20 సంవత్సరాల క్రితం.”

        ఇది చూసి అహల్య నేరుగా తన తండ్రి దగ్గరకు వెళ్లి ప్రశ్నించింది. కానీ ఆయన ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు.

        మరుసటి రోజు ఆమె ఫోన్‌కు మళ్ళీ Unknown Number నుండి ఒక మెసేజ్ వచ్చింది.

“నీకు నిజం తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి 11 గంటలకు అదే వంతెన దగ్గరకు రా.”

        మెసేజ్‌లో చెప్పినట్టే అహల్య 11 గంటలకు వంతెన దగ్గరకు వెళ్లింది. ఈసారి ఆమె ఒంటరిగా కాదు — పోలీసులు కూడా దూరంగా గమనిస్తూ ఉన్నారు.

       కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు.

అతను అహల్యతో,
“నన్ను క్షమించమ్మా… దీనికంతా కారణం నేనే” అని చెప్పాడు.

      అతను చెప్పిన కథ అహల్యను షాక్‌కు గురి చేసింది.

“ఒకప్పుడు నేను మీ నాన్నకు ప్రాణ స్నేహితుడిని. మీ నాన్న ఒక నిజాయితీ గల జర్నలిస్ట్. కానీ నేను తప్పు దారిలో వెళ్లిపోయాను…”

      అతను తన గతాన్ని, అవినీతి ఎలా జరిగిందో అన్నీ వివరంగా చెప్పాడు. చివరికి చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు.

అప్పుడే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు.

అహల్య ఇచ్చిన సాక్ష్యాలతో పెద్ద అవినీతి బయటపడింది. చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారు.

ప్రజలు అహల్యను ధైర్యమైన జర్నలిస్ట్ అని ప్రశంసించారు.

అహల్య జీవితం ఇప్పుడు మారిపోయింది… కానీ కథ ఇక్కడితో ముగియలేదు.

నిజం కొన్నిసార్లు ప్రమాదకరం…
కానీ దాన్ని వెతికే ధైర్యం ఉన్నవాళ్లే ప్రపంచాన్ని మార్చగలరు.

కొన్ని నెలల తర్వాత…

అహల్య ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్ట్ గా పని చేయడం ప్రారంభించింది.

ఆమె కథ చాలా మందికి ప్రేరణ అయింది.

భయం మనల్ని ఆపుతుంది…
కానీ ధైర్యం నిజాన్ని గెలిపిస్తుంది.

ఒక చిన్న అమ్మాయి కూడా
నిజం కోసం నిలబడితే ప్రపంచం మారుతుంది.

ఇలాంటి మరిన్ని తెలుగు కథలు చదవాలంటే మా బ్లాగ్ ను follow అవ్వండి.

Comments

Popular posts from this blog

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

“ఆమె చనిపోయింది… కానీ మెసేజ్ ఇంకా వస్తోంది! 📱👻” part-1

మూసిన గది రహస్యం అద్దంలో కనిపించింది… కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు… ఎవరూ లేరు… అదే ఆమె చేసిన పెద్ద తప్పు… ఆ రాత్రి… ఆమె బ్రతికే బయటపడలేదు 😱      వర్షం గట్టిగా కురుస్తోంది… అది సాధారణ వర్షం కాదు…   ఆకాశమే పగిలిపోయినట్టుగా కుండపోతగా కురుస్తోంది. గాలి ఒక్కోసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా హోరెత్తుతోంది. చెట్లు వంగి మళ్లీ నిలబడుతున్నాయి. ఆకాశంలో మెరుపులు ఒక్కసారిగా మెరుస్తూ… చీకటిని క్షణం పాటు చీల్చేస్తున్నాయి.  ఆ వెంటనే వినిపిస్తున్న గర్జన గుండెల్లోకి దూసుకెళ్లేంత భయంకరంగా ఉంది. గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్ మొత్తం ఆ రాత్రి ఒక భూతబంగ్లా లా కనిపిస్తోంది. సాధారణంగా వెలుగులతో మెరిసే ఆ భవనం… ఇప్పుడు పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. కరెంట్ ఒక్కసారిగా పోయింది. ఎక్కడో ఎలక్ట్రిక్ వైర్లు చప్పుళ్లు చేస్తూ…  “టక్…టక్…” అంటూ వినిపిస్తున్నాయి. లిఫ్ట్ పనిచేయడం ఆగిపోయింది. కారిడార్లలో ఎమర్జెన్సీ లైట్లు కూడా వెలగడం లేదు. అప్పుడప్పుడు మెరుపు వెలుగు పడినప్పుడు మాత్రమే…  ఆ భవనం గోడలు, కిటికీలు, బాల్కనీలు ఒక్క క్షణం కనిపించి…   వెంటనే మళ్లీ చీకటిలో కలిసిప...