Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

“రహస్య గది – Part 1 (తెలుగు Horror Story)”

“పెద్దింటి రహస్యం – భయంకర కథ”

  ఒక గ్రామంలో పెద్ద ఇల్లు. ఆ ఇల్లు చాలా పెద్ద సంసారం ఉన్న ఇల్లు. గ్రామంలో అందరూ ఆ ఇంట్లో వాళ్ళను పెద్దింటి వాళ్ళు అనేవారు. ఆ పెద్దింట్లో ఒక అబ్బాయికి పెళ్లి నిశ్చయం అయ్యింది. ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా పెళ్లి ఏర్పాట్లు జరిగుతున్నాయి.

      ఇంటి ముందు మామిడి ఆకుల తోరణాలు, గాలి తాకిడికి ఊగుతూ… రంగురంగుల లైట్లు రాత్రి ఆకాశాన్ని కూడా వెలిగిస్తున్నాయి. గ్రామం మొత్తం ఆహ్వానం పొందింది. ఎవరైనా వచ్చి తినొచ్చు… చూడొచ్చు… ఆశీర్వదించొచ్చు.

పెళ్లి రోజు ఉదయం…
నాదస్వరాలు మోగుతుండగా, డప్పులు, తాళాలు గ్రామం అంతా వినిపిస్తున్నాయి. పెళ్లి కొడుకు రాజశేఖర్  తెల్ల పంచె కట్టుకొని, తిలకం పెట్టుకొని, అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఇక పెళ్లికూతురు నాదియా పసుపు పచ్చ, ఎర్రటి అంచు పట్టు చీర ఇంకా బంగారు ఆభరణాలు, ఆమె ముఖంలో చిన్న నవ్వు పెద్ద సంతోషం. పెళ్లి సందడులు చాలా సరదాగా నడుస్తూ ఉండేది.

 ఇలా ఉండగా, పెళ్లికి ముందు రోజు రాత్రి పెళ్లి కొడుకు ఇంట్లో బంధువులతో ఎన్నో సరదా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పెళ్లికూతురు నాదియాకు వాష్ రూమ్ కు వెళ్లాలని అనిపిస్తుంది దానికోసం ఇంటి లోపలికి వెళ్ళాలి.

       నాదియాకు తోడుగా ఒక ఆడ పిల్లను పంపించారు. లోపల చాలా పెద్ద ఇల్లు తనకు ఏమో తెలియని భయం. లోపలకు వెళుతూ, వెళుతూ తనకి ఒక తాళం వేసిన గది ఒకటి కనిపిస్తుంది. 

         అక్కడకు వెళ్ళగానే తోడుగా ఉన్న పాప తనను చేతిని పట్టుకొని అక్కడినుండి లాక్కొని వెళుతుంది. ఏమైంది అని అడిగితే, ఆ పాప అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు అని చెప్తుంది. 

   తనకేమో కొంచం అనుమానంగా అనిపించింది. ఇంకా దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం వచ్చింది. కానీ పెళ్లి సంబరంతో దాని గురించి మర్చిపోయింది. తరువాత రోజు పెళ్లి. పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. 5 గంటలకే ముహూర్తం. 

ముహూర్తం సమయం దగ్గరపడింది. పండితులు మంత్రాలు చదువుతున్నారు. అగ్ని ముందు ఇద్దరూ కూర్చున్నారు జనం అంతా “శుభమస్తు!” అంటూ ఆశీర్వదిస్తున్నారు. రాజశేఖర్ నాదియాకు తాళి కట్టే సమయం వచ్చింది. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. అగ్ని మంటలు ఒక్కసారిగా పెరిగింది, కొన్ని దీపాలు ఆరిపోయాయి. అందరూ కాసేపు షాక్ అయ్యారు, పండితుడు మరేమి పరవాలేదు. “ఇది చిన్న అపశకునం మాత్రమే… పెళ్లిని ఆపకండి అని అన్నాడు.

అంతే… ఇక తాళి కట్టబడింది. పెళ్లి పూర్తయ్యాక ఆటలు, పాటలు, నృత్యాలు తర్వాత విందు భోజనం… అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ రాత్రే వారిద్దరి మొదటి రాత్రి ఆ రాత్రి నాదియా తెల్ల చీర కట్టుకొని, మల్లె పూలు పెట్టుకొని, పాల గ్లాస్ తో లోపలికి వెళ్ళింది. 

     పెళ్ళికొడుకు ఒక్కడే రూమ్ లో కూర్చుని ఉన్నాడు. నదియా తన చేతిలో ఉన్న పాల గ్లాసును రాజశేఖర్ కు ఇచ్చింది. తను పాలు  తాగిన తర్వాత ఇద్దరూ కలిసి కూర్చుని చాలా సేపటి వరకు మాట్లాడుకున్నారు, ఇంకా కొత్త అనుభూతిని పొందారు. మధ్యరాత్రి 1:00 గంట తర్వాత రాజశేఖర్ కు బాగా నిద్ర పట్టేసింది. నాదియాకు మాత్రం కొత్త ఇల్లు కాబట్టి నిద్ర రాలేదు. అలాగే గదిలో కూర్చొని ఉంది… 

    ఒక్కతే ఎంత సేపని కూర్చోను, కాసేపు అలా గాలికి తిరిగొద్దాం అంటూ రూమ్ నుండి బయటకు వచ్చింది. పెద్దిల్లంతా చూస్తూ, నడుస్తూ ఆ తాళం వేసిన గది దగ్గరికి వచ్చి ఆగింది.  ఆ గది డోర్ దగ్గరకి వెళ్ళగానే ఒక వింత గాలి.

ఆ గదిలోంచి “వెన్నులో వణుకు పుట్టించే శబ్దాలు వినిపించాయి…
మంత్రాల్లాంటి మాటలు…
అర్థం కాని గుసగుసలు…
ఎవరో నెమ్మదిగా మాట్లాడుతున్నట్టు...
ఇంకా ఏదో లాగుతున్నట్టు… అనిపించింది. 

      ఆమె శబ్దాలు వస్తున్న వైపుకు వెళ్లి చూసింది కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఆ గదిలో ఏముందో చూద్దాం అని దగ్గరకు వెళ్ళగానే ఒక వృద్దురాలు అక్కడికి వచ్చి ఇలా అంది. “ఈ ఇంట్లో రాత్రిళ్లు బయటకి రావద్దమ్మా…” అది విన్న నాదియా కొంచం కంగారుపడింది. రాజశేఖర్ కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి తనని తీసుకెళ్లాడు.

      తర్వాత రోజు ఇంట్లో ఒక పెద్దాయన హఠాత్తుగా చనిపోయాడు అన్న వార్త వచ్చింది. “వయస్సు అయ్యింది… సహజ మరణం” అని అందరూ అనుకున్నారు. దాని గురించి ఎవరూ అంతగా పట్టించుకోలేదు. మరుసటి రోజు నాదియా వంటింట్లో  వంట చేస్తుంది. ఆ వంటింట్లో ఉన్న కిటకీ ఎలాంటిదంటే రోడ్డుపై ఎవరు ఏమి మాట్లాడినా వినబడుతుంది. 

      అలాగే ఆ రోజు గ్రామస్థులు నాదియాను, ఈ ఇంటి కోడలి కాలి గుణం బాలేదు, అందుకే పెద్దింటి అయన చనిపోయాడు అని మాట్లాడుకోవడం వినింది. ఆ మాటలు విన్న నాదియాకు కంటిలోని నీరు ఆగలేదు. చాలా బాధపడింది. రోజులు గడుస్తూ ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన విషయాలను ఆమె గమనించింది.

ఆ ఇంటి పెద్దలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు కానీ కళ్లలో ఏదో భయం కనిపిస్తుంది. రాత్రి అయ్యే సరికి ఇంట్లో ఒక్కో మూలలో నీడలు కదిలినట్టు కనిపించాయి. ఇంకా తాళం వేసిన ఆ గది రహస్యం. పెళ్లి రోజు నుంచే నాదియాకు ఆ గదిలో ఏమో ఉందని అనుమానం. ఒక రోజు రాత్రి టైమ్ 11:40 అయ్యింది. వాళ్ళ గదిలో నీళ్ళు లేకపోవడంతో తీసుకొద్దాం అని రూమ్ నుండి బయటకు వచ్చింది.

      ఇంటి వెనకాల కొంతమందిని వెళ్లడం చూసింది. కిటకీ దగ్గరికి వెళ్లి చూస్తే, ఒకరిని ఈడ్చుకొని తీసుకెళ్తున్నారు.
ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తాళం వేసిన గది లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నారు. అదైన మరుసటి రోజు మరో వ్యక్తి చనిపోయారు. 

ఇంకో రోజు ఇంకొకరు, ఇలా రోజుకో మరణం. అది ఆ పెద్దింటి ముందు మాత్రమే కనిపించేది. గ్రామంలో భయం మొదలైంది. “ఆ ఇంట్లో ఏదో దయ్యం ఉంది పెళ్లి కూతురు వచ్చిన దగ్గర నుంచి ఇది మొదలైంది” అన్న మాటలే వినిపించసాగాయి. ఆ మాటలు విన్న నాదియా సహించలేకపోయింది. “నేనేమి చేశాను…?” నా వల్లే ఇది జరుగుతుందా అన్న భయం ఆమె గుండెను కొట్టేసింది. కన్నీళ్లు ఆగలేదు….

       గ్రామంలో ఒక్కొక్కరూ చనిపోతూ ఉండగా భయంతో సగం మంది గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. నిజంగా ఇదంతా  నా వల్లే జరుగుతోందా లేదా  ఎవరైనా చేస్తున్నారా అంటూ తనకు ఇప్పట్నుంచో అనుమానం. నేను వచ్చినప్పట్నుంచి చాలా ప్రశ్నలు నన్ను వేదిస్తున్నాయి. 
  • ఎప్పుడూ ఆ గదికి తాళం వేసి ఉంటుంది
  • ఆ గది దగ్గరకి వెళ్తే ఒక వింత చలి 
  • రాత్రి అయ్యాక లోపల నుంచి మంత్రాల్లాంటి శబ్దాలు వస్తుంటాయి.
  • మరణాలు జరిగిన ప్రతి రోజు… ఇంట్లో కొందరు వ్యక్తులు మాత్రమే కనిపించకుండా పోయి తిరిగి వచ్చేవారు.
  • ఇంకా ఆ గది దగ్గరకి వాళ్ళు మాత్రమే వెళ్లేవారు.
       ఎలాగైనా కనిపెట్టాలి అంటూ  ఒక రోజు రాత్రి అందరూ పడుకొన్న తర్వాత అంటే 12:00 గంటలు అయ్యాక… తాళం వేసిన ఆ గది రహస్యం తెలుసుకుందాం అని నాదియా దూరంగా దాక్కొని ఆ గది వైపు చూస్తోంది.

      ఇంటి పెద్దలు నెమ్మదిగా ఆ గది దగ్గరకు వచ్చారు.
తలుపు తెరిచారు. లోపల నుంచి పొగ లాంటిది బయటకు వచ్చింది. ఒక కాంతి… ఎర్రగా మెరుస్తోంది. వాళ్లు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లిపోయారు. నాదియా భయంతో కొన్ని అడుగులు ముందుకు వేయగానే ఒక ముసలావిడ గట్టిగా 

నాదియా...!
ఎక్కడికి వెళ్ళేది? నువ్వు ఈ ఇంటి కోడలివి. కోడలు చేయాల్సిన పని మాత్రం చేయి అంటూ అరిచింది. నాదియాకు చాలా భయం వేసింది. తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. తరువాత రోజు  రాత్రి నాదియాకు ఒక అవకాశం వచ్చింది. ఆ గది తాళం అక్కడే విడిచిపెట్టారు. అప్పుడు ఆమె ధైర్యం చేసి నెమ్మదిగా తలుపు తెరిచింది…

తలుపు తెరవగానే, శవాల దుర్వాసన, ఎముకల్లోకి దిగే చలి, గది అంతా చీకటి. నెమ్మదిగా లోపలికి వెళ్లి చూసింది. ఆ గది ఒక సాధారణ గది కాదు, అది ఒక రహస్య పూజల స్థలం తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకం. గోడల మీద రక్తంతో వేసిన చిహ్నాలు, మధ్యలో ఒక పెద్ద వేదిక (పూజ స్థలం), చుట్టూ కొవ్వొత్తులు, అర్ధం కాలిపోయినవి
ఒక మూలలో ఎముకలు ఇంకా బలి గుర్తులు.

అప్పుడే తనకు అర్థమైంది ఇదంతా కావాలనే చేస్తున్నవి.
  •  పెళ్లి రోజు జరిగిన అపశకునం
  •  రాత్రిళ్లు వినిపించే శబ్దాలు
  •  ఒక్కొక్కరుగా జరిగే మరణాలు
నాదియా భయంతో వెనక్కి తిరిగింది అక్కడ తనకు ఒక పుస్తకం దొరికింది. నాదియా షాక్ అయింది. అన్నీ ఆ గది వల్లే అని అర్థం చేసుకున్న నాదియా. ఒక పేజీ తెరిచింది. అక్కడ రక్తంతో రాసిన ఒక వాక్యం.

“కొత్త కోడలు బలి అవుతుంది…” దాన్ని చూసిన వెంటనే నాదియా చేతిలోని ఆ పుస్తకం జారి కింద పడింది.


తరువాత ఏమి జరుగుతుంది?
పాత కాలపు కథ
ఇది ఎలా మొదలయ్యింది?
ఎందుకు ఇదంతా చేస్తున్నారు? 


ఇంకా ఇలాంటి stories కావాలంటే మా బ్లాగ్ ను follow అవ్వండి

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...