Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

💔❤️ “లిఖిత – వరుణ్ ప్రేమకథ” ❤️💔

💔❤️ “లిఖిత – వరుణ్ ప్రేమకథ” ❤️💔 

     లిఖిత ఒక కోటిశ్వరుడి కూతురు. చదువులో, పోటీల్లో ఎప్పుడూ ఫస్ట్ వచ్చేది. ఎన్నో గోల్డ్ మెడల్స్ కూడా సాధించింది. అయినప్పటికీ, ఆమెకు కోపం, ద్వేషం, అహంకారం అనే లక్షణాలు ఏమాత్రం ఉండేవి కాదు. ఆమె చాలా సాధారణమైన అమ్మాయిలా ఉండేది.

      లిఖిత రోజూ ఉదయం 5 గంటలకే లేస్తుంది. ఆమె గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడుతుంటే, అది ఆమెకు కొత్త రోజు ప్రారంభమని గుర్తు చేస్తాయి. ఆమె జీవితం చాలా సింపుల్, కానీ ఇంట్లో కఠినమైన నియమాలు ఉంటాయి. ఎంత మంది పనివాళ్లు ఉన్నా, తన పనులు తానే చేసుకుంటుంది. ఉదయం లేచి పూజ చేయడం, కిచెన్‌లో పనివాళ్లకు సహాయం చేయడం ఆమెకు అలవాటు. తర్వాత చదువుకు సిద్ధమవుతుంది.

     లిఖితకు అమ్మానాన్నలు అంటే చాలా ప్రేమ. కానీ ఆమె నాన్న చాలా strict. ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండే లిఖిత, కాలేజ్‌లో మాత్రం ఎవ్వరితో ఏమీ మాట్లాడేది కాదు. చదువులే తన ప్రపంచం అన్నట్టుగా ఉండేది. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే, ఆమె మాత్రం ఒక మూలలో కూర్చొని పుస్తకం చదువుతుంటుంది.

      ఇంట్లో అందరూ పడుకున్నాక, లిఖిత మాత్రం కిటికీ దగ్గర కూర్చొని ఆకాశాన్ని చూస్తుంది. చందమామను చూసుకుంటూ తనతో తానే మాట్లాడుకుంటుంది:

“నా జీవితం ఇలా సింపుల్‌గానే ఉంటుందా…?”
“నా కలలు ఏమిటి…?”
“నేను నిజంగా సంతోషంగా ఉన్నానా…?”

     ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. కానీ ఆలోచనలు మాత్రం ఆగవు, ఆమెకు అన్నీ ఉన్నాయి — ప్రేమించే తల్లిదండ్రులు, మంచి చదువు, సేఫ్ లైఫ్. అయినా కూడా, ఆమె మనసులో ఎక్కడో ఒక చిన్న ఖాళీ ఉంటుంది. అది ఏమిటో ఆమెకు తెలియదు, కానీ అది ఎప్పుడూ ఆమెను వెంటాడుతూనే ఉంటుంది.

       ఒక రోజు ఆమె తన డైరీలో ఇలా రాసింది: “నా జీవితంలో ఏదో మిస్సింగ్ అనిపిస్తోంది… కానీ అది ఏమిటో నాకు అర్థం కావడం లేదు…” ఆమె జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద సమస్యలు లేవు… కానీ ఎలాంటి ఎగ్జైట్‌మెంట్ కూడా లేదు. అది ఒక తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది. ఆమెకు తెలియదు — చాలా త్వరలో ఆమె జీవితంలో ఒక వ్యక్తి వచ్చి, ఆమె ప్రపంచాన్నే మార్చేస్తాడని.

       ఒక రోజు కాలేజ్ లైబ్రరీలో లిఖిత చదువుకుంటుండగా, ఒక అబ్బాయి వచ్చి యాదృచ్ఛికంగా ఆమె పుస్తకాలను కింద పడేశాడు. వెంటనే “సారీ…” అని చిరునవ్వుతో అన్నాడు. మొదట లిఖిత కోపంగా చూసినా, ఆ నవ్వులో ఏదో ప్రత్యేకత ఉంది. అలా ఆమెకు కొత్త పరిచయం ఏర్పడింది. అతని పేరు వరుణ్. వరుణ్, లిఖితకు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. అతను చాలా చురుకుగా, అందరితో కలిసిపోతూ, సహాయం చేసే స్వభావం కలవాడు. స్నేహితుల కోసం ఏదైనా చేసే వ్యక్తి.

       మరుసటి రోజు క్లాస్‌లో లిఖిత కూర్చొని ఉండగా, వరుణ్ లోపలికి వచ్చి, Excuse me sir, నేను లోపలికి రావచ్చా?” అని అడిగాడు. సర్ “Come in” అని అనుమతించారు. సర్, నేను ఈ క్లాస్‌కి కొత్తగా అడ్మిషన్ అయ్యాను. ఇది నా మొదటి రోజు, అన్నాడు వరుణ్. సరే, వెళ్లి కూర్చో, అన్నారు సర్.

     లంచ్ టైమ్‌లో లిఖిత అతని దగ్గరకు వెళ్లి, నేను గుర్తుందా? ఆ రోజు లైబ్రరీలో నా పుస్తకాలు పడేశావు… అంది. వరుణ్ నవ్వుతూ, “అవును, గుర్తుంది. సారీ, అన్నాడు. పరవాలేదు, అంది లిఖిత.

    అలా వాళ్లిద్దరి మధ్య స్నేహం మొదలైంది. కలిసి క్లాసులు… కలిసి లంచ్… అలా వాళ్లు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఒక రోజు వర్షం పడుతుండగా, వరుణ్ అన్నాడు: లిఖిత… నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా…

    లిఖిత గుండె వేగంగా కొట్టుకుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను…” అన్నాడు వరుణ్. ఆ మాట విన్న వెంటనే లిఖిత కొద్దిసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పింది: నేను కూడా… ఆ క్షణం నుంచి వారి జీవితంలో ఒక అందమైన అధ్యాయం మొదలైంది. లిఖిత తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకుంది. ఆమెకు తన తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంది. కానీ ఆమె నాన్న చాలా కఠినమైన వ్యక్తి. విషయం చెప్పగానే, ప్రేమా? ఇది మన ఇంట్లో జరగదు!” అని గట్టిగా అరిచాడు. లిఖిత కన్నీళ్లు పెట్టుకుంది. లిఖిత నాన్న తన అహంకారంతో, “ఈ అబ్బాయి మన కూతురి జీవితంలో ఉండకూడదు,” అని నిర్ణయించుకున్నాడు.

లిఖితకు తెలియకుండా వరుణ్‌ను పిలిపించి, అతనిని తీవ్రంగా బెదిరించాడు. లిఖితను మర్చిపో. లేకపోతే నీ కుటుంబానికి కూడా సమస్యలు వస్తాయి, అన్నాడు. వరుణ్ చాలా బాధపడ్డాడు. లిఖితకు ఏమీ తెలియకూడదు…” అని నిర్ణయించుకున్నాడు. లిఖితకు వరుణ్ అకస్మాత్తుగా దూరంగా మారడం అర్థం కాలేదు. కాల్స్ ఎత్తలేదు, మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదు. ఆమె గుండె విరిగిపోయింది. నన్ను వదిలేశావా…? అని ఏడ్చింది. వరుణ్ కూడా ఆమె ఫోటో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఒక రోజు వరుణ్ తన స్నేహితులు — అర్జున్, కిరణ్, మనోజ్‌తో కలిసి లంచ్‌కు వెళ్లాడు. అర్జున్ – ధైర్యంగా ఉండే స్నేహితుడు. తప్పు కనిపిస్తే ఎదుర్కొంటాడు. కిరణ్ – ఆలోచించి మాట్లాడే, ప్రాక్టికల్ వ్యక్తి. మనోజ్ – ఎప్పుడూ నవ్వులు పంచే, టెన్షన్‌ను తగ్గించే స్నేహితుడు. వరుణ్ ప్రవర్తనలో వచ్చిన మార్పును వారు గమనించారు. ఒక రాత్రి వాళ్లు అతని గదికి వెళ్లి, నిజం అడిగారు. చివరకు వరుణ్ అన్నీ చెప్పాడు. విషయం విన్న అర్జున్ కోపంతో, “ఇది న్యాయం కాదు!” అన్నాడు. కిరణ్, ఇలా వదిలేస్తే మీరు ఇద్దరూ జీవితాంతం బాధపడతారు, అన్నాడు. మనోజ్ కూడా, మనం ఏదైనా చేయాలి, అన్నాడు. ఆ రాత్రే వాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నారు — ఎలాగైనా లిఖిత, వరుణ్‌లను కలపాలని. మరుసటి రోజు వాళ్లు లిఖితను కలిశారు. నిజం చెప్పగానే, ఆమె షాక్ అయింది. వరుణ్ నా కోసం ఇంత బాధపడ్డాడా…? అని ఏడ్చింది. ఆమె గట్టిగా నిర్ణయం తీసుకుంది: నేను వెనక్కి తగ్గను. ఇంట్లోకి వెళ్లి, నేను వరుణ్‌ను పెళ్లి చేసుకుంటాను, అని ధైర్యంగా చెప్పింది. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆమె నాన్న వెంటనే తన బిజినెస్ పార్ట్నర్ కొడుకుతో పెళ్లి జరపాలని నిర్ణయించాడు.వరుణ్ స్నేహితులు ఎంతో కష్టపడి, పెళ్లి మంటపం నుంచి లిఖితను తీసుకువచ్చి, అదే ముహూర్తంలో ఒక చిన్న దేవాలయంలో లిఖిత – వరుణ్ పెళ్లి జరిపించారు.

       అది సింపుల్ మ్యారేజ్ అయినా, నిజమైన ప్రేమ గెలిచిన రోజు. కొన్ని రోజుల తర్వాత, వాళ్లు చిన్న ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. పెద్దగా సౌకర్యాలు లేకపోయినా, అక్కడ నిజమైన ప్రేమ ఉంది. లిఖితకు ఇంతవరకు తెలియని ఆనందం ఇప్పుడు అనుభవమైంది.

      ఇదిలా ఉంటే, ఆమె తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అమ్మ ప్రతిరోజూ లిఖిత గదిలోకి వెళ్లి ఆమె ఫోటోలు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక రోజు, లిఖిత చిన్నప్పటి డ్రాయింగ్ కనిపించింది నాన్న – నా హీరో అని రాసి ఉంది. దాన్ని చూసి ఆమె నాన్న మనసు కదిలిపోయింది.

    నేను చేసినది సరైనదేనా…? అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత, ఆయన లిఖిత ఇంటికి వెళ్లాడు. అక్కడ లిఖిత నవ్వు వినిపించింది. ఇంత సంతోషంగా ఆమె ఎప్పుడూ నవ్వలేదు…” అని అనిపించింది. తలుపు తట్టగా, లిఖిత తలుపు తీసింది.

నాన్న…! ఆయన నెమ్మదిగా అన్నాడు: నన్ను క్షమించు…
ఆ ఒక్క మాటతో అన్నీ మారిపోయాయి. వరుణ్ దగ్గరకు వెళ్లి, నువ్వు నిజంగా నా కూతుర్ని ప్రేమిస్తున్నావు. నేను తప్పు చేశాను, అన్నాడు. వరుణ్ గౌరవంగా, మీరు లిఖితకి నాన్న… నాకు కూడా అలాగే, అన్నాడు. ఆ క్షణం నుంచి అందరూ మళ్లీ కలిశారు. కొద్దిసేపటి తర్వాత, లిఖిత అమ్మ కూడా వచ్చి తన కూతుర్ని కౌగిలించుకుంది.

ఆ రోజు —
కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు, అందరి మనసులు కూడా కలిశాయి.

ప్రేమ గెలిచింది…
అమ్మానాన్నల ప్రేమ కూడా గెలిచింది.

లిఖిత – వరుణ్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ❤️

ఇలాంటి మరిన్ని తెలుగు కథలు చదవాలంటే మా బ్లాగ్ ను follow అవ్వండి

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...