Skip to main content

🔑 అర్జున్ రహస్య కోట పజిల్ | సరైన తాళంచెవి సంఖ్యను కనుగొనగలరా?

అర్జున్ పుస్తకంలో ఉన్న పజిల్‌ను జాగ్రత్తగా లెక్కించాడు. (3 × 4) + (10 ÷ 2) - 14 = ?  12 + 5 - 14 = 3 కానీ కోటలోకి వచ్చినప్పుడు చదివిన సూచన అతనికి గుర్తొచ్చింది: "వచ్చిన సమాధానం నుండి 1 తీసివేయాలి." అంటే 3 - 1 = 2 అర్జున్ ధైర్యంగా గది 2 తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. గది అంతా చీకటిగా ఉంది. గోడలపై పాత చిత్రాలు వేలాడుతున్నాయి.  మధ్యలో ఒక చిన్న రాతి బల్ల కనిపించింది. ఆ బల్లపై ఒక తాళంచెవి కాదు...  తాళంచెవుల గుత్తి! కనిపించింది. "అయితే వీటిలో ఒకటి పెద్ద ఇనుప తలుపుకు సరిపోతుందేమో!" అని సంతోషంగా అనుకున్నాడు. అర్జున్ వెంటనే ఆ గుత్తిని తీసుకుని భారీ ఇనుప తలుపు దగ్గరకు వెళ్లాడు. అతను ఒక తాళంచెవిని తీసి తాళంలో పెట్టబోతుండగా... అకస్మాత్తుగా కోట అంతా కంపించింది! గోడల మధ్య నుంచి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. "సరిగ్గా ఆలోచించు ప్రయాణికుడా! నీకు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది!" అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అప్పుడే తాళం మీద బంగారు అక్షరాలు వెలిగాయి. "సరైన తాళంచెవి సంఖ్యను కనుగొనకపోతే ఈ తలుపు ఎప్పటికీ తెరుచుకోదు." అప్పుడే అతని ముందు రెండు చిత్రాలు ప్రత్యక్షమయ...

“ఆమె చనిపోయింది… కానీ మెసేజ్ ఇంకా వస్తోంది! 📱👻” part-1

మూసిన గది రహస్యం

గమనిక: ఈ కథ పూర్తిగా కల్పితం. వినోదం కోసం మాత్రమే రాయబడింది. ఇందులో చూపించిన పాత్రలు, సంఘటనలు నిజ జీవితంతో సంబంధం లేవు.

అద్దంలో కనిపించింది…
కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు… ఎవరూ లేరు…
అదే ఆమె చేసిన పెద్ద తప్పు…
ఆ రాత్రి… ఆమె బ్రతికే బయటపడలేదు 😱

    ఒకరోజు రాత్రి వర్షం గట్టిగా కురుస్తోంది. అది సాధారణ వర్షం కాదు, ఆకాశమే పగిలిపోయినట్టుగా కుండపోతగా కురుస్తోంది. దానితోపాటు గాలి కూడా ఎక్కువగానే విస్తోంది. చెట్లు వంగి మళ్లీ నిలబడుతున్నాయి.

అది గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్. ఆ రాత్రి మొత్తం అక్కడ ఒక భూతబంగ్లాలాగా కనిపిస్తోంది. మంచి వెలుగులతో మెరిసే ఆ భవనం… ఇప్పుడు పూర్తిగా చీకట్లో మునిగిపోయింది. అప్పుడే ఎక్కడో ఎలక్ట్రిక్ వైర్లు చప్పుళ్లు చేస్తూ... కరెంట్ వెళ్ళి పోయింది. లిఫ్ట్ పనిచేయడం ఆగిపోయింది, కారిడార్లలో ఎమర్జెన్సీ లైట్లు కూడా వెలగడం లేదు. అప్పుడప్పుడు మెరుపు వెలుగు పడినప్పుడు ఒక్క క్షణం మాత్రమే  ఆ భవనం గోడలు, కిటికీలు, బాల్కనీలు అన్నీ కనిపిస్తుంది. తర్వాత వెంటనే మళ్లీ చీకటిలో కలిసిపోతున్నాయి. దూరంగా ఎక్కడో ఒక కుక్క గట్టిగా అరుస్తోంది. 

ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న ప్రతి ఫ్లాట్‌లోనూ ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ప్రజలు ఉన్నారు… కానీ ఎవ్వరూ బయటికి రావడం లేదు. కానీ ఆ చీకటిలో ఒక ఫ్లాట్ బాల్కనీలో మాత్రం ఒక నీడ నిలబడి ఉంది.

అది అన్విత. అన్విత తన బాల్కనీలో నిలబడి ఉంది. చల్లని గాలి వాన చినుకులతో కలిసి ఆమె ముఖాన్ని తాకుతోంది. చేతులతో రెయిలింగ్ పట్టుకుని ఎదురుగా ఉన్న ఫ్లాట్ వైపు చూస్తోంది. అది అద్వైత్ ఫ్లాట్. సాధారణంగా అక్కడ లైట్ ఆన్‌లో ఉండేది… TV శబ్దం, నవ్వులు, ఏదో ఒక శబ్దం ఉండేది. కానీ ఈరోజు మాత్రం అక్కడ కూడా గాఢమైన చీకటి మాత్రమే ఉంది. ఒక్కోసారి మెరుపు మెరుస్తే అతని బాల్కనీ, కిటికీలు క్షణం మాత్రం కనిపిస్తున్నాయి. ఆ క్షణాల్లో ఎవరో లోపల కదులుతున్నట్టు అనిపించి, మళ్లీ ఏమీ కనిపించకుండా పోతుంది.

అన్విత కళ్లను తుడుచుకుని మళ్లీ జాగ్రత్తగా చూసింది. “అది నిజంగానే ఎవరోనా? లేక నా భ్రమేనా?” అని ఆమె మనసులో అనుకుంది. అదే సమయానికి ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయ్యింది. ఆ శబ్దం ఆ నిశ్శబ్దంలో చాలా గట్టిగా వినిపించినట్టు అనిపించింది.

అన్విత ఒకేసారి ఉలిక్కిపడింది. ఆమె నెమ్మదిగా ఫోన్ స్క్రీన్ వైపు చూసింది. స్క్రీన్ మీద మెరుస్తున్న పేరు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అద్వైత్... ఇంత టైమ్‌లో…?

వర్షం శబ్దం మధ్యలో, ఆమె మెసేజ్ ఓపెన్ చేసింది. నువ్వు ఏమైనా శబ్దం విన్నావా? ఆ ఒక్క లైన్ చూసిన వెంటనే అన్విత గుండె మళ్లీ గట్టిగా కొట్టుకుంది. ఆమె వెంటనే తలెత్తి అతని ఫ్లాట్ వైపు చూసింది. అక్కడ ఇంకా చీకటే ఉంది. ఎలాంటి కదలిక కనిపించలేదు. శబ్దమా…? ఏ శబ్దం…? అని మనసులోనే అనుకుంది. కానీ ఆమె మనసులో ఒక అనుమానం మొదలైంది. ఇప్పటికే వర్షం, మెరుపులు, చీకటి ఇవన్నీ కలిసి ఒక విచిత్రమైన భయం కలిగిస్తున్నాయి.

ఆమె వెంటనే టైప్ చేసింది ఏ శబ్దం? మెసేజ్ పంపిన తర్వాత ఆమె చూపు మళ్లీ ఆ ఫ్లాట్‌పైనే నిలిచిపోయింది. ఇప్పుడు ఆమెకు స్పష్టంగా అనిపించింది. ఆ చీకటిలో ఎవరో కదులుతున్నారు అని. అప్పుడే ఆమెకు అద్వైత్ నుండి మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. మా ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తోంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఎదురుగా ఉన్న అతని బాల్కనీ వైపు చూసింది. చూసిన వెంటనే లైట్లు ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి.

    అప్పుడే ఒక పెద్ద శబ్దం కూడా వినిపించింది. అన్విత చాలా భయపడిపోయింది. నా బెడ్‌రూమ్ తలుపు మూసుకుపోయింది. అని మెసేజ్ వచ్చింది. అన్విత గుండెలో దడ మొదలైంది. ఇక్కడ నిలబడి చూడటం కంటే అక్కడికి వెళ్లి ఏమి జరిగిందో తెలుసుకోవడం మంచిది అని ఆమె తనలోనే అనుకుంది. అలాగే వెనక్కి తిరిగి, తలుపు తెరిచి బయటకు అడుగు వేసింది.

కారిడార్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఎమర్జెన్సీ లైట్ కూడా పనిచేయడం లేదు. దూరంగా ఎక్కడో వర్షం నీళ్లు పైప్ నుంచి జారిపడుతున్న శబ్దం, టప్… టప్… టప్… అంటూ ప్రతిధ్వనిస్తోంది. ఆ శబ్దం మధ్యలో ఆమె అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ప్రతి అడుగు వేసినప్పుడు ఆ శబ్దం కారిడార్ అంతా వినిపించినట్టు అనిపిస్తోంది. అన్విత నెమ్మదిగా ముందుకు నడిచింది. చేతితో గోడను తడుముకుంటూ, దారి చూసుకుంటోంది. అప్పుడప్పుడు మెరుపు మెరుస్తే, కారిడార్ ఒక్క క్షణం వెలుగుతో నిండిపోతుంది. వెంటనే మళ్లీ గాఢ చీకటి.

అదే క్షణాల్లో గోడల మీద వేలాడుతున్న నీడలు విచిత్రంగా కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఆమె మనసులో భయం పెరుగుతోంది. కానీ అద్వైత్ గురించి ఆలోచన ఆమెను ముందుకు నడిపిస్తోంది. చివరికి ఆమె అతని ఫ్లాట్ తలుపు దగ్గరికి చేరుకుంది. కొన్ని క్షణాలు  ఆమె అక్కడే నిలబడి ఉంది. లోపల ఏదైనా శబ్దం వినిపిస్తుందేమో అని చెవులు గట్టిగా పెట్టి విన్నది. కానీ అంతా నిశ్శబ్దం అది సాధారణ నిశ్శబ్దం కాదు. ఏదో దాగి ఉన్నట్టుగా అనిపించే భయంకరమైన నిశ్శబ్దం.

ఆమె గొంతు ఎండిపోయింది కానీ కొంచెం ధైర్యం చేసి తలుపు దగ్గరికి ఇంకా దగ్గరగా వెళ్లి వణుకుతున్న తన గొంతుతో పిలిచింది…

"అద్వైత్…!”

ఆ శబ్దం కారిడార్ అంతా వినిపించింది. కానీ  లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఐతే ఎలాగో లోపలినుంచి తలుపు లాక్ కాలేదని తెలుసుకుంది, నెమ్మదిగా తలుపు తెరిచింది. ఇంటి లోపల పూర్తిగా చీకటి. ఆమె ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని మెల్లగా లోపలికి వెళ్ళింది. నేల మీద పడిన మట్టి అడుగుల ముద్రలు బెడ్‌రూమ్ వైపుకు వెళ్లినట్టు కనిపించాయి. భయపడుతూనే మెల్లగా లోపలికి నడిచింది. బెడ్‌రూమ్ తలుపు కొద్దిగా తెరిచి ఉంది. చప్పుడు చేస్తూనే నెమ్మదిగా తలుపు తోసింది.

    అద్వైత్ నేలపై కూర్చుని గోడ వైపు చూస్తున్నాడు. అన్విత చాలా భయపడిపోయింది. మెల్లగా “అద్వైత్!” అని పిలిచింది. అతను నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. 

అన్విత నాకు నువ్వు మెసేజ్ చేశావా?” అని అడిగింది, అతను ఆశ్చర్యంగా చూసాడు. 

"నేనా..! నేను ఏ మెసేజ్ చేయలేదే…” అని అన్నాడు.

  అద్వైత్ నంబర్ నుంచే అన్విత ఫోనుకు మళ్ళీ ఇంకొక కొత్త మెసేజ్ వచ్చింది.

  “నేను ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నాను.”

అన్విత చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… శ్వాస కూడా సరిగ్గా పడటం లేదు. ఏమి జరుగుతోంది అనేది ఆమెకు అర్థం కావడం లేదు. కొన్ని క్షణాలు అక్కడే నిలబడి నెమ్మదిగా  చాలా నెమ్మదిగా తన ఇంటి వైపు తిరిగింది. ఆమె అడుగులు భారంగా అనిపిస్తున్నాయి. ఎవరైనా వెనుక నుంచి చూస్తున్నట్టుగా ఒక భయం ఆమెను వెంటాడుతోంది.

అన్విత

ఆ క్షణంలో ఆమె బెడ్‌రూమ్ లోపల ఒక కాంతి మెరుపులా కనిపించింది. అన్విత గుండె ఒక్క క్షణం ఆగినట్టయింది. 

“అది… ఏమిటి…?” 

ఆమె కళ్ళు పెద్దవిగా మారాయి. నెమ్మదిగా బెడ్‌రూమ్ వైపు అడుగు వేసింది. తలుపు దగ్గరికి చేరుకుని లోపలికి చూసింది. అక్కడ అద్దం ముందున్న ప్రతిబింబంలో, తెల్ల చీర కట్టుకుని ఉన్న ఒక ఆవిడ నిలబడి ఉంది. ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు ఎందుకంటే తన జుట్టు ముందుకు పడిపోయి ముఖాన్ని దాచేసింది. అద్దంలో కనిపిస్తున్న ఆ రూపం మాత్రం కదలడం లేదు. నిశ్శబ్దంగా… అక్కడే నిలబడి ఉంది.

అద్దంలో కనిపిస్తున్న ఆ రూపాన్ని చూసిన క్షణంలో, అన్విత శరీరం మొత్తం గడ్డకట్టినట్టైంది. ఆమె కళ్ళు ఆ ప్రతిబింబంపైనే నిలిచిపోయాయి. అది నిజంగానే ఉందా? లేక నా బ్రమేమైనానా అని మనసులో అనుకుంది. ఆమె నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూసింది. గది ఖాళీగా ఉంది ఎవరూ లేరు. తర్వాత అద్వైత్ ఇంట్లో ఉన్న  అద్దం వైపు చూసింది ఇక్కడ అదే ఆవిడ  నిలబడి ఉంది. ఈసారి… అద్దంలో ఆమె తల పైకి లేచింది. జుట్టు కాస్త పక్కకు జరగడంతో. ఆమె ముఖం కొద్దిగా కనిపించింది. అప్పుడు ఆమె ఎవరన్నది తనకి తెలిసింది. అది చూసిన వెంటనే అన్విత గుండె బలంగా కొట్టుకుంటోంది.

"నువ్వా..."! అని అంది అన్విత.

విచిత్రంగా నవ్వుతూ, అలాగే ఏడుస్తూ ఉంది. అద్దంలో కనిపిస్తున్న ఆమె.

"ప్లీజ్ నన్ను వదిలేయ్...."అని ప్రధేయపడింది అన్విత. కానీ ఆమె మాటలు తనకే వినిపించలేదు.  

అప్పుడు అన్విత మెల్లగా ఒక అడుగు వెనక్కి వేసింది. అప్పుడే అద్దంలో ఉన్న ఆ రూపం నెమ్మదిగా చేతిని పైకి లేపింది. అన్విత కూడా భయంతో వెనక్కి జరగబోతుంది కానీ ఆమె కదలలేకపోయింది. ఏదో కనిపించని శక్తి ఆమెను అక్కడే ఆపేసింది. అద్దంలో ఉన్న ఆవిడ… నెమ్మదిగా ముందుకు కదిలింది కానీ…  ఆమె కాళ్లు నేలపై కదలడం లేదు. అద్దం లోపలే దగ్గర పడుతోంది. ఇంకా దగ్గరగా, ఇంకా దగ్గరగా

అప్పుడే ఒక్కసారిగా... అద్దం గట్టిగా పగిలిపోయింది!. గాజు ముక్కలు చుట్టూ ఎగిరిపోయాయి. అన్విత ఒక్కసారి గట్టిగా అరచింది…

“ఆఆఆఆఆఆ…!!!”

ఆ అరుపు మెల్లగా, మెల్లగా నిశ్శబ్దంలో కలిసిపోయింది. ఆ క్షణంలో గది మొత్తం చీకటితో నిండిపోయింది. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోయింది, సూర్యకాంతి మెల్లగా గ్రీన్‌వుడ్ అపార్ట్‌మెంట్స్ మీద పడుతోంది. ప్రజలు బయటకు వచ్చారు. నిన్న రాత్రి జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు.

అప్పుడే... ఒక ఫ్లాట్ ముందు జనాలు గుమికూడారు. అది అన్విత ఫ్లాట్. పోలీసులు వచ్చారు. తలుపు తెరిచారు లోపలికి వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఒక్కసారిగా ఆగిపోయారు. బెడ్‌రూమ్ లోపల అద్దం పూర్తిగా పగిలిపోయి ఉంది. నేలంతా గాజు ముక్కలు. మధ్యలో అన్విత నిశ్చలంగా పడుంది. ఆమె శరీరంపై ఎక్కడా గాయాలు లేవు కానీ ఆమె ఇక బ్రతికి లేదు. పోలీసులు కేసు నమోదు చేశారు…

“అనుమానాస్పద మరణం…”

అంతే. ఎవరికి ఏమీ అర్థం కాలేదు. అయితే ఆ రాత్రి నిజంగా ఏమి జరిగింది…?

అద్దంలో కనిపించిన ఆ ఆవిడ ఎవరు…?

అన్వితకు వచ్చిన మెసేజ్ ఎవరు పంపించారు…?


👉 ఈ రహస్యాలన్నీ Part-2 లో చూడండి…

Follow చేయండి.

Part-2 త్వరలోనే వస్తుంది.

Part-2 Click Here  

Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...