Skip to main content

Episode - 11 ఉమ్మడి కుటుంబం| సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది

"వరద వారి పంటను తీసుకెళ్లింది...   అప్పులు వారి నిద్రను దోచుకున్నాయి...   కానీ ఒక చిన్న ఆశ వారి జీవితాన్ని మళ్లీ మార్చబోతోంది.  ఆ ఆశకు మొదటి అడుగు వేసింది సుమతే..." సుమతి అడుగు – కొత్త ఆశకు నాంది సుమతి మాటలు విన్న తర్వాత అక్కడ కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. సిద్ధయ్య ఆమె వైపు చూసి మెల్లగా అన్నాడు.  అమ్మా... నీ మనసు ఎంత మంచిదో మాకు తెలుసు. కానీ పొలం పని నిజంగా చాలా కష్టం.  సుమతి మాత్రం వెనక్కి తగ్గలేదు.  మావయ్యా...  మొదట్లో కష్టం అనిపించొచ్చు. కానీ నేర్చుకుంటాను. కుటుంబం కోసం చేసే పని కదా. ఆమె మాటల్లో కనిపించిన నమ్మకం అందరినీ ఆలోచనలో పడేసింది. చివరికి రాములమ్మ చిరునవ్వుతో అంది. "సరే అమ్మా...  నీ ఇష్టం. కానీ ఎక్కువ కష్టపడకూడదు." ఆ మాట విన్న సుమతి ముఖంలో చాలా రోజుల తర్వాత నిజమైన ఆనందం కనిపించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే సుమతి లేచింది. ఇంటి పనులు త్వరగా ముగించి సిద్ధయ్యతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో అడుగుపెట్టగానే ఆమెకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడ చూసినా తడిసిన నేల... వరద మిగిల్చిన గుర్తులు... ఎండిపో...

Part-1 వెలగంపల్లి దేవకన్య రహస్యం | ప్రతి 12 సంవత్సరాలకు కనిపించే దేవకన్య కథ | Telugu Mystery Story


"ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి... 

ఆ కొండపై కనిపించే దేవకన్యను చూసినవాళ్లు తిరిగి గ్రామానికి రాలేదట...

అది కేవలం కథే అనుకున్నారు అందరూ...

కానీ 1987లో ఒక అమ్మాయి ఆ నిజాన్ని వెతకాలని నిర్ణయించుకుంది..."

1987 సంవత్సరం…
పచ్చని కొండల మధ్యలో దాగి ఉన్న చిన్న గ్రామం — వెలగంపల్లి.  ఉదయం పొగమంచు కమ్ముకున్నా… సాయంత్రం గాలిలో పక్షుల అరుపులు వినిపించినా… ఆ ఊరిలో ఒక్క విషయం మాత్రం అందరి మనసుల్లో భయంగా ఉండేది. ఆ కొండపై ఉన్న పాత దేవాలయం గ్రామానికి ఎంతో ప్రత్యేకమైనది. ఎత్తైన రాతి మెట్లను ఎక్కి వెళ్లాల్సి ఉండేది.  చుట్టూ దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, గాలికి ఊగే కొమ్మల శబ్దం ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇచ్చేవి. దేవాలయం గోడలు కాలగమనానికి సాక్ష్యాల్లా కనిపించేవి.  కొన్ని చోట్ల రాళ్లు చెక్కుచెదిరిపోయినా, ఆ ఆలయం వైభవం మాత్రం ఇప్పటికీ అందరినీ ఆకర్షించేది. 

చాలా ఏళ్ల క్రితం అక్కడ పెద్ద జాతరలు జరిగేవని పెద్దలు చెప్పుకునేవారు.  జాతర సమయం వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయేవట. కొండ దారంతా రంగురంగుల జెండాలు, తోరణాలతో అలంకరించబడేది. ఉదయం నుంచే డప్పుల మోతలు, భజనలు, హారతుల శబ్దాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయేదట. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని ఆనందంగా తిరిగేవారు. వ్యాపారులు తమ దుకాణాలను ఏర్పాటు చేసి బొమ్మలు, మిఠాయిలు, గాజులు, చిన్నచిన్న వస్తువులు అమ్మేవారు. దూరదూరాల నుంచి ప్రజలు వచ్చి పూజలు చేసేవారట. ఎద్దుబండ్లలో, గుర్రపు బండ్లలో, కొందరు నడుచుకుంటూ కూడా రోజుల ప్రయాణం చేసి ఆలయానికి చేరుకునేవారట.  దేవుడిని దర్శించుకుని తమ కోరికలు చెప్పుకునేవారు.  కొందరు మొక్కులు తీర్చుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించేవారు.  ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడేది. సాయంత్రం వేళ వందలాది దీపాలు వెలిగించగానే కొండంతా బంగారు వెలుగులతో మెరిసిపోయేదట. ఆ దృశ్యాన్ని ఒక్కసారి చూసినవారు జీవితాంతం మర్చిపోలేరని గ్రామంలోని వృద్ధులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. 
 
కానీ ఒక రోజు అకస్మాత్తుగా ఆ దేవాలయం మూసుకుపోయింది. ఎందుకు మూసుకుపోయిందో... అక్కడ ఏమి జరిగిందో… ఎవరూ స్పష్టంగా చెప్పేవారు కాదు. ఆ తర్వాత గ్రామం కూడా మారిపోయింది. ఒకప్పుడు జాతరలతో కళకళలాడిన దారులు నిశ్శబ్దంగా మారిపోయాయి. కొండపైకి వెళ్లే మెట్లపై ముళ్లపొదలు పెరిగాయి. సాయంత్రం అయ్యాక ఆ దారివైపు చూడటానికే ప్రజలు భయపడేవారు. కొందరు రాత్రివేళ ఆలయం వైపు నుంచి విచిత్రమైన గంట శబ్దాలు వినిపిస్తాయని చెప్పేవారు. మరికొందరు చంద్రకాంతి రాత్రుల్లో ఆలయ గోపురం దగ్గర ఒక తెల్లని నీడ కనిపించేదని ప్రమాణాలు చేసేవారు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఒక నమ్మకం మాత్రం తరతరాలుగా వస్తూనే ఉంది…
 
“ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి… ఆ దేవాలయంలో ఒక దేవకన్య కనిపిస్తుంది” అని.
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి… ఆ దేవాలయంలో ఒక దేవకన్య కనిపిస్తుంది” అని.

ఆమె తెల్లని వస్త్రాలు ధరించి, చంద్రకాంతిలో నెమ్మదిగా దేవాలయం మెట్లపై నడుస్తూ కనిపిస్తుందట. ఆమె ముఖం పూర్తిగా ఎవరికీ కనిపించదట. కానీ ఆమె కళ్లలోకి ఒక్కసారి చూసిన వాళ్లు, తర్వాత మళ్లీ ఊరికి తిరిగి రాలేదట. కొంతమంది "వాళ్లు దేవకన్యతో వెళ్లిపోయారని" మరికొందరు… ఆ కొండ వాళ్లను మింగేసింది” అని ఎన్నో విషయాలను చెప్పుకునేవారు.

1987 సంవత్సరం వచ్చింది... మళ్లీ ఆ 12 ఏళ్ల చక్రం పూర్తయింది. ఆ విషయం గుర్తొచ్చినప్పటి నుంచి వెలగంపల్లిలో భయం మళ్లీ మొదలైంది. సాయంత్రం పడితే తలుపులు త్వరగా మూసేసేవారు. రాత్రి అయ్యాక బయటకు రావడానికి కూడా ఎవరూ ధైర్యం చేసేవారు కాదు. అలా కథలు వింటూ, ఆ భయాల మధ్యే పెరిగింది 17 ఏళ్ల మాధవి." 

చిన్నప్పుడు మాధవి తన తాతయ్య పక్కన కూర్చుని ఈ కథలు వింటూ ఉండేది. తాతయ్య చెప్పే ప్రతి మాట ఆమె ఊహల్లో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించేది. భయంగా అనిపించినా... ఆ దేవాలయం గురించి ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గేది కాదు. ఒకసారి స్నేహితులతో కలిసి కొండ దారి వరకు వెళ్లినా, పెద్దలు చూసి వెంటనే ఇంటికి తీసుకువచ్చారు.

ఒక రోజు… పై చదువుల కోసం పట్నం వెళ్లింది మాధవి. పట్నంలోని కాలేజీ జీవితం ఆమెకు కొత్తగా అనిపించింది.

కొత్త స్నేహితులు…
కొత్త ప్రదేశాలు…
కొత్త అనుభవాలు…
అలా మెల్లగా ఆ ప్రదేశానికి అలవాటుపడింది. రోజులు వేగంగా గడుస్తుండగా... ఒక రోజు వారి చరిత్ర అధ్యాపకుడు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ప్రకటించాడు.

“మీరు అందరూ ఒక పురాతన వస్తువు, చారిత్రక ప్రదేశం లేదా కాలగర్భంలో కలిసిపోతున్న ఒక రహస్యమైన విషయాన్ని ఎంచుకుని దాని గురించి పూర్తి వివరాలతో ఒక పుస్తకం రాయాలి” అది కూడా ఒక నెలలోపు అని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కాలేజీలో చాలా ప్రతిష్టాత్మకమైనది. ఉత్తమంగా రాసిన పుస్తకాన్ని రాష్ట్రస్థాయి పోటీకి పంపిస్తామని కూడా చెప్పారు. అందరూ తమ తమ విషయాలను ఎంచుకోవడం మొదలుపెట్టారు. కొందరు కోటల గురించి… మరికొందరు రాజవంశాల గురించి... ఇంకొందరు పురాతన వస్తువుల గురించి సమాచారం సేకరించడం ప్రారంభించారు. కానీ మాధవికి మాత్రం ఏ విషయం ఎంచుకోవాలో అర్థం కాలేదు. ఆమె లైబ్రరీలో గంటల తరబడి వెతికింది. పురాతన దేవాలయాలపై ఉన్న పుస్తకాలు... జానపద కథల సంకలనాలు... పాత వార్తాపత్రికల కట్టలు... ఇలా దొరికిన ప్రతి విషయాన్ని ఆమె నోట్ చేసుకుంటోంది. కానీ తనకు నచ్చే ఒక్క చిన్న సమాచారం కూడా దొరకలేదు.

అదే ఆమె ఆసక్తిని మరింత పెంచింది. రోజులు గడుస్తున్నాయి. అయినా ఆమె మనసుకు నచ్చే విషయం దొరకలేదు. ప్రాజెక్ట్ సమర్పించేందుకు ఇంక 15 రోజులు మాత్రమే ఉంది. అప్పుడే ఒక సాయంత్రం ఆమె జీవితాన్ని మార్చబోయే ఒక ఉత్తరం కాలేజీ హాస్టల్‌కు వచ్చింది. ఆ ఉత్తరం వాళ్ల అమ్మ రాసింది. గ్రామంలోని విషయాలు... పొలాల పరిస్థితి… పక్కింటి వాళ్ల సంగతులు… ఇలా ఎన్నో విషయాలు రాసింది. మాధవి ఆ ఉత్తరాన్ని నెమ్మదిగా చదువుతోంది. అంతలో ఒక వాక్యం ఆమె దృష్టిని ఆకర్షించింది.


“ఈ మధ్య మళ్లీ ఊరిలో అందరూ కొండపై ఉన్న పాత దేవాలయం గురించే మాట్లాడుకుంటున్నారు... ఈసారి కూడా ఆ దేవకన్య కనిపిస్తుందని పెద్దలు చెబుతున్నారు…”

అని రాసి ఉంది. ఆ ఒక్క వాక్యం చదివిన క్షణమే మాధవి చేతులు ఆగిపోయాయి. ఆమెకు చిన్నప్పటి నుంచి వినిపించిన కథలు గుర్తొచ్చాయి. ఆ మూసివేసిన దేవాలయం… ప్రతి 12 సంవత్సరాలకు కనిపిస్తుందని చెప్పే దేవకన్య… అదృశ్యమైన మనుషులు… ఎవరికీ తెలియని నిజం… అన్నీ ఒక్కసారిగా ఆమె మనసులో మెదిలాయి.

“ఇది కేవలం గ్రామ కథ మాత్రమేనా...? లేదా నిజంగా దీని వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా...?” అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే ఆమెకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. తన ప్రాజెక్ట్ కోసం అదే విషయాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. “వెలగంపల్లి కొండ దేవాలయం — మరచిపోయిన ఒక రహస్యం” అనే పేరుతో పుస్తకం రాయాలని అనుకుంది. కానీ ఆ పుస్తకం రాయాలంటే కథలు వినడం సరిపోదు. నిజాలు తెలుసుకోవాలి. ఆ దేవాలయం ఎందుకు మూసుకుపోయింది? దేవకన్య కథ ఎక్కడి నుంచి మొదలైంది? అదృశ్యమైన వాళ్లకు ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కనుక్కోవాలి. 

అలా ఆలోచిస్తున్న క్షణంలోనే మాధవికి తెలియదు... ఆమె ప్రారంభించబోతున్న పరిశోధన కేవలం ఒక కాలేజీ ప్రాజెక్ట్ మాత్రమే కాదని... ఆ దేవాలయం మూసివేయడానికి కారణమైన చివరి వ్యక్తి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని...

ఇంకా అతను ఆమె కోసం ఎదురుచూస్తున్నాడని...


Comments

Popular posts from this blog

మూసిన గది రహస్యం Part 3 ముగింప

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం, నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం... నా కళ్లలో ఆనందం… గందరగోళం. నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?  అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు.  నేను బాగున్నాను…  నువ్వెలా ఉన్నావు… అన్విత?  ఆ మాట విన్న క్షణం నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది.  నేను కూడా బాగున్నాను…  ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…  అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది…  ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.”  ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు.  ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది.  ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ...

పెద్దింటి రహస్యం – Part 2” ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది.  కొత్త కోడలు కూడా బలి అవుతుంది.  ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది. ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది. అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది. మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది. అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది అందులోని ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది. ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో నాకు అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని, ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత” ఏళ్ల క్రితం ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా... తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు. పగలు పొలాల్లో పని చేస్తూ, రాత్రిపూట తినడానికి తిండి లేకుండా ఆకలితోనే నిద్రపోయేవారు. పిల్లలు రోజంతా ఏడుస్తూ ఉంటే పెద్దలు అసహాయంగా చూస్తూ కాలాన్ని గడిపేవారు. ఆ ఇంట్లో నవ్వులు ఎప్పుడో మాయం అయ్యాయి.  ఒకసారి భారీ కరువు వచ్చింది....

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి,  శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద,  వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి,  అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు…చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు.  నాన్నా...  తాతయ్యా..." అంటూ వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది శారద. అంతలో తాతయ్య చేతులు, కాళ్ళు కడుక్కుని "రామ్మా నా చిట్టి తల్లి" అంటూ శారదను ఎత్తుకున్నాడు. రాఘవుడు...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి...      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల...