తర్వాత అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.
తనకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు…
తను ప్రెగ్నెంట్ అన్న విషయం తన ప్రెండ్స్ తో చెప్పాలి అనుకుని వెళ్ళింది.
కానీ...
ఎవరికైనా చెబితే… “అందరూ నన్నే తిడతారు… నా పరువు కూడా పోతుంది…” అని అనుకుని ఎవ్వరికీ చెప్పలేదు.
ఆ ఆలోచనే ఆమెను పూర్తిగా బంధించింది.
ఇంట్లో వాళ్లతో మాట్లాడాలన్నా గొంతు ఆగిపోయేది…
స్నేహితుల దగ్గరకు వెళ్లాలన్నా అడుగు ముందుకు పడేది కాదు.
ఎవరైనా తన కళ్లలోకి నేరుగా చూస్తే… “వాళ్లకి ఏమైనా తెలిసిపోయిందా?” అనే భయం తనను వెంటాడేది.
ఒక దశలో ఆమె మనసు పూర్తిగా అలసిపోయింది.
ఎంత ప్రయత్నించినా ఆలోచనలు ఆగడం లేదు… భయం తగ్గడం లేదు…
“ఇలా ఇంకా ఎంతకాలం…?”
“ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుంది…?”
అనే ప్రశ్నలు ఆమెను లోపల నుంచి నెమ్మదిగా నొక్కేస్తున్నాయి.
ఇది తప్ప మరే మార్గం లేదేమో అన్న భావన ఆమెను వెంటాడింది.
ఒక రోజు… చేతిలో ఫోన్ పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చుంది.
కొద్దిసేపు స్క్రీన్ వైపు చూస్తూనే ఉంది…
సెర్చ్ బార్‌లో టైప్ చేయాలనిపించింది… కానీ వేళ్లు ముందుకు కదలలేదు.
గుండె గట్టిగా కొట్టుకుంటోంది…
ఒక తెలియని భయం లోపల నుంచి అడ్డుకుంటోంది.
కొన్ని క్షణాల తర్వాత… ధైర్యం కూడబెట్టుకుని,
నెమ్మదిగా కొన్ని పదాలు టైప్ చేసింది.
స్క్రీన్ మీద వచ్చిన సమాచారాన్ని చూస్తూ…
ఆమె కళ్లలో ఒక గందరగోళం.
ఏది నిజం…?
ఏది సురక్షితం…?
ఎవరిని నమ్మాలి…?
అన్న సందేహాలు వరుసగా తలెత్తాయి.
ప్రతి ఆర్టికల్ చదివిన కొద్దీ…
ఆమె భయం ఇంకాస్త పెరిగింది.
కొన్ని చోట్ల రిస్క్ గురించి చెప్పిన మాటలు…
మరికొన్ని చోట్ల అనుభవాలు…
అవి అన్నీ కలిసిపడి ఆమె మనసును ఇంకా భారంగా మార్చాయి.
ఫోన్‌ను పక్కన పెట్టి… కొద్దిసేపు కళ్లను మూసుకుంది.
“నేను నిజంగా ఇది చేయగలనా…?” అని తనని తాను ప్రశ్నించుకుంది.
సమాధానం మాత్రం రాలేదు.
మరోసారి ఫోన్ తీసుకుని… మళ్లీ వెతికింది.
ఈసారి కాస్త ఎక్కువ సమయం గడిపింది.
కొన్ని క్లినిక్‌ల వివరాలు కనిపించాయి…
అడ్రెస్సులు, టైమింగ్స్…
అన్నీ కనిపిస్తున్నాయి… కానీ
అక్కడికి వెళ్లడానికి అవసరమైన ధైర్యం మాత్రం ఆమెకు కనిపించలేదు.
ఆ రాత్రి…
ఆమె మనసులో ఒక యుద్ధం జరుగుతోంది.
ఒక వైపు భయం…
మరో వైపు ఒక కఠినమైన నిర్ణయం…
అది తీసుకోవడానికి ఆమె ఇంకా సిద్ధంగా లేదు…
ఒకసారి ధైర్యం చేసి ఒక క్లినిక్ దగ్గరకు కూడా వెళ్లింది.
కానీ అక్కడి వరకు వెళ్లగానే గుండె గట్టిగా కొట్టుకుంది…
కానీ అక్కడి వరకు వెళ్లగానే గుండె గట్టిగా కొట్టుకుంది…
చేతులు వణికాయి… చెమటలు పట్టాయి…
“డాక్టర్ ఏమైనా అడిగితే ఏమి చెప్పాలి…?”
“నా విషయం బయటకు తెలిసిపోతే…?”
అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి వచ్చేసింది.
మరోసారి… ఇంకో చోట ప్రయత్నించింది.
కానీ అక్కడ కూడా అదే పరిస్థితి.
తనలోని భయం… తనను ముందుకు వెళ్లనీయలేదు.
ఇలా ప్రయత్నాలు చేసిన ప్రతిసారి…
ఆమెకు తనపై కోపం పెరిగింది.
“ఇంత చిన్న పని కూడా నేను చేయలేకపోతున్నానా…?” అని తననే తాను నిందించుకుంది.
రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి…
కానీ ఆమెకు ప్రతి రోజు ఒక సంవత్సరం లాగా అనిపించింది.
బయట ప్రపంచం యథావిధిగా నడుస్తోంది…
కానీ ఆమె జీవితం మాత్రం అక్కడే నిలిచిపోయింది.
రాత్రిళ్లు పడుకున్నాక… ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యేవి.
“ఇలా ఇంకా ఎన్ని రోజులు…?”
“ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుంది…?” అని ప్రశ్నలు వరుసగా తలెత్తేవి.
“ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుంది…?” అని ప్రశ్నలు వరుసగా తలెత్తేవి.
ఏడవాలనిపించేది… కానీ శబ్దం బయటకు రాకుండా నోటిని మూసుకుని ఏడ్చేది.
ఆ కన్నీళ్లు ఎవరికీ కనిపించకుండా… తన దుప్పటిలోనే మింగేసేది.
తన చేతిలో ఏమీ లేకపోవడం…
ఏం చేయాలో తెలియకపోవడం…
ఎవరితోనూ చెప్పుకోలేకపోవడం…
ఈ మూడు కలిసి ఆమెను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేశాయి.
ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి…
కానీ ఆమె పరిస్థితి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.
కడుపు కూడా అంతగా కనిపించకపోవడంతో… ఆమె తన పరిస్థితిని బయటపడకుండా దాచుకుంటూ, రోజూ కాలేజ్‌కు వెళ్లి వచ్చేది.
బయటికి చూస్తే అన్నీ సాధారణంగానే కనిపించేవి — క్లాస్‌లో కూర్చోవడం, నోట్స్ రాయడం, ఫ్రెండ్స్‌తో మాట్లాడడం…
కానీ ఆ సాధారణత అంతా ఒక నటన మాత్రమే.
ప్రతి అడుగులోనూ ఒక జాగ్రత్త…
ఎవరూ గమనించకూడదు…
ఎవరూ అనుమానించకూడదు…
డ్రెస్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకునేది — కొంచెం లూజ్‌గా ఉండేలా…
ఎప్పుడూ బ్యాగ్‌ను ముందే పట్టుకుని నడిచేది.
ఎవరైనా
“ఎందుకింత నిశ్శబ్దంగా ఉన్నావ్?” అని అడిగితే…
“ఏం లేదు… అలసటగా ఉంది…” అని తప్పించుకునేది.
ఇలా ఒక్కో రోజు గడుస్తూ…
తెలియకుండానే ఐదు నెలలు అయిపోయాయి.
తెలియకుండానే ఐదు నెలలు అయిపోయాయి.
అదే సమయంలో కాలేజ్‌కు సెలవులు ప్రకటించారు.
అందరూ సంతోషంగా తమ తమ ఊళ్లకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు…
కానీ ఆమెకు మాత్రం అది మరో పరీక్షలా అనిపించింది.
ఊరికి వెళ్తే… ఇంట్లో వాళ్లు దగ్గరగా ఉంటారు…
ఎవరైనా గమనిస్తే…?
ప్రశ్నలు అడిగితే…?
అని ఆలోచించగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ప్రశ్నలు అడిగితే…?
అని ఆలోచించగానే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
అందుకే ఒక నిర్ణయం తీసుకుంది.
ఇంట్లో వాళ్లకు కాల్ చేసి —
“ఇక్కడే ఉండి చదువుకుంటాను… ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి… ఇప్పుడే రావడం కుదరదు” అని చెప్పింది.
ఆమె మాటల్లో ధైర్యం కనిపించినా… అసలు అది భయం దాచిన ధైర్యం.
ఇంట్లో వాళ్లు మొదట కొంచెం ఆశ్చర్యపోయారు.
“ఎప్పుడూ సెలవుల్లో ఇంటికి వచ్చేదానివి కదా… ఈసారి ఎందుకు రావడం లేదు?” అని అడిగారు.
ఆమె వెంటనే ఒక కారణం చెప్పింది —
“చదువు ఎక్కువగా ఉంది… లైబ్రరీలో ఉండాలి… ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు…” అని.
కొంతసేపు మాట్లాడిన తర్వాత…
ఇంట్లో వాళ్లు కూడా “సరే… జాగ్రత్తగా ఉండు” అని ఒప్పుకున్నారు.
ఫోన్ పెట్టిన వెంటనే…
ఆమె ఒక లోతైన ఊపిరి తీసుకుంది.
ఒక పెద్ద ప్రమాదం తప్పించుకున్నట్టుగా అనిపించింది.
ఇప్పుడు ఆమెకి కొంత సమయం దొరికింది —
ఎవరూ దగ్గరగా లేకుండా…
ఎవరూ ప్రశ్నించకుండా…
కానీ అదే సమయంలో… ఆ ఒంటరితనం ఇంకా ఎక్కువైంది.
రూమ్‌లో ఒంటరిగా కూర్చుంటే… గోడలే తనని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించేది.
“ఇంకా ఎంతకాలం ఇలా దాచుకుంటావు…?” అని.
బయట ప్రపంచం దూరమవుతూ…
ఆమె తనలోకే మునిగిపోయింది.
సెలవులు మొదలైనప్పటి నుంచి… రోజులు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఎంత ప్రయత్నించినా అబోషన్ చేయించుకోవడం సాధ్యం కాలేదు.
ప్రతి సారి వెనక్కి తగ్గినప్పుడు… ఆమెకి తనమీదే అసహనం, కోపం, భయం అన్నీ కలిసిపోయేవి.
చివరికి ఒకరోజు…
ఎన్నో రోజుల ఆలోచనలు, భయాలు, సందేహాల తర్వాత…
ఆమె మౌనంగా ఒకటి ఆలోచించింది.
ఆ రోజు గది నిశ్శబ్దంగా ఉంది.
కిటికీ బయట నుంచి వచ్చే వెలుతురు నేలపై పడుతోంది…
ఆమె మాత్రం ఒక మూలలో నిశ్చలంగా కూర్చుంది.
ఎంత పరుగెత్తినా…
ఎంత దాచుకున్నా…
ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా…
అవి మళ్లీ మళ్లీ అదే చోటికి తీసుకువస్తున్నాయి.
ఆమె నిశ్శబ్దంగా కూర్చుంది.
చేతులు మోకాలిపై ఉంచుకుని… తల కొంచెం వంచింది.
కొన్ని క్షణాలు…
ఏ ఆలోచన కూడా లేకుండా కూర్చున్నట్టే అనిపించింది.
తర్వాత నెమ్మదిగా…
తనలోనే మాటలు మొదలయ్యాయి.
“ఇప్పుడేం చేసినా ప్రయోజనం లేదు…”
ఆ మాటలు ఆమె మనసులో భారంగా మోగాయి.
“ఇది నా వాస్తవం…”
ఈ ఒక్క మాట…
ఆమె ఇప్పటి వరకు పారిపోవాలని చూసిన నిజాన్ని
తన ముందు నిలబెట్టింది.
“ఇంతవరకు వచ్చిన తర్వాత…
ఎలాగోలా ఇంతవరకు ఎవరికీ తెలియకుండా మ్యానేజ్ చేస్తున్నాను…”
“ఇకమీదట నేను జాగ్రత్తగా లేకపోతే…?
ఏదైనా అనుకోని విషయం జరిగితే…?
నా ఆరోగ్యానికి ఏమైనా అయితే…?"
అనే ప్రశ్నలు ఒక్కసారిగా వరుసగా వచ్చాయి.
గుండె మళ్లీ వేగంగా కొట్టుకుంది.
“అప్పుడు… అందరికీ విషయం తెలిసిపోతుంది…
అప్పుడు నేను ఎవరికీ నా ముఖం చూపించలేను…”
ఈ ఆలోచన…
ఆమెను లోపల నుంచి కుదిపేసింది.
కొన్ని క్షణాలు…
ఆమె ఊపిరి కూడా బిగుసుకుపోయినట్టైంది.
ఆమె చేతులు స్వల్పంగా వణికాయి…
కానీ ఈసారి ఆమె వాటిని ఆపడానికి ప్రయత్నించింది.
నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంది.
తన గుండెపై చేయి పెట్టుకుని…
కొన్ని క్షణాలు కళ్లను మూసుకుంది.
“లేదు…”
అని నెమ్మదిగా తనలోనే అనుకుంది.
“ఇక నేను భయపడుతూ ఉండలేను…”
ఈసారి ఆమె ఆలోచనల్లో ఒక మార్పు కనిపించింది.
భయం ఇంకా ఉంది…
కానీ ఆ భయంతో పాటు ఒక జాగ్రత్త కూడా కలిసింది.
“ఇప్పటి వరకు ఎలా దాచుకున్నానో…
ఇకమీదట ఇంకా జాగ్రత్తగా ఉండాలి…”
అని తనని తాను నెమ్మదిగా ఒప్పించుకుంది.
ప్రతి అడుగు…
ప్రతి మాట…
ప్రతి చర్య…
ఇప్పటి నుంచి ఆలోచించి తీసుకోవాలి అని నిర్ణయించుకుంది.
ఆ క్షణం…
ఆమె జీవితంలో చిన్న మార్పు అయినా… చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే…
అది పారిపోవడం నుంచి
ఎదుర్కోవడానికి తీసుకున్న మొదటి నిజమైన అడుగు.
ఆమె కళ్లలో ఇంకా భయం ఉంది…
కానీ అదే కళ్లలో ఇప్పుడు ఒక నిర్ణయం కూడా కనిపిస్తోంది.
ఆ రోజు…
ఆమె తన పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని…
దానితో జీవించడం ప్రారంభించింది.
కొన్ని క్షణాలు కళ్లను మూసుకుని… లోతుగా శ్వాస తీసుకుంది. గుండెలో ఉన్న భారం కొంచెం తగ్గినట్టనిపించింది.
“దీనినే ఎదుర్కోవాలి…
ముందుగా నేను మోస్తున్న ఈ భారాన్ని బయటకు తీసుకురావాలి…
ఆ తర్వాత ఏం చేయాలో… తర్వాత చూసుకుందాం..." అని తనని తాను సమాధానపరిచుకుంది.
ఆ ఆలోచనలో ఒక బాధ, ఒక భయం ఉంది…
కానీ అదే సమయంలో ఒక చిన్న ధైర్యం కూడా ఉంది.
ఎప్పటి నుంచో పరుగులు తీస్తున్న తన మనసు…
ఆ రోజు కొంచెం నెమ్మదించింది.
ప్రతి సమస్యను ఒక్కసారిగా పరిష్కరించలేమని…
కొన్నిసార్లు ఒక అడుగు ముందుకు వేయడం కూడా పెద్ద నిర్ణయమేనని ఆమె అర్థం చేసుకుంది.
ఇప్పటి వరకు…
తన పరిస్థితి నుంచి పారిపోవాలని మాత్రమే అనిపించింది.
కానీ ఇప్పుడు…
మొదటిసారి ఆమె ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది.
ఆ నిర్ణయం పూర్తిగా భయాన్ని తొలగించలేదు…
కానీ భయంతో పాటు నిలబడే శక్తిని మాత్రం ఇచ్చింది.
ఆ రోజు నుంచి…
ఆమె జీవితం నెమ్మదిగా మారడం ప్రారంభమైంది.
తర్వాత ఆమె చాలా జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టింది.
ఒక రోజు… ఫోన్‌ను తీసుకుని నిశ్శబ్దంగా కూర్చుంది.
ఈసారి భయంతో కాదు… తెలుసుకోవాలనే అవసరంతో.
నెమ్మదిగా సెర్చ్ చేయడం మొదలుపెట్టింది—
“ఈ సమయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి…
ఏం తినాలి…?
ఏం చేయకూడదు…?”
స్క్రీన్ మీద కనిపించే ప్రతి సమాచారం…
ఆమెకు ఒక కొత్త ప్రపంచంలా అనిపించింది.
మొదట్లో కొంచెం గందరగోళంగా అనిపించినా…
ఆమె ఓపికగా ఒక్కొక్కటి చదవడం ప్రారంభించింది.
బయటకు ఎక్కువగా వెళ్లకుండా…
ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.
రోజు రోజుకి తన routine మార్చుకుంది.
టైంకి లేచేది…
టైంకి తినేది…
ఇప్పటి వరకు ఏదోలా తిన్న ఆహారం…
ఇప్పుడు జాగ్రత్తగా ఎంచుకుని తినడం మొదలుపెట్టింది.
“ఇది మంచిదా…?”
“ఇది తినొచ్చా…?”
అని చూసుకుని మాత్రమే తీసుకునేది.
కొన్ని సార్లు…
తనకు ఇష్టమైన వాటిని కూడా వదిలేయాల్సి వచ్చింది.
అలాగే…
తన శరీరం ఆరోగ్యంగా ఉండాలని కొన్ని సులభమైన వ్యాయామాలు, యోగాలు గురించి కూడా చూసి తెలుసుకుంది.
గదిలో తలుపు వేసుకుని…
ఎవరూ చూడకుండా నెమ్మదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది.
మొదట్లో భయంగా అనిపించినా…
తరువాత అది ఆమెకు ఒక అలవాటుగా మారింది.
ప్రతి రోజు…
ఒక్కో చిన్న జాగ్రత్త తీసుకుంటూ…
తనలో జరుగుతున్న మార్పులను ఆమె నిశ్శబ్దంగా గమనిస్తోంది.
ఎవరితోనూ చెప్పుకోలేని ఈ ప్రయాణం…
ఆమె ఒంటరిగా నడుస్తున్నా…
ఆ ఒంటరితనంలోనే
ఒక కొత్త బాధ్యత… ఒక కొత్త బంధం నెమ్మదిగా పెరుగుతోంది.
కొన్నిసార్లు…
తన కడుపుపై చేయి పెట్టుకుని చూసుకొనేది.
ఆమె ప్రపంచం ఇప్పుడంతా చిన్నదైపోయింది—
ఆ గది… ఆ నిశ్శబ్దం…
మరియు ఆమె మోస్తున్న ఆ చిన్న ప్రాణం.
అలా నెలలు గడుస్తున్నాయి…
ఆమె శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి…
కానీ ఆ మార్పులను చూసేది ఆమె మాత్రమే.
రాత్రిళ్లు పడుకున్నప్పుడు…
తన గుండె దడ మధ్య ఇంకో చిన్న ప్రాణం కదలికలు ఆమెకు అనిపించేవి.
“మొదటిసారి తన కడుపులో చిన్న కదలిక అనిపించినప్పుడు…
ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది.
అది భయమా…?
లేక ఒక కొత్త బంధం మొదలైందా…?
"ఆమెకి ఇంకా సమాధానం తెలియదు…”



Comments
Post a Comment