ఆ రాత్రి జోరునపడుతున్న వర్షం...
వర్షం ఆ రాత్రి ఆగేలా అనిపించలేదు…
గాలి గట్టిగా ఊదుతూ,
చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి ఢీకొని భయంకరమైన శబ్దం చేస్తుండగా,
రోడ్డు మీద ఉన్న వీధి దీపాలు
కొన్నిసార్లు వెలిగుతూ... కొన్నిసార్లు ఆరిపోతూ…
ఒక వింత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.
ఆ రోడ్డు కింద ఉన్న డ్రైనేజ్ దగ్గర నుండి ఒక అసహ్యమైన దుర్వాసన వచ్చేస్తోంది.
మొదట్లో అది సాధారణంగా వర్షం వల్ల వచ్చిన మట్టి వాసన అనుకున్నారు అక్కడి వాళ్లు.
“ఇది వర్షం కదా… అలానే ఉంటుంది” అని అందరూ పట్టించుకోకుండా వెళ్లిపోయారు.
ఆ వాసన… ప్రతి క్షణం మరింత తీవ్రంగా మారుతోంది.
దగ్గరగా వెళ్లిన వాళ్లకి ఒక్కసారి వాంతులు రావాలనిపించేంతగా అది దుర్గంధంగా మారింది.
ఒకరు కాసేపు ఆగి డ్రైనేజ్ లోకి చూసే ప్రయత్నం చేశారు…
కానీ లోపల పూర్తిగా నలుపు… వర్షపు నీళ్లు వేగంగా పారిపోతుండటంతో ఏమీ కనిపించలేదు.
అయినా... ఆ నీళ్లలో కలిసిపోయినట్లు కనిపిస్తున్న ఎర్రటి రంగు…
ఎవరికీ స్పష్టంగా అర్థం కాలేదు.
“బహుశా మట్టి అయి ఉంటుంది” అని చెప్పుకుంటూ వెళ్లిపోయారు.
“బహుశా మట్టి అయి ఉంటుంది” అని చెప్పుకుంటూ వెళ్లిపోయారు.
ఆ రాత్రి… ఎవరూ ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు.
మరుసటి ఉదయం…
వర్షం ఆగిపోయింది.
కానీ ఆకాశం ఇంకా మబ్బులతోనే ఉంది.
నది ఒడ్డున కొందరు గ్రామస్థులు వెళ్లారు…
అప్పుడు వాళ్ల కళ్ల ముందు కనిపించిన దృశ్యం మాత్రం…
వాళ్ల గుండెల్లో భయాన్ని నింపేసింది.
నది నీళ్లు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి…
కానీ ఆ నీళ్లలో… ఎర్రటి రంగు కలిసిపోయి ఉంది.
చిన్న చిన్న అలలతో కలిసి…
ఆ ఎర్రదనం ఒడ్డుకి చేరుతూ ఉంది.
“ఇది ఏమిట్రా…?” అని ఒకరు భయంతో అడిగారు.
ఒడ్డుకి దగ్గరగా వెళ్లి చూసినప్పుడు…
అది సాధారణ మట్టి కాదు…
అది రక్తం... రాత్రి డ్రైనేజ్ లోకి కలిసిపోయిన ఆ ఎర్రటి నీళ్లు…
ఇప్పుడు నదిలోకి చేరి…
ఒక భయంకరమైన నిజాన్ని బయటపెడుతున్నాయి.
అక్కడే ఒక చిన్న గుడ్డ ముక్క…
నీళ్లతో కలిసి ఒడ్డుకు కొట్టుకువచ్చాయి…
ఆ దృశ్యం చూసిన వాళ్లు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు.
“ఇది యాదృచ్ఛికం కాదు. ఏదో జరిగింది… చాలా పెద్దది…”
అక్కడి నిశ్శబ్దం…
వాళ్ల అనుమానాలను మరింత భయంకరంగా మార్చింది…
“ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన… హారిక జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని… ఆమెకు అప్పటికి తెలియదు.”
10-11 నెలల క్రితం...
అది ఒక పచ్చని పల్లెటూరు…
ప్రశాంతంగా కనిపించే జీవితం.
ఆ ఊరిలోనే హారిక పెరిగింది.
ఆమె ఒక పెద్ద సంయుక్త కుటుంబంలో పెరిగింది.
ఇంట్లో పెద్దలు, అన్నలు, వదినలు, చిన్న పిల్లలు…
ఎప్పుడూ నవ్వులు, సందడి నిండే ఇల్లు.
అందరి మధ్య హారిక ఒక్కతే అమ్మాయి.
అందుకే… ఆమెకు ఇంట్లో ఒక ప్రత్యేక స్థానం.
ఎవరైనా బయట వాళ్లు వచ్చి “హారిక ఎక్కడ?” అని అడిగితే…
ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆమె గురించి గర్వంగా మాట్లాడేవారు.
అమ్మమ్మ కళ్లల్లో ఆమెపై ప్రేమ, తాతయ్య మాటల్లో ఆమెపై గర్వం, అన్నయ్యల దగ్గర అల్లరి, వదినల దగ్గర స్నేహం…
అంతా కలిపి…
అంతా కలిపి…
హారిక జీవితం ఒక చిన్న పండుగలానే ఉండేది.
కానీ… ఈ అందమైన జీవితంలో ఒక చిన్న సమస్య మాత్రం ఉంది.
అది… చదువు. హారికకు చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు.
పుస్తకం తెరిస్తే…
ఐదు నిమిషాల్లోనే ఆమె మనసు బయటకి వెళ్లిపోతుంది.
పొలాల్లో తిరగడం,
ఇంట్లో వాళ్లతో మాట్లాడడం, వంటగదిలో అమ్మమ్మతో కబుర్లు చెప్పడం…
ఇవే ఆమెకు ఇష్టం.
“చదువు చదువు” అని అందరూ చెప్పేవాళ్లు…
కానీ హారిక మాత్రం నవ్వుతూ తప్పించుకునేది.
ఎలాగోలా స్కూల్ పూర్తయింది.
మార్కులు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి.
కానీ…
ఇంట్లో వాళ్లు ఒక నిర్ణయం తీసుకున్నారు.
“ఇంకా చదవాలి… మంచి కాలేజీలో చేరాలి” అని.
హారికకు మాత్రం అది పెద్ద షాక్.
“నాకు అవసరం లేదు… నేను ఇంట్లోనే ఉంటాను…” అని ఎంత చెప్పినా…
ఎవరూ వినలేదు.
చివరికి…
పై చదువు కోసం టౌన్‌కి వెళ్లాల్సి వచ్చింది.
టౌన్‌కి వచ్చిన మొదటి రోజు…
అది హారిక జీవితంలో ఒక కొత్త అధ్యాయం.
పెద్ద పెద్ద భవనాలు, ట్రాఫిక్ శబ్దం, కొత్త కొత్త ముఖాలు…
ఆమెకు అన్నీ కొత్తగా, కొంచెం భయంగా కూడా అనిపించాయి.
కాలేజీ గేటు ముందు నిలబడి…
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది.
ఇంట్లో వాళ్ల ముఖాలు గుర్తొచ్చాయి.
“నేను ఇక్కడ ఎలా ఉంటాను…?” అని తనలోనే అనుకుంది.
కాలేజీ లోపలకి వెళ్లిన తర్వాత…
మొదట్లో ఎవ్వరితో మాట్లాడలేదు.
క్లాస్‌లో కూర్చుని నిశ్శబ్దంగా ఉండేది.
కానీ… రోజులు గడిచేకొద్దీ
ఒక్కొక్కరుగా పరిచయాలు మొదలయ్యాయి.
మొదట బెంచ్ పక్కన కూర్చున్న అమ్మాయి “హాయ్” అనింది.
తర్వాత ఇంకొకరు వచ్చి “నువ్వెక్కడి నుంచి?” అని అడిగారు.
ఇలా… చిన్న చిన్న మాటలతో…
హారికకు కొత్త ప్రపంచం తెరుచుకుంది.
ఆమె నవ్వడం మళ్లీ మొదలైంది.
కానీ…
ఆమె మనసు మాత్రం ఇంకా ఇంటి దగ్గరే ఉంది.
ప్రతి రోజు సాయంత్రం…
ఫోన్ తీసుకుని ఇంటికి కాల్ చేసేది.
“అమ్మమ్మా… నేడు ఏమి వండారు?, నాన్నా… మీరు పొలానికి వెళ్లారా?, అన్నయ్యా… ఇంట్లో ఏం జరిగింది?”
అలా… గంటలకొద్దీ మాట్లాడేది.
కొన్నిసార్లు నవ్వుతూ…
కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకుంటూ…
“నాకు మీరంతా గుర్తొస్తున్నారు…” అని చెప్పేది.
ఇంట్లో వాళ్లు కూడా…
“బాగా చదువు… మేమంతా ఉన్నాం కదా…” అని ధైర్యం చెప్పేవారు.
ఫోన్ కట్ చేసిన తర్వాత…
హారిక ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి…
ఆకాశం వైపు చూసేది.
అక్కడ కనిపించే నక్షత్రాల్లో…
తన ఊరిని వెతుక్కుంటూ…
ఇలా…
హారిక జీవితంలో రెండు ప్రపంచాలు మొదలయ్యాయి…
ఒకటి – కుటుంబం, ప్రేమ, జ్ఞాపకాలు…
మరొకటి – కొత్త స్నేహాలు, కొత్త అనుభవాలు…
ఒక రోజు కాలేజీ క్లాసులు పూర్తయ్యాక, హారిక నెమ్మదిగా బయటికి వచ్చింది.
ఆ రోజు ఆకాశం మబ్బులతో కప్పుకుంది…
సాయంత్రం వెలుతురు కొంచెం మసకబారినట్టు ఉంది.
మామూలుగా ఫ్రెండ్స్‌తో వెళ్లే హారిక…
ఆ రోజు మాత్రం ఒంటరిగా నడుస్తోంది.
ఎందుకో మనసు కూడా కాస్త బరువుగా ఉంది.
ఇంటికి ఫోన్ చేయాలనిపించింది… కానీ “ఇంకా కొంచెం తర్వాత చేస్తాను” అనుకుని ఫోన్ బ్యాగ్‌లో వేసేసింది.
రోడ్డు మీద తక్కువ మంది మాత్రమే ఉన్నారు.
గాలి నెమ్మదిగా వీచుతూ…
చెట్ల ఆకులు చప్పుళ్లు చేస్తుండగా…
హారిక తనలో తానే ఏదో ఆలోచిస్తూ నడుస్తోంది.
అప్పుడే…
ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు ఒక్కసారిగా జారి కింద పడిపోయాయి.
“అయ్యో!” అని అనుకుంటూ వంగి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా…
“ఓహ్… careful…” అని ఒక స్వరం వినిపించింది.
ఆమె పైకి చూసింది.
ఒక అబ్బాయి…
సాధారణగా కనిపించే డ్రెస్, ముఖంలో చిన్న నవ్వు…
ఆమె పడేసిన పుస్తకాలు తీసుకుని ఇచ్చాడు.
“థ్యాంక్స్…” అని హారిక కొంచెం సంకోచంగా చెప్పింది.
“పర్లేదు… నువ్వు అదే కాలేజీలోనే చదువుతున్నావా?నేను ఎప్పుడూ చూడలేదు” అని అన్నాడు.
హారిక తల ఊపుతూ,
“నేను కొత్తగా జాయిన్ అయ్యాను…” అని చిన్నగా సమాధానం ఇచ్చింది.
"హో... అవునా...
నేను ఇక్కడే జాబ్ చేస్తున్నాను..." అన్నాడు
కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.
హారికకి కొంచెం ఇబ్బంది, కొంచెం సంకోచం…
ఏం మాట్లాడాలో అర్థం కాకపోయింది.
“నీ పేరు?” అని అతను అడిగాడు.
“హారిక…”
“నైస్… నేను అర్జున్…” అని చెప్పాడు.
అర్జున్ మాట్లాడే తీరు చాలా సింపుల్‌గా ఉంది.
ఏ అహంకారం లేకుండా…
ఒక ఫ్రెండ్‌లా మాట్లాడుతున్నాడు.
ఇద్దరూ కలిసి కొంత దూరం నడిచారు.
మధ్య మధ్యలో చిన్న చిన్న మాటలు…
“ఎక్కడి నుంచి వచ్చావు?”
“హాస్టల్‌లో ఉంటున్నావా?”
“కాలేజీ ఎలా అనిపిస్తోంది?”
హారిక కూడా మెల్లగా కంఫర్ట్ ఫీల్ అయ్యింది.
ఆమెకు తెలియకుండానే… తన గురించి కొంచెం కొంచెంగా చెప్పడం మొదలుపెట్టింది.
చిన్నగా నవ్వింది కూడా.
ఆ సమయం లో…
అర్జున్ ఒక్కసారి ఆగి,
“ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు?” అని అడిగాడు.
“హాస్టల్…” అని చెప్పింది.
“సరే… కేర్ ఫూల్ గా వేళ్ళు” అని చెప్పి, వెళ్లిపోవడానికి తిరిగాడు.
హారిక కూడా ముందుకు నడిచింది…
కానీ రెండు అడుగులు వేసి… ఒక్కసారి వెనక్కి చూసింది.
అర్జున్ కూడా అదే సమయంలో వెనక్కి చూసాడు.
ఇద్దరూ ఒక్కసారి చూసుకుని… చిన్నగా నవ్వుకున్నారు.
ఆ క్షణం…
హారికకి ఏదో కొత్త అనుభూతి.
అది స్నేహమా… లేక ఇంకేదైనా…
ఆమెకు అర్థం కాలేదు.
ఆ రాత్రి…
ఇంటికి ఫోన్ చేసింది.
ఎప్పటిలాగే నవ్వుతూ మాట్లాడింది…
కానీ మధ్య మధ్యలో…
ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోయాయి.
“హారిక… ఏమైంది? ఎందుకో ఈ రోజు సైలెంట్ గా ఉన్నావు?” అని అమ్మ అడిగింది.
“ఏమీ లేదు అమ్మ…” అని చెప్పినా…
ఆమె మనసులో మాత్రం అర్జున్ గురించే ఆలోచన…
“ఆ సాయంత్రం జరిగిన ఆ చిన్న పరిచయం…
హారిక జీవితంలో ఒక పెద్ద తుఫాను మొదలు అవుతుందని…
ఆమెకు ఇంకా తెలియదు…”
హారిక జీవితంలో ఒక పెద్ద తుఫాను మొదలు అవుతుందని…
ఆమెకు ఇంకా తెలియదు…”
తర్వాత ఏమి జరిగింది...?
చూడండి part-2 లో




Comments
Post a Comment