తర్వాత రోజు…
అర్జున్ కాలేజీ గేటు దగ్గరే నిలబడి ఉన్నాడు.
అర్జున్ కాలేజీ గేటు దగ్గరే నిలబడి ఉన్నాడు.
గడియారం వైపు చూస్తూ… అప్పుడప్పుడు లోపలికి చూస్తూ… ఎవరినో ఎదురు చూస్తున్నట్టు కనిపించాడు.
అతని కళ్ళలో ఒక చిన్న ఆతృత… ఒక చిన్న టెన్షన్ కూడా కనిపిస్తోంది.
ఇక హారిక…
మెల్లగా నడుచుకుంటూ కాలేజీ వైపు వస్తోంది. చేతిలో పుస్తకాలు… గాలి తాకుతూ జుట్టు కొద్దిగా అల్లకల్లోలంగా కదులుతోంది.
ఆమె మనసులో మాత్రం నిన్నటి సాయంత్రం సంఘటనలే తిరుగుతున్నాయి.
“అతను మళ్లీ కనిపిస్తాడా…?” అనే చిన్న ఆశ ఆమె అడుగుల్లో కనిపించింది.
గేటు దగ్గరకు చేరుకున్న వెంటనే… ఆమె కళ్ళు ఒకసారి చుట్టూ తిరిగాయి…
ఒక్కసారిగా — అర్జున్ కనిపించాడు.
ఒక క్షణం…
ఆమె అడుగులు ఆగిపోయాయి. హృదయం ఒక్కసారి గట్టిగా కొట్టుకుంది.
“అరే… మీరు ఇక్కడా?” అని కొంచెం ఆశ్చర్యంతో, కొంచెం సంతోషంతో అడిగింది.
అర్జున్ చిరునవ్వు నవ్వుతూ,
“ఏమీ లేదు… నిన్ను చూడాలనే వచ్చాను…” అని మెల్లగా అన్నాడు.
ఆ మాట విన్న వెంటనే… హారిక కళ్ళలో ఒక చిన్న మెరుపు.
“నన్నా ఎందుకు…?” అని అడిగింది.
ఆమె గొంతులో అమాయకత… కానీ లోపల మాత్రం ఆనందం మెల్లగా పెరుగుతోంది.
అర్జున్ కాసేపు ఏమీ మాట్లాడకుండా ఆమెను గమనించాడు.
ఆమె కళ్ళు… ఆమె నవ్వు… ఆమె ఆత్మవిశ్వాసం…
అప్పుడే మాట మార్చుతూ,
“ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు…” అన్నాడు.
ఆ ఒక్క మాట… హారిక హృదయాన్ని తాకింది.
ఆమె కళ్ళు పెద్దవయ్యాయి…
ముఖం మీద చిన్న నవ్వు… చెంపలు కొద్దిగా ఎర్రబడ్డాయి.
ఒక్క క్షణం… ఇద్దరి మధ్య నిశ్శబ్దం.
ఆమె అతన్ని చూస్తూ నిలిచిపోయింది.
ఆ క్షణం ఆమెకి చాలా ప్రత్యేకంగా అనిపించింది.
మనసులో అనుకుంది.
“ఇంత నేరుగా చెప్పేస్తాడా…?”
అర్జున్ కూడా ఆమెని చూస్తూ…
ఆమె స్పందన కోసం ఎదురు చూస్తున్నాడు.
హారిక వెంటనే తేరుకుని, కొంచెం తల వంచి నవ్వుతూ,
“థ్యాంక్స్…” అని మెల్లగా చెప్పింది.
కొంచెం సిగ్గు… కొంచెం సంతోషం…
ఆమె ముఖం మొత్తం కనిపిస్తోంది. తర్వాత గడియారం వైపు చూసి,
“సరే… టైం అయ్యింది. నేను క్లాస్ కి వెళ్ళాలి… బాయ్…” అంది.
అలా చెప్పినా…
ఆమె అడుగులు ముందుకు పడుతున్నాయి కానీ,
మనసు మాత్రం వెనక్కే చూస్తోంది.
కొన్ని అడుగులు వెళ్లాక… మళ్ళీ ఒక్కసారి తిరిగి చూసింది.
అర్జున్ ఇంకా అక్కడే నిలబడి ఆమెనే చూస్తున్నాడు.
ఆ క్షణం…
హారిక ముఖంలో ఒక అందమైన నవ్వు మెరిసింది.
అలా నవ్వుతూ… ఆమె క్లాస్ వైపు నడిచిపోయింది.
కానీ ఆ రోజు…
క్లాస్ లో ఆమె దృష్టి పుస్తకాల మీద కాదు… ఆ ఒక్క మాట మీదే ఉంది.
క్లాస్ లో ఆమె దృష్టి పుస్తకాల మీద కాదు… ఆ ఒక్క మాట మీదే ఉంది.
ఆ రోజంతా…
హారిక ఎక్కడ ఉన్నా… ఏం చేస్తున్నా…
ఆమె మనసులో మాత్రం ఒక్క అర్జున్ మాత్రమే ఉన్నాడు.
క్లాస్ లో లెక్చరర్ చెప్పే మాటలు వినిపిస్తున్నాయి…
కానీ అర్థం కావడం లేదు.
పుస్తకం తెరిచి ఉంది…
కానీ కళ్ళ ముందు మాత్రం అర్జున్ నవ్వే కనిపిస్తోంది.
“ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు…”
అతను చెప్పిన ఆ ఒక్క మాట మళ్లీ మళ్లీ ఆమె చెవుల్లో వినిపిస్తోంది.
తన ఫ్రెండ్ మాలతి పక్కనుంచి చూసి,
“ఏమైంది నీకు? ఈ రోజు చాలా silent గా ఉన్నావ్…” అని అడిగింది.
హారిక తడబడి,
“ఏమీ లేదు…” అని చెప్పింది.
సాయంత్రం…
బెల్ మోగిన వెంటనే హారిక గుండె వేగంగా కొట్టుకుంది.
“అతను బయట ఉంటాడేమో…” అనే ఆశతో బ్యాగ్ సర్దుకుని తొందరగా బయటికి వచ్చింది.
గేట్ దగ్గరకు వచ్చి… చుట్టూ చూసింది.
ఎడమ వైపు… కుడి వైపు…
ప్రతి ముఖంలోనూ అతనే అనిపించింది.
కానీ… అతను కనిపించలేదు.
ఆ ఒక్క క్షణంలో…
ఆమె ముఖంలో ఉన్న వెలుగు మెల్లగా తగ్గిపోయింది.
“వచ్చి ఉంటాడనుకున్నా…” అని మనసులోనే అనుకుంది.
ఆశతో వచ్చిన అడుగులు… ఇప్పుడు నెమ్మదిగా మారిపోయాయి.
కొంచెం నిరాశ… కొంచెం ఖాళీగా అనిపించింది.
అలా మెల్లగా హాస్టల్ వైపు నడిచిపోయింది.
ఆ రాత్రి…
హాస్టల్ గదిలో పడుకున్నా… నిద్ర మాత్రం రావడం లేదు.
ఫ్యాన్ గాలి ఊదుతోంది… బయట ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి…
కానీ ఆమెకు వినిపించేది ఒక్కటే —
అర్జున్ గొంతు.
అతను నవ్విన తీరు… చూసిన విధానం… ఆమెతో మాట్లాడిన ఆత్మీయత…
ప్రతి చిన్న విషయం గుర్తుకొస్తోంది.
ఆమె కళ్ళు మూసుకుంది…
కానీ ఆలోచనలు మాత్రం ఆగలేదు.
“అతను రేపు వస్తాడా…?” అనే ప్రశ్నతోనే నిద్రలోకి జారుకుంది.
మరుసటి రోజు…
అలారం మోగకముందే హారిక లేచింది.
“లేట్ ఐతే… అతను వెళ్లిపోతాడేమో…”
అనే ఆలోచనతో తొందరగా రెడీ అవుతోంది.
ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి అని రెండు సార్లు మార్చుకుంది.
చివరికి కాస్త బాగానే కనిపించేలా మేకప్ వేసుకొని…
అద్దం ముందు ఒకసారి నిలబడి చూసుకుంది.
“మళ్లీ నన్ను అలా చూస్తాడా…?” అని తనలో తాను నవ్వుకుంది.
హాస్టల్ నుండి బయటకు వచ్చింది. ఆమె అడుగులు వేగంగా ఉన్నాయి…
హృదయం ఇంకా వేగంగా కొట్టుకుంటోంది. గేట్ దగ్గరకు చేరుకునేలోపే…
దూరంగా ఒక బైక్ కనిపించింది.
ఆ బైక్ మీద… అర్జున్.
ఒక్కసారిగా ఆమె అడుగులు ఆగిపోయాయి.
“ఇక్కడా…?” అని ఆశ్చర్యంతో చూసింది.
అర్జున్ ఆమెను గమనించి చిరునవ్వు నవ్వాడు.
“హే… ఇక్కడికి ఎలా వచ్చావ్?” అని ఆమె అడగకముందే,
అతనే ముందుగా చెప్పాడు —“నేను డ్రాప్ చేస్తా… కాలేజ్ వరకు”
ఆ మాట విన్న క్షణం…
హారిక హృదయం ఆనందంతో నిండిపోయింది.
హారిక హృదయం ఆనందంతో నిండిపోయింది.
“నిజంగానా…?” అన్నట్టు అతన్ని చూసింది.
“సరే…” అని మెల్లగా తల ఊపింది.
ఆ క్షణం ఆమెకు చాలా ప్రత్యేకంగా అనిపించింది.
మొదటిసారి… అతనితో కలిసి ప్రయాణం. బైక్ మీద కూర్చుంది.
ఆమె చేతులు కొంచెం సంకోచంగా ఉన్నాయి…
ఎక్కడ పట్టుకోవాలో తెలియక… చివరికి మెల్లగా సీట్ అంచున పట్టుకుంది.
బైక్ స్టార్ట్ అయింది.
గాలి తాకుతూ ఆమె జుట్టు ఎగిరింది… అర్జున్ దగ్గరగా ఉండటం వల్ల…
ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటోంది.
ఆమెకి అనిపించింది —
“ఇది ఒక చిన్న ప్రయాణం కాదు… ఇది ఒక కొత్త కథ ప్రారంభం…”
తన కాలేజ్ దగ్గర వదిలి వెళ్లే ముందు అర్జున్ ఇలా అన్నాడు.
“సాయంత్రం కూడా నేనే వచ్చి పికప్ చేసుకుంటాను.”
హారిక చిన్నగా నవ్వుతూ తల ఊపింది.
అతను చెప్పినట్టే సాయంత్రం…
కాలేజ్ ముగిసే సమయానికి ముందే వచ్చి బయట వేచి చూస్తూ ఉన్నాడు.
కాలేజ్ గేట్ దగ్గర అతన్ని చూసిన క్షణం… ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది.
ఆ రోజు వాళ్లు కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు.
మొదట చిన్న చిన్న విషయాలు…
తర్వాత వారి గురించి…
ఇష్టాలు… అభిరుచులు… కలలు…
ఆ సంభాషణలోనే… వాళ్లిద్దరి మధ్య ఉన్న దూరం నెమ్మదిగా కరిగిపోయింది.
ఆ రోజు తర్వాత… రోజురోజుకీ వాళ్ల మధ్య దగ్గరితనం పెరిగింది.
మెసేజ్‌లు…
రాత్రి పొద్దుపోయేంతవరకు ఫోన్ కాల్స్… చిన్న చిన్న కారణాలతో కలుసుకోవడం…
ఇది అన్నీ వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయాయి.
హారికకి అర్జున్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది.
అతని మాటలు, అతని కేర్… ఆమెకి అలవాటైపోయాయి.
అర్జున్ కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.
ఒక రోజు…
“రేపు హాలిడే కదా… మనం ఇద్దరం బయటకి వెళ్దాం,” అన్నాడు అర్జున్.
హారిక కొద్దిసేపు ఆలోచించింది.
మనసులో చిన్న సందేహం… కానీ అతనిపై నమ్మకం ఎక్కువ.
చివరికి— “సరే,” అని ఒప్పుకుంది.
తర్వాత రోజు ఉదయం… ఇద్దరూ నగరానికి కొంచెం దూరంగా… ప్రశాంతంగా ఉన్న ఒక చోటికి వెళ్లారు.
అక్కడి నిశ్శబ్దం… చల్లని గాలి…
ఇద్దరి మధ్య పెరిగిన నమ్మకం… అన్నీ కలిసొచ్చాయి.
సమయం ఎలా గడిచిందో వాళ్లకు తెలియలేదు.
సాయంత్రం అయ్యేసరికి వర్షం మొదలైంది.
తిరిగి రావడం కష్టంగా మారడంతో…
ఇద్దరూ దగ్గర్లో ఉన్న ఒక చిన్న రిస్టారెంట్‌కి వెళ్లారు.
వర్షం మరింత గట్టిగా పడుతుండగా… అర్జున్ మెల్లగా అన్నాడు—
“ఈ రోజు ఇక్కడే ఉండేద్దాం…”
హారిక కాసేపు మౌనంగా నిలిచింది.
“ఇంత వర్షంలో వెళ్ళడం సేఫ్ కాదు… ఇక్కడే ఉంటే మంచిది,” అన్నాడు.
హారిక కొంచెం సందేహంగా చూసినా…
అతని మాటల్లో ఉన్న నమ్మకం చూసి ఏమీ అనలేదు.
చివరికి… అతనితో ఉండటానికి ఒప్పుకుంది.
ఆ రోజు…
ఒక క్షణం…
ఒక నిర్ణయం…
అది వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
మరుసటి రోజు ఉదయం…
హారిక మెల్లగా కళ్ళు తెరిచింది. అర్జున్ పక్కన లేడు.
“బహుశా బయటకి వెళ్లి ఉంటాడు…” అని అనుకుంది.
కొద్దిసేపటికి ఫోన్ తీసుకుని చూసింది.
అర్జున్ నుండి ఒక చిన్న మెసేజ్—
“Emergency వచ్చింది… వెళ్తున్నాను. తర్వాత మాట్లాడుదాం.”
అంతే.
కాల్ చేయడానికి ప్రయత్నించింది… ఫోన్ switch off.
ఆ ఒక్క మెసేజ్…
ఆమె మనసులో ఒక తెలియని భయాన్ని మొదలుపెట్టింది.
“బిజీ అయి ఉంటాడా…?” అని తనను తాను ప్రశ్నించుకుంది.
ఏమైనా తర్వాత చూసుకుందాం అంటూ తను ఒక్కతే హాస్టల్ కు వెళ్ళిపోయింది.
రోజులు గడుస్తున్నాయి… కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు…
మెసేజ్‌లకు స్పందన లేదు… అతను ఎక్కడా కనిపించలేదు.
ఆమె వెతికింది… ఎక్కడికక్కడ అడిగింది…
కానీ అర్జున్ మాత్రం కనిపించలేదు.
కొన్ని రోజుల తర్వాత…
హారికకి తనలో ఏదో మార్పు అనిపించడం మొదలైంది.
మొదట దాన్ని పట్టించుకోలేదు.
కానీ…
రోజులు గడిచేకొద్దీ… ఆమె మనసులో భయం పెరిగింది.
చివరికి…
ఒక రోజు ధైర్యం చేసి టెస్ట్ చేసింది.
ఆమె చేతులు వణికిపోయాయి.
గుండె బలంగా కొట్టుకుంటోంది…
రెజల్ట్ చూసిన క్షణం—
ఆమె ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది.
ఆమె… ప్రెగ్నెంట్.
ఆ క్షణం…
ఆమెకు చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం చీకటిగా అనిపించింది.
ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో పెద్ద తప్పు చేసినట్టు…
ఎక్కడో జీవితమే చేతిలో నుంచి జారిపోయినట్టు అనిపించింది.
అర్జున్‌కి చెప్పాలని అనుకుంది…
కానీ…
అతను ఎక్కడున్నాడో తెలియదు.
మాటలు రావట్లేదు. కళ్లలో నీళ్లు… మనసులో భయం…
ముందున్న జీవితం ప్రశ్నగా మారింది.
అక్కడ అర్జున్ కనిపించడం లేదు.
ఇక్కడ హారిక ప్రెగ్నెంట్.
“అర్జున్‌కి ఏమైంది…?”
“ఆ రాత్రి నిజంగా ఏమి జరిగింది…?”
“ఆ రాత్రి నిజంగా ఏమి జరిగింది…?”
తర్వాత ఏమీ జరిగింది.
చూడండి Part-3.
Part-3 త్వరలోనే వస్తుంది.




Comments
Post a Comment