అర్ధరాత్రి 12 గంటలకు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న అమ్మాయి
అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు. రోడ్డుపై ఎవ్వరూ లేరు. చుట్టూ నిశ్శబ్దం, గాలి కూడా మెల్లగా ఊదుతోంది. రోడ్డుపై ఉన్న లైట్లు అలా మసకగా వెలుగుతున్నాయి. అక్కడక్కడ చిమ్మ చీకటి. అలాంటి సమయంలో ఒంటరిగా ఒక అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె పేరు అహల్య. అహల్య సాధారణమైన అమ్మాయి. చిన్నప్పటి నుంచే ఆమె చాలా ధైర్యంగా ఉండేది. చదువులో మంచి ప్రతిభ ఉంది, కానీ జీవితం మాత్రం అంత సులభంగా ఉండేది కాదు. తండ్రి చిన్న ఉద్యోగి, తల్లి గృహిణి. అయినా ఆమెకు మాత్రం ఒక మంచి జర్నలిస్ట్ అవ్వాలి… నిజాలను బయటపెట్టాలి, నిజాయితీగా ఉండాలి అనే ఆశ ఉండేది. కుటుంబం కోసం తన కలలను కొంతకాలం పక్కన పెట్టాల్సి వచ్చింది.
ఆమె దాన్ని మొదట అవసరం లేని మెసేజ్ అనుకొని పట్టించుకోలేదు. మరుసటి రోజు కూడా అలాగే మెసేజ్ వచ్చింది. రిప్లై చేయడానికి కాదు, కాల్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎవరో ఆట పట్టిస్తున్నారేమో అనుకొని మళ్ళీ పట్టించుకోలేదు.
కానీ రోజూ అదే మెసేజ్ రావడంతో ఆమెకు అనుమానం మొదలైంది. “ఈ మెసేజ్ ఎవరు చేస్తున్నారు? నాకే ఎందుకు పంపిస్తున్నారు?” అని ఆలోచించసాగింది.
ఏదేమైనా నాకు ఈ విషయం తెలియాల్సిందే అని నిర్ణయించుకుని, ఇంట్లో ఎవరికీ ఏమి చెప్పకుండా ఒంటరిగా వంతెన దగ్గరకు వెళ్లింది. అక్కడ ఎవరూ లేరు. చిమ్మ చీకటి, గాలి మాత్రమే గట్టిగా ఊదుతోంది.
అప్పుడే ఆమెకు “టక్… టక్…” అనే శబ్దం వినిపించింది. ఎవరో అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. అహల్య వెనక్కి తిరిగి చూసింది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది.
తిరిగి వెళ్ళిపోదాం అనుకొని కొంచెం ముందుకు వెళ్లగానే ఆమెకు ఒక పాత బ్యాగ్ కనిపించింది. ఆమె జాగ్రత్తగా దాన్ని తెరిచి చూసింది. అందులో కొన్ని పేపర్లు… ఫోటోలు ఉన్నాయి.
ఆ ఫోటోలు చూసి ఆమె షాక్ అయింది. అవి ఒక పెద్ద అవినీతి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు. కొంతమంది పెద్ద అధికారుల ఫోటోలు, అక్రమ డబ్బు లావాదేవీల వివరాలు ఉన్నాయి. అది చాలా ప్రమాదకరమైన విషయం.
అప్పుడే వెనక నుంచి ఒక కార్ లైట్ ఆమెపై పడింది. ఆమె భయంతో వెనక్కి తిరిగి చూసింది. కారు ఆమె దగ్గరకు వచ్చి ఆగింది. అందులో నుంచి ఇద్దరు మనుషులు దిగి, “ఆ బ్యాగ్ మాకు ఇవ్వు” అని చెప్పారు.
అహల్యకు వెంటనే అర్థమైంది — ఈ రహస్యం వాళ్లదే అని. ఆమె భయపడుతూ మెల్లగా ఒక అడుగు వెనక్కి వేసింది.
వాళ్లు ఆ బ్యాగ్‌ను లాక్కోవడానికి ముందుకు రాగానే, అహల్య ఒక్కసారిగా వారిని తోసి బ్యాగ్‌ను తీసుకొని అక్కడి నుంచి పరుగెత్తింది. వాళ్లు కూడా ఆమె వెనకే పరుగెత్తారు.
ఆ చీకట్లో ఒక గల్లీలో దాక్కుంది. కారు ఆమెను దాటి కొంచెం ముందుకు వెళ్లగానే అహల్య వెంటనే పోలీస్ స్టేషన్ వైపుకు పరుగెత్తింది. వాళ్లు కూడా ఆమెను వెంబడించారు. కానీ చివరికి ఆమె పోలీస్ స్టేషన్ చేరుకుంది.
లోపలికి వెళ్లగానే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూర్చుని ఉన్నారు. అహల్య వెంటనే వాళ్ళతో జరిగినదంతా చెప్పింది.
అంతా విన్న పోలీసులు, “సరే అమ్మా, దీని గురించి మేము విచారణ చేస్తాము” అని చెప్పారు. ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాలన్నింటిని తీసుకొని, అహల్యను క్షేమంగా ఇంటి దగ్గర వదిలేశారు.
కొన్ని రోజుల తర్వాత ఒక రోజు రాత్రి 11 గంటలకు అహల్య ఫోన్‌కు Unknown Number నుండి ఒక కాల్ వచ్చింది. ఆమె ఫోన్ ఎత్తగానే, ఆవైపు నుండి ఒక నెమ్మదైన గొంతు వినిపించింది: “అహల్య… నిజం ఇంకా పూర్తిగా బయటపడలేదు.”
అహల్య షాక్ అయింది. “ఎవరు మీరు?” అని అడిగింది. కానీ ఫోన్ కట్ అయిపోయింది. ఆ రాత్రంతా అహల్యకు అస్సలు నిద్ర పట్టలేదు.
మరుసటి రోజు ఆమె ఇంటి తలుపు ముందు ఒక చిన్న కవర్ కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక పాత ఫోటో… ఇంకా ఒక పేపర్ ఉంది.
ఆ ఫోటో చూసి ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి వేరెవరో కాదు — అహల్య తండ్రి. ఆ పేపర్ మీద ఒక్క వాక్యం మాత్రమే ఉంది:
“ఈ కథ మొదలైంది 20 సంవత్సరాల క్రితం.”
ఇది చూసి అహల్య నేరుగా తన తండ్రి దగ్గరకు వెళ్లి ప్రశ్నించింది. కానీ ఆయన ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు ఆమె ఫోన్‌కు మళ్ళీ Unknown Number నుండి ఒక మెసేజ్ వచ్చింది.
“నీకు నిజం తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి 11 గంటలకు అదే వంతెన దగ్గరకు రా.”
మెసేజ్‌లో చెప్పినట్టే అహల్య 11 గంటలకు వంతెన దగ్గరకు వెళ్లింది. ఈసారి ఆమె ఒంటరిగా కాదు — పోలీసులు కూడా దూరంగా గమనిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు.
అతను తన గతాన్ని, అవినీతి ఎలా జరిగిందో అన్నీ వివరంగా చెప్పాడు. చివరికి చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అప్పుడే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. అహల్య ఇచ్చిన సాక్ష్యాలతో పెద్ద అవినీతి బయటపడింది. చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. ప్రజలు అహల్యను ధైర్యమైన జర్నలిస్ట్ అని ప్రశంసించారు. అహల్య జీవితం ఇప్పుడు మారిపోయింది… కానీ కథ ఇక్కడితో ముగియలేదు.
కొన్ని నెలల తర్వాత…
అహల్య ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్ట్ గా పని చేయడం ప్రారంభించింది. ఆమె కథ చాలా మందికి ప్రేరణ అయింది.

Comments
Post a Comment