Skip to main content

Part-1 వెలగంపల్లి దేవకన్య రహస్యం | ప్రతి 12 సంవత్సరాలకు కనిపించే దేవకన్య కథ | Telugu Mystery Story

"ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి...  ఆ కొండపై కనిపించే దేవకన్యను చూసినవాళ్లు తిరిగి గ్రామానికి రాలేదట... అది కేవలం కథే అనుకున్నారు అందరూ... కానీ 1987లో ఒక అమ్మాయి ఆ నిజాన్ని వెతకాలని నిర్ణయించుకుంది..." 1987  సంవత్సరం… పచ్చని కొండల మధ్యలో దాగి ఉన్న చిన్న గ్రామం — వెలగంపల్లి.   ఉదయం పొగమంచు కమ్ముకున్నా… సాయంత్రం గాలిలో పక్షుల అరుపులు వినిపించినా…   ఆ ఊరిలో ఒక్క విషయం మాత్రం అందరి మనసుల్లో భయంగా ఉండేది.   ఆ కొండపై ఉన్న పాత దేవాలయం గ్రామానికి ఎంతో ప్రత్యేకమైనది. ఎత్తైన రాతి మెట్లను ఎక్కి వెళ్లాల్సి ఉండేది.  చుట్టూ దట్టమైన చెట్లు ,  పక్షుల కిలకిలారావాలు ,  గాలికి ఊగే కొమ్మల శబ్దం ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇచ్చేవి. దేవాలయం గోడలు కాలగమనానికి సాక్ష్యాల్లా కనిపించేవి.  కొన్ని చోట్ల రాళ్లు చెక్కుచెదిరిపోయినా ,  ఆ ఆలయం వైభవం మాత్రం ఇప్పటికీ అందరినీ ఆకర్షించేది. చాలా ఏళ్ల క్రితం అక్కడ పెద్ద జాతరలు జరిగేవని పెద్దలు చెప్పుకునేవారు.  జాతర సమయం వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోయేవట.  కొండ దారంతా రంగురంగు...

గ్రామాన్ని కాపాడిన ధార్మిక – నిజం ఏమిటి? “Telugu Story / Moral Story”

 గ్రామాన్ని కాపాడిన ధార్మిక – నిజం ఏమిటి? “
ధార్మిక ఎవరు..?
 ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న, ప్రకృతి సోయగాలతో నిండిన గ్రామంలో ‘ధార్మిక’ అనే ఒక యువతి జీవించేది."

     ఆమె ఈ గ్రామానికి ఎలా వచ్చింది అనేది మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియదు…

కానీ అందరూ ఇలా చెబుతారు…

ఒక రాత్రి భారీ వర్షం పడినప్పుడు, మెరుపులు ఆకాశాన్ని చీల్చుతూ, గాలి గట్టిగా ఊదుతున్న సమయంలో… 

గ్రామం చివర ఉన్న పెద్ద వేపచెట్టు కింద ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించిందని.
ఆ పాపను మొదట చూసింది అదే గ్రామంలోని ఓ ముసలమ్మ.

“ఈ సమయంలో ఇక్కడ పాప ఎలా వచ్చింది?” అని ఆశ్చర్యపోయింది.

ఆమె దగ్గరికి వెళ్లి చూస్తే… ఆ పాప ముఖం మీద ఒక విచిత్రమైన ప్రశాంతత, కళ్లలో ఓ వెలుగు కనిపించాయి.

ఇంత చీకటిలో, ఇంత భారీ వర్షంలో ఈ పాపను ఇలా వదిలేసి ఎవరు వెళ్లారు? సరే… రేపు పొద్దున్న చూద్దాం…" 
అని ఆ ముసలమ్మ ఆమెను తనతో ఇంటికి తీసుకెళ్లింది.

తనకు కాస్త భోజనం పెట్టి పడుకోబెట్టింది. 

పొద్దున్న లేచి ఆ పాపతో ఇలా అడిగింది.

"ఎవరమ్మా నువ్వు? అంత రాత్రిపూట అక్కడ ఏమి చేస్తున్నావు?"
ఎక్కడనుంచి వచ్చావు అని అడిగింది. 

అప్పుడు ఆ పాప ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది.
మా అమ్మ నాన్న చనిపోయారు, నాకు ఎవరూ లేరు అనింది. 

ముసలమ్మ ఒకతే ఉండడంతో  
"నీ ఏడుపు నేను చూడలేకపోతున్నానమ్మా… ఏడవకు." 

పోనీ ఇక్కడే నా దగ్గరే ఉంటావా అని అడిగింది ముసలమ్మ.
దాంతో ఆ పాప ఒక్కసారిగా తల ఊపింది.

దేవుడు నాకోసం పంపిన పిల్లవే అనుకుంటూ…" 
ఆ పాపకు “ధార్మిక” అని పేరు పెట్టారు.

ధార్మిక విచిత్రమైన విషయాలు 
కాలం గడుస్తూ…
ధార్మిక పెరుగుతున్న కొద్దీ, ఆమె గురించి కొన్ని విచిత్రమైన విషయాలు గ్రామస్తులకు కనిపించసాగాయి.

ధార్మిక

ఆమె ఎక్కడికి వెళ్లినా పూలు స్వయంగా వికసించేవి.
గాయపడిన పక్షులు ఆమె చేతుల్లో కాసేపు ఉండగానే మళ్లీ ప్రాణం పొందినట్టుగా ఎగిరిపోతుండేవి." 

ఆమె నవ్వితే… 
బాధలో ఉన్న వాళ్లకూ తెలియని ఆనందం కలిగేది

ముఖ్యంగా…
ఆమెకు ప్రకృతితో ఒక అద్భుతమైన అనుబంధం ఉండేది.
అడవుల్లో తిరుగుతూ,
పక్షులతో మాట్లాడినట్టుగా…
జంతువులను అర్థం చేసుకున్నట్టుగా…
వాటి బాధలు తెలుసుకున్నట్టుగా ఉండేది.

రైతు బాధ 
ఒకసారి ఒక రైతు పంటలు ఎండిపోయి బాధ పడుతుంటే…

ధార్మిక అతని భాదను చూసి... బాధ పడకు తాతయ్య మళ్ళీ పొలాన్ని పండిద్దాం  "నీ పొలంలో నేనూ సహాయం చేస్తాను" అంటూ కాస్త పని చేసి తను ఇంటికి వెళ్ళింది.

రెండు మూడు రోజులకే ఆ పొలం మళ్లీ పచ్చగా మారింది…
ఆ రైతుకే ఆశ్చర్యమ్ వేసింది... ఆమె చేతిలో ఏదో దివ్యశక్తి ఉందేమో అని అనుకున్నాడు

ఇలా…
గ్రామంలో ఎవరికైనా కష్టం వస్తే, ధార్మిక అందరికి సహాయం చేసేది.

కానీ…
గ్రామ పెద్దలు అప్పుడప్పుడు ఇలా అనుకునేవారు:

“ఈ అమ్మాయి సాధారణం కాదు… తన హస్తవాసి చాలా మంచిది…”

ధార్మిక మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉండేది...
తన నవ్వు అందరిని ఆకట్టుకొనేలా ఉండేది. 

గ్రామస్థులకు తన ముఖం చూస్తే ఎదో తెలియని సంతోషంగా అనిపించేది. 
అలా అందరూ తనను చాలా ఇష్టపడేవారు. 

రోజులు గడుస్తున్న కొద్దీ… ధార్మికలో కొన్ని మార్పులు గ్రామస్తులకు గమనించబడ్డాయి.

ముందు లాగానే నవ్వుతూ, అందరితో కలిసిమెలసి ఉండేది… 
కానీ కొన్ని సార్లు ఆమె కళ్లలో ఒక విచిత్రమైన ఆలోచన, ఒక లోతైన బాధ కనిపించేది.

ఒక సాయంత్రం…
సూర్యాస్తమయం అవుతోంది. ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది…
గ్రామం నిశ్శబ్దంగా మారుతోంది…

ధార్మిక కనిపించకుండా పోవడం...
అప్పుడు ధార్మిక ఒంటరిగా గ్రామం చివర ఉన్న అడవివైపు నడవడం మొదలుపెట్టింది.

అది గమనించిన చిన్న పిల్లలు అడిగారు:
“ధార్మిక అక్కా… ఎక్కడికి వెళ్తున్నావ్?”

ఆమె కాస్త చిరునవ్వు నవ్వుతూ:
కొంచెం పని ఉంది… త్వరలో వస్తాను…" అని చెప్పింది. కానీ ఆమె కళ్లలో ఏదో తెలియని రహస్యం కనిపించింది. 

ఆ మాటలో ఏదో ప్రత్యేకమైన భావం ఉంది… 
కానీ ఎవరికీ అర్థం కాలేదు.

ఆ రాత్రి…
గాలి బలంగా ఊదుతోంది… ఆకాశంలో మబ్బులు గుమిగూడుతున్నాయి… మెరుపులు మెరుస్తున్నాయి.

గ్రామస్తులలో కొందరు చెబుతారు…
ఆ రాత్రి అడవిలోనుంచి ఒక వెలుగు కనిపించిందని…
ఆ వెలుగు నేరుగా కొండపై ఉన్న గుహ వైపు వెళ్లిందని…

మరుసటి ఉదయం…
ధార్మిక ఇంటికి రాలేదు.

మొదట అందరూ “ఏదైనా పని ఉండి ఆలస్యమై ఉంటుంది” అనుకున్నారు.

"ఆ రోజు నుంచి ధార్మిక ఎవరూ చూడలేదు… కానీ కొందరు ఆమె అడవిలోకి వెళ్లినట్టు చెప్పుకున్నారు…" 

ఆమె కనిపించలేదని గ్రామం మొత్తం కలవరపడింది 😟

కొందరు అడవిలో వెతికారు
కొందరు సమీప గ్రామాలకు వెళ్లి అడిగారు.
కొందరు గుహ దగ్గరికి కూడా వెళ్లారు… కానీ లోపలికి వెళ్లడానికి భయపడ్డారు.

ఎక్కడా… ధార్మిక జాడ కనిపించలేదు.
ఆమెను పెంచిన ముసలమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అనుకుంది:

“నాకు అప్పుడే అనిపించింది… ఈ అమ్మాయి సాధారణం కాదని…

దేవుడు ఇచ్చినవాళ్లను దేవుడే తీసుకుపోతాడేమో…”

రోజులు గడుస్తూ…
మొదట అందరూ ఆమె గురించి మాట్లాడుకున్నారు…

తర్వాత మెల్లగా…
ఆమె జ్ఞాపకం కథలలో మాత్రమే మిగిలిపోయింది…

అయినా…
కొన్ని రాత్రుల్లో…
గ్రామం చుట్టూ ఒక మృదువైన గాలి వీచినప్పుడు…
పూలు ఒక్కసారిగా వికసించినప్పుడు…

“ఇది ధార్మికే కావచ్చు…” అని కొందరికి అనిపించేది… 
అలా కొద్ది కొద్దిగా తనని మరిచిపోయారు. 

     ఒకసారి గ్రామానికి భారీ ఎండబారుడు వచ్చింది.

 బావులు ఎండిపోయాయి, పంటలు వాడిపోయాయి. ఇంకా తెలియని జబ్బు ఒకటి గ్రామం మొత్తం వ్యాపించింది. గ్రామస్తులు ఎంతో ఆందోళనచెందారు. 

      ఎప్పుడూ వెళ్ళని గ్రామ ప్రజలంతా, కొండ పైన గుహలో ఉన్న తమ గ్రామ దేవతను వేడుకుందాం అని  అక్కడికి వెళ్లారు.  

అక్కడ ఎవ్వరూ లేరు, భయంకరమైన చీకటి, గాలి, గుహలోకి వెళ్ళడానికి భయం.  

        గ్రామం కోసం ప్రజలు.. ఏమైనా పరవాలేదు లోపలికి వెళదాము అనుకునేటప్పుడు, అక్కడ ధార్మిక లోపలికి వెళ్లడం చూసారు. 

        ధార్మిక ఏంటి ఇక్కడ.. అనుకుంటూ గ్రామ ప్రజలు తన వెంటే వెళ్లారు. 

ధార్మిక అకస్మాత్తుగా మాయం అయిపోయింది.
 పక్కకు తిరిగి చూస్తే గ్రామ దేవత కనిపించింది. 

ధార్మిక

       అందరూ గ్రామదేవతతో వారి కష్టాలు, కన్నీళ్లు చెప్పుకుంటూ, ఇక ఏమైనా మా గ్రామ ప్రజలను నువ్వే దిక్కు తల్లి అంటూ వేడుకుని అక్కడినుండి బయలుదేరారు. 

ధార్మిక అసలు రహస్యం

       వెళుతూ వెళుతూ... అయ్యో తల్లికి నైవేద్యం పెట్టడం మరిచిపోయాము, అని వెనుకకు తిరిగారు.

అక్కడే ఒక వింత జరగడం చూసారు. అందరూ అలాగే నిశ్యబ్దంగా చూస్తూ ఉండిపోయారు...!

       "గ్రామ దేవత క్రమంగా ధార్మిక రూపంలోకి మారడం చూసి…" అందరూ ఆశ్చర్యపోయారు...!  

ఐతే ఇన్ని రోజులు మనతో ఉన్న ధార్మిక ఎవరో కాదు, మా ఊరిని కాపాడటానికి వచ్చిన మన గ్రామ దేవతా?

 అంటూ వెంటనే తన కాళ్ళ మీదకు పడి, తల్లి నీ గ్రామ ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. 

నీవూ మాతో రావాలి, నీవే మాకు దిక్కు తల్లి… మమ్మల్ని కాపాడాలి…" అంటూ ప్రధేయపడ్డారు.

       ప్రజల కష్టాలను విన్న గ్రామ దేవత తన శక్తులతో మేఘాలను ఆహ్వానించింది. కొద్దిసేపటికి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి చల్లబడింది. వెంటనే భారీ వర్షం కురిసింది. ఆ వర్షంలో తడిచిన గ్రామ ప్రజల జబ్బు కూడా మాయం అయ్యింది. 

ఆ రోజు నుంచి…
గ్రామ ప్రజలు ధార్మికను దేవతగా పూజించసాగారు.

ఇప్పటికీ ఆ గ్రామంలో వర్షం పడిన ప్రతిసారి…
పూలు వికసించిన ప్రతిసారి…
‘ధార్మిక అమ్మ తిరిగి వచ్చింది…’ అని నమ్ముతారు."**

ధార్మిక
      

Comments

Popular posts from this blog

🌑 “ఈ ఇంట్లో కోడళ్లు ఎందుకు చనిపోతారు? నిజం బయటపడిన రాత్రి…”

పెద్దింటి రహస్యం – Part 2” 💀 ఆమెను బలి చేయడానికి అన్నీ సిద్ధం… ఇంటి వాళ్లు, మంత్రికుడు అందరూ రెడీ… కానీ వాళ్లు ఒక పెద్ద తప్పు చేశారు… ఆమెను తక్కువ అంచనా వేశారు 🔥 ఆమె గుండె బలంగా కొట్టుకుంటోంది… “కొత్త కోడలు కూడా బలి అవుతుంది…” ఆ ఒక్క వాక్యం ఆమె మెదడులో మళ్లీ మళ్లీ మారుమోగుతోంది… ఆమె ఒక్కసారిగా తేరుకుని పుస్తకాన్ని మళ్లీ తీసుకుంది… అందులో ఇంకొన్ని పేజీలు వేగంగా తిప్పింది… మొదటి పేజీ నుంచి చదవడం ప్రారంభించింది అప్పుడు తనకు అర్థం అయ్యింది. అందులో ఒక పాత కథ ఉంది… ఒకొక్క పేజీని చదువుతూ వచ్చింది. నాదియాకు దొరికిన పుస్తకం రహస్యం… ఆ పుస్తకం సాధారణం కాదు… అది ఆ ఇంటి మొదట బలి అయిన కోడలు రాసినది… ఆ పుస్తకంలో మొదట పేజీ ఇలా ఉంది "ఈ పుస్తకం చదువుతున్నావంటే నువ్వు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నవో అర్థం అయ్యింది. దీనికి ఇక ముగింపు ఇవ్వాలని... ఈ పుస్తకం నీకు సహాయం కోసం రాస్తున్నాను. నా పేరు — “అమృత”… “ఏళ్ల క్రితం… ఈ పెద్దింటి పూర్వీకులు చాలా పేదవాళ్లు. వాళ్లు రోజూ కష్టపడి పని చేసినా…” తినడానికి సరిపడా అన్నం కూడా దొరకేది కాదు… పగలు పొలాల్లో పని… రాత్రి ఆకలితో నిద్ర… పిల్లలు ఏడు...

మూసిన గది రహస్యం Part 3 ముగింపు

అక్కడ ఉన్న కొద్ది రోజులు గడిచిన తర్వాత… ఒక రోజు… నేను ఉతికిన బట్టలను అరేయడానికి బయటకు వచ్చాను.…  కారిడార్‌లోకి అడుగు పెట్టగానే… ఎదురుగా అద్వైత్  ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.. మొదట నేను చూసింది నిజమో కాదో కూడా అర్థం కాలేదు… అతన్ని చూసిన క్షణం— నా చేతుల్లో ఉన్న బట్టలు కదలకుండా ఆగిపోయాయి… నా శ్వాస ఒక్కసారిగా ఆగిపోయినట్టైంది. ఎన్ని రోజుల తర్వాత… ఇంత దగ్గరగా అతన్ని చూస్తున్నాను… అతను ఫోన్ కాల్ ముగించుకుని నా వైపు చూసాడు. ఒక్క క్షణం… మా ఇద్దరి కళ్లూ కలిశాయి. అతని కళ్లలో ఆశ్చర్యం… నా కళ్లలో ఆనందం… గందరగోళం… నేను ఏమి మాట్లాడాలో తెలియక… నవ్వు కూడా సరిగా రాలేదు. చివరికి… ధైర్యం కూడబెట్టుకుని నెమ్మదిగా అన్నాను— “అద్వైత్ నువ్వా…? బాగున్నావా…?” అతను కాసేపు నన్ను చూసి…   స్మైల్ చేశాడు. “నేను బాగున్నాను… నువ్వెలా ఉన్నావు… అన్విత?” ఆ మాట విన్న క్షణం… నా గుండె లోపల ఏదో కరిగిపోయినట్టైంది. “నేను కూడా బాగున్నాను… ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి…” అని చెప్పేటప్పుడు… నా గొంతులో చిన్న కంపనం వినిపించింది. అలా మేము ఇద్దరం కాసేపు అలాగే నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నా...

Part-3 తలుపు బయట ఉన్నది నా ఫ్రెండ్ కాదు… అయితే ఎవరు? తలుపు తానే తెరుచుకుంది… తర్వాత ఏమైంది?

  అర్ధరాత్రి వచ్చిన కాల్ – Part 3 (Final) “అర్ధరాత్రి వచ్చిన ఆ కాల్‌ని రవి ignore చేసి ఉండాల్సింది… ఎందుకంటే ఆ ఒక్క కాల్ వాళ్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రాత్రి వాళ్లు చూసింది మనిషి కాదు… కానీ అది వాళ్ల రూపంలోనే ఉంది.” తలుపు బయట నిలబడి ఉన్న ఆ నీడను చూసిన క్షణంలోనే… అరుణ్ చేతిలో ఉన్న ఫోన్ నేలపై జారిపోయింది. టార్చ్ వెలుతురు నెమ్మదిగా ఆ నీడ ముఖం మీద పడింది. రవి శ్వాస ఆగిపోయినట్టయింది. ఎందుకంటే… బయట నిలబడి ఉన్నది అతడే. అదే ముఖం… అదే కళ్ళు… అదే బట్టలు… కానీ ఒక తేడా ఉంది. ఆ “రవి” ముఖంపై అసహజమైన చిరునవ్వు ఉంది. అతని మెడ కొంచం పక్కకు తిరిగి ఉంది… కళ్ళు మాత్రం ఒక్కసారి కూడా మూయడం లేదు. అప్పుడే బయట నిలబడి ఉన్న ఆ రూపం నెమ్మదిగా మాట్లాడింది— “కిరణ్  తలుపు తెరువు…   లోపల ఉన్నది నిజమైన రవి కాదు.” ఆ మాట విన్న వెంటనే గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. లోపల నిలబడి ఉన్న రవి ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసాడు. అరుణ్ మాత్రం చెమటలు పట్టిన చేతులతో టార్చ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. “ఇది… ఇదే నేను చూసింది…” అరుణ్ గొంతు వణికింది. “ముందు నా వాయిస్‌ని కాపీ చేసింది… ఇప్పుడు మన రూపం కూడా…” బ...

Episode - 3 ఉమ్మడి కుటుంబం1980లో మట్టి కుండలోని ఆనందం

ఉమ్మడి కుటుంబం – Episode 3 1980లో… ఒక చిన్న పల్లెలో ఉన్న ఉమ్మడి కుటుంబం. మధ్యాహ్నపు ప్రశాంతత… కుటుంబంతో కలిసి భోజనం… చిన్నారి శారద అల్లరి… కానీ… ఆ ప్రశాంతమైన రోజుల్లోనే నెమ్మదిగా ఒక మార్పు మొదలవుతోంది… 👇 మధ్యాహ్నపు ఎండ నెమ్మదిగా ఊరంతా పరుచుకుంది. ఇళ్ల ముందు వేసిన మగ్గాలపై ఆరేసిన బట్టలు గాలికి మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా ఎక్కడో ఎద్దుల బండి చక్రాల శబ్దం వినిపిస్తోంది. సుమతి ఇంటి ముందు నిలబడి, “శారదా… రామ్మా తల్లి… అన్నం చల్లారిపోతుంది…” అంటూ మళ్లీ పిలిచింది. పిల్లలతో ఆడుకుంటున్న శారద, “వస్తున్నా అమ్మా…” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది. పాదాలన్నీ మట్టితో నిండిపోయి ఉన్నాయి. అది చూసి సుమతి, “అయ్యో… నిన్ను చూస్తే పిల్లలా ఉన్నావో లేక మట్టిబొమ్మలా ఉన్నావో అర్థం కావట్లేదు!” అంది. శారద చిన్నగా నవ్వేసింది. ఇంట్లోకి వెళ్లగానే రాములమ్మ అప్పటికే పళ్లెంలు తీసి వరుసగా పెట్టింది. ఆ రోజుల్లో భోజనం అంటే అందరూ కలిసి కూర్చుని తినడం తప్పనిసరి. ముందు ఇంటి పెద్దవాళ్లు… తర్వాత పిల్లలు… చివరగా ఆడవాళ్లు తినేవారు. సుమతి మావయ్య సిద్దయ్య ఇంకా రాఘవుడు ఇద్దరూ పొలం నుంచి భోజనానికి అని కొద్దిసేపు ఇంటికి వచ్చారు. ...

“ఆమెతో మాట్లాడింది ఒక ఆత్మనా? 💔😱 | Harika & Advait Love Horror Story Part 2”

“హారిక కథ Part 2 – నీడ వెనుక నిజం |  ప్రేమ అంటే… ఎప్పుడూ మనతో ఉండడమే కాదు. కొన్ని సార్లు… చనిపోయిన తర్వాత కూడా మనల్ని వదలని జ్ఞాపకం. హారికకి అది ఒక ప్రేమ కాదు… ఒక రహస్యం… ఒక భయం… Telugu Love & Horror Story” ఆ రాత్రి…      ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బయట అప్పుడప్పుడు గాలి వీచిన శబ్దం మాత్రమే వినిపిస్తోంది. గడియారం టిక్… టిక్… అని ప్రతి సెకను గట్టిగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. హారికకు మాత్రం నిద్ర ఏమాత్రం రాలేదు. ఆమె మంచంపై పడుకుంది… కానీ కళ్ళు మూసుకున్నా కూడా మనసు మాత్రం ఆగలేదు. చివరికి లేచి కూర్చుంది. ఫోన్‌ని చేతిలోకి తీసుకుంది. స్క్రీన్ వెలుగు ఆమె ముఖంపై పడింది… ఆ వెలుగులో ఆమె కళ్ళలో కనిపించింది— భయం… అనుమానం… ఇంకా… ఒక తెలియని ఆశ… “ఈరోజు కూడా మెసేజ్ వస్తుందా…?” అని ఆమె మనసులోనే తానే ప్రశ్నించింది. ఆమె చూపు గడియారంపై పడింది. 8:57 PM… గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది. ఆమె చేతులు స్వల్పంగా వణికాయి. ఫోన్‌ని గట్టిగా పట్టుకుంది. ప్రతి సెకను ఒక నిమిషంలా అనిపించింది. ఆమెకు ఆ రాత్రి చలి ఎక్కువగా అనిపించింది… కానీ అది గాలివల్ల కాదు… లోపల పెరుగుతున్న భయంవల్...